బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–52లోని నందగిరిహిల్స్ హుడా లేఅవుట్‌లో ప్రభుత్వ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీగోడను పక్కనే ఉన్న గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు దౌర్జన్యంగా కూలి్చవేయడం జరిగిందని, ఇందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రోత్సాహం ఉందని, ఆయనపై చర్యలు తీసుకోవాల్సిందిగా హైడ్రా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌ఛార్జి వి.పాపయ్య ఇచి్చన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దానం నాగేందర్‌పై కేసు నమోదు చేశారు.
నందగిరిహిల్స్ లేఅవుట్‌లో 850 గజాల జీహెచ్‌ఎంసీ ఓపెన్ స్పేస్ ఉందని, ఇది ప్రభుత్వానికి చెందినదని, దీనిని కాపాడే యత్నంలో భాగంగా చుట్టూ ప్రహరీ నిరి్మంచడం జరిగిందన్నారు. ఈ నెల 10వ తేదీన ఉదయం గురుబ్రహ్మనగర్ బస్తీవాసులు ఇక్కడికి వచ్చి జీహెచ్‌ఎంసీ స్థలం చుట్టూ నిరి్మంచిన ప్రహరీని కూలి్చవేశారన్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఘటనా స్థలంలోనే ఉండి బస్తీవాసులను ప్రోత్సహించారని, బస్తీ నేతలు గోపాల్‌నాయక్, రాంచందర్‌లను ప్రోత్స హించి ఈ కూలి్చవేతలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కూలి్చవేతల వల్ల రూ.10 లక్షల ఆస్తి నష్టం జరిగిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పాపయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే దానం, గురుబ్రహ్మనగర్ బస్తీ నేతలు గోపాల్‌నాయక్, రాంచందర్‌లపై బీఎన్‌ఎస్ 189 (3), 329 (3), 324 (4), రెడ్‌విత్ 190, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ యాక్ట్ కింద కేసు నమోదైంది. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment