హైదరాబాద్: తొలుత ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి ఒక్కో అడుగు పెంచుకుంటూ 69వ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతిగా ఈ సంవత్సరం 63 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన కలర్ పనులు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా కుడివైపు పంచముఖ లక్ష్మీనారసిహ స్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. చవితికి రెండు రోజుల ముందే మహాగణపతి పూర్తిస్థాయిలో దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతారని తెలిపారు.
► అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులైన సంగరి శంకరయ్య బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఎ. భీమయ్య, జి.సుందర్శనం, రాజారాగం, రాజమణిదేవి, ఎస్.సుదర్శన్, ఎస్.వీరభద్రయ్య, గణేష్‌కుమార్ కలిసి ఈ మహత్ కార్యానికి పూనుకున్నారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహ తయారీ పనులు పూర్తియ్యాయని, ఈ నెల 18 వినాయక చవితి నాటికి భక్తులకు సంపూర్ణంగా దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఉత్సవ కమిటి పోలీసు శాఖతో సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు దానం నాగేందర్ పేర్కొన్నారు.
► వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జన ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌తో కలిసి పరిశీలించారు. పీపుల్స్ ప్లాజా, జలవిహార్ వద్ద వాహనాల పార్కింగ్, బ్రిడ్జి– 2, ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ మహాగనపతి నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. వీరితో ట్రాఫిక్ అడిషినల్ కమిషనర్ సుధీర్ బాబు, విక్రమ్ సింగ్ మాన్, జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, ఈఎస్‌సీ జియావుద్దీన్, జోనల్ ఎస్‌ఈ రత్నాకర్, హెచ్‌ఎండీఏ ఎస్‌ఈ పరంజ్యోతి, అడిషినల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment