కేన్సర్‌పై అవగాహన కల్పిస్తూ నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన రన్‌లో పాల్గొన్న డాక్టర్లు
ఖైరతాబాద్: కేన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ఆదివారం నెక్లెస్ రోడ్డులో సూరజ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో వాక్ పర్ హోప్ పేరుతో 5కే రన్ నిర్వహించారు. ఎంఎన్‌జే కేన్సర్ హాస్పిటల్ వైద్యులు, బసవతారకం కేన్సర్ హాస్పిటల్, గాంధీ, ఉస్మానియా, కిమ్స్, నిమ్స్, అపోలో హాస్పిటల్స్ వైద్యులతో పాటు వివిధ విభాగాల ఉన్నత స్థాయి ఇంజనీరింగ్, సామాజిక వాదులు కుటుంబ సమేతంగా రోజు రోజుకు పెరుగుతున్న కేన్సర్‌కి ప్రధాన కారణం అవగాహన లేకపోవడమేనన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ మొదటి దశలో కేన్సర్‌ను గుర్తించి సరైన చికిత్స అందిస్తే మహమ్మారి నుంచి పూర్తిగా తప్పించుకోవచ్చన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్‌లో డాక్టర్లు మధుసూదన్, డాక్టర్ విశాల్, డాక్టర్ పల్లవి, డాక్టర్ అశ్విని, సత్యనారాయణ, శ్యాంనాయక్, జగన్ యాదవ్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment