మహా గణపతి నేత్ర దర్శనం
ఖైరతాబాద్: శ్రీ శక్తిపీఠ శివనాగేంద్ర మహా గణపతి రూపంలో దర్శనమివ్వనున్న ఖైరతాబాద్ మహాగణపతికి శుక్రవారం సాయంత్రం 4.40 గంటలకు శిల్పి రాజేంద్రన్ కంటి పాపను దిద్దారు. విఠల శర్మ సిద్ధాంతి నిర్ణయించిన ముహూర్తం మేరకు మహా గణపతికి దిష్టితీసి, కొబ్బరి కాయలు కొట్టి కంటి పాపను తీర్చిదిద్దారు. 58 అడుగుల ఎత్తులో మహాగణపతి అద్భుత రూపంలో భక్తులకు దర్శనమిస్తారని శిల్పి తెలిపారు. ఇప్పటికే రంగులు వేసే కార్యక్రమం దాదాపు పూర్తయిందని... శనివారం కర్రలు విప్పుతామని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సింగరి సుదర్శన్ తెలిపారు.