మాస్ మహారాజా రవితేజ హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో సందడి చేశారు. ఇటీవలే ఆయన కొత్తగా ఖరీదైన ఎలక్ట్రిక్ కారు(ఈవీ)ని కొనుగోలు చేశారు. ఈ మేరకు తన వాహనం రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లారు. దాదాపు రూ.34.5 లక్షలతో కారు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా టీఎస్09 జీబీ2628 అనే ఫ్యాన్సీ నంబర్‌ను 17,628 రూపాయలకు వేలంలో దక్కించుకున్నారు.
కారు ప్రత్యేకతలు ఇవే
రవితేజ తాజాగా కొనుగోలు కారులో ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నాయి. చైనాకు చెందిన ఈ కారు అత్యంత సురక్షితమైందిగా 5 స్టార్ రేటింగ్ కలిగి ఉంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 12.8 ఇంచెస్ సెంట్రల్ స్క్రీన్ ఉంటుంది. ఇది ఆపిల్ కార్ప్లే , ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేస్తుంది. అంతే కాకుండా ఇందులో ఒక పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్‌గేట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, సింథటిక్ లెదర్ అపోల్స్ట్రే, పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్, ప్యాసింజర్ సీట్లు, 5 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. అత్యంత సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా దీనికి పేరుంది.
కాగా.. రవితేజ ఇటీవలే రావణాసుర సినిమాతో అభిమానులను అలరించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌తో కలిసి రవితేజ ప్రొడక్షన్ నిర్మించిన ఈ సినిమాలో అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా సహా ఐదుగురు హీరోయిన్స్ నటించారు. ఈ సినిమా ఏప్రిల్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నెగెటివ్ పర్ఫార్మెన్స్‌కు మంచి మార్కులు పడుతున్నప్పటికీ.. మూవీకి మాత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment