కాన్పూర్‌లో కాంగ్రెస్ కార్యకర్తల దాడి
కాన్పూర్(యూపీ): కాన్పూర్‌లో బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం కోడిగుడ్లు, టొమాటోలు, చెత్త విసిరి సిరా చల్లారు. అయితే నిరసనకారులపై పోలీసులు స్వల్ప లాఠీచార్జీ చేసి చెదరగొట్టారు. ప్రపంచ ఉగ్రవాదంపై ఓ కాలేజీలో జరిగే సదస్సుకు స్వామి హాజరవుతుండగా ఈ దాడి జరిగింది.
అనంతరం సదస్సులో స్వామి కశ్మీర్ అంశం నేపథ్యంలో మాట్లాడుతూ ఢిల్లీలోని జేఎన్‌యూ పేరును నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట మార్చాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. జేఎన్‌యూ విద్యార్థులను కాంగ్రెస్, వామపక్ష అనుబంధ విద్యార్థులు వారిని చదువుకోనివ్వట్లేదని స్వామి ఆరోపించారు. జేఎన్‌యూను నాలుగు నెలలు మూసేసి తనిఖీలు చేపట్టాలని స్వామి డిమాండ్ చేశారు.
సుబ్రమణ్య స్వామి కాన్వాయ్‌పై గుడ్లు, టొమాటోలు
Published Sun, Feb 28 2016 1:49 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement