
మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత దానం నాగేందర్
హైదరాబాద్: ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్‌పై రెండు మూడు రోజుల్లో నిర్ణయం రానుందని, టీఆర్‌ఎస్ తరపున ఖైరతాబాద్ టిక్కెట్ ఎవరికిచ్చినా తన మద్దతు ఉంటుందని మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత దానం నాగేందర్ తెలిపారు. హైదరాబాద్‌లో దానం విలేకరులతో మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేసిందని ఆరోపించారు. పొన్నాల లాంటి సీనియర్ నేతను బలి పశువును చేశారని విమర్శించారు. బీసీ నాయకులను రోడ్డున పడేసి.. ఏసీ రూముల్లో మీటింగ్‌లు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్‌లో బీసీలకు అన్యాయం జరుగుతుందని తాను మొదటి నుంచి చెబుతూనే ఉన్నానని తెలిపారు. కాంగ్రెస్‌లో అన్యాయం జరిగిన వాళ్లు కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి రావాలని ఆహ్వానిస్తున్నానని, కేసీఆర్ అన్ని వర్గాలకు వారికి న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌లో ఒకరి తోక మరొకరు కట్ చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment