
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు పెండింగ్ చలాన్లను ఆదివారం క్లియర్ చేశారు. కొంత కాలంగా ఆయనకు చెందిన టీఎస్ 09 ఎఫ్‌ఏ 0999తోపాటు మరో నాలుగు కార్లకు 66 చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరుగుతున్న ఈ వాహనాలపై బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పెండింగ్ చలాన్ల జాబితా గుట్టురట్టైది.
దీంతో 66 చలానాలకుగాను రూ. 37365లను ఎమ్మెల్యే చెల్లించారు. ఈ మేరకు బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు చెందిన అయిదు కార్లకు చెందిన చలానాలు క్లియర్ అయినట్లు తెలిపారు.
చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు
Comments
Please login to add a commentAdd a comment