సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జెండా ఆవిష్కరణ విషయంపై మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, హిమాయత్‌నగర్ కార్పొరేటర్ భర్త గడ్డం రామన్‌గౌడ్ కార్యకర్తల ఎదుట బాహాబాహీకి దిగారు. హిమాయత్‌నగర్ డివిజన్‌లోని విఠల్‌వాడీలో బీజేపీ కార్యకర్త అనీల్ ఏర్పాటు చేసిన జెండావిష్కరణలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది.
దీనిపై ఇరు వర్గీయులు అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. అనీల్ ఏర్పాటు చేసిన జెండావిష్కరణకు చింతల రామచంద్రారెడ్డి, కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్‌కు ఆహ్వానం అందింది. మొదట చింతల రాగా, 20 నిమిషాల పాటు కార్పొరేటర్ కోసం వేచి ఉండగా ఆమె రావడం ఆలస్యమైంది. దీంతో చింతల జెండాను ఆవిష్కరించి వెనుదిరిగారు. ఇదే సమయంలో కార్పొరేటర్ మహాలక్ష్మిగౌడ్ ఆమె భర్త రామన్‌గౌడ్ వారి వర్గీయులు వస్తున్నారు.
కార్పొరేటర్ వర్గీయుల్లో ఒకరు ‘మేం రాకుండా జెండా ఆవిష్కరిస్తారా? నువ్వు అంత పెద్ద రాజకీయం చేసేవాడివి అయ్యావా? అంటూ’ అనీల్‌ను ప్రశ్నించగా మీరు రావడం ఆలస్యమైంది సార్ ఇంకో చోటకు వెళ్లాల్సి ఉంది అందుకే ఆవిష్కరించారని జవాబిచ్చారు. అంతే. ఇరు వర్గాల వారు ఒకరికొకరు తిట్టుకోవడంలో రెచ్చిపోయారు. అందరి సమక్షంలో బాహాబాహీకి దిగి ఇరు వర్గాల వారు ముష్టికొమ్ములాటకు దిగారు.
చదవండి: తలసరి విద్యుత్‌లో తెలంగాణ నెంబర్ 1.. అసలు నిజం ఇదే!
Comments
Please login to add a commentAdd a comment