జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడైన తర్వాత తమిళ రాజకీయాల్లో శరవేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. శశికళ క్యాంపు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా కె.పళనిస్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. 'పార్టీ శాసనసభాపక్ష నేతగా నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను. నా ఎన్నిక గురించి గవర్నర్ కు సమాచారం అందించాను. నాకు 129 మంది ఎమ్మెల్యేల మద్ధతు ఉందని తెలియజేశాను. గవర్నర్ ను కలిసి మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు ఉన్నట్లు లేఖ సమర్పిస్తాను. పన్నీర్ సెల్వంను పార్టీ నుంచి బహిష్కరించామని' పళనిస్వామి వివరించారు.
Published Tue, Feb 14 2017 1:56 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
Advertisement