Ganapati
-
ప్రతి సంవత్సరం కొత్త వినాయక విగ్రహాన్ని పెట్టడం వెనుక కారణమేంటి?
-
రిచెస్ట్ గణపతి: 69 కిలోల బంగారం.. 336 కిలోల వెండి.. చూస్తే రెండు కళ్లూ చాలవు!
Richest Ganpati: దేశంలో ప్రముఖంగా జరిగే పండుగల్లో వినాయక చవితి ఒకటి. భక్తులు తమ శక్తికొద్దీ గణేషుడి ప్రతిమలు కొలుదీర్చి పూజలు చేస్తారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై నగరంలో గణేష్ చతుర్థి అత్యంత వైభవంగా జరుగుంది. గణేషుడి భారీ విగ్రహాలతోపాటు కోట్లాది రూపాయలతో ఏర్పాటు చేసిన మంటపాలను ఇక్కడ చూడవచ్చు. ముంబై నగరంలోని అత్యంత సంపన్నమైన గణపతి మండపాలలో ఒకటిగా పేరుగాంచిన గౌడ్ సరస్వత్ బ్రాహ్మణ (GSB) మండల్ తమ 69వ వార్షిక గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా 69 కిలోల బంగారం, 336 కిలోల వెండి ఆభరణాలతో గణేష్ విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దారు. (Ganesh Chaturthi: రైల్లో వినాయక చవితి పిండి వంటలు! ఆర్డర్ చేయండి.. ఆస్వాదించండి..) కాగా ఈ సంవత్సరం ఉత్సవాలకు రూ. 360.45 కోట్ల బీమా కవరేజీని తీసుకున్నట్లు జీఎస్బీ సేవా మండల్ వైస్ ఛైర్మన్ రాఘవేంద్ర జి భట్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో వెల్లడించారు. గతేడాది రూ. 316.40 కోట్లకు బీమా తీసుకోగా ఈసారి మరింత మొత్తానికి కవరేజీ కవరేజీ తీసుకున్నారు. బీమా ప్యాకేజీలో బంగారం, వెండి, ఇతర విలువైన వస్తువులకు రూ. 31.97 కోట్ల కవరేజీ ఉంటుంది. మిగిలినది మంటపం, నిర్వాహకులు, భక్తుల భద్రతకు కవరేజీ ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. #WATCH | Maharashtra | 'Richest' Ganpati of Mumbai - by GSB Seva Mandal - installed for the festival of #GaneshChaturthi. The idol has been adorned with 69 kg of gold and 336 kg of silver this year. pic.twitter.com/hR07MGtNO6 — ANI (@ANI) September 18, 2023 -
ఒజ్జ గణపతికి వందనాలు
‘‘ఓ బొజ్జ గణపయ్య! నీ బంటు నేనయ్య! ఉండ్రాళ్ళ మీదికి దండు పంపు.’’ అంటూ పిల్లలు సంబరంగా జరుపుకునే పండగ వినాయక చవితి. యావద్భారత దేశం వేడుకగా జరుపుకునే పండగ ఇది. కలియుగంలో అతి త్వరగా అనుగ్రహించే దైవం వినాయకుడు. ఋగ్వేద కాలం నుండి కీర్తించబడి పూజించబడుతున్న దేవత ఒక్క గణపతి మాత్రమే. దేవతలలో ప్రథముడు, జ్యేష్ఠుడు ఐన గణపతిని అన్ని సందర్భాలలోను పూజించటమే కాదు దేవతలందరూ త్రిమూర్తులతో సహా పూజించినట్టు ఆధారాలున్నాయి. గణపతి కున్న నామాలలో బాగా ప్రసిద్ధమైనవి వినాయకుడు, గజాననుడు. గణనాథుడికి ఉన్న పన్నెండు నామాలలో ప్రతి దాని వెనక ఒక చరిత్ర ఉంది. ముఖ్యంగా వినాయకోత్పత్తి, వినాయకుడు గజాననుడు కావటానికి గల కారణాలు ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి. అంతే కాదు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో అవతరించినట్టు కనపడుతుంది. సృష్టికార్యం ప్రారంభించే ముందు బ్రహ్మ ప్రార్థించిన గణపతి ఓంకార స్వరూపుడు. కృతయుగంలో కశ్యపునికి అదితికి జన్మించి ‘మహోత్కటుడు‘ అనే పేరుతో దేవాంతక నరాంతక రాక్షసులను సంహరించి లోకకల్యాణం గావించాడు. త్రేతాయుగంలో, మయూరేశుడుగా అవతరించి త్రిమూర్తులకు వారు కోల్పోయిన స్థానాలను తిరిగి ఇప్పించాడు. అప్పుడే బ్రహ్మ తన కుమార్తెలైన సిద్ధి, బుద్ధిలను వినాయకుడికిచ్చి, వివాహం చేస్తాడు. ఈ అవతారంలో వినాయకుడి వాహనం నెమలి. ద్వాపరయుగంలో గజాననుడుగా అవతరించి, సింధూరుడనే రాక్షసుని సంహరించాడు. మనం వినాయకవ్రత కల్పంలో చదివే కథ ఈ గజాననునిదే. కలియుగంలో ధూమ్రకేతువుగా అవతరించి, అశ్వారూఢుడై ప్రతిప్రాణిలో పెచ్చుపెరిగిన రాక్షసప్రవృత్తిని నశింప చేస్తూ ఉన్నాడట. వివిధ పురాణాలలో గణపతి వినాయకుడి ఆవిర్భావం, రూపు రేఖలు విభిన్నంగా ఉన్న కారణంగా శిల్పులు వాటికి గణపతి తత్త్వాన్ని, తమ సృజనాత్మకతను జోడించి రకరకాల గణపతులను మన ముందు ఉంచుతున్నారు. మిగిలిన లక్షణాలను ఏరకంగా చూపించినా అన్నింటిలోనూ సామాన్యంగా ఉండేవి – గజ ముఖం, కురచ మెడ, పెద్దబొజ్జ, నాగయజ్ఞోపవీతం, చేతిలో మోదకం, మూషిక వాహనం మొదలైనవి. గజముఖంలో తొండం, పెద్ద చెవులు, చిన్న కళ్ళు భాగాలు. ప్రపంచ సాహిత్యంలో మొదటిది అయిన ఋగ్వేదంలో గణపతిగానే పేర్కొనటం జరిగింది. బ్రహ్మాండ పురాణంలో ‘‘కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరా’’ అని లలితాదేవి కల్పించినది గణేశ్వరుణ్ణే అని తెలుస్తోంది. తరువాత విఘ్నాలకి అధిపతి అయి విఘ్నేశ్వర నామాన్ని పొందటం జరిగింది. గణాలకు అధిపతి కనుక గణపతి, గణాధిపతి అనే నామాలు కలిగాయి. ఏవైనా గణములు అంటే గుంపులు, సముదాయాలు ఉంటే వాటి మీద అధికారం కలిగి, అవన్నీ ఏకోన్ముఖంగా పని చేసేట్టు చేయించ కలిగిన ప్రజ్ఞయే గణపతి. ఏకాత్మతా భావన కలిగించ గలవాడు గణపతి. ఆ ప్రజ్ఞ లేనట్టయితే సృష్టిలోని అన్ని భాగాలు దేనికవే ఉండేవి. కనుకనే సృష్టి చేసే సమయంలో బ్రహ్మ గణపతిని ప్రార్థించాడట! దేవతారూపాలన్నీ ఆయా తత్త్వాలకి ప్రతీకలు. ముఖ్యంగా ప్రత్యేక రూపాలున్న మూర్తులు. గణపతి అనగానే గుర్తు వచ్చేది పెద్ద పొట్ట. దాని నిండా ఉన్నవి విద్యలు. ‘‘కోరిన విద్యలకెల్ల నొజ్జయయి యుండెడి ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్’’ అంటాము కదా! వొజ్జ అంటే గురువు అని అర్థం. అందుకే గణపతి పూజలో పిల్లల చేత పుస్తకాలు పెట్టించుతాము. పనిలో పనిగా గుంజీలు తీయిస్తాము. గుంజీలు తీయటం వల్ల కుదురు వస్తుంది. మెదడు చురుకుగా పని చేస్తుంది. పెద్ద చెవులు బాగా వినమని చెపుతున్నాయి. చిన్న కళ్ళు సూక్ష్మ మైన అంశాలని ఎంత నిశితంగా ఏకాగ్రతతో చూడాలో తెలియ చేస్తాయి. తొండం ఎప్పుడు నోటిని మూసుకుని ఉండాలని తెలియ చేస్తుంది. చంద్రుణ్ణి చూసిన దోషం తొలగటానికి శమంతకోపాఖ్యానం చదవుకోవాలనటం కూడా విశేషమే. ఆ కథని అర్థం చేసుకుంటే సమాజం ఎంత బాగుంటుందో కదా! ఏదైనా ఒక వరం ఒకరికి ఇస్తే దాన్ని వారు మాత్రమే ఉపయోగించాలి. ఇతరులకి అది ఉపయోగ పడక పోగా ప్రాణాంతకం కూడా కావచ్చును అని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనజిత్తు వృత్తాంతమ్ తెలుపుతుంది. ప్రభుత్వం వద్ద కాక వ్యక్తుల దగ్గర ధనం పోగు అయితే ప్రాణాలకే మోసం జరుగుతుందని సత్రాజిత్తు మరణం తెలుపుతుంది. ఎంతటి అవతార పురుషుడికి అయినా దోషఫలం అనుభవించక తప్పదు అని కృష్ణుడికి నీలాపనిందలు రావటం తెలియ చేస్తుంది. సర్వమానవుల మూలాధారంలో కుండలినీ శక్తిగా ఉన్న జగన్మాతకి గుమ్మం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. అదే పార్వతీ దేవి గుమ్మంలో కాపలా పెట్టింది అని కథలో చదువుకుంటాం. విఘ్నాధిపతి కనుక మనం చేసే పనుల్లో ఎటువంటి అడ్డంకులు రాకుండా చూడమని అన్ని కార్యాలకి ముందుగా విఘ్నేశ్వరుణ్ణి పూజించటం సంప్రదాయంగా మారింది. గణపతి పూజ మనకి ఏంచెపుతోంది? 1. మాతా పితృభక్తి అది ఉంటే లోకాలనన్ని చుట్టి రావచ్చు. విజయం సాధించవచ్చు. 2. భౌతిక బలం కన్న బుద్ధి బలం మిన్న తమ్ముడు నెమలి వాహనం మీద ఎగురుతూ వెళ్ళాడు. తాను ఎలుకనెక్కి వెళ్ళి గెలవటం ఎంత కష్టం? కనుక బుద్ధిబలాన్ని ఉపయోగించాడు. 3. ఆకుపచ్చని ఆహారం తింటే తెలివితేటలు పెరుగుతాయి. ఆకుపచ్చరంగులో ఉన్న ఆహారం తింటే తెలివి తేటలు పెరుగుతాయి, చూపు మెరుగుగా ఉంటుంది. అందుకే గరిక తనకి పరమప్రీతి అని చెప్పాడు. బుద్ధి కావాలంటే ఆరాధించవలసింది గణపతినే. గణపతి నక్షత్రమైన హస్తకి అధిపతి బుధుడు. బుద్ధి కారకుడు బుధుడే కదా! 4. ఏక వింశతి 21 రకాల పత్రితో పూజ చేయటం ఒక్క గణపతి పూజలో మాత్రమే కనిపిస్తుంది. పిల్లలకి పత్రి సేకరణ పేరుతో చెట్లని, పర్యావరణాన్ని పరిచయం చేయటం జరుగుతుంది. అవన్నీ ఆ సమయంలో వచ్చే తరుణ వ్యాధులకి ఔషధాలు. ప్రత్యేకంగా గరిక పూజ ద్వారా గరికకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తున్నాడు. గరిక పవిత్రమైనదే కాదు, భూమి ఆకృతిని పరిరక్షిస్తుంది. 5. రెండుసార్లు ఆవిరిమీద ఉడకబెట్టిన ఆహారం వానాకాలంలో మంచిది. బలం కలిగిస్తుంది. నూనెలో వేయించిన ఆహారం వానలు పడుతున్నప్పుడు అరగటం కూడా కష్టం. 6. మనలో సామర్థ్యం ఉండాలే కాని పరికరాలు ప్రధానం కాదు అని ఎలుక వంటి అతి చిన్న వాహనం ఎక్కి లోకాల నన్నిటిని జయించి చూపించాడు. డా. ఎన్.అనంతలక్ష్మి -
మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు..?
మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు? ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కధల్లో కనిపిస్తుంది. మట్టిగణపతిని పూజించడానికి పురాణప్రాశస్త్యం కూడా ఉంది. ఏదో వినాయకచవితి వల్లనే మొత్తం కాలుష్యం జరుగుతున్నట్టుకొన్ని సంస్థలు నానా హంగామా చేస్తున్నాయి. అసలు దాని గురించి పురాణం ఏమంటోందో చూద్దాం. గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. ‘ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?‘ ‘మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వం కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వం కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యాన్ని చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు (లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది.సర్వజీవ సమాన త్వానికి ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ‘ అని చెప్పాడు సూతుడు. వినాయక పూజ... కొన్ని ముఖ్య విశేషాలు వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం. మనం ఎంత పెద్ద విగ్రహం ప్రతిష్టించాము, ఎంత ఆర్భాటాలు చేశామన్నది ముఖ్యం కాదు. మనం ఎంత సేపు స్వామి మీద ధ్యాస పెట్టి నిలకడగా కూర్చున్నామన్నదే ముఖ్యం. కూర్చుని ఏమి చేయాలంటే? ..స్వామికి సంబంధించిన ఒక శ్లోకం, మంత్రం ఓం వినాయకాయ నమః లాంటి మంత్రాలు లేదా అష్టోత్తరం కాని చదవడం ఉత్తమం. ఏదీ రానివారు? ‘ఓం’ అని జపించండి. కేవలం చదవడమే కాదు, చదువుతున్నప్పుడు మనస్సు మొత్తం స్వామి మీద లగ్నం చేయండి. వేరే ఏ పని చేయకండి. మీకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి నైవేద్యం పెట్టి స్వీకరించండి. చిన్న బెల్లం ముక్క పెట్టినా ఫర్వాలేదు. ఇలా చేసి చూడండి, ఒక సంవత్సరకాలంలో మీలో అద్భుతమైన మార్పు కనపడుతుంది. మీరు కనుక రోజూ క్రమం తప్పకుండా స్నానం చేసిన తరువాత పైన చెప్పిన విధంగా చేయగలిగితే చాలు మీరే గమనిస్తారు మీలో కలిగిన మార్పు. మీరు నమ్మనంతగా మారతారు. చేసే ప్రతి పని మీద మనసు లగ్నం చేయగలుగుతారు. విద్యార్థులు చదువు మీద ఎప్పుడూ లేనంతగా శ్రద్ధ పెడతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏదైనా విషయం వినగానే గుర్తుపెట్టుకొనే శక్తి గణపతి ప్రసాదిస్తాడు. వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి ‘‘స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు’’ అని చదువుతారు. అందుకే గజాననుని ముందు, రోజూ కూర్చునే ప్రయత్నం చేయడం వల్ల అద్భుతమైన విద్యాబుద్ధులను, జ్ఞానాన్ని పొందవచ్చు. ఎంత పెద్ద విగ్రహం పెట్టి పూజించడమన్నది ముఖ్యం కాదు. స్వామి ముందు ఎంతసేపు కూర్చున్నామన్నది ముఖ్యం. అందరూ రోజూ కాసేపు గణపతికి కేటాయించండి. మీలో కలిగే మార్పులను గమనించండి. జీవితంలో అతి త్వరగా పైకి ఎదగండి.మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్దం అవ్వడానికి ఇది బాగా ఉపకరిస్తుంది కనుక గణపతి ఆరాధనను మీ నిత్యజీవితంలో భాగం చేసుకోవడం మంచిది. ఆసనం (చాప వంటివి) వేసుకోవడం మరవకండి. – డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: వినాయకుడి పూజలోని ఏకవింశతి పత్రాల విశిష్టత ఏంటో తెలుసా!) -
చవితికి రెండ్రోజుల ముందే మహా గణపతి సిద్ధం
హైదరాబాద్: తొలుత ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి ఒక్కో అడుగు పెంచుకుంటూ 69వ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతిగా ఈ సంవత్సరం 63 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన కలర్ పనులు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా కుడివైపు పంచముఖ లక్ష్మీనారసిహ స్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. చవితికి రెండు రోజుల ముందే మహాగణపతి పూర్తిస్థాయిలో దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతారని తెలిపారు. ► అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులైన సంగరి శంకరయ్య బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఎ. భీమయ్య, జి.సుందర్శనం, రాజారాగం, రాజమణిదేవి, ఎస్.సుదర్శన్, ఎస్.వీరభద్రయ్య, గణేష్‌కుమార్ కలిసి ఈ మహత్ కార్యానికి పూనుకున్నారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహ తయారీ పనులు పూర్తియ్యాయని, ఈ నెల 18 వినాయక చవితి నాటికి భక్తులకు సంపూర్ణంగా దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఉత్సవ కమిటి పోలీసు శాఖతో సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు దానం నాగేందర్ పేర్కొన్నారు. ► వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జన ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్తో కలిసి పరిశీలించారు. పీపుల్స్ ప్లాజా, జలవిహార్ వద్ద వాహనాల పార్కింగ్, బ్రిడ్జి– 2, ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ మహాగనపతి నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. వీరితో ట్రాఫిక్ అడిషినల్ కమిషనర్ సుధీర్ బాబు, విక్రమ్ సింగ్ మాన్, జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, ఈఎస్సీ జియావుద్దీన్, జోనల్ ఎస్ఈ రత్నాకర్, హెచ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి, అడిషినల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ 'భగవద్గీత పారాయణం
-
తీన్మార్ డ్యాన్సులు, స్టెప్పులతో గణేషుడికి వీడ్కోలు
-
దేశంలోని ప్రతీ నగరంలో గణపతికి సంబంధించిన ఆనవాళ్లున్నాయి
-
200 కిలోల బెల్జియం చాక్లెట్ తో గణపతి
-
మావోయిస్టు గణపతి లొంగుబాటుకు లైన్‌క్లియర్
-
విశేష ఘనపతి
గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు... ఘనమైన దైవం కూడా. ఎందుకంటే, ఈ సృష్టి యావత్తూ అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ, సృష్టిని శాసించే మహా శక్తిమంతుడు. అంతటి శక్తిమంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఆయన ఘనులకే ఘనుడు. ఘనపతి. ఘనపాఠి. ఆయన పుట్టుకే చాలా చిత్రమైనదనుకుంటే, ఆకృతి అంతకన్న విచిత్రమైనది. అయితేనేం, ఎవరిని పూజించాలన్నా, ఏ కార్యం ప్రారంభించాలన్నా అగ్రపూజ ఆయనదే! తల్లిదండ్రులను మించిన దైవం లేడని, నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజిక్కించుకున్న సూక్ష్మగ్రాహి ఆయన. తండ్రిలాగానే ఈయన ఆకారాన్ని కల్పించటమూ, పూజించటమూ, ప్రసన్నం చేసుకోవటమూ ఎంతో సులువు. దోసెడు మట్టి లేదా చిటికెడు పసుపు ఉంటే చాలు.. .క్షణాల్లో గణాధ్యక్షుని రూపు తయారు చేసేయవచ్చు. గుప్పెడు గరికె... కణుపంత బెల్లం ముక్క ఉంటే చాలు...ప్రశాంతంగా పూజించుకుని, నిండుగా నైవేద్యం పెట్టేయవచ్చు. సర్వవిఘ్నాలనూ ఉపశమింపజేసి, వరాల వర్షం కురిపించే మహా ఉదారుడైన ఆ మహోదరుడి విశేషాలను వీక్షిద్దాం... గణపతి అంటే జ్ఞానమోక్షప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖా విలాసాల గురించి అనేక పురాణేతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకలశాస్త్రాలూ ఆయనను పరబ్రహ్మస్వరూపంగానూ, భవిష్యద్బ్రహ్మగానూ పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్నసంహారకుడు. గణం అంటే సమూహం అని అర్థం. ఈ సృష్టి యావత్తూ గణాలమయం. అనేకమైన గణాలతో కూడిన మహాగణం. ఈ విశ్వం, మనుష్యగణం, వృక్షగణం, గ్రహగణం– మళ్లీ ఇందులో వివిధ ధర్మాలను అనుసరించి మరెన్నో గణాలు– ఈ గణాలన్నింటిలో నూ అంతర్యామిగా వుంటూ, సృష్టిని శాసించే పరమేశ్వరుడు గణపతి. సమస్త యోగాలకు గణపతియే మూలాధారం. సమస్త విశ్వానికి ఆధారశక్తి గణపతి. బ్రహ్మసూచనను అనుసరించి వేదవ్యాసుని శబ్దానికి గణపతి రూపునిచ్చాడు. అంటే మహాభారత రచనలో వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి తన దంతంతో రాసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఇంద్రుడు, భగీరథుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దమయంతి, సాంబుడు, ధర్మరాజు మొదలయిన వారు గణపతిని ఆరాధించినట్లు ఐతిహ్యాలు. ప్రథమ పూజ ఎందుకు? ఏ పూజ చేసినా, తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతనే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని, అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితోబాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే గణపతికి వరం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకనే ఏ కార్యాన్ని ప్రారంభించడానికయినా ముందుగా గణపతిని పూజించి, ఆ తర్వాతనే ఆ పనిని మొదలు పెట్టడం ఆచారంగా వస్తోంది. వినాయకుడు వివాహితుడేనా? వినాయకుడు ‘హస్తిముఖుడు’, హస్తమంటే తుండం. హస్తం (తుండం) కలిగింది హస్తి (ఏనుగు). ఈ రూపాన్ని చూస్తూ మనం గమనించాల్సింది ఈయన ‘ఏనుగు ముఖం వా’డనే విశేషాన్ని కాదు. ఈయన జన్మనక్షత్రం ‘హస్త’ హస్తా నక్షత్రం కన్యారాశికి చెందింది కాబట్టి ఈయన్ని ‘అవివాహితు’డన్నారు. అయితే లోకంలో వివాహం కానిదే కొన్ని కార్యాలకు అర్హత సిద్ధించదు కాబట్టి వినాయకునికి సిద్ధి, బుద్ధి అనేవారు భార్యలుగానూ, క్షేమం, లాభం సంతానంగానూ చెబుతారు. పత్రి పూజ వల్ల ప్రయోజనమేమిటి? వినాయకుడిని పత్రితో పూజించడంలో కొన్ని రహస్యాలు ఇమిడి ఉన్నాయి. విఘ్నేశ్వర పూజకు మాచపత్రి, ములక, మారేడు, గరిక, ఉమ్మెత్త, రేసపత్రి, ఉత్తరేణి, తులసి, మామిడి, విష్ణుక్రాంత, దానిమ్మ, రేగు, దేవదారు, గన్నేరు, మరువం, వావిలి, జాజి, జమ్మి, రావి, మద్ది, జిల్లేడు. గణపతి పూజకు ఉపయోగించే ఈ 21 రకాల ఆకులూ ఓషధీ విలువలు కలిగినవి. ఈ ఔషధ రకాలకు చెందిన మొక్కలను తాకడం, వాటిని తుంచి సేకరించడం, వినియోగించడం వల్ల వాటిలో ఉండే ఓషధీ విలువలను మనం పొందగలం. తులసి, మారేడు, ఉత్తరేణి వంటి ఆకులను స్పర్శించడం వల్ల చర్మరోగాలు నశిస్తాయి. మెదడు ఉత్తేజితమవుతుంది. విశేష నాయకుడు అకారాన్నీ ఉకారాన్నీ మకారాన్నీ కలిపి ‘ఓమ్’ అనే ఓ మంత్రాన్ని సిద్ధం చేశారు దేవతలు. మొదటగా కన్పించిన విఘ్ననివారక దైవానికి ఈ వేదాలద్వారా ఏర్పాటు చేసిన ఓంకారాన్ని సంకేతంగా ఏర్పాటు చేశారు. ‘ఓం’అనడమంటే వినాయకుణ్ణి ప్రార్థించినట్లన్నమాట. అందుకే అష్టోత్తర శతనామాలను పఠించబోయేముందు ప్రతినామానికీ ముందు ఓంకారాన్ని చేర్చారు. ఓంకారం లేకుండా నామాన్ని చదివితే ఆ నామానికి అక్షరతత్వమే ఉంటుంది తప్ప మంత్రత్వం సిద్ధించదన్నమాట. ‘ఓమ్’ అని పలికితే వినాయకుని నామాన్ని ఉచ్చరించినట్టూ, ఓమ్ అని పూజా ప్రారంభంలో మన పూజామందిరం ముందు రాస్తే వినాయకుని చిత్రాన్ని మనకొచ్చినంత నైపుణ్యంతో గీసినట్టూ ఔతుందన్నమాట. ఎలుక వాహనం ఏమి చెబుతోంది? వినాయకుని వాహనం మూషకం. ‘ముషస్తేయే’ అనే ధాతువు మీద మూషకం లేదా మూషికమనే మాట ఏర్పడింది. దీనికి ‘ఎలుక’ అని అర్థం. ఎలుకని ఓసారి పరిశీలించండి. ఎప్పుడూ చలిస్తూనే ఉండేదీ ఏ క్షణమూ కూడ కదలకుండా ఉండనిదీ ఆ ప్రాణి. నిశ్చలంగా కూచున్నప్పుడు కూడ మూతినో కళ్లనో కదుపుతూనే ఉండే లక్షణం దానిది. ఇక రెండవది– ఎక్కడినుండో దొంగతనంగా తెచ్చి బొరియలో దాచిపెట్టుకునే లక్షణం దానిది. ఈ ఎలుక మీద వినాయకుడు ఉంటాడంటే ఎవరైనా సరే, దొంగబుద్ధితో దాచకు. అనుభవించకుండా నిలవ ఉంచుకోకు! చంచలత్వాన్ని నియంత్రించుకుని నిశ్చలతతో ఉంటే విఘ్నం నీ దరి చేరదు, విజయం నీ చెంత నుంచి వెనక్కు మళ్లదు అని సంకేతార్థం. పత్రి అంటే ఎందుకంత ప్రీతి? వినాయకుడి జన్మరాశి అయిన కన్యారాశికి అధిపతి బుధగ్రహం. ఈయన ఆకుపచ్చగా ఉంటాడు కాబట్టి, వినాయకునికి పత్రిపూజ ఇష్టమని చెప్పవచ్చు. ఆయన ఆది నుంచి ప్రకృతి ప్రియుడు. గడ్డిజాతి మొక్కల ద్వారానే ఆయనకు అనలాసురుడి బాధ నుంచి ఉపశమనం లభించింది. అందుకే ఆయనకు గరిక అంటే ఇష్టం. పాలవెల్లి ఎందుకు..? జ్యోతిస్సు అంటే గ్రహాలూ నక్షత్రాలూ. ఆ జ్యోతిస్సు ఆధారంగా ఏర్పడిన శాస్త్రమే జ్యోతిశ్శాస్త్రం. ఈ గ్రహాలూ నక్షత్రాలూ అన్నీ ఆకాశంలోనే ఉంటాయి కాబట్టే వినాయక చవితినాడు ఈ రహస్యాన్ని విశదీకరించేందుకే ‘పాలవెల్లి’ పేరిట వినాయకుని పైభాగంలో చతురస్రాకారంలో ఒక జల్లెడలాంటి అలంకారాన్ని వెదురుబద్దలతో ఏర్పాటు చేసి, వెలగ, బత్తాయి వంటి ఫలాలూ, కూరగా యలూ వేలాడదీస్తారు. బంకమట్టే ఎందుకు? గణేశ పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉపయోగించడం ఎందుకంటే, వాగులు, నదులు, కాలువలు మొదలైన జలాశయాలన్నీ పూడికతో నిండి వుంటాయి. బంకమట్టికోసం ఆయా జలాశయాలలో దిగి, తమకు కావలసినంత మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీగాక మట్టిని తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు ఎప్పుడో చెప్పారు. పూజానంతరం ఆయా మట్టి విగ్రహాలను నీటిలో కలపడం వల్ల ఆయా పత్రాలలోని ఔషధగుణాలు సంతరించుకుంటుంది. నిమజ్జనమెందుకు? భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే అంటే బంకమట్టితో విగ్రహం చేసి, దానికి ప్రాణప్రతిష్ఠ, ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసిన అనంతరం ఉద్వాసన చెప్పి, తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. అలా ఎందుకంటే, భూమినుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా, తిరిగి భూమిలోనే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేనిమీదా వ్యామోహాన్ని పెంచుకోకూడదన్న నీతిని చెప్పేందుకే! వినాయకుణ్ణి పూజిస్తే నిజంగా విఘ్నాలు తొలగుతాయా? ‘వి– విశేషంగా (ఎన్నడూ ముడిపడని రీతిలో), ఘ్న– పనిని ప్రారంభించిన వ్యక్తి శారీరక మానసిక ధైర్యాలని నాశనం చేసేది’ (విశేషేణ కార్యసామర్థ్యం హంతీతి విఘ్నః) అని విఘ్న పదానికి అర్థం. మనం పూర్వజన్మల్లో చేసుకున్న పాపాల కారణంగా రావలసిన విఘ్నాలేమేమి వున్నాయో వాటన్నింటినీ తొలగించగల శక్తి ఏ భగవంతుడికీ లేదు. అలాగే తొలగింపజేయగలిగిన వాళ్లయితే ప్రతివాళ్లూ నిత్యం పూజా పురస్కారాల్లో మునిగి అసలు విఘ్నాలే రాకుండా చేసేసుకునేవాళ్లు. అప్పుడు తాము లోగడ చేసిన పాపాలకి శిక్ష అనేది లేకుండానే పోయేది కూడా. ఇది లోక రక్షణ వ్యవస్థకి విరుద్ధం. మరి వినాయకుడేం చేస్తాడంటే, ఆయన్ని ప్రార్థించిన పక్షంలో ‘సర్వవిఘ్న ఉపశాంతయే...’ రావలసిన విఘ్నాలంటూ మనకేం ఉన్నాయో, ఆ విఘ్నాలు మనకి సంప్రాప్తించిన వేళ మానసిక ఉపశాంతిని ఇచ్చి జీవితం మీద విరక్తి రానీయకుండానూ, కొత్తధైర్యంతో ముందుకి అడుగు వేసేలానూ చేస్తాడన్నమాట. అంటే విఘ్నమనేది కాలానికి సంబంధించింది కాబట్టి, ప్రతి వ్యక్తికీ ఒక్కొక్క కాలంలో జీవితదశలో వచ్చేది కాబట్టి ఆ కాలాన్ని తన అధీనంలో ఉంచుకున్న విఘ్ననాయకుణ్ణి ప్రార్థించి విఘ్నాలనుండి దూరం కావలసింది గానూ, ఒకవేళ విఘ్నమే తప్పనిసరై వస్తే తట్టుకోగలిగిన మానసిక స్థైర్యాన్ని ఈయనని ప్రార్థించడం ద్వారా పొందవలసిందిగానూ ఈ పండుగ మనకి చెప్తుంది. -
గణపతిని పూజించిన శివుడు
ఒకసారి శివుడు తన గణాలను తీసుకుని ఒక రాక్షసుడి మీదికి యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధానికి వెళ్లే తొందరలో గణపతిని కలిసి తాను Ðð ళుతున్న పని గురించి చెప్పి, అనుమతి తీసుకోవడం మరచిపోయి హడావుడిగా వెళ్లడంతో అడుగడుగునా ఆయనకు, ఆయన పరివారానికి అనేక ఆటంకాలు ఎదురయ్యాయి. ప్రతి పనిలోనూ విఘ్నాలు ఏర్పడుతుంటాయి. శివుడు వాటిని పట్టించుకోకుండా రథం ఎక్కబోయాడు. రథచక్రం కాస్తా ఊడిపోవడంతో తన వాహనమైన నందిని పిలిచాడు. నంది రావడం తోటే అధిరోహించబోయాడు. ఉత్సాహంగా ముందుకు ఉరకబోయిన నందికి కాలు మడతబడినట్లయి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. ఏమి చేద్దామా అన్నట్లుగా తన పరివారం వైపు చూస్తాడు శివుడు. వారంతా ఏదో పోగొట్టుకున్నట్లుగా నిరాశానిస్పృహలతో, కళ తప్పిన ముఖాలతో కనపడ్డారు. గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన అనుభవాలు లేకపోవడంతో ఏమి జరుగుతోందో చూద్దామని కన్నులు మూసుకోగానే మనోనేత్రం ముందు బాలగణపతి నవ్వుతూ దర్శనమిచ్చాడు. అప్పుడు గుర్తుకొచ్చింది శివుడికి... విష్ణుమూర్తి సహకారంతో గజాసురుడి ఉదరం నుంచి వెలికి వచ్చిన తర్వాత తన సతిని చూద్దామన్న వేగిరపాటుతో తన నివాసానికి రావడం, వేలెడంత కూడా లేని బుడత ఒకడు తనను లోనికి వెళ్లనివ్వకుండా అడ్డగించడం, తాను ఆగ్రహంతో ఆ బాలుడి శిరస్సు ఖండించడం, పార్వతి ద్వారా అసలు విషయం తెలుసుకుని, ఆ బాలుడికి ఏనుగు తల అతికించి తిరిగి బతికించిన సందర్భంలో... ‘‘నాయనా! గణేశా! ఇకపై దేవదానవ యక్ష గంధర్వ కిన్నర కింపురుషుల దగ్గర నుంచి, మామూలు మనుషులు, మహిమాన్విత గుణాలు కలిగిన రుషులు ఏ పూజలు, వ్రతాలు, శుభకార్యాలూ చేసినా ప్రథమ పూజ నీకే. నూత్నంగా ఎవరు ఏ పని తలపెట్టినా ముందుగా నిన్ను తలచుకుని, నీకు పూజ చేయనిదే ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తి కాదు, అందుకు త్రిమూర్తులమైన మేమూ అతీతులం కాము సుమా’’ అని చెప్పిన మాట, ఇచ్చిన వరం గురించి. వరమిచ్చిన తానే దానిని విస్మరించి, తన కుమారుడే కదా అన్న తేలికపాటి దృష్టితో యుద్ధానికి బయలు దేరేముందు గణపతిని స్మరించకుండా వచ్చేసినందుకే తనకూ, తన పరివారానికీ అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయని గ్రహించాడు. దాంతో ఎంతో నొచ్చుకుని వెంటనే వెనక్కు వెళ్లి, తన పరివారంతో గణపతి పూజ చేయించాడు. తాను కూడా గణపతిని కలిసి తాను యుద్ధానికి వెళుతున్నాననీ, తనకు ఏ విఘ్నాలూ లేకుండా విజయం సాధించేలా చూడమని గణపతికి చెప్పి, వీడ్కోలు తీసుకుని తిరిగి వచ్చి ఈ సారి యుద్ధంలో ఘన విజయం సాధించాడు శివుడు. పిల్లలతో అబద్ధం చెప్పకూడదని, దొంగతనం, అవినీతి, లంచగొండితనం నేరమని చాలా నీతులు చెబుతూ ఉంటాం. కానీ, తీరా మన దగ్గరకొచ్చేసరికి వాటన్నింటినీ పక్కన పెట్టేస్తాం. అది చాలా తప్పు. ఏ మంచినైనా ముందు మనం ఆచరిస్తేనే, పిల్లలు కూడా వాటిని అనుకరిస్తారని తెలుసుకోవడమే ఇందులోని నీతి. – డి.వి.ఆర్. భాస్కర్ -
గణపతి సాక్షిగా...
ఆ గణపతి శివభక్తుల అఖండ భక్తికి, శ్రీశైలయాత్రకు తొలిసాక్షి. ఇల కైలాసపు విశేషాలకు ముఖ్య సాక్షి. క్షేత్రానికి వచ్చే జన నానుడిలో శ్రీశైలయాత్ర చేసేవారు ముందుగా సాక్షిగణపతిని దర్శించి క్షేత్రానికి వచ్చినట్లుగా తెలుపుకోవాలనీ, ఆయన ఈ యాత్రను నమోదుచేసి తన తండ్రి మల్లికార్జునస్వామివారికి, తల్లి భ్రమరాంబాదేవికి తెలియజేస్తాడని కథనం. అపు‘రూపం’ గణపతి రూపాలలోనే అత్యంత విశిష్టమైన రూపం ఇదని క్షేత్ర మాహాత్మ్యం చెబుతోంది. ఈ రూపం మరే ఇతర గాణాపత్య సాహిత్యంలోను మనకు దొరకదు. ఈ మూర్తి ఆసీన రూపంలో కొలువై వుంటాడు. ప్రసన్న వదనంతో, వక్రతుండంతో, ఎడమచేత పుస్తకాన్ని, కుడిచేత లేఖిని (కలం)ని, మిగిలిన రెండు చేతులతో పాశం, అంకుశం ఆయుధాలను ధరించి దర్శనమిస్తాడు. ఓంకార గణపతి ఓనమాలు దిద్దుతూ పుస్తకంపై ఆయన లిఖిస్తున్న ఓనమాలు శివపంచాక్షరీ (ఓం నమశ్శివాయ) మంత్రమే. అక్షరాలను లిఖిస్తూ కనిపిస్తున్న ఈ స్వామిని వ్రాతపతి అని అధర్వణ వేదం తెలిపింది. ముద్గల పురాణం చెప్పిన 32 గణపతి రూపాలో ద్విజగణపతి రూపానికి, ఈ సాక్షిగణపతి రూపానికి చాలా దగ్గర పోలిక వుంది. అక్కడ కూడా స్వామి పుస్తకం, లేఖిని మొదగు ఆయుధాలతో దర్శనమిస్తాడు. పుస్తకం, లేఖిని అజ్ఞానాన్ని, అవిద్యను నాశనం చేసే ఆయుధాలే. కనుక ఈ గణపతిని పూజిస్తే విద్య లభిస్తుందని శాస్త్రం చెబుతోంది. మహాభారతం నాటి రూపం ఐదవ వేదంగా ప్రసిద్ధి పొందిన మహాభారతం రచించింది వేదవ్యాసుడైనా , కొన్ని లక్షల శ్లోకాలను నిరాటంకంగా గణపతి లిఖించాడు. ప్రస్తుతం శ్రీశైలంలోని సాక్షిగణపతి రూపం ఆ లేఖక గణపతిని గుర్తుకు తెస్తుంది. అయితే ఇక్కడ వ్యాసుడు మాత్రం మనకు కనపడడు. శ్రీశైలం యుగయుగాల నాటిదని క్షేత్రపురాణం చెబుతోంది. ద్వాపర యుగంలో పంచపాండవులు ద్రౌపదితో కలిసి క్షేత్రానికి వచ్చినట్లు క్షేత్ర మాహాత్మ్యం తెలుపుతోంది. – డా. ఛాయా కామాక్షీదేవి -
శ్రేయస్కరం... శుభస్కరం
సాధారణంగా లోకంలో ఎన్నో దీక్షలున్నాయి. కాని అన్నింటిలోనూ గణపతి దీక్ష అత్యంత సులభసాధ్యమైనది, అన్నివేళల్లో అందరూ సులభంగా ఆచరించదగినది. ఎక్కువ నియమ నిబంధనలు లేకుండా, ఏ ఇబ్బందులూ కష్టాలూ లేకుండా బాలల నుంచి వృద్ధుల వరకూ, స్త్రీ, పురుషులందరూ చేయగలిగినది. వ్యాసభగవానుడు ముద్గల పురాణంలో తెలిపిన ఈ గణపతి దీక్షను ఆచరించి, కోరిన కోరికలను నెరవేర్చుకోగలిగేందుకు ఈ వారం మీకోసం... ఈ గణపతి దీక్షను వినాయకుడి ఆలయంలో ఒక శుభముహూర్తాన స్వీకరించాలి. దీక్ష తీసుకునే రోజు అభ్యంగ స్నానమాచరించి గణపతి ముందు రెండు చేతులు జోడించి, ‘ఓ గణేశా! ఈ రోజు నుంచి నీ దీక్షావ్రతాన్ని అవలంబించి యథాశక్తి నిన్ను సేవిస్తాను. దీక్షా సమయంలో ఏ విధమైన విఘ్నాలూ కలగకుండా నా కోరికను నెరవేర్చి నీ అనుగ్రహాన్ని ప్రసాదించ’మని ప్రార్థించుకోవాలి. ఏ రంగు వస్త్రాలంటే..? బంగారు రంగుతో మెరుస్తూ ఉన్న కొత్త వస్త్రాలను లేదా లేత ఎరుపురంగు వస్త్రాలు, గణపతి చిహ్నంతో ఉన్న ఒక మాల, కంకణ ం ధరించాలి.దీక్షను స్వీకరించే ముందు –ఆదిదేవ గణాధ్యక్ష! త్వదనుగ్రహకారకం!దీక్షాం స్వీకృత్యత్వతేవాం కరోమీప్సిత సిద్ధయే! అనే దీక్షా మంత్రాన్ని పఠిస్తూ మాలను మెడలో ధరించాలి. చేతికి కంకణాన్ని ధరించాలి. మన కోరికను అనుసరించి 3, 5, 11, 21, 41 రోజులు లేదా శుద్ధ చవితి నుంచి బహుళ చవితి వరకు లేదా బహుళ చవితి నుంచి శుద్ధ చవితి వరకు లేదా వినాయక చవితి నాటికి 11, 5, లేదా 3 రోజులు పూర్తయే విధంగా సులభమైన తిథిని ఎంచుకుని మనకు అనుకూలంగా దీక్షను స్వీకరించాలి. ప్రతిరోజు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని గణపతిని యథాశక్తి ఆరాధించి, అల్పాహారం చేసి, సాయంత్రం ప్రదోష పూజ చేసుకుని, స్వామికి నివేదించిన భోజనాన్ని స్వీకరించాలి. మధ్యలో పండ్లు లేదా పాలు వంటివి తీసుకోవచ్చు. రోగగ్రస్థులు, పిల్లలు, గర్భిణులు, వృద్ధులు తమకు అనుకూలంగా ఆహారాలను స్వీకరించవచ్చు. తూర్పు ముఖంగా కూర్చొని, గణపతి ప్రతిమను లేదా విగ్రహాన్ని లేదా పటాన్ని ముందుంచుకొని పూజించాలి. అవకాశముంటే దీక్షరోజు పళ్లెంలో బియ్యం పోసి, పసుపుతో ముగ్గువేసి, ఒక కలశాన్ని పెట్టి దానిలో నీరుపోసి, అందులో మామిడి మండలు ఉంచి పైన నిండు కొబ్బరికాయను మూతగా ఉంచి, రవికెల గుడ్డను చుట్టి, ఆవాహన చేసి పూజించవచ్చు. ఈ కలశాన్ని దీక్ష ముగిసే వరకు పూజించి ఉద్వాసన చేయవచ్చు. ఎక్కడ ఉన్నా రెండుపూటలా పూజించుకోవడమే ప్రధానం. పూజ ఎక్కువ సమయం చేయలేనివారు మానసిక పూజ చేయవచ్చును. ప్రయాణాలలో ఇది బాగా ఉపకరిస్తుంది. ‘ఓం గం గణపతయే నమః’ అనే మంత్రాన్ని స్మరిస్తూ ఉంటే గణపతి అనుగ్రహం కలుగుతుంది. ఇరుముడికి ప్రత్యామ్నాయంగా గణపతికి ప్రీతికరమైన కొబ్బరి, చెరకు, బెల్లం, అటుకులు, పేలాలు, తేనె, అరటిపండ్లు, ఖర్జూరాలు, తెల్లనువ్వులు, ఉండ్రాళ్ళు సమర్పించడం శుభప్రదం. దీక్షా నియమాలుపూజలో పసుపు, కుంకుమ, అక్షతలు, ఎర్రని పూలు, అగరువత్తులు, హారతి కర్పూరం, దీపం, నైవేద్యం ముందే సిద్ధం చేసుకోవాలి. గరిక (గడ్డిపరకలు), ఎర్రని లేదా తెల్లని పూలు విధిగా ఉంచాలి. బ్రహ్మచర్యాన్ని పాటించాలి. మద్యమాంసాలను విసర్జించి, అందరితోనూ సాత్వికంగా మెలగాలి. దీక్షలో ఉన్నప్పుడు అవకాశాన్ని బట్టి గణపతిని ఆయా దేవాలయాల్లో దర్శించుకోవడం మంచిది. నుదుట విభూతి, గంధం, కుంకుమ ధరించాలి. తినే ప్రతి ఆహార పదార్థాన్ని ‘గణేశార్పణమస్తు’ అని స్వీకరించాలి. దీక్షలో ఉన్నప్పుడు ప్రతి ప్రాణిని గణపతి స్వరూపంగా చూడగలగాలి. దీక్షా ఫలితం ఈ దీక్షను సక్రమంగా పూర్తి చేసిన విద్యార్థులకు సద్బుద్ధి, అఖండ విద్యాప్రాప్తి కలుగుతాయి. సంతానార్థులకు సంతానం, ఉద్యోగార్థులకు మంచి ఉద్యోగం ప్రాప్తిస్తుందని విశ్వాసం. వరంగల్‌కు చేరువలోని కాజీపేటలో శ్వేతార్క గణపతి దీక్షలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. -
బడిని విడిచి.. బందూకు పట్టి విప్లవ గురువులు
కట్టా నరేంద్రచారి, పెద్దపల్లి : అవి 1970 నాటి రోజులు.. పెద్దపల్లి డివిజన్లోని ఎలిగేడు ప్రభుత్వ పాఠశాల.. అందులో ఓ సైన్స్ టీచర్.. ఆయనంటే పిల్లలందరికీ ఎంతో ఇష్టం.. ఏనాడూ ఎవరినీ దండించేవాడు కాదు.. తనకొచ్చే రూ.150 జీతంలో పేద పిల్లల పుస్తకాల కోసమే రూ.50 ఖర్చు చేసేవాడు.. సాయంత్రమైతే చాలు పిల్లలతో కలిసిపోయి ఫుట్‌బాల్ ఆడేవాడు.. ! విద్యార్థులపై ఏనాడూ బెత్తం ఎత్తని ఆ మాస్టారు సమసమాజ లక్ష్యం కోసం బందూకు ఎత్తాడు! సున్నిత మనస్కుడైన ఆ ఉపాధ్యాయుడే ఆయుధం చేతబట్టి అడవిబాట పట్టాడు. ఆయనెవరో కాదు.. దేశంలో మోస్ట్‌వాంటెడ్ మావోయిస్టుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాలిస్తున్న మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు!! నమ్మిన సిద్ధాంతం కోసం 40 ఏళ్లుగా అజ్ఞాతవాసం గడుపుతున్న ఈ ‘ఉపాధ్యాయుడి’ తలపై రూ.2 కోట్ల దాకా రివార్డు ఉంది. ఈయన ఒక్కరే కాదు.. ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ విప్లవ పంథా పట్టినవారు పదుల సంఖ్యలో ఉన్నారు. కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి, వెంపటాపు సత్యం(కొండబారిడి మాస్టారు), పంచాతి కృష్ణమూర్తి, ఖాతా రామచంద్రారెడ్డి, చంద్రశేఖర్, ఆదిభట్ల కైలాసం, కనకాచారి, కోబడ్ గాంధీ, అరుణాగాంధీ, ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడైన ఆర్కే తదితరులంతా ఈ కోవకు చెందినవారే. మొదటితరంలో టీచర్లు ఉద్యమ నాయకులైతే తర్వాతి తరంలో వారి కొడుకులు, వారి శిష్యులు ఇప్పుడు నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తరగతి గదుల నుంచి తరలివెళ్లిన ఈ ‘విప్లవ’ ఉపాధ్యాయులపై మంగళవారం గురుపూజోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. సున్నిత మనస్కుడు.. విప్లవ భావాలు ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శిగా పనిచేస్తున్న ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు అలియాస్ గణపతి పెద్దపల్లి డివిజన్లోని ఎలిగేడు ప్రభుత్వ పాఠశాలలో 1972 నుంచి 1976 వరకు సైన్స్ టీచర్‌గా పని చేశారు. సున్నిత మనస్కుడని, పిల్లల కష్టాలు చూసి చలించిపోయేవాడని నాడు ఆయనతో కలసి పనిచేసిన టీచర్లు గుర్తుచేసుకుంటున్నారు. వచ్చే రూ.150 జీతంలో పేద విద్యార్థుల పుస్తకాలు, వారి అవసరాల కోసం రూ.50 ఖర్చు చేసేవారని, సాయంత్రం వేళ ఉచితంగా చదువు చెప్పేవారని పేర్కొంటున్నారు. ‘‘పిల్లలతో ఆయన ఏనాడూ కఠి నంగా మాట్లాడేవారు కాదు. ఏ విషయమైన ఓర్పుతో సున్నితంగా చెప్పేవారు. విద్యార్థుల కష్టాలు చూసి చలించేవారు. ఇతరుల సొమ్ము అణా పైసా కూడా ముట్టేవాడు కాదు. ఆయన భార్య తన తల్లిగారి ఇంటి నుంచి ఎప్పుడైన బియ్యం, పప్పులు వంటివి తెస్తే వాటిని కూడా వెనక్కి పంపేవాడు. నాడే విప్లవ భావాలు బయటపడ్డాయి. పాఠశాలలో మీటింగ్‌లు జరిగితే దొరలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లా డేవాడు..’’ అని నాడు గణపతితో కలసి టీచర్‌గా పనిచేసిన బోడ మల్లారెడ్డి చెప్పారు. మిగతా టీచర్లం తా పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాల్లో ఉంటూ సైకిల్‌పై ఎలిగేడు వచ్చేవారని, లక్ష్మణ్‌రావు మాత్రం తమ ఊరిలోనే ఇల్లు కిరాయికి తీసుకొని ఉండేవారని గ్రామస్థులు పేర్కొన్నారు. గణపతి అత్తగారి ఊరు పెద్దపల్లి మండలం రాగినేడు. ఈ ఊళ్లో దొరతనాన్ని ధిక్కరిస్తూ సాగిన కార్యకలాపాలకు గణపతి సారథ్యం వహించడం గమనార్హం. ఒక్కరా.. ఇద్దరా! ఉమ్మడి రాష్ట్రంలో 1965లో నక్సలిజానికి బీజం పడింది. పశ్చిమబెంగాల్లోని నక్సల్బరీ స్ఫూర్తితో శ్రీకాకుళాన్ని తాకిన ఈ ఉద్యమంలో ఎందరో ఉపాధ్యాయులు దూకారు. వెంపటాపు సత్యం, పంచాతి కృష్ణమూర్తి ఉపాధ్యాయ వృత్తిని వదిలి విప్లవబాట పట్టారు. 1976లో తెలంగాణ ప్రాంతంలో ఫ్యూడలిస్టులకు వ్యతిరేకంగా కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తిల నాయకత్వంలో నక్సలైట్ కార్యకలాపాలు మొదలయ్యాయి. కొండపల్లి సీతారామయ్య హిందీ మాస్టారు కాగా సత్యమూర్తి తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు. వెంపటాపు సత్యం 1962–63లో ఇప్పటి విజయనగరం జిల్లా కురుపాం మండలం కొండబారిడిలో ప్రభుత్వ టీచర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఉన్న మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్న ఖాతా రామచంద్రారెడ్డి తీగలకుంటపల్లిలో స్కూల్ టీచర్‌గా పనిచేస్తూనే అజ్ఞాతంలోకి వెళ్లారు. దండకారణ్యంలో ఉన్న మరో మావోయిస్టు నాయకుడు చంద్రశేఖర్ కూడా ఏటూరు నాగారం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. వీరితోపాటు కోబడ్ గాంధీ, అరుణాగాంధీ(వీరిద్దరూ ఢిల్లీలో ప్రొఫెసర్లు), ప్రస్తుతం మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆర్కే(గుంటూరు జిల్లాలో టీచర్‌గా), ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన లలితక్క(కోరుట్లలో టీచర్‌గా), కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన రమేశన్న(సిరిసిల్లలో టీచర్‌గా) వంటి నేతలంతా ప్రభుత్వ విద్యాలయాల్లో పిల్లలకు పాఠాలు బోధించినవారే. ప్రస్తుతం జైల్లో ఉన్న ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాతోపాటు విరసం నేత వరవరరావు, ఉద్యమంలో అమరులైన చెరబండ రాజు, బాలగోపాల్, ఆకుల భూమయ్య కూడా టీచర్లే కావడం గమనార్హం. సారు ఒక్క దెబ్బ కొట్టలేదు.. ఆ రోజుల్లో సార్లు బొర్లిచ్చి కొట్టేవారు. కోదండం ఎక్కించేవారు. లక్ష్మణ్‌రావు (గణపతి) సారు మాత్రం మమ్ముల్ని ఒక్కదెబ్బ కొట్టేవారు కాదు. బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. ఎలిగేడులోనే ఉండి సాయంకాలం ఉచితంగా ట్యూషన్ చెప్పేవారు. మాతో కలసి ఫుట్‌బాల్ ఆడేవారు. – కట్ల అశోక్, స్కూల్లో గణపతి శిష్యుడు -
శైవాగమంలో గణపతి... మరి వైష్ణవంలో..?
ఆగమం శైవసంప్రదాయంలో తొలిపూజ అందుకునేది వినాయకుడైతే, శ్రీవైష్ణవ ఆగమాలు విష్వక్సేనునికి అగ్రపూజ చేస్తాయి. ‘విశ్వ’ అంటే సకలలోకాలను, ‘సేనుడు’ అంటే నడిపించేవాడనీ అర్థం. విష్వక్సేనుడు విష్ణు గణాలకు అధిపతి. విష్ణు సైన్యాధిపతియైన విష్వక్సేనుని ఆశ్రయించిన వారికి ఎన్ని అడ్డంకులనైనా తొలగిస్తాడు. నాలుగు భుజాలతో శంఖు, చక్ర, గదలను ధరించి నాలుగువేళ్ళను మడిచి, చూపుడు వేలును పైకి చూపిస్తోన్న ముద్రతో దర్శనమిస్తుంటాడు విష్వక్సేనుడు. కొన్ని సందర్భాలలో గదకు బదులుగా దండాయుధంతో కనబడుతుంటాడు. ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు, సమస్త దోషాలను హరించి, భక్తులలో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. ఎవరైతే విష్వక్సేనుని ఆరాధిస్తారో, ధ్యానిస్తారో, వారికి ఎలాంటి విఘ్నాలు, ఆపదలు, కష్టాలు కలుగవని వైఖానస ఆగమం చెబుతోంది. విష్వక్సేనునికి సూత్రవతీ, జయ అనేవారు భార్యలు. మనం చేతికి ధరించే రక్షాసూత్రానికి అధి దేవతే సూత్రవతి. శ్రీవైష్ణవాగమాలు విష్వక్సేనుని దర్భకూర్పుగా ఆరాధిస్తాయి. శైవంలో పసుపు గణపతిని పూజిస్తే, వైష్ణవంలో తమలపాకుపై వక్కను ఉంచి, విష్వక్సేనునిగా భావిస్తారు. అందుకే వక్కలు లేని ఆకులు నిరర్థకం, నిష్ఫలం అంటారు. -
గణపతి నవరాత్రోత్సవాలకు శ్రీకారం
- శ్రీశైలంలో సెప్టెంబర్ 3 వరకు విశేష పూజలు - అప్పటి వరకు ఆర్జిత రుద్రహోమాలు రద్దు ·- నాలుగు అడుగులకుపైగా మృత్తికా (మట్టి) గణపతి శ్రీశైలం: వినాయక చవితి పురస్కరించుకొని శుక్రవారం శ్రీశైలంలో గణపతి నవరాత్రోత్సవాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఆలయ ప్రాగణంలో ఉదయం 8.10 గంటలకు యాగశాలప్రవేశం, వేదస్వస్తి, శివసంకల్పం, గణపతి పూజతో అత్యంత వైభవంగా ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈఓ భరత్ గుప్త .. ఉభయదేవాలయాల అర్చకులు, ప్రధాన అర్చకులు, వేదపండితుల స్వస్తిపుణ్యా హవచం, కంకణపూజ, ఋత్విగ్వరణం, కంకణదారణలతో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. సెప్టెంబర్ 3 వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈఓ తెలిపారు. అప్పటి వరకు ఆలయ ప్రాంగణంలో రత్నగర్భగణపతి, శ్రీశైలానికి మూడు కిలోమీటర్ల దూరంలోని సాక్షి గణపతికి నిత్యం వ్రతకల్పం విశేషార్చనలుంటాయన్నారు. అలాగే గత ఏడాది తరహాలోనే ఆలయప్రాంగణంలో మృత్తిక(మట్టి) గణపతిని నెలకొల్పి వ్రత కల్ప పూర్వకంగా పూజాధికాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ప్రారంభ పూజల అనంతరం యాగశాలలో అఖండస్థాపన, మండపారాధన, కలశస్థాపన నిర్వహించారు. సాయంకాలం అంకురార్పణ, అగ్నిప్రతిష్టాపన, ఉపాంగహవనాలు, గణపతి హోమం జరిపించారు. చివరిరోజు సెప్టెంబర్ 3 ఉదయం 10 గంటలకు గణపతిపూజ, మండపారాదనలు, కలశార్చనలు, గణపతిహోమం, రుద్రహోమం అనంతరం పూర్ణాహుతితో ఉత్సవాలకు ముగింపు పలుకుతామన్నారు. ఆ తర్వాత అలంకార మండపంలోని మృత్తికా గణపతిని నిమర్జనం చేస్తామన్నారు. నవరాత్రులలో ఆర్జిత రుద్రహోమాలు నిలుపుదల.. గణపతి నవరాత్రులను పురస్కరించుకొని శుక్రవారం నుంచి సెప్టెంబర్ 3 వరకు గణపతి హోమం, ఆర్జిత రుద్రాభిషేకం, ఆర్జిత మృత్యుంజయ హోమం, ఆర్జిత నవగ్రహ హోమం నిలుపుదల చేస్తున్నట్లు ఈఓ ప్రకటించారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే చండీహోమాలు మాత్రం ఉత్సవ సమయంలో కూడా కొనసాగుతాయన్నారు. భక్తులకు సదావకాశం:.. గణపతి నవరాత్రోత్సవాల్లో ఆలయంలో చేపడుతున్న పుష్పాలంకరణలో భక్తులకు అవకాశం కల్పించాలని దేవస్థానం సంకల్పించిందని ఈఓ తెలిపారు. ఆసక్తి కల్గిన వారు పుష్పాలంకరణ కోసం విడిపూలు విరాళంగా సమర్పించవచ్చన్నారు. -
గణపతీ.. ఇదేమి దుస్థితి
నిమజ్జనానికి నీరు కరువు మూడేళ్లుగా ఇదే పరిస్థితి గంగమ్మ కోసం గ్రామస్తుల ఎదురుచూపు ఈ వి‘చిత్రం’ చూశారా..! ఈ విగ్రహాలను చూస్తుంటే వినాయక చవితి ఉత్సవాల కోసం తయారు చేసి అమ్మకం కోసం పెట్టినట్టు కనిపిస్తోంది కదూ.. కానీ ఇది నిజం కాదు. ఇవి ఇప్పటికే నవరాత్రుల పాటు పూజలందుకున్న విగ్రహాలే. లింగాల ఘణపురం మండల కేంద్రంలోని చెరువులో నీళ్లు లేక ఇలా మట్టిలోనే వదిలేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నా ఇక్కడ మాత్రం చుక్కనీరు పడలేదు. ఈ ఒక్క ఏడాదే కాదు.. గత మూడు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఎటూ చూసిన కరువు ఛాయలే కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో సైతం ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తున్నారు. గ్రామంలో వీధివీధినా ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలను ఇలా చెరువులో వదిలేసిన భక్తులు గంగమ్మ కోసం ఎదురుచూస్తున్నారు. -
గణపతి వచ్చే.. సంబరాన్ని తెచ్చే
-
రేపటి నుంచి గణపతి నవరాత్రోత్సవాలు
శ్రీశైలం: శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో ఈ నెల 5వ తేదీ నుంచి 14 వరకు గణపతి నవరాత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. వినాయకచవితి సందర్భంగా ఆలయప్రాంగణంలోని రత్నగర్భగణపతితో పాటు క్షేత్రపరిధిలోని సాక్షిగణపతికి విశేషపూజలను నిర్వహిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త శనివారం తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో వైదిక కమిటీ సూచనల మేరకు మత్తికా గణపతి ( మట్టితో చేసిన వినాయక విగ్రహం) నెలకొల్పి విశేషపూజలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆగమశాస్త్రాన్ని అనుసరించి మండపారాధనలు, ఉపనిషత్ పారాయణలు, జపానుష్ఠానాలు, గణపతిహోమం, ఉపాంగహోమం, నిత్యాహవనాలు తదితర వైదిక కార్య›క్రమాలు జరుగుతాయన్నారు. గణపతి నవరాత్రోత్సవాలలో భక్తులు కూడా ఆర్జిత ఉభయం చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. ఒక్క రోజు ఉభయానికి రూ. 5,000లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ ఉభయసేవా టికెట్లను ఆన్లైన్ ద్వారా కూడా పొందవచ్చునని పేర్కొన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో పార్యావరణ పరిరక్షణ దష్టిలో పెట్టుకుని వినాయక చవితి మహోత్సవాలలో వినాయకుని మట్టి విగ్రహాలను మాత్రమే అనుమతిస్తామని ఈఓ నారాయణభరత్ గుప్త శనివారం తలెఇపారు. పర్యావరణ సమతుల్యం కోసం క్షేత్రపరిధిలో ప్లాస్టర్‌ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను పూర్తిగా నిషేధించినట్లు పేర్కొన్నారు. -
‘చరిత’ నడవాలని..
వజ్ర సంకల్పం మనమంతా దేవుడు చేసిన మనుషులమే.. ఒక్కోసారి ఆ దేవుడు కూడా పనిభారం ఎక్కువయ్యో ఏమోగానీ కొందరిని కొన్ని లోపాలతో పుట్టిస్తుంటాడు. కవిత, వజ్రాచారి దంపతులకూ అలాంటి ఓ బిడ్డనే ప్రసాదించాడు. అన్నీ బాగానే ఇచ్చి.. నడిచేందుకు కాళ్లను మాత్రం సరిగా ఇవ్వలేదు. ఆ దంపతులకు ఆయన మీద చాలా నమ్మకం.. ఇవ్వాళ్ల కాకపోతే రేపు.. నా బిడ్డకు దేవుడు న్యాయం చేయకపోతాడా అని. ఆ నమ్మకంతోనే వజ్రాచారి గట్టి సంకల్పం చేసి, ‘తన కూతురు కర్రసాయం లేకుండా కాళ్లతో నడవాలని... కర్రతోనే భారీ గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు ఓ తపస్సులా... ఇరవై రోజులుగా గణేశుడి తయారీలో లీనమైపోయాడు. ఈ తండ్రి కథ ఇది... ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని కావేరి నగర్లో నివాసం ఉంటున్న ఏలేటి వజ్రాచారి వడ్రంగి పనినే నమ్ముకుని దాంతోనే కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వజ్రాచారి దంపతులకు ఇద్దరు బిడ్డలు ఒకేసారి పుట్టారు. చరిత, చార్మి అని పేర్లు పెట్టుకుని, ఇద్దరినీ అల్లారుముద్దుగా పెంచారు. రెండేళ్లదాకా అంతా ఆనందంగానే సాగింది. ఆ తర్వాత.. చార్మి బుడిబుడి అడుగులు వేస్తోంది.. నడుస్తోంది.. పరుగులూ పెడుతోంది. కానీ.. తన కన్న కొన్ని నిమిషాలు పెద్దదైన చరిత మాత్రం కనీసం నిల్చోలేక పోతోంది. ‘కొంచెం పెద్దగయితే నడుస్తుందిలే..’ అని సర్దిచెప్పుకున్నారు కానీ నాలుగేళ్లయినా చరిత నడవడం లేదు. మంచానికే పరిమితమైంది. ఎన్ని ఆస్పత్రులో.. ఎన్ని గుళ్లో.. ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. నిర్మల్, నిజామాబాద్, హైదరాబాద్ ఇలా.. అన్ని పెద్దాసుపత్రులకూ తీసుకెళ్లారు. గుళ్లకు తిరిగారు. ఆమె నడవలేకపోవడానికి నరాల బలహీనత వంటి కొన్ని కారణాలున్నాయన్నారు డాక్టర్లు. చివరకు ఎవరో చెబితే, తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు చరిత కాళ్లకు ఆపరేషన్ చేశారు. ఆ తర్వాత నుంచి కర్రసాయంతో నెమ్మదిగా నడుస్తోంది చరిత. శారీరకలోపం ఉన్నా.. తన బిడ్డ చదువులో వెనుకబడకూడదన్న తపనతో ఆమెను బడికి తీసుకెళ్లాడు వజ్రాచారి. ప్రస్తుతం పదమూడేళ్ల చరిత తమ వీధిలోనే ఉండే పాఠశాలలో సెవెంత్ క్లాస్ చదువుతోంది. దేవుడు కరుణిస్తాడేమోనని.. కర్రల సాయం లేకుండా చరిత నడవాలంటే ప్రత్యక్ష దైవాలైన వైద్యుల పని పూర్తయింది. ఇక ఆ దైవానుగ్రహమే మిగిలిందని ఆ దేవుడికే ప్రాణప్రతిష్ట చేసేందుకు సిద్ధమయ్యాడు వజ్రాచారి. ఇరవై రోజుల క్రితం నిర్మల్‌లోని మల్లన్నగుట్టపై గల హరిహరక్షేత్రంలో గణపతికి పూజ చేసి సంకల్పం తీసుకున్నాడు. ‘గణపయ్యా.. నా బిడ్డ కర్రలు లేకుండా నడవాలి. అందుకోసం కర్రతో నీ విగ్రహాన్ని తయారుచేస్తా..’ అని మొక్కుకున్నాడు. ఆరోజు నుంచి నిర్విరామంగా గణనాథుడి తయారీలో నిమగ్నమయ్యాడు వజ్రాచారి. బిడ్డ కోసం భర్త తీసుకున్న దీక్షకు భార్య కవిత, తమ్ముడు ప్రసాద్ కూడా తోడయ్యారు. పూర్తిగా టేకు కర్రతో.. ‘వజ్ర’ సంకల్పంతో తయారు చేసిన గణేశుడి విగ్రహాన్ని స్థానిక వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం వద్దగల సంఘభవనంలో ప్రతిష్ఠిస్తామని తెలిపారు. ఇక.. ఆ దేవుడు కరుణించడమే మిగిలి ఉంది. ఆ ఆడబిడ్డపై గణనాథుడు కరుణ కురిపించాలని మనం కూడా మనసారా వేడుకుందాం. - రాసం శ్రీధర్, నిర్మల్ రూరల్, ఆదిలాబాద్ నడిస్తే దీక్ష నెరవేరినట్లే.. దేవుడి కృపతో తాను అందరిలా నడుస్తుందన్న నమ్మకంతోనే గణపతి విగ్రహ తయారీ మొదలుపెట్టాను. ఇదే మొదటి విగ్రహమైనా మనసు నిండా స్వామిని నింపుకోవడం వల్లనేమో ఎలాంటి లోపం లేకుండా విగ్రహం తయారైంది. ఇక ఆ దేవుడు కరుణించి చరితను నడిపిస్తే.. నా దీక్ష నెరివేరినట్లే. - ఏలేటి వజ్రాచారి, చరిత తండ్రి నడకొస్తే అమ్మానాన్నలను బాగా చూసుకుంటా! నా కోసం అమ్మానాన్నా ఇంతగా తపిస్తుండటం చూస్తుంటే వాళ్ల బిడ్డగా పుట్టడటమే నా అదృష్టం అనుకుంటాను. ఆ గణేశుని దయవల్ల నాన్న కోరిక నెరవేరి.. నాకు నడక వస్తే బాగా చదివి ఉద్యోగం సాధిస్తా. అమ్మానాన్నలను బాగా చూసుకుంటా. - చరిత, ఏడో తరగతి -
మహా గణపతి నేత్ర దర్శనం
ఖైరతాబాద్: శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహా గణపతి రూపంలో దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ మహాగణపతికి శుక్రవారం సాయంత్రం 4.40 గంటలకు శిల్పి రాజేంద్రన్ కంటి పాపను దిద్దారు. విఠల శర్మ సిద్ధాంతి నిర్ణయించిన ముహూర్తం మేరకు మహా గణపతికి దిష్టితీసి, కొబ్బరి కాయలు కొట్టి కంటి పాపను తీర్చిదిద్దారు. 58 అడుగుల ఎత్తులో మహాగణపతి అద్భుత రూపంలో భక్తులకు దర్శనమిస్తారని శిల్పి తెలిపారు. ఇప్పటికే రంగులు వేసే కార్యక్రమం దాదాపు పూర్తయిందని... శనివారం కర్రలు విప్పుతామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు. -
ఏకవింశతి దూర్వాయుగ్మ (గరిక) పూజ
(రెండు, రెండు గరికలుగా స్వామిని అర్చించాలి. సరిపోని పక్షంలో అక్షతలతో పూజించవచ్చు.) గణాధిపాయ నమః దూర్వారయుగ్మం పూజయామి! పాశాంకుశధరాయనమః దూర్వారయుగ్మం పూజయామి! ఆఖువాహనాయ నమః దూర్వారయుగ్మం పూజయామి! వినాయకాయనమః దూర్వారయుగ్మం పూజయామి! ఈశపుత్రాయ నమః దూర్వారయుగ్మం పూజయామి! సర్వసిద్ధిప్రదాయ నమః దూర్వారయుగ్మం పూజయామి! ఏకదంతాయనమః దుర్వారయుగ్మంపూజయామి! ఇభవక్త్రాయ నమః దూర్వారయుగ్మం పూజయామి! మూషికవాహనాయ నమః దూర్వారయుగ్మం పూజయామి! కుమారగురవే నమః దూర్వారయుగ్మం పూజయామి! కంపిలవర్ణాయనమః దూర్వారయుగ్మం పూజయామి! బ్రహ్మచారిణేనమః దూర్వారయుగ్మం పూజయామి! మోధికహస్తాయనమః దూర్వారయుగ్మం పూజయామి! సురశ్రేష్టాయనమః దూర్వారయుగ్మం పూజయామి! గజనాసికాయ నమః దూర్వారయుగ్మం పూజయామి! కపిత్తఫలిప్రియాయనమః దూర్వారయుగ్మం పూజయామి! గజముఖాయనమః దూర్వారయుగ్మం పూజయామి! సుప్రసన్నాయనమః దూర్వారయుగ్మం పూజయామి! సురాగ్రజాయనమః దూర్వారయుగ్మం పూజయామి! ఉమాపుత్రాయనమః దూర్వారయుగ్మం పూజయామి! స్కందప్రియాయనమః దూర్వారయుగ్మం పూజయామి! శ్రీ వరసిద్ది వినాయకాయ స్వామినే నమః ఏకవింశతి - దూర్వారయుగ్మం సమర్పయామి శ్రీ గణపతి అష్టోత్తర శతనామావళి ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ద్వైమాతురాయ నమః ఓం ద్విముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృతినే నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుఖనిధయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నాయ నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబకర్ణాయ నమః ఓం హ్రస్వగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మహోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రమధాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాటత్పయే నమః ఓం శ్రీపతయే నమః ఓం శృంగారిణే నమః ఓం ఆశ్రీతవత్సలాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శీఘ్రకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాయ నమః ఓం బలోత్థితాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణ పురుషాయ నమః ఓం పూష్ణే నమః ఓం పుష్కరక్షిప్తవారిణే నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం చామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమార గురవే నమః ఓం అక్షోభ్యాయ నమః ఓం కుంజరాసుర భంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్థ పనసప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః ఓం విష్ణవే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మథాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జ్యాయనే నమః ఓం యక్షకిన్నరసేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనినదాయ నమః ఓం వటవే నమః ఓం అభీష్టవరదాయినే నమః ఓం జ్యోతిషే నమః ఓం భక్తనిధయే నమః ఓం భావగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం అపాకృతపరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యే నమః ఓం సరసాంబునిధయే నమః ఓం మహేశాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింకిణీ మేఖలాయ నమః ఓం సమస్తదేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతతోత్థితాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వక్‌దృశే నమః ఓం విశ్వరక్షాకృతే నమః ఓం కళ్యాణ గురవే నమః ఓం ఉన్మత్తవేషాయ నమః ఓం అపరాజితే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాన్తచిదచిత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. ధూపమ్ : (అగరువత్తులను వెలిగించి ఆ ధూపాన్ని గణపతికి కుడి చేతితో చూపించాలి. అంతేగాని అగరువత్తులను చుట్టూ తిప్పకూడదు) దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం॥ఉమా సుత నమస్తుభ్యం గృహాణవరదో భవ॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి. దీపమ్ : (కర్పూర దీపాన్ని గాని, నేతి దీపాన్ని గాని కుడిచేతితో భగవంతునికి చూపాలి) స్వాజ్యంత్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి॥ నైవేద్యమ్ : (గణపతికి నివేదించాల్సిన అన్ని ఫలాలను, పిండి వంటలను పళ్లెంలో ఒక ఆకువేసి ఆ ఆకులో పెట్టి ఉంచాలి. వాటిపై ఈ క్రింది మంత్రంతో నీళ్ళు చల్లాలి) ఓమ్ భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయనః ప్రచోదయాత్ ॥ (పుష్పంతో నీటిని పదార్థాల చుట్టూ తిప్పాలి) ఓమ్ సత్యంత్వర్తేన పరిషించామి॥ ఓమ్ బుుతంత్వా సత్యేన పరిషించామి॥(రాత్రి అయితే) సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృతపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవచణముద్గైః ప్రకల్పితాన్ భక్ష్యం భోజ్యం చ లేహ్యంచ చోష్యం పానీయమేవచ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మహానైవేద్యం సమర్పయామి. (పుష్పంతో నీటిని రెండుసార్లు పళ్లెంలో విడిచిపెట్టాలి) ఓమ్ అమృతమస్తు! ఓమ్ అమృతోపస్తరణమసి॥ (అయిదుసార్లు ఎడమచేతితో కుడిమోచేయిని పట్టుకుని కుడి చేతితో గణపతివైపు నైవేద్యాన్ని చూపాలి) ఓమ్ ప్రాణాయ స్వాహా ఓమ్ అపానాయ స్వాహా ఓమ్ వ్యానాయ స్వాహా ఓమ్ ఉదానాయ స్వాహా ఓమ్ సమానాయ స్వాహా॥(తరువాత సమర్పయామి అన్నప్పుడల్లా పుష్పంతో పళ్ళెంలో నీళ్ళు వదలాలి) మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోశనం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి॥ తాంబూలమ్ : (మూడు తమలపాకులు, వక్కలు, అక్షతలు, పుష్పం, ఫలం సుగంధ ద్రవ్యాలు, దక్షిణలతో తాంబూలాన్ని గణపతి వద్ద ఉంచాలి) పూగీఫలసమాయుక్తం నాగవల్లీదళైర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి॥సదానంద విఘ్నేశ పుష్కలాని ధనాని చ భూమ్యాం స్థితాని భగవాన్ స్వీకురుష్వ వినాయక॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః సువర్ణ పుష్పం సమర్పయామి॥ నీరాజనమ్ : (హారతి కర్పూరాన్ని వెలిగించి ఆ దీపాన్ని తిప్పుతూ గణపతికి చూపించాలి) ఘృతవర్తిసహస్రైశ్చ కర్పూర శకలైస్తదా నీరాజనం మయాదత్తం గృహాణ వరదోభవ॥సమ్రాజంచ విరాజంచ అభిశ్రీః యాచనోగృహే లక్ష్మీరాస్ట్య్ర యాముఖే తయామా సగ్ం సృజామసి॥సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళానిభవంతు నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం దర్శయామి॥నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి॥(అని పుష్పంతో పళ్ళెంలో నీటిని విడవాలి) మంత్రపుష్పమ్ : (ఇక్కడ మంత్రపుష్పాన్ని పెద్దదిగాని, చిన్నదిగాని చెప్పవలెను. రానివారు ఈ శ్లోకాలతో మంత్రపుష్పాన్ని సమర్పించాలి) గణాధిప నమస్తేస్తు ఉమాపుత్రా విఘ్ననాశన వినాయకేశ తనయ సర్వసిద్ధి ప్రదాయక॥ ఏకదంతైక వదన తథా మూషికవాహన కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్॥ తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నోదంతిః ప్రచోదయాత్॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః మంత్రపుష్పాంజలిం సమర్పయామి. ఆత్మప్రదక్షిణ నమస్కారమ్ : (పువ్వులు, అక్షతలు తీసుకుని లేచి నిలబడి నమస్కారం చేయాలి. అంతేగాని తనచుట్టూ తాను తిరగకూడదు) ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన॥ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే పాపోహం పాపకర్మానాం పాపాత్మా పాపసంభవః త్రాహిమాం కృపయాదేవ శరణాగత వత్సల అన్యాధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్కారుణ్యభావేన రక్షరక్ష గణాధిప॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ప్రార్థన (పుష్పాక్షతలతో ప్రార్థించి, తరువాత వాటిని గణపతి పాదాల వద్ద ఉంచాలి) నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్॥వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా॥అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక॥ శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి॥ సాష్టాంగ నమస్కారమ్ ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పాదాభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే॥శ్రీ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారాన్ సమర్పయామి॥ శ్లో॥ మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి యత్పూజితం మయాదేవ పరిపూర్ణంతదస్తుతే అనేన పూజావిధానేన శ్రీ మహాగణాధిపతి సుప్రీత స్సుప్రసన్నో వరదోభవతు. (నేను చేసిన పూజలో మంత్రలోపము, క్రియాలోపము, భక్తి లోపము ఉన్నను అవన్నీ మన్నించి గణపతి దేవా పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించుము. అపరాధ ప్రార్థన : (రెండు చేతులు జోడించి గణపతికి నమస్కరించి, చెంపలు వేసుకోవాలి) అపరాధ సహస్రాణి క్రియంతేహం అహర్నిశా పుత్రోయమితి మామత్వా క్షమస్వ గణనాయక॥ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజాంచైవ నజానామి క్షమ్యతాం గణనాయక॥శ్రీ వరసిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామినే నమః అపరాధ నమస్కారాన్ సమర్పయామి॥ (ఈ కింది మంత్రాలను చెబుతూ కొన్ని అక్షింతలు చేతిలో తీసుకొని నీటితో పళ్లెంలో విడిచిపెట్టాలి) అనేన మయాకృతేన కల్పోక్త ప్రకారేణ గణపతి అష్టోత్తర శతనామ సహిత యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజానేన భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధిబుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామిన్ సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు. శ్రీ గణేష ప్రార్థన తుండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మ్రొక్కెదన్ తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటినందన నీకు మ్రొక్కెదన్ ఫలితము సేయుమయ్య నిను ప్రార్థన చేసెద నేకదంత నా వలపటి చేతి గంటమున వాక్కున నెప్పుడు బాయకుండుమీ తలపున నిన్ను వేడెద దైవగణాధిప లోకనాయకా! తలచితినే గణనాథుని తలచితినే విఘ్నపతిని తలచిన పనిగా దలచితినే హేరంబుని దలచితి నా విఘ్నముల దొలగుట కొఱకున్ అటుకులు కొబ్బరిపలుకులు చిటిబెల్లము నానుబ్రాలు చెరకు రసంబున్ నిటలాక్షు నగ్రసుతునకు పటుతరముగ విందుసేతు ప్రార్థింతు మదిన్ శ్రీ వినాయకుని దండకము శ్రీ పార్వతీపుత్ర లోకత్రయీస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్త్రా మహాకాయ, కాత్యాయనీనాథ సంజాత స్వామీ శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు ఖండంబు నీ నాల్గు హస్తంబులన్నీ కరాళంబు నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద యుగ్మంబు లంబోదరంబున్ సదా మూషికాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్ని తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగ యజ్ఞోపవీతంబు నీ భవ్యరూపంబు దర్శించి హర్షించి సంప్రీతి మ్రొక్కంగ శ్రీ గంధమున్ గుంకుమం బక్షతలాజులున్ చంపకంబున్ తగన్ మల్లెలన్మొల్లలన్మంచి చేమంతులున్ తెల్లగన్నేరులన్ మంకెలన్ పొన్నలన్ పువ్వులు న్మంచి దుర్వంబు లందెచ్చి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి పూజించి సాష్టాంగంబు జేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయలుం పొన్నంటి పండున్ మరిన్మంచివౌ ఇక్షుఖండంబులు, రేగుబండ్లప్పడాల్ వడల్ నేతిబూరెల్ మరీస్ గోధుమప్పంబులు న్వడల్ పున్గులున్ గారెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ తేనెయుం జున్ను బాలాజ్యమున్నాను బియ్యంబు చామ్రంబు బిల్వంబు మేల్ బంగరున్ బళ్లెమం దుంచి నైవేద్యముంబంచనీ రానంబున్ నమస్కారముల్జేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్యదైవంబుల్ ప్రార్థనల్చే యుటల్ కాంచనం బొల్లకే యిన్ముదాగోరు చందంబుగారే మహాదేవ యో భక్తమందారయో సుందరాకార యో భాగ్య గంభీర యో దేవ చూడామణి లోకరక్షామణి బంధు చింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాదిదాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుండ నన్నిప్డు చేపట్టి సుశ్రేయునింజేసి శ్రీమంతుగనూచి హృత్పద్మసింహాస నారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గొల్చి ప్రార్థించు భక్తాళికిన్ కొంగు బంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియున్విద్య యున్నాడియున్ బుత్ర పౌత్రాభివృద్ధిన్ దగన్‌గల్గగాజేసి పోషించుమంటిన్ గృపన్ గావుమంటిన్ మహాత్మా! ఇవే వందనంబుల్ శ్రీ గణేశా నమస్తే.. నమస్తే...నమః విఘ్నేశుని కథా ప్రారంభం (కథ చదివేవారు వినేవారు అందరూ అక్షతలు చేతిలో వుంచుకొని కథ వినాలి) సూతమహాముని శౌనకాది మునులకు విఘ్నేశ్వరో త్పత్తియు, చంద్రదర్శన దోషకారణంబును, తన్నివారణ మును చెప్పదొడంగెను. పూర్వము గజరూపముగల రాక్షసేశ్వరుండు శివుని గూర్చి ఘోర తపంబొనర్చెను. అతని తపమునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరంబు కోరుకోమనెను. అంత గజాసురుండు పరమేశ్వరుని స్తుతించి, స్వామీ! నీవెల్లప్పుడు నా యుదర మందు వసించియుండుమని కోరెను. భక్త సులభుండగు నా పరమేశ్వరుండాతని కోర్కెదీర్చి గజాసురుని యుదరమందు ప్రవేశించి సుఖంబుననుండెను. కైలాసమున పార్వతీదేవి భర్త జాడ తెలియక పలుతెరంగుల నన్వేషించుచు కొంత కాలమునకు గజాసుర గర్భస్థుడగుట తెలిసికొని రప్పించుకొను మార్గముగానక పరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి తన పతి వృత్తాంతము తెలిపి, ‘‘మహాత్మా! నీవు పూర్వము భస్మాసురుని బారి నుండి నా పతిని రక్షించి నాకు యొసంగితివి, ఇప్పుడు కూడా నుపాయాంతరముచే నా పతిని రక్షింపుము’’ అని విలపింప, శ్రీహరి యా పార్వతి నూరడించి పంపె. అంత నా హరి బ్రహ్మాదిదేవతలను పిలిపించి, గజాసుర సంహారమునకు గంగి రెద్దుమేళమే యుక్తమని నిశ్చయించి, నందిని గంగిరెద్దుగా నలంకరించి, బ్రహ్మాదిదేవతలందరిచేతను తలొక వాద్యమును ధరింపజేసి, తానును చిరుగంటలు, సన్నాయిలు దాల్చి గజాసురపురంబు జొచ్చి జగన్మోహనంబుగా నాడించు చుండగా, గజాసురుండు విని వారలను తన చెంతకు పిలిపించి తన భవనమందు నాడింప నియోగించెను. బ్రహ్మాదిదేవతలు వాద్య విశేషంబుల బోరు సలుప జగన్నాటక సూత్రధారియగు నా హరి చిత్ర విచిత్ర కరంబుగ గంగిరెద్దును ఆడించగా, గజాసురుండు పరమానంద భరితుడై ‘‘మీకేమి కావలయునో కోరుడొసంగెద’’ ననిన, హరి వానిని సమీపించి, ‘‘ఇది శివుని వాహనమగు నంది’’ శివుని కనుగొనుటకై వచ్చె కావున శివునొసంగు’’ మనెను. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని రాక్షసాంతకుడగు శ్రీహరిగా నెరింగి, తనకు మరణమే నిశ్చయమనుకొనుచు తన గర్భస్థుండగు పరమేశ్వరుని ‘‘నా శిరసు త్రిలోకపూజ్యముగా జేసి, నా చర్మము నీవు ధరింపు’’ మని ప్రార్థించి విష్ణుమూర్తికి అంగీకారము తెలుప నాతడు నందిని ప్రేరేపించెను. నందియు తన శృంగములచే గజాసురుని చీల్చి సంహరించెను. అంత శివుడు గజాసుర గర్భము నుండి బహిర్గతుడై విష్ణుమూర్తిని స్తుతించెను. అంత నా ‘‘హరి దుష్టాత్ములకిట్టి వరంబు లీయరాదు... ఇచ్చినచో పామునకు పాలుపోసినట్లగు’’నని ఉపదేశించి బ్రహ్మాది దేవతలను వీడ్కొలిపి తాను వైకుంఠమున కేగెను. శివుడు నంది నెక్కి కైలాసమున కతివేగంబున జనియె. వినాయకోత్పత్తి కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదుల వలన విని ముదమంది అభ్యంగన స్నానమాచరించుచు నలుగుబిండితో నొక బాలునిగ జేసి, ప్రాణం బొసగి, వాకిలి ద్వారమున కాపుగా నుంచెను. స్నానానంతరము పార్వతి సర్వాభరణముల నలంకరించుకొనుచు పత్యాగమునమును నిరీక్షించుచుండె. అపుడు పరమేశ్వరుడు నంది నధిరోహించి వచ్చి లోపలికి పోబోవ వాకిలి ద్వారముననున్న బాలుడడ్డగించెను. శివుడు కోపించి త్రిశూలముతో బాలుని కంఠంబు దునిమిలోనికేగెను. అంత పార్వతీదేవి భర్తనుగాంచి, ఎదురేగి, అర్ఘ్యపాద్యాదులచే పూజించె, వారిరువురును పరమానందమున ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము వచ్చె. అంత నమ్మహేశ్వరుండు తానొనరించిన పనికి చింతించి, తాను తెచ్చిన గజాసుర శిరంబును బాలునికతికించి ప్రాణంబు నొసంగి ‘‘గజాననుడు’’ అని నామం బొసంగె. అతనిని పుత్ర ప్రేమంబున ఉమామహేశ్వరులు పెంచుకొనుచుండిరి. గజాననుడు తల్లిదండ్రులను పరమభక్తితో సేవించు చుండెను. అతడు సులభముగా ఎక్కి తిరుగుటకు అనింద్యుడను నొక ఎలుక రాజును వాహనముగా జేసికొనెను. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వురులకు కుమారస్వామి జనియించెను. అతడు మహాబలశాలి. అతని వాహనరాజము నెమలి. దేవతల సేనానాయకుడై ప్రఖ్యాతిగాంచి యుండెను. విఘ్నేశాధిపత్యము ఒకనాడు దేవతలు, మునులు పరమేశ్వరుని సేవించుచు విఘ్నముల కొక్కని అధిపతిగా తమ కొసంగుమని కోరిరి. గజాననుడు తాను జ్యేష్ఠుడు గనుక అయ్యాధిపత్యము తనకొసంగు మనియు, ‘‘గజాననుడు మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు గనుక అయ్యాధిపత్యము తన కొసంగు’’ మని కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. శివుండక్కుమారులను జూచి, ‘‘మీలో నెవ్వరు ముల్లోకము లందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నా యొద్దకు వచ్చెదరో, వారికీయాధిపత్యం బొసంగుదు’’ నని మహేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి నెమలి వాహనంబు నెక్కి వాయు వేగంబున నేగె. అంత గజాననుడు ఖిన్నుడై, తండ్రిని సమీపించి ప్రణమిల్లి ‘‘అయ్యా! నా అసమర్థత తామెరింగియు నిట్లానతీయ దగునే! నీ పాదసేవకుడును నాయందు కటాక్షముంచి తగు నుపాయంబుదెల్పి రక్షింపవే’’ యని ప్రార్థింప, మహేశ్వరుడు దయాళుడై, కుమారా! ఒకసారి ‘‘నారాయణ మంత్రంబు పఠించు’’ మని ఆ నారాయణ మంత్రాన్ని ఉపదేశించె. ‘‘సకృత్ నారాయణేత్యుక్త్యాపుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక’’ అంత గజాననుడు సంతసించి, అత్యంత భక్తితో నమ్మంత్రంబు జపించుచు కైలాసంబున నుండె. అమ్మంత్ర ప్రభావంబున అంతకు పూర్వము గంగానదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుండా నదిలో స్నానమాడి తన కెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును మూడు కోట్ల ఏబది లక్షల నదులలో కూడ అటులనే చూచి ఆశ్చర్యపడుచు, కైలాసంబున కేగి తండ్రి సమీపమందున్న గజాననుని గాంచి, నమస్కరించి, తన బలమును నిందించుకుని ‘‘తండ్రీ! అన్నగారి మహిమ తెలియకట్లంటిని క్షమింపుము. ఈ ఆధిపత్యంబు అన్నగారికే యొసంగు’’ మని ప్రార్థించెను. అంత పరమేశ్వరునిచే భాద్రపద శుద్ధ చతుర్థినాడు గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె. ఆనాడు సర్వదేశస్తులు విఘ్నేశ్వరుని తమ విభవముల కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు, పానకము, వడపప్పు మొదలగునవి సమర్పించి పూజింప, విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని వాహనమున కొసంగియు, కొన్ని చేత ధరించియు మందగమనంబున సూర్యాస్తమయం వేళకు కైలాసంబున కరిగి తల్లిదండ్రులకు ప్రణామంబు సేయబోవ ఉదరము భూమి కానిన చేతులు భూమి కందవయ్యే, బలవంతంబుగ చేతులానిన చరణంబులాకాశంబు జూచె, ఇట్లు దండ ప్రణామంబుసేయ గడు శ్రమనొందుచుండ, శివుని శిరంబున వెలయు చంద్రుడు జూచి వికటంబుగ నవ్వె, అంత ‘రాజదృష్టి’ సోకి నరాలుకూడ నుగ్గగు నను సామెత నిజమగునట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములు తత్ప్రదేశంబెల్లెడల దొర్లెను. అతండును మృతుండయ్యె, పార్వతి శోకించుచు చంద్రుని జూచి, బుషి పత్నులకు నీలాపనిందలు ‘‘పాపాత్ముడా! నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించెను గాన, నిన్ను చూచినవారు పాపాత్ములై నీలాపనిందలు నొందుదురుగాక’’ అని శపించెను. ఆ సమయంబున సప్తమహర్షులు యజ్ఞంబు చేయుచు తమ భార్యలతో ప్రదక్షిణము చేయుచుండిరి. అగ్నిదేవుడు ఋషి పత్నులను చూచి మోహించి శాప భయంబున అశక్తుడై క్షీణించు చుండగా, నయ్యది అగ్ని భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతీ రూపము దక్క తక్కిన ఋషిపత్నుల రూపంబు తానే దాల్చి పతికి ప్రియంబు చేసె, ఋషులద్దానింగనుగొని అగ్నిదేవునితో నున్నవారు తమ భార్యలేయని శంకించి తమ భార్యలను విడనాడిరి. పార్వతీ శాపానంతరము ఋషిపత్నులు చంద్రుని చూచుటచే వారికట్టి నీలాపనింద కలిగినది. ఋషిపత్నుల యాపద పరమేష్టికి దెల్ప నాతండు సర్వజ్ఞుండగుటచే అగ్నిహోత్రుని భార్యయే ఋషి పత్నుల రూపంబు దాల్చి వచ్చుటం దెల్పి సప్త ఋషులను సమాధానపరచె. వారితో కూడా బ్రహ్మ కైలాసంబున కేతెంచి, ఉమామహేశ్వరుల సేవించి మృతుడై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె. అంత దేవాదులు, ‘‘ఓ పార్వతీ దేవి! నీ శాపంబున లోకంబులకెల్ల కీడు వాటిల్లుచున్నది. దాని నుపసంహరింపు’’ మని ప్రార్థింప, పార్వతి సంతసించి, ‘‘ఏ దినంబున విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వెనో నా దినంబున చంద్రుని జూడరాద’’ ని శాపోపశమనంబునొసంగె, అంత బ్రహ్మాదులు సంతసించి తమ గృహంబులకేగి, భాద్రపద శుద్ధ చతుర్థియందు మాత్రము చంద్రుని జూడక జాగరూకులై సుఖంబుగ నుండిరి. శ్యమంతకోపాఖ్యానము యదువంశమునందు సత్రాజిత్తు, ప్రసేనుడు అను సోదరులుండిరి. వారు నిఘ్నని కుమారులు. సత్రాజిత్తునకు సూర్యభగవానుడు మిత్రుడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్యభగవానుని స్తుతించెను. తదేక మనస్కుడై సత్రాజిత్తు చేసిన స్తుతికి ప్రసన్నుడై సూర్యభగవానుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. అంతట సత్రిజుత్తు సూర్యునకు ప్రణామములు చేసి స్తుతించెను. ప్రసన్నుడైన సూర్యుడు వరమును కోరుకొనమనెను. అంతట సత్రాజిత్తు సూర్యుని నుండి ‘‘శ్యమంతకమణి’’ని కోరెను. అది విని సూర్య భగవానుడు శ్యమంతకమణిని తన కంఠం నుండి తీసి సత్రాజిత్తునకు ఇచ్చెను. ఆ సమయమున సూర్యుడు సత్రాజిత్తుతో ఇట్లు పలికెను. ఆ దివ్యమణిని పవిత్రుడై ధరించినచో ప్రతిదినమా మణి ఎనిమిది బారువుల బంగారము ననుగ్రహించును. ఆ మణియున్ను దేశమున అనావృష్టి, ఈతిబాధలు, అగ్ని, వాయు, విషక్రిములచే ఉపద్రవములు, దుర్భిక్షము మొదలగునవి వుండవు. కానీ అశుచియై ధరించినచో అది ధరించిన వానిని చంపును. ఈ విషయ ములను తెలిసికొని, సత్రాజిత్తు సూర్యుని నుండి మణిని గ్రహించి, ధరించి, పురవీధులలో నడిచి వచ్చుచుండగా చూసిన పౌరులు దాని కాంతికి భ్రమించి సూర్యభగవానుడే శ్రీకృష్ణదర్శనమునకై వచ్చుచున్నాడని భావించి, ఆ విషయము శ్రీ కృష్ణునకు నివేదించిరి. శ్రీ కృష్ణుడు అట్టి రత్నము ప్రభువు వద్ద ఉన్నచో దేశాభివృద్దికి, ప్రజా సంక్షేమమునకు ఉపయోగపడునని ఆ మణిని ప్రభువైన ఉగ్రశేనునికి ఇప్పింప సంకల్పించెను. అది తెలిసిన సత్రాజిత్తు ఆ దివ్యమణిని తనతమ్ముడైన ప్రసేనునకిచ్చెను. ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకై ఆరణ్యమునకు వెళ్ళెను. కొంత సమయమునకు శరీరశోధన కారణముగ ప్రసేనుడు అశౌచమును పొందెను. ఆ కారణముచే ప్రసేనుడు సింహము చేతిలో మరణించెను. ఆ సింహమును జాంబవంతుడను భల్లూకము సంహరించి ఆ మణిని తీసుకొనిపోయి దానిని గూహలో ఊయలలో నున్న తన కుమారునకు ఆట వస్తువుగా ఇచ్చెను. ఆ పిల్లవాని పేరు సుకుమారుడు. ప్రసేనుడు అరణ్యములోనికి వేటకై వెళ్ళినపుడు శ్రీ కృష్ణుడు కూడా వెంట వెళ్ళెను. ఆనాడు భాద్రపద శుక్ల చవితి. ప్రదోష వేళలో ప్రసేనుడు సంహరింపబడెను. వానికై వెదుకుచూ శ్రీ కృష్ణుడు తలెత్తి చూడగ ఆకాశమున శుక్లపక్ష చవితినాటి చంద్రబింబము కనపడెను. చీకట్లుబాగుగా ముసురుకున్న కారణముచే శ్రీ కృష్ణుడు తన మందిరమునకు తిరిగి వచ్చెను. దానికి పూర్వము, దేశ ప్రయోజనాల కొరకై ఆ మణిని శ్రీ కృష్ణుడు కోరిన కారణము చేత, అతడే ప్రసేనుని చంపి మణినపహరించెనని సత్రాజిత్తు, పౌరులు, భావించిరి. అంతట ఆ అపవాదును బాపుకొనుటకై, శ్రీకృష్ణుడు మరునాడు, అడవిలో శోధింపగా ఎముకలు, చిరిగిన బట్టలు, తెగిపడిన ఆభరణములు కనబడెను, దానిని ప్రసేనుని గుర్రమును ఏదో కూృరమృగము చంపి ఉండునని కృష్ణుడు భావించెను. అచ్చట గుర్రపు పాదముద్రలు ఆగిపోయి, ఒక సింహపు పాదముద్రలు కనబడెను. శ్యమంతకమణి మాత్రము దొరకలేదు. కాని కృష్ణుని వెంట వచ్చిన సత్రాజిత్తు సన్నిహితులు, కృష్ణుడే ముందటి రోజు ప్రసేనుని సంహరించి, శ్యమంతకమణిని అపహరించెననియు. రాత్రి వేళ సింహము ప్రసేనుని, అతని గుర్రమును తిని యుండునని నిష్టూరముగా పలికిరి. ఈ అపవాదు నుండి తప్పించుకొనుటకై శ్రీ కృష్ణుడు మరింత ప్రయత్నము ప్రారంభించెను. కొంత దూరము వెళ్ళగా అచట సింహపు కళేబరము కనబడెను. అచ్చటినుండి భల్లూకపు పాదముద్రలు కనబడెను. వాని ననుసరించి వెళ్ళి ఒక గుహలోనికి ప్రవేశించెను. అచ్చట యవ్వనమునందున్న ఒక యింతి ఊయలలో పరున్న బాలుని ఊపుచుండెను. ఊయల పై ఆట వస్తువుగా శ్యమంతకమణి కట్టబడి ఉండెను. ఊయల ఊపుచున్న ఆ లలనయే జాంబవతి. ఆమె కృష్ణుని చూచి ఆయన సౌందర్యమునకు వశపడి, బహుశః ఆయన శ్యమంతకమణికై వచ్చెనని భావించి, గట్టిగా మాట్లాడినచో తన తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీ కృష్ణునకేమైనా ఆపద కల్పించునేమోనని భీతిచెంది, పాటపాడుచున్న దాని వలె ఆ శ్యమంతకమణి వచ్చిన విధమునిట్లు చెప్చెను. శ్లో॥ సింహః ప్రసేనమవధీః సింహో జాంబవతాహతాః సుకుమారక మారోధీః తవ హ్యేష శ్యమంతకః తా॥ప్రసేనుని వధించిన సింహమును జాంబవంతుడు వధించి, శ్యమంతకమణిని తెచ్చెను. ఓ సుకుమారుడా! ఈ మణి నీకే ఏడవకుము. అంతలో లోపల నిద్రించుచున్న జాంబవంతుడు లేచి వచ్చి, శ్యమంతకమణి కొరకై శ్రీ కృష్ణుడు వచ్చెనని శంకించి, ద్వంద యుద్దమునకు తలపడెను. ఆ కృష్ణుడే రామావతార కాలమున జాంబవంతునికి చిరంజీవిగా వరమిచ్చెను. ఆ కాలమున జాంబంవంతునకు రాముని ఆలింగనమొనర్చుక ొనవలెనని కోర్కె యుండెడిది. కాని కృష్ణుడు ఆ కోర్కెనిప్పుడు తీర్చుటకై జాంబవంతునితో ఇరవైయొక్క (21) రోజుల పాటు యుద్దమొనర్చెను. క్రమముగా జాంబవంతుని బలము తగ్గి కృష్ణుడే రాముడని తెలిసికొని ఆయన పాదములపై పడి ప్రార్థించి శ్యమంతకమణితో పాటుగా తన కుమార్తె ఆయిన జాంబవతిని శ్రీ కృష్ణునికిచ్చి సాగనంపెను. ద్వారాకానగర పౌరులకు ఈ సత్యము తెలిసి, శ్రీకృష్ణుడు శ్యమంతకమణిని సత్రాజిత్తునకిచ్చివేసెను. అప్పుడు సత్రాజిత్తు తన తప్పు తెలిసికొని శ్రీ కృష్ణుని క్షమింపమని ప్రార్థించి, తన కన్యారత్నమైన సత్యాభామను, మణిరత్నమైన శ్యమంతకమణిని గోపాలరత్నమైన శ్రీకృష్ణునకు సమర్పించెను. కృష్ణుడు భూదేవి అవతారమైన సత్యభామను గ్రహించి శ్యమంతకమణి సత్రాజిత్తునకే ఇచ్చివేసెను.ఈలోగా పాండవులు, కుంతీదేవి, లక్క ఇంటిలో కాలి మరణించినారని వార్త వచ్చెను. శ్రీ కృష్ణునకు వారు సజీవులై ఉన్నారని తెలిసినప్పటికీ, కుటుంబ పెద్ద అయిన ధృతరాష్ర్ణుని అనునయించుట, లౌకిక మర్యాదగా భావించి, హస్తినాపురమునకు వెళ్ళెను. యాదవుల యందే శతధన్యుడు, కృతవర్మ, అక్రూరుడను ముగ్గురు ప్రముఖులుండెడివారు సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి పరిణయము చేయుటకు పూర్వము, వీరు ముగ్గురు ఆమెను తమకిచ్చి వివాహము చేయమని సత్రాజిత్తునడిగిరి. వారిలో ఒకరికి సత్యభామ నిత్తునని సత్రాజిత్తు వాగ్ధానమొనర్చెను. కానీ అనుకోని పైన పరిణామములతో సత్యభామను శ్రీకృష్ణునకిచ్చి వివాహ మొనర్చెను. దానిచే కక్ష పెంచుకొనిన ఈ ముగ్గురు, ఏకమై కృష్ణుడు లేని సమయమెరిగి, సత్రాజిత్తును సంహరించి శ్యమంతకమణిని అపహరింపమని శతధన్యుని ప్రేరెపింపగా, అతడట్లే చేసి ఆ మణిని అక్రూరుని వద్ద వదలి పారిపోయేను, ఇది తెలిసి శ్రీ కృష్ణుడు హస్తినాపురమునుండి వచ్చి, సత్యభామను ఓదార్చి శతధన్యుని సంహరించుటకై బలరామునితో కలిసి రథములో బయల్దేరెను. గుర్రముపై పారిపోవుచున్న శతధన్యుడు, అది అలసి పడిపోగా, దానిని వదిలి పరుగిడుచుండెను. అంతట కృష్ణుడు బలరాముని రథమందుండమని, తాను దిగి శతధన్యుని వెంబడించి, పట్టి ద్వంద యుద్దంలో అతనిని సంహరించి ఒడలంతయు వెదుకగా, మణి దొరకదయ్యే అంతట కృష్ణుడు తిరిగి వచ్చి బలరామునకా విషయము తెలుపగా, అతుడు కృష్ణునితో నీవు బాల్యమునుండియూ చోరుడవు, ఇప్పుడు ఆ మణిని నేనడిగెదనని శంకించి, దానిని దాచివైచి నీవిట్లు చెప్పుచున్నావని శ్రీ కృష్ణుని నిందించి, నీతో కలిసి యుండనని, విదేహ రాజ్యమునకు వడలి పోయేను. బాహ్యశౌచము లేక మణిని ధరించి ప్రసేనుడు మరణించెను. అంతః శౌచము లేక (శ్రీకృష్ణుని అనుమానించుటచే) సత్రాజిత్తు మరణించెను. పరమ భక్తుడైనప్పటికినీ, తాత్కాలికముగా భగవద్విరోధ భావమునొందిన అక్రూరుడు మనః శ్శాంతికై తీర్థయాత్ర చేయుచూ, కాశీ పట్టణమునకు చేరెను. అచ్చటికి పోగానే మనఃశ్శాంతిని పొంది శ్యమంతకమణి వలన ప్రతిదినము వచ్చు బంగారమును ధైవకార్యములకు ఉపయోగించెను. అక్రూరుడు బాహ్యభ్యంతర శౌచమును పొంది యుండుటచే అచ్చట అతివృష్టి, అనావృష్టి రోగబాధలు లేక ప్రశాంతముగానుండెను. ఇచ్చట శ్రీ కృష్ణుడు బలరామునిచే నిందింపబడి ఒక్కడే తిరిగి ద్వారక నగరమునకు చేరెను. ఈ మణి విషయమై తమ దండ్రులకు కీర్తి కలుగరాదని శ్రీకృష్ణుడు ఏదో మాయ చేసెనని, జాంబవతి, సత్యభామలు అనుమానించిరి. శ్రీకృష్ణుడు ఈ అపనిందలకు కారణమేమాయని ఆలోచించుచుండగా నారదుడేతెంచి భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి ప్రసేనునితో అడవికి వెళ్ళినపుడు చంద్రుని చూచుటయే కారణమని, తద్విశేషమును ఇట్లు చెప్పెను. శశివర్ణుడను పేరుగల మహహాగణపతి, అన్ని లోకములలో విహరించుచూ ఒకనాడు చంద్రలోకమునకు చేరెను. బాహ్యమున వినాయకుడు మరుగుజ్జు, లంబోధరుడు, అయినప్పటికీ హృదయమున మిక్కిలి కారుణ్యముర్తి. కానీ చంద్రుడు పైకి అందగాడైనప్పటికీ, కవులచే వర్ణింపబడినప్పటికీ నడవడియందు దోషములున్నవాడు. అట్టి చంద్రుడు వినాయకుని చూచి వికటముగా నవ్వెను. అప్పుడు చంద్రుని అహంకారమును తగ్గించుటకై వినాయకుడు, ఎవ్వరేని చంద్రుని చూసినచో అపనిందలు పొందెదరని శపించెను. దానిచే జనులెవ్వరు చంద్రుని చూడరైరి. దానితో కుంగినవాడై చంద్రుడు తాను జన్మించిన క్షీరసాగరములోనికి వెళ్ళిపోయెను. చంద్రకాంతిలేమిచే ఓషదులు పలించుట మానెను. ప్రజలకు ఆహ్లాదము కరువాయేను. దీనిచే దయతలిచి, దేవతలు, ఋషులు, బ్రహ్మగారి వద్దకు పోయి నివారణోపాయము నర్థించిరి. అంతట బ్రహ్మ బాద్రపద శుక్ల చవితి నాడు నక్తవ్రత మొనరింపవలెననీ (పగటి ఉపవాసము) విఘ్నేశ్వరుని పూజించి, మోదకములు, (ఉండ్రాళ్ళు,), పండ్లు, కుడుములు, ప్రత్యేకించి దోసపండు, నివేదన మొనరింపవలెనని, సూచించెను. అప్పుడు చంద్రుడు కూడా ఆ వ్రతమొనర్చి వినాయకుని అనుగ్రహమును పొందెను. అంతట వినాయకుడు, ఒక్క తన అవతారదినమైన భాద్రపద శుక్ల చవితినాటి రాత్రి తప్ప మిగిళిన రోజులలో చంద్రుని చూచినను ఎట్టి నిందలు కలగవని శాపావకాశమిచ్చెను. అంతట భాద్రపద శుక్ల చవితినాటి చంద్రదర్శనముచే తనకు కలిగిన నిందలను పోగొట్టుకొనుటకై నారదుని సలహా మేరకు శ్రీకృష్ణుడు వినాయక వ్రతమాచరించెను. వెంటనే వినాయకుడు ప్రత్యక్షమై శ్రీ కృష్ణునికి వచ్చిన అపనిందలు తొలగిపోవునని మంగళవాక్కులు పలికెను. అంతట శ్రీ కృష్ణుడు తాను సమర్థతతో ఇంత కష్టపడితిని గాని, సామాన్యలకది ఎట్లు సాద్యమగుననీ, కాన లోకమంతటినీ అనుగ్రహింపమని కోరెను. భాద్రపద శుక్ల చవితినాడు తనను ఫూజించి, శ్యమంతకోపాఖ్యానమును చదివిన మరియు విన్నా, చంద్రుని చూచిననూ అపనిందలు కలగవని వినాయకుడు వరమిచ్చెను. ద్వారకా నగరమునందు కలిగిన క్షామ నివారణకు మాహా భక్తుడైన అక్రూరుని రాక అవసమని భావించి, శ్రీ కృష్ణుడు అక్రూరునకు కబురుపంపెను. పరమభక్తుడైన అక్రూరుడు ద్వారక నగరమునకు వచ్చుటచే, అందరికి శ్యమంతకమణి వృత్తాంతము తెలిసి శ్రీకృష్ణుని పై వచ్చిన అపనిందలు తొలగిపోయినవి. లోపల, బయట, శౌచము కల అక్రూరుని వద్ద శ్యమంతకమణి శుభ పరంపరలిచ్చుచూండెను. కావున ఈ వ్రత సమయమందు. జాంబవతి ఊయల ఊపుచూ చెప్పిన శ్లోకము అందరు తప్పక పటింపవలెను. సుకమారక మారోధీః అనగా ఆ సుకుమారుడు మనమే. తవః హ్యేషా శ్యమంతకః అనగా ఇప్పడు గోపాలరత్నము, గణేషరత్నము కూడా మనవై వారి అనుగ్రహముచే ఎల్లరూ ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందెదరు. ‘‘మంగళం మహత్’’ చేతిలో వున్న అక్షతలను కొన్ని విఘ్నేశ్వరుని పాదాల చెంత వుంచి కొన్ని మీ శిరస్సుపై వేసుకొని మిగిలినవి మీ పిల్లల శిరస్సుపై వేసి దీవించవలెను. - కథ సమాప్తం - పునఃపూజ : ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీచయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికా నారోహయామి గజానారోహయామి అశ్వానారోహ యామి సమస్త రాజోపచార, భక్త్యోపచార, శక్త్యోపచార పూజాన్ సమర్పయామి॥ (స్వామిపై పుష్పాక్షతలు వేయాలి) విఘ్నేశ్వరుని మంగళహారతులు శ్రీ శంభుతనయునకు సిద్ధిగణనాధునకు వాసిగల దేవతా వంద్యునకును ఆ సరసవిద్యలకు ఆదిగురువైనట్టి భూసురోత్తమ లోకపూజ్యునకును జయ మంగళం నిత్య శుభమంగళం! నేరేడు మారేడు నెలవంక మామిడి దూర్వారచెంగల్వ ఉత్తరేణు వేరువేరుగా దెచ్చి వేడ్కతో పూజింతు పర్వమున దేవ గణపతికి నెపుడు ॥ సుచిరముగ భాద్రపద శుద్ధచవితి యందు పొసగ సజ్జనులచే పూజగొల్తు శశి చూడరాదన్న జేకొంటినొక వ్రతము పర్వమున దేవగణపతికి నిపుడు ॥జయ॥ పానకము వడపప్పు పనస మామిడి పండ్లు దానిమ్మ ఖర్జూర ద్రాక్షపండ్లు తేనెతో మాగిన తియ్యమామిడిపండ్లు మాకు బుద్ధినిచ్చు గణపతికినిపుడు ॥జయ॥ ఓ బొజ్జ గణపయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండుపంపు కమ్మనీ నెయ్యియు కడుముద్దపప్పును బొజ్జనిండుగ దినుచును పొరలుచును ॥జయ ॥ వెండి పళ్లెములోన వేవేల ముత్యాలు కొండలుగ నీలములు కలయబోసి మెండుగను హారములు మెడ నిండ వేసుకొని దండిగా నీకిత్తు ధవళారతి ॥జయ ॥ పువ్వులను నినుగొల్తు పుష్పాల నినుగొల్తు గంధాల నినుగొల్తు కస్తూరినీ ఎప్పుడూ నినుగొల్తు ఏకచిత్తమ్మున పర్వమున దేవగణపతికి నిపుడు ॥జయ ॥ ఏకదంతంబున ఎల్లగజవదనంబు బాగైన తొండంబు వలపు కడుపు జోకయిన మూషికము పరకనెక్కాడుచు భవ్యుడగు దేవ గణపతికి నిపుడు ॥జయ ॥ మంగళము మంగళము మార్తాండ తేజునకు మంగళము సర్వజ్ఞ వందితునకు మంగళము ముల్లోక మహిత సంచారునకు మంగళము దేవ గణపతికి నిపుడు ॥జయ ॥ సిద్ధి విఘ్నేశ్వర ప్రసిద్ధిగా పూజింతు ఒనరంగ నిరువది యొక్క పత్రి దానిమ్మ మరువమ్ము దర్భవిష్ణుక్రాంత యుమ్మెత్త దూర్వార యుత్తరేణి ॥జయ ॥ కలువలు మారేడు గన్నేరు జిల్లేడు దేవకాంచన రేగు దేవదారు జాజి బలురక్కసి జమ్మిదానపువ్వు గరిక మాచిపత్రి మంచి మొలక ॥జయ ॥ అగరు గంధాక్షత ధూప దీప నైవేద్య తాంబూల పుష్పోపహారములును భాద్రపద శుద్ధ చవితిని కుడుములు నానుబాలు ఉండ్రాళ్లు పప్పు ॥జయ ॥ పాయసము జున్ను తేనెయు భక్తిమీర కోరి పూజింతు నిన్నెపుడు కోర్కెలలర ॥జయ ॥ బంగారు చెంబుతో గంగోదకము దెచ్చి సంగతిగ శిశువునకు జలకమార్చి మల్లెపువ్వుల దెచ్చి మురహరిని పూజింతు రంగైన నా ప్రాణలింగమునకు ॥జయ ॥ పట్టు చీరలు మంచి పాడిపంటలు గల్గి ఘనముగా కనకములు కరులు హరులు యిష్ట సంపదలిచ్చి యేలిన స్వామికి పట్టభద్రుని దేవగణపతికి నిపుడు ॥జయ ॥ ముక్కంటి తనయుడని ముదముతో నేనును చక్కనైన వస్తుసమితి గూర్చి నిక్కముగ మనమును నీయందె నేనిల్పి ఎక్కుడగు పూజలాలింప జేతు ॥జయ ॥ మల్లెలా మొల్లలా మంచి సంపెంగలా చల్లనైనా గంధసారము లను ఉల్లమలరగ మంచి ఉత్తమపు పూజలు కొల్లలుగ నేజేతు కోరి విఘ్నేశ ॥జయ ॥ దేవాదిదేవునకు దేవతారాధ్యునకు దేవేంద్రవంద్యునకు దేవునకును దేవతలు మిముగొల్చి తెలిసి పూజింతురు. భవ్యుడగు దేవగణపతికి నిపుడు ॥జయ ॥ చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామరలు తంగేడు తరచుగాను పుష్పజాతులు తెచ్చి పూజింతు నేనిపుడు బహుబుద్ధి గణపతికి బాగుగాను ॥జయ ॥ మారేడు మామిడి మాదీఫలంబులు ఖర్జూర పనసలును కదళికములు నేరేడు నెంవంది టెంకాయ తేనెయు చాలగా నిచ్చెదరు చనువుతోడ ॥జయ ॥ ఓ బొజ్జగణపతి ఓర్పుతో రక్షించి కాచి నన్నేలు మీ కరుణతోను మాపాలగలవని మహిమీద నెల్లపుడు కొనియాడుచుందును కోర్కెదీర జయమంగళం నిత్య శుభమంగళం! ॥జయ ॥ వాయనదానము శో॥ గణేశః ప్రతిగృహ్ణాతు గణేశో వైదదాతి చ గణేశః తారకోభాభ్యాం గణేశాయ నమోనమః (ఈ శ్లోకము వాయనమిచ్చువారు చెప్పవలెను) మంత్రము - దేవస్యత్యాసవితుః ప్రసవేశ్వినోర్బాహుభ్యాం పూషోహస్తాభ్యామా దదా! (ఈ మంత్రము వాయనము పుచ్చుకొనువారు చెప్పవలెను) ఉద్వాసన మంత్రము : (ఈ క్రింది మంత్రంతో గణపతి ప్రతిమ ఈశాన్యదిశగా మూడుసార్లు కదపవలెను) యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్॥తేహనాకం మహిమానస్యచంతే యత్రపూర్వే సాధ్యాస్సంతి దేవాః॥శ్రీ సిద్ధిబుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామిన్ యథాస్థాన ముద్వాసయామి॥పూజా విధానం సంపూర్ణమ్. (వ్రతకల్ప పూజా విధానం సమాప్తం) ॥సర్వేజనాస్సుఖినో భవంతు ॥ చంద్రదర్శన దోషశాంతి శ్లోకం వినాయక చతుర్థినాడు చంద్రుని చూడరాదు. పొర పాటున చూచినచో విష్ణుపురాణములోని ఈ క్రింది శ్లోకమును చదివినచో ఆ దోషము తొలగిపోవునని నిర్ణయ సింధువులో చెప్పబడినది. సింహః ప్రసేన మవధీత్ సింహోజాంబవతా హతః సుకుమారక మారోదీః తవ హ్యేషస్స్యఃమంతకః వ్యాపార ప్రారంభంలో ఆరాధించవలసిన మూర్తులు వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతిదేవి వ్యాపారము ఆటంకం లేకుండా సక్రమంగా జరగడానికి ముందుగా గణపతిని, లావాదేవీలు సక్రమంగా జరగడానికి సరస్వతిని, లాభం రావడానికి మహాలక్ష్మిని, వ్యాపారము స్థిరంగా ఉండటానికి వెంకటేశ్వరస్వామిని వ్యాపారంలో తిరుగులేకుండా ఉండటానికి దుర్గాదేవిని ఆరాధించవలెను. వాహనపూజా విశేషం వినాయకుడు విఘ్నరాజు. ఆదిపరాశక్తి అంశం, అంగారకుడు వినాయకునికి పరమ భక్తుడు, అంగారకుడు నవగ్రహాలలో సైన్యాధిపతి, ఈ అంగారకుని అనుగ్రహంవల్ల వాహనంనకు అపాయము ఉండదు కాబట్టి వినాయకుడు దగ్గర వాహనపూజ విశేషము. అర్జునుడు రధసారధి కృష్ణుడు, రథ సంరక్షకుడు ఆంజనేయుడు, కాబట్టి ఆంజనేయస్వామి దగ్గర కూడా వాహనపూజ విశేషము. -
మావోల లొంగు‘బాట’ !
తమకు సమాచారం ఉందన్న డీజీపీ అగ్రనేత గణపతి ఆచూకీ కోసం వాకబు ‘ఉసెండి’ దంపతుల లొంగుబాటులో మంత్రి ప్రమేయం లేదు డీజీపీ ముందుకు ఉసెండీ దంపతులు సాక్షి, హైదరాబాద్: మావోయిస్టు పార్టీ నేతల్లో అత్యధికమంది లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తమకు సమాచారం ఉందని డీజీపీ బి.ప్రసాదరావు చెప్పారు. ఆ పార్టీ అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆచూకీ కోసం కూడా వాకబు చేస్తున్నామని వెల్లడించారు. రెండు రోజుల కిందట లొంగిపోయిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి గుమ్మడివెల్లి వెంకటకిషన్ ప్రసాద్ అలియాస్ గుడ్సా ఉసెండి, ఆయన భార్య సంతోషి మార్కంను ఎస్ఐబీ పోలీసులు గురువారం డీజీపీ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల్లో మావోయిస్టు పార్టీ సభ్యులు అధిక సంఖ్యలో లొంగిపోయారని వివరించారు. 2011లో 212 మంది, 2012లో 297 మంది మావోయిస్టులు, 11 మంది ఇతర విప్లవపార్టీల సభ్యులు, 2013లో 81 మంది మావోయిస్టులతోపాటు 14 మంది ఇతర గ్రూపులవారు లొంగిపోయారని తెలిపారు. మావోయిస్టు కేంద్ర కమిటీ స్థాయి సభ్యుడిపై రూ. 25 లక్షలు, రాష్ట్ర కమిటీ సభ్యుడిపై రూ. 20 లక్షలు, జిల్లా కార్యదర్శిపై రూ. 8 లక్షలు, జిల్లా కమిటీ సభ్యుడిపై రూ. 5 లక్షలు, ఏరియా కార్యదర్శిపై రూ. 4 లక్షలు, ఏరియా కమిటీ సభ్యుడిపై రూ. 2 లక్షలు, దళ సభ్యుడిపై రూ.లక్ష వంతున రివార్డు ఉందన్నారు. ఉసెండి పేరుతో ఉన్న రూ. 20 లక్షల రివార్డును అతని పునరావాసం కోసం అందజేస్తామని తెలిపారు. ఉసెండి దంపతుల లొంగుబాటులో తెలంగాణకు చెందిన మంత్రి పాత్ర లేదన్నారు. ఈ దంపతులపై రాష్ట్రంలో ఎలాంటి కేసులూ లేవని, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో మాత్రం కేసులున్నాయని తెలిపారు. రాజకీయ విభేదాలతోనే లొంగుబాటు ఆరోగ్య సమస్యలతోపాటు పార్టీ విధి విధానాలపై కేంద్ర కమిటీతో విభేదించి ఉసెండి దంపతులు లొంగిపోయారని డీజీపీ ప్రసాదరావు ప్రకటించారు. ఇన్ఫార్మర్ల పేరిట అమాయకులను విచక్షణారహితంగా హతమార్చడం, పాఠశాల భవనాలు పేల్చివేయడం వంటి విధానాలను పార్టీ వేదికలపైనే ఉసెండి పలుసార్లు ఖండించినట్లు తమ విచారణలో తెలిపాడన్నారు. ఉసెండి 1987లో అరెస్టు కాగా... అనంతరం ఏడుగురు ఐఏఎస్ అధికారుల అపహరణ ఘటన నేపథ్యంలో అతన్ని అప్పట్లోనే బెయిల్‌పై విడుదల చేశామని తెలిపారు. రహస్య కార్యకలాపాల్లో 275 మంది: మావోయిస్టు పార్టీ 17 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 11 మంది, అలాగే పొలిట్‌బ్యూరోలోని ఆరుగురిలో నలుగురు మన రాష్ట్రానికి చెందినవారేనని డీజీపీ తెలిపారు. దేశవ్యాప్తంగా 275 మంది తెలుగువారు రహస్య జీవితం గడుపుతున్నారని, వారిలో 77 మంది మన రాష్ట్రపరిధిలోని కమిటీలలో పనిచేస్తున్నారని చెప్పారు. మిగతా 198 మంది ఇతర రాష్ట్రాల కమిటీల్లో పనిచేస్తున్నారని ఆయన వివరించారు. నక్సల్స్‌కు సంబంధించి రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి రిక్రూట్మెంట్ జరగట్లేదని డీజీపీ వివరించారు. ఎన్ఐఏ కస్టడీకి ఉసెండి? ఇదిలాఉండగా ఉసెండి దంపతులను తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోరే అవకాశముందని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు మందుపాతరపేల్చి సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్ర కర్మ, ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నంద కుమార్ పటేల్ తదితర నేతలను హతమార్చిన సంఘటనకు సంబంధించి ఉసెండి వద్ద కీలక సమాచారం లభ్యంకాగలదని ఎన్ఐఏ భావిస్తోంది. -
సాక్షి కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు
-
వాడ వాడలా వినాయక చవితి సందడి
-
రాష్ట్రమంతటా గణపతి ఉత్సవాలు
-
రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు
-
గణపతికి షర్మిళ ప్రత్యేక పూజలు
-
వాడ వాడలా కొలువైన గణపయ్య