ntr marg
-
ఎండలు ముదిరే.. గొడుగులు అదిరే..
హైదరాబాద్: రోజురోజుకూ ఎండలు ముదురుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈసారి వేసవి కాస్త ముందుగానే వచ్చినట్టు ఎండల తీవ్రతను చూస్తే తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నం గొడుగుల నీడలో వెళ్తున్న యువతుల చిత్రం ఎన్టీఆర్ మార్గ్‌లో కనిపించింది. -
గణేష్ నిమజ్జనానికి హాజరైన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అరుదైన ఫీట్ సాధించారు. నగరంలో ఇవాళ జరిగిన గణేష్ నిమజ్జనంలో పాల్గొన్న తొలి సీఎంగా నిలిచారు. ఇవాళ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. అటు నుంచి నేరుగా ట్యాంక్‌బండ్ ఎన్టీఆర్ మార్గ్ చేరుకున్నారు. మహాగణపతి నిమజ్జనం జరిగే క్రేన్ నెంబర్ 4 వద్ద పరిశీలన జరిపారు. అక్కడి నుంచే హుస్సేన్ సాగర్‌లో నిమజ్జన కార్యక్రమాలను వీక్షించారాయన.క్లిక్ చేయండి: ఖైరతాబాద్ శోభాయాత్ర.. నెవర్ భిపోర్ -
చవితికి రెండ్రోజుల ముందే మహా గణపతి సిద్ధం
హైదరాబాద్: తొలుత ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ మహాగణపతి ఒక్కో అడుగు పెంచుకుంటూ 69వ సంవత్సరం శ్రీ దశమహా విద్యాగణపతిగా ఈ సంవత్సరం 63 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రారంభమైన కలర్ పనులు మరో రెండు రోజుల్లో పూర్తవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరం ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా కుడివైపు పంచముఖ లక్ష్మీనారసిహ స్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలను ఏర్పాటు చేశారు. చవితికి రెండు రోజుల ముందే మహాగణపతి పూర్తిస్థాయిలో దర్శనమిచ్చేందుకు సిద్ధమవుతారని తెలిపారు. ► అప్పట్లో స్వాతంత్య్ర సమరయోధులైన సంగరి శంకరయ్య బాల గంగాధర్ తిలక్ స్ఫూర్తితో ఎ. భీమయ్య, జి.సుందర్శనం, రాజారాగం, రాజమణిదేవి, ఎస్.సుదర్శన్, ఎస్.వీరభద్రయ్య, గణేష్‌కుమార్ కలిసి ఈ మహత్ కార్యానికి పూనుకున్నారని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్ నేతృత్వంలో విగ్రహ తయారీ పనులు పూర్తియ్యాయని, ఈ నెల 18 వినాయక చవితి నాటికి భక్తులకు సంపూర్ణంగా దర్శనమిచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఉత్సవ కమిటి పోలీసు శాఖతో సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు దానం నాగేందర్ పేర్కొన్నారు. ► వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో నిమజ్జన ఏర్పాట్లను నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్తో కలిసి పరిశీలించారు. పీపుల్స్ ప్లాజా, జలవిహార్ వద్ద వాహనాల పార్కింగ్, బ్రిడ్జి– 2, ఎన్టీఆర్ మార్గ్‌లో ఖైరతాబాద్ మహాగనపతి నిమజ్జన ప్రాంతాలను పరిశీలించారు. వీరితో ట్రాఫిక్ అడిషినల్ కమిషనర్ సుధీర్ బాబు, విక్రమ్ సింగ్ మాన్, జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, ఈఎస్సీ జియావుద్దీన్, జోనల్ ఎస్ఈ రత్నాకర్, హెచ్ఎండీఏ ఎస్ఈ పరంజ్యోతి, అడిషినల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. -
హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడి (ఫొటోలు)
-
మళ్లీ గందరగోళం.. తొలి రోజు ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్
నగరంలో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ తొలిరోజు ముగిసింది. అయితే తొలిరోజు రేసింగ్‌లో రెండు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే జరిగాయి. రేసింగ్ నిర్వహణలో మరోసారి గందరగోళం నెలకొనడంతో నిర్వహకులు ఆదివారమే అన్ని పోటీలు పెట్టే యోచనలో ఉన్నారు. రేసింగ్ సమయంలో రెండు కార్లు రేస్ మద్యలో ఆగడంతో రెండు సార్లు రెడ్ ఫ్లాగ్స్ రావడం గందరగోళానికి దారి తీసింది. గతంలోలాగే మరోసారి రేస్ నిర్వహణలో ఆలస్యం కావడంతో ప్రాక్టీస్ రేస్‌లతోనే నిర్వాహకులు తొలిరోజును ముగించారు. ఆలస్యం కారణంగా మెయిర్ రేస్-1 జరగలేదు. దీంతో ఆదివారం అసలైన ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనుంది. ఇక సాంకేతిక కారణాలతో స్పోర్ట్స్ కార్లు చాలా ఆలస్యంగా ట్రాక్ ఎక్కాయి. అయితే రేసింగ్ చూడడానికి వీక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఆదివారం జరిగే ఇండియన్ రేసింగ్ ఫైనల్‌పైనే అందరి ఆసక్తి నెలకొంది. -
హైదరాబాద్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ సందడి
హైదరాబాద్‌లో మరోసారి కార్ రేసింగ్ సందడి షురూ అయింది. ఎన్టీఆర్ మార్గ్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ ఫైనల్ రౌండ్ జరుగుతుంది. నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్ మార్గ్ వద్ద ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్‌పై కార్లు రయ్.. రయ్‌మని దూసుకెళ్లాయి. కాగా రేసింగ్‌లో ఆరు టీమ్స్, 12 కార్లు, 24 మంది డ్రైవర్స్ పాల్గొన్నారు.గంటకు 250-300 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకుపోతూ అభిమానులను అలరిస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలకు సన్నాహకంగా ఈ ట్రయల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో జరిగిన ప్రమాదం, బ్రేక్‌డౌన్స్ కారణంగా పోటీలు లేకుండానే ట్రయల్స్‌కే కార్ రేసింగ్ పరిమితమైంది. కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయిన కార్లు సందర్శకులకు కనువిందు చేశాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రాక్‌ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలను సిద్ధం చేశారు. హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌బర్డ్స్ (రేసర్ల టీమ్) ఢిల్లీకి చెందిన స్పీడ్ డిమాన్స్, బెంగళూరుకు చెందిన స్పీడ్‌స్టర్స్, చెన్నై టీమ్ టర్బోరైడర్స్, గోవా ఏసెస్ బృందాలు ఈ పోటీల్లో నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్‌పై దూసుకెళ్లనున్నాయి. మోటర్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోనున్న ఈ పోటీల్లో నగరానికి చెందిన రేసర్లు కూడా పాల్గొననున్నారు. స్విస్ ఇండియన్ ప్రొఫెషనల్ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్ నీల్ జానీ, ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అకాడమీ డ్రైవర్ అఖిల్ రవీంద్రలతోపాటు ఫిమేల్ ఎఫ్–4 రేసింగ్ డ్రైవర్ లోలా లోవిన్ ఫోసీ కూడా పాల్గొననున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు ఈ సారి ప్రేక్షకులు, మోటార్ స్పోర్ట్స్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భారతీయ మోటర్‌స్పోర్ట్స్ కంపెనీ, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్)వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విదేశీ, భారతీయ రైడర్లు పాల్గొననున్నారు. -
Hyderabad IRL: కార్ రేసింగ్‌కు సై
సాక్షి, సిటీబ్యూరో: సాగరతీరం మరోసారి ఉత్కంఠభరితమైన కార్ రేసింగ్‌కు సన్నద్ధమైంది. గత నెలలో సాంకేతికంగా ఎలాంటి పోటీలు లేకుండానే ముగిసిన రేసింగ్‌ను ఈ సారి పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శని, ఆదివారాలు జరుగనున్న ఈ పోటీల కోసం రేసింగ్ కార్లు మరోసారి నగరానికి చేరుకున్నాయి. నెక్లెస్‌రోడ్డులోని 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్లో పరుగులు తీసేందుకు రెడీగా ఉన్నాయి. వచ్చే ఫిబ్రవరిలో జరుగనున్న ఫార్ములా–ఈ పోటీలకు సన్నాహకంగా ఈ ట్రయల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నవంబర్‌లో జరిగిన ప్రమాదం, బ్రేక్‌డౌన్స్ కారణంగా పోటీలు లేకుండానే ట్రయల్స్‌కే కార్ రేసింగ్ పరిమితమైంది. కన్ను మూసి తెరిచే లోపు వాయువేగంతో రయ్ మంటూ దూసుకుపోయిన కార్లు సందర్శకులకు కనువిందు చేశాయి. ఈ పోటీల నిర్వహణ కోసం హెచ్ఎండీఏ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ట్రాక్‌ను మరోసారి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. పోటీలను వీక్షించేందుకు అనుగుణంగా నెక్లెస్‌రోడ్డులో గ్యాలరీలను సిద్ధం చేశారు. 12 రేసింగ్ కార్లు పాల్గొననున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, తదితర నగరాలతో పాటు విదేశాలకు చెందిన రేసర్లు కూడా ఈ పోటీల్లో పాల్గొననున్నారు.రేసర్లు, నిపుణులు, నిర్వహణ యంత్రాంగంతో పాటు, వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది నగరానికి చేరుకున్నారు. రేసింగ్ రయ్.... హైదరాబాద్‌కు చెందిన బ్లాక్‌బర్డ్స్ (రేసర్ల టీమ్) ఢిల్లీకి చెందిన స్పీడ్ డిమాన్స్, బెంగళూరుకు చెందిన స్పీడ్‌స్టర్స్, చెన్నై టీమ్ టర్బోరైడర్స్, గోవా ఏసెస్ బృందాలు ఈ పోటీల్లో నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్‌పై దూసుకెళ్లనున్నాయి. మోటర్ స్పోర్ట్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకోనున్న ఈ పోటీల్లో నగరానికి చెందిన రేసర్లు కూడా పాల్గొననున్నారు. స్విస్ ఇండియన్ ప్రొఫెషనల్ పోర్శీ ఫ్యాక్టరీ డ్రైవర్ నీల్ జానీ, ఆస్టన్ మార్టిన్ రేసింగ్ అకాడమీ డ్రైవర్ అఖిల్ రవీంద్రలతోపాటు ఫిమేల్ ఎఫ్–4 రేసింగ్ డ్రైవర్ లోలా లోవిన్ ఫోసీ కూడా పాల్గొననున్నారు. ఈ పోటీలను వీక్షించేందుకు ఈ సారి ప్రేక్షకులు, మోటార్ స్పోర్ట్స్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు భారతీయ మోటర్‌స్పోర్ట్స్ కంపెనీ, రేసింగ్ ప్రమోషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్పీపీఎల్)వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ పోటీల్లో మొత్తం 24 మంది విదేశీ, భారతీయ రైడర్లు పాల్గొననున్నారు. ట్రాఫిక్ నరకం.. ఇండియన్ రేసింగ్ లీగ్ దృష్ట్యా శుక్రవారం నుంచే నెక్లెస్‌రోడ్డు మార్గంలో రాకపోకలను నిలిపివేశారు. మింట్ కాపౌండ్ నుంచి ఖైరతాబాద్ మార్గంలో వాహనాలను అనుమతించారు. దీంతో భారీ ఎత్తున వాహనాలు ఈ మార్గంలోకి ప్రవేశించడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. గంటల తరబడి రోడ్లపైన పడిగాపులు కాయాల్సి రావడంతో వాహనదారులు నరకం చవి చూశారు. ఖైరతాబాద్ నుంచి నెక్లెస్‌రోడ్డు వెళ్లే వాహనాలను లక్డీకాపూల్ వైపు మళ్లించారు. అటు మహాగణపతి వైపు నుంచి, ఇటు ఖైరతాబాద్ నుంచి వెళ్లే వాహనాలతో ప్రధాన రహదారి స్తంభించింది. లోయర్‌ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, తదితర రూట్లలోనూ గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. -
వాహనదారులకు అలర్ట్.. ఎన్టీఆర్ మార్గ్ మూసివేత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హుస్సేన్ సాగర్ తీరం ఉత్కంఠభరితమైన రేసింగ్ లీగ్‌కు సిద్ధమైంది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు జరుగనున్నాయి. దీంతో, నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. ఈ నేపథ్యంలో శుక్రవారం 11 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌ను పూర్తిగా మూసివేయనున్నట్టు ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. కాగా, రేసింగ్ పోటీలు జరుగనున్న నేపథ్యంలో ట్రాక్ పనులు చేసేందుకు శుక్రవారం నుంచే పనులు ప్రారంభమయ్యాయి. ట్రాక్ పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు రోడ్డును మూసివేస్తున్నట్టు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వాహనదారులు ఎన్టీఆర్ మార్గ్ కాకుండా వేరే మార్గాల నుండి వెళ్లాలని పోలీసులు వెల్లడించారు. -
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ అంజనీ కుమార్
-
గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు పర్యవేక్షించిన సీపీ అంజనీ కుమార్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది వినాయక చవతి సందర్భంగా హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కోసం చేసిన ఏర్పాట్లను సీపీ అంజనీ కుమార్ పర్యవేక్షించారు. నిమజ్జనం ఏర్పాట్లలో భాగంగా అధికారులు ట్యాంక్ బండ్‌పై ట్రయల్ నిర్వహించారు. ఈ క్రమంలో నేడు ఖాళీ డ్రమ్ పెట్టి ఎక్స్పరిమెంట్ చేశారు.. అలానే థర్మకోల్ పెట్టి మరోకటి చేశారు. (చదవండి: ‘ట్యాంక్‌బండ్ ఎలా ఉందండి.. సిటీ పారిస్ నగరంలా కనిపిస్తోంది’) ఇది కొత్త ప్రోగ్రాం అన్నారు సీపీ అంజనీ కుమార్. నిమజ్జనం కోసం 3 ఏళ్ల క్రితం ఆటోమేటిక్‌గా రిలీజ్ చేసే యంత్రాలు ఉపయోగించారని తెలిపారు. గణేష్ నిమజ్జనం కోసం ఎన్టీఆర్ మార్గ్ , పీవీఆర్ మార్గ్‌లో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. -
మోక్షమెప్పుడో..?
– ముందుకుసాగని ఎన్టీఆర్ మార్గ్ పనులు – కాలయాపన చేస్తున్న పాలకులు అనంతపురం న్యూసిటీ : ఎన్టీఆర్ మార్గ్ ఏర్పాటుపై నీలినీడలు కమ్ముకున్నాయి. రోడ్డుకు మోక్షమెప్పుడు లభిస్తుందా అంటూ నగర ప్రజలు ఎదురు చూస్తున్నారు. అనంతపురం నగరంలో అత్యంత రద్దీగా ఉండే పాతూరు ట్రాఫిక్ సమస్యకు ఎన్టీఆర్ మార్గ్ ఏర్పాటుతో చెక్ పెట్టవచ్చు. అటువంటిది పాలకులు కాలయాపన చేస్తూ.. ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి స్థల యజమానులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం రూ.25.04 కోట్లు విడుదల చేశారని ఎమ్మెల్యే, మేయర్ చెబుతున్నా అది మాటలకే పరిమితమైంది. బాధితులకు ఇంత వరకు చిల్లిగవ్వ దక్కకపోవడం గమనార్హం. దీంతో పాటుగా ఓ వైపు జలవనరులశాఖ చెరువుకట్ట నుంచి ముసలమ్మకట్ట వరకు డబుల్ లైన్ రోడ్డు వేస్తోంది. ఈ పనులు వేగవంతంగానే సాగుతున్నా ఎన్టీఆర్ మార్గ్ పనులు ముందుకు కదలడం లేదు. ఈ రెండు సకాలంలో పూర్తయితే నగర ప్రజలకు సగం ట్రాఫిక్ తలనొప్పి తగ్గినట్లే. ప్రధానంగా పాతూరు తిలక్‌రోడ్డును విస్తరణ చేయకుండా ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపవచ్చని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నత్తనడకన పనులు.. ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడుతామని పాలకులు గత ఏడాది రూ.35 లక్షలతో చెరువుకట్ట కింద నుంచి శాంతినర్సింగ్ హోం వరకు ఎన్టీఆర్ మార్గ్ పేరుతో కిలోమీటర్ రోడ్డు వేసేందుకు శ్రీకారం చుట్టారు. తమ స్థలంలో రోడ్డు ఏవిధంగా వేస్తారంటూ నష్ట పరిహారం చెల్లించాలని 18 మంది కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. దీంతో రోడ్డు ఏర్పాటు చేయకుండా కొంత మంది రాళ్లను అడ్డంగా వేశారు. దీంతో రోడ్డుకు బ్రేక్ పడింది. చివరకు కోర్టు కంటెమ్ట్ ఇవ్వడంతో నగరపాలక సంస్థ అధికారులు స్పందించారు. ఇటీవల ప్రభుత్వం రూ.25.04 కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు జీఓ 312ను విడుదల చేసినా, ఎవరి స్థలం ఎంత ఉందని, వారికి ఎంత నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది తదితర వాటిపై నగరపాలక సంస్థ అధికారులు ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. కాగా చెరువుకట్ట నుంచి ముసలమ్మ కట్ట వరకు డబుల్‌లైన్ రోడ్డు, చెరువుకట్ట కింద వైపు ఎన్టీఆర్ మార్గ్ నుంచి శాంతి నర్సింగ్ హోం వరకు పూర్తీ స్థాయిలో రోడ్డు అమలులోకి వస్తే తిలక్‌రోడ్డును టచ్ చేయాల్సిన పనిలేదని కొందరు అధికారులు, మేధావులు చెబుతున్నారు. తాడిపత్రి, గుత్తి నుంచి వచ్చే పెద్ద వాహనాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను ఈ మార్గాల ద్వారా దారి మళ్లించే సదుపాయం ఉంది. ఏదిఏమైనా ఈ రెండు మార్గాలు ఏర్పాటు జరిగితే నగరంలో ట్రాఫిక్ సమస్య ఉండదని తెలుస్తోంది. మరి పాలకులు ఎప్పుడు పూర్తి చేస్తారో లేదో వేచి చూడాలి. -
ఎన్టీఆర్ మార్గ్‌లో ట్రాఫిక్ డైవర్షన్స్
హైదరాబాద్ : ఎన్టీఆర్ మార్గ్‌లో కుంగిన సీవరేజ్ పైప్‌లైన్ మరమ్మతుల నిమిత్తం ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. ఈ మేరకు ట్రాఫిక్ విభాగం అదనపు సీపీ జితేందర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని వాహనచోదకులు దృష్టిలో పెట్టుకుని తమకు సహకరించాలని కోరారు. - తెలుగుతల్లి చౌరస్తా, ఇక్బాల్మీనార్ల వైపు నుంచి వచ్చే భారీ వాహనాలను ఎన్టీఆర్ మార్గ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వైపు అనుమతించరు. - ఈ మార్గంలో రాకపోకలు సాగించే సాధారణ ట్రాఫిక్‌ను సైతం కుడి వైపు ఉన్న రోడ్ మీదుగానే పంపిస్తారు. - రవీంద్రభారతి వైపు నుంచి నెక్లెస్‌రోటరీ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మీనార్ నుంచి మింట్ కాంపౌండ్ మీదుగా మళ్లిస్తారు. - తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. రెండు సచివాలయాలకూ తెలుగుతల్లి చౌరస్తా నుంచి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. -
నోరు తెరిచిన రోడ్డు
⇒ ఎన్టీఆర్ మార్గ్ మధ్యలో భారీ అగాథం.. సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలకు హైదరాబాద్‌లో పురాతన పైపులైన్లు ధ్వంసమై అడుగుకో అగాథం ఏర్పడుతోంది. బుధవారం ఓ వ్యక్తి బైక్‌పై ఎన్టీఆర్ గార్డెన్ ముందుకు రాగానే ముందు టైరు రోడ్డుపై చిన్న గోతిలో పడి ఆయన కిందపడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న వాళ్లు ఆయన్ను పైకి లేపారు. ఆ తర్వాత అక్కడ చూడగా రోడ్డుపై చిన్న రంధ్రం కనిపించింది. బండరాయి పెడితే సరిపోతుందనుకున్నారు. కానీ కాసేపటికే ఆ గొయ్యి కాస్తా మృత్యుబిలంగా పెద్దయింది. లోపలికి చూస్తే వరద ఉధృతంగా ప్రవహిస్తోంది! సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై బారికేడ్లు పెట్టి ట్రాఫిక్‌ను పక్కకు మళ్లించారు. విషయం తెలుసుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి అక్కడికి చేరుకున్నారు. జేసీబీ సాయంతో రోడ్డును పైనుంచి తొలగించి చూడగా 6 మీటర్ల వెడల్పు, 25 అడుగుల లోతున మహాబిలం ఏర్పడింది. ఈ పైప్‌లైన్ మరమ్మతులకు వారంరోజుల సమయం పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. గతంలో పంజాగుట్ట, లోయర్ ట్యాంక్‌బండ్, ఇందిరాపార్క్ వద్ద నాలాల పైన ఉన్న భూభాగం కుంగి భారీ అగాథాలు ఏర్పడ్డాయి. ప్రధాన నగరంలో సుమారు 40 నాలాలు భూగర్భం నుంచి ప్రవహిస్తుండగా.. సుమారు 1,500 కిలోమీటర్ల మేర వరదనీటి కాల్వ వ్యవస్థ ఉంది. వీటి ఉనికిని కచ్చితంగా పసిగట్టే టెక్నాలజీ జీహెచ్ఎంసీ, జలమండలికి వద్ద లేదంటే అతిశయోక్తి కాదు! -
భక్తులతో సందడిగా మారిన ఎన్టీఆర్ మార్గ్
-
‘సాగర్’ మథనం!
సాక్షి, సిటీబ్యూరో: గణనాథుని నిమజ్జనోత్సవం ముగిసింది. నగరంలోని వేలాది వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో జలప్రవేశం చేశాయి. వీటి వ్యర్థాలను తొలగించేందుకు ‘సాగర్’ వడపోత కార్యక్రమానికి హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది చిన్నా, పెద్దవి కలిపి సుమారు 60 వేల వినాయక ప్రతిమలు నిమజ్జనమైనట్టు అధికారుల అంచనా. వీటిని సత్వరం వెలికితీసి సాగర్‌ను కాలుష్యం నుంచి కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఈ నెల 12కల్లా నిమజ్జన పూడిక తొలగింపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ప్లాట్‌ఫారాల వద్ద నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాల అవశేషాలు, పూలు, పత్రి తదితర వ్యర్థాలను ఒడ్డుకు చే రుస్తున్నారు. వాటిని కవాడీగూడలోని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్‌కు తరలించే పనులను మంగళవారం రాత్రి నుంచి ముమ్మరం చేశారు. ప్రధానంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.4 వద్ద సాగర్‌లో పెద్ద మొత్తంలో వినాయక విగ్రహాలు పోగవ్వడంతో ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనానికి అడ్డంకిగా మారాయి. ఈపరిస్థితిని గమనించిన హెచ్ఎండీఏ అధికారులు మంగళవారం ఉదయం 150 మంది కూలీలు, యంత్రాలను నియమించి 3 గంటల వ్యవధిలో వాటిని పక్కకు తొలగించారు. అనంతరం పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ను నియంత్రించి, సుమారు 170 టన్నుల వ్యర్థాలను జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ పనులన్నీ ఖైరతాబాద్ భారీ వినాయకుడు సాగర్‌కు చేరుకునే లోగానే పూర్తవడంతో పోలీసులు, ఇతర అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే భారీ గణేశుడి నిమజ్జనం మరింత ఆలస్యమయ్యేది. భారీ విగ్రహాన్ని నీటిలో కాకుండా గట్టున వేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున అధికారులు క్షణాల్లో చర్యలు చేపట్టి నిమజ్జనానికి మార్గం సుగమం చేశారు. మిగతా ఫ్లాట్ ఫారాల వద్ద నిమజ్జనమైన విగ్రహాలను కూడా నీటిలోకి జారిపోకుండా ఎప్పటికప్పుడు గట్టుకు చేర్చి జాగ్రత్తలు తీసుకున్నారు. నిరంతరాయంగా పరిశుభ్రత వినాయక నిమజ్జన వ్యర్థాలను తొలగించే పనులను నిరంతరాయంగా కొనసాగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 200 మంది కూలీలు, 10 టిప్పర్లు, 2 డీయూసీలు, 3 జేసీబీలు, 1 పాంటూన్ ఎక్స్కవేటర్లను వినియోగిస్తున్నట్లు బీపీపీ ఓఎస్డీవి.కృష్ణ, ఎస్ఈ బీఎల్ఎన్.రెడ్డిలు తెలిపారు. షిఫ్టుల వారీగా ఏకధాటిగా ప్రక్షాళన పనులు నిర్వహించి, 12వ తేదీలోగా పూర్తి చే స్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు నిమజ్జనమైన విగ్రహాలను ఇప్పటికే గట్టుకు చేర్చామని, వీటిని రెండు రోజుల్లో పూర్తి స్థాయి లో తొలగిస్తామని తెలిపారు. ఖైరతాబాద్ భారీ వినాయకుడికి సుమారు 10 టన్నుల వరకు ఇనుము వినియోగించారని, దీన్ని సేకరించేందుకు గణేశ్ ఉత్సవ సమితికి ఈ నెల 11వరకు సమయమిచ్చి, 12న ఆ విగ్రహ శకలాలను కూడా పూర్తిగా తొలగిస్తామని వారు వెల్లడించారు. స్క్రాప్ కోసం ఆరాటం నిమజ్జన విగ్రహాల ఇనుము (స్క్రాప్)ను చేజిక్కించుకొనేందుకు కొందరు పడుతున్న ఆరాటం చూపరులను విస్మయానికి గురిచేస్తోంది. పీకలోతు నీటిలోకి వెళ్లి విగ్రహాల నుంచి వీలైనంత స్క్రాప్‌ను పోగు చేసుకొనేందుకు కొందరు యువకులు పోటీలు పడ్డారు. గట్టుకు చేర్చిన ఇనుమును కూడా చేతనైనంత వరకు తీసుకెళ్లడం కనిపించింది. వీరితోపాటు అక్కడి క్రేన్ వద్ద పనిచేస్తున్న కూలీలు, వివిధ బస్తీల నుంచి వచ్చిన నిరుపేదలు కూడా ఇనుమును సేకరించేందుకు తీవ్రంగా శ్రమించారు. వీటివల్ల వచ్చే ఆదాయమే పలువురు నిరుపేదలకు జీవనాధారం కావడంతో అధికారులు కూడా వారికి అడ్డు చెప్పకుండా వదిలేశారు. -
గంగమ్మ ఒడికి ఇలా..
18 గంటల 44 నిమిషాలు.. ఖైరతాబాద్ కైలాస విశ్వరూప మహా గణపతి గంగమ్మ ఒడికి చేరడానికి పట్టిన సమయమిది. సోమవారం రాత్రి 11:59కి భక్తుల జయజయధ్వానాలతో కదిలిన గణనాథుడు మంగళవారం సాయంత్రం 6.44కి నిమజ్జనమయ్యాడు. దీంతో మహా ఘట్టానికి తెరపడింది. మునుపటితో పోలిస్తే నిమజ్జన యాత్ర ఈసారి సుదీర్ఘంగా సాగింది. ఎన్టీఆర్ మార్గ్‌లో మొత్తం 9 క్రేన్ల సాయంతో 6580 విగ్రహాలు నిమజ్జనమైనట్టు పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ మహాగణపతి షష్టిపూర్తి (ఉత్సవాలకు 60 ఏళ్లు) మహోత్సవం ఓ అద్భుత ఘట్టం. కైలాస విశ్వరూప మహాగణపతి విగ్రహ పనులు ప్రారంభమైన క్షణం నుంచి నిమజ్జనం వరకూ ప్రతి ఘట్టం అపురూపమే. ముఖ్యంగా మహాగణపతి నిమజ్జనోత్సవం దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాగణపతి నిష్ర్కమణ ప్రక్రియ ఏకబిగిన 18.44 గంటలపాటు సాగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం సాయంత్రం 6.44 గంటల వరకు యాత్ర కొనసాగింది. వేలాదిగా భక్తజనం వెంటరాగా గణేషుడు గంగమ్మ ఒడిలోకి జారుకున్నాడు. - ఖైరతాబాద్ శోభాయాత్ర ఇలా.. సోమవారం రాత్రి 11.59 గంటలకు ముహూర్తం కోసం మహాగణపతి రథాన్ని కదిలించారు. అర్ధరాత్రి 1.35: గంటలకు వాహనం కేవలం వందగజాల దూరం కదిలింది. మంగళవారం ఉదయం 10.15 వరకు మహారథం అక్కడే ఉంది. మధ్యాహ్నం: 12.05: రాజ్‌దూత్ చౌరస్తాకు చేరుకుంది. టెలిఫోన్ భవన్: 12.20 సచివాలయం పాత గేటు: 12.55 మధ్యాహ్నం ఒంటిగంట నుంచి 50 నిమిషాలు పాటు తెలుగుతల్లి ప్లై ఓవర్ వద్ద ఆగింది. మధ్నాహ్నం 2.05 నిమిషాలకు కీలకమైన మలుపు తెలుగుతల్లి చౌరస్తాను దాటింది. తెలుగు తల్లి చౌరస్తా నుంచి సెంట్రల్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో మహాగణపతి వాహనం ముందుకు సాగింది. 3.30 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం 4 వద్దకు మహాగణపతి చేరుకున్నాడు. 4 గంటలకు పక్కనే ఉన్న మరో క్రేన్ సాయంతో దుర్గామాత విగ్రహాన్ని పైకి లేపారు. 4.10కి మహాగణపతికి కలశ పూజ నిర్వహించారు. 5.20 భారీక్రేన్ వైర్లను వాహనంపై ఉన్న మహాగణపతికి తగిలించి సిద్ధం చేశారు. 6.15 విశ్వరూపుడికి మహాహారతి సమర్పించారు. 6.20 వెల్డింగ్ పనులు పూర్తయ్యాయి. 6.30 కైలాస విశ్వరూప మహాగణపతిని పైకి లేపారు. 6.44 జలప్రవేశం. 2012: రాత్రి 7 గంటలకి బయల్దేరి మరుసటి రోజు మధ్నాహం 2.22 గంటలకు జలప్రవేశం చేశాడు. ఎన్నిగంటలు: సుమారు 7.30 గంటలు 2013: అర్ధరాత్రి 2.30కి బయల్దేరిన గణపయ్య మధ్నాహ్నం 1.53కు గంగఒడికి చేరాడు. ఎన్నిగంటలు: సుమారు 11.30 గంటలు 2014: అర్ధరాత్రి 11:59 కదిలి సాయంత్రం 6.44 గంటలకు గంగఒడికి చేరాడు. ఎన్నిగంటలు: సుమారు 18.45 గంటలు తొలిసారి నిమజ్జన పూజల్లో రాజేంద్రన్... అధ్భుత సృజనతో గణనాథుడి ఆకృతికి రూపమిచ్చిన ప్రధాన శిల్పి రాజేంద్రన్ ఈ ఏడాది నిమజ్జన పూజల్లో పాల్గొనడం విశేషం. విగ్రహం తయారీ మొదలైన నాటి నుంచి ఎప్పుడూ కూడా ఆయన నిమజ్జనయాత్రలో పాల్గొనలేదు. విగ్రహాన్ని రథంపై ఉంచిన మరుక్షణం ఆయన ఇంటికెళ్లిపోతారు. కానీ ఈ ఏడాది మాత్రం తెలుగుతల్లి చౌరస్తా నుంచి నిమజ్జన యాత్రలో పాల్గొన్నారు. గణపయ్యకు మహాహరతి సమర్పించిన వెంటనే ఒంటరిగా ఇంటి బాటపట్టారు. భారీగా భక్తజనం సోమవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారే వరకు మహాగణపతి శోభా యాత్రను తిలకించేందుకు నగరం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఖైరతాబాద్ వీధుల్లో బారులు తీరారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఐమాక్స్ చౌరస్తా, మింట్ కాంపౌండ్, సచివాలయం ప్రాంతాలన్నీ జనసంద్రమయ్యాయి. -
9 నుంచి ‘ఆపరేషన్ గణేశ’
సాగర్ శుద్ధికి హెచ్ఎండీఏ ఏర్పాట్లు వ్యర్థాల తొలగింపునకు ప్రత్యేక డ్రైవ్ 3సాక్షి, సిటీ బ్యూరో: హుస్సేన్ సాగర్‌లో వినాయక విగ్ర హ శకలాలను తొలగించేందుకు హెచ్ఎండీఏ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఏరోజు నిమజ్జనమయ్యే విగ్రహాలను ఆ రోజే గట్టుకు చేర్చి, జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. ఇప్పటివరకు చిన్నా, పెద్ద విగ్రహాలు సుమారు 16 వేలకు పైగా నిమజ్జనమై ఉంటాయని అంచనా. ఈ నెల 8తో వినాయక నిమజ్జన ప్రధాన ఘట్టం ముగియనుంది. 9వ తేదీ మధ్యాహ్నం నుంచే సాగర్ పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా 5 రోజుల్లోగా వ్యర్థాలను పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఎస్ఈ బి.ఎల్.ఎన్.రెడ్డి తెలిపారు. ప్రముఖుల రాకపోకలు అధికంగా ఉండే ఎన్టీఆర్ మార్గ్ వైపు 9 ఫ్లాట్‌ఫారాల వద్ద శకలాలను తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టామన్నారు. దీని కోసం 2 డ్రెడ్జింగ్ యుటిలిటీ క్రాఫ్ట్ (డీయూసీ)లు, 2 జేసీబీలు, 10 టిప్పర్లు, 80 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు ఎస్ఈ తెలిపారు. ఇప్పటి వరకు 1100 టన్నుల వ్యర్థాలను తరలించామన్నారు. ఫ్లాట్‌ఫారాల వద్ద క్రేన్లు అడ్డుగా ఉండటంతో అక్కడి వ్యర్థాలను తొలగించడం ఇబ్బందిగా ఉందన్నా రు. ఇవి నీటిలోకి జారిపోయి సాగర్ కలుషితం కాకుం డా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. ఈ ఏడాది 3,740 టన్నుల వ్యర్థాలు పోగయ్యే అవకాశం ఉందన్నారు. మొక్కుబడి తంతేనా... ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్‌ల వైపు విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నా...కేవలం ఎన్టీఆర్ మార్గ్ వైపు మాత్రమే ప్రక్షాళన పనులు చేపడుతుండటం హెచ్ఎండీఏ చిత్త‘శుద్ధి’కి అద్దం పడుతోంది. ట్యాంక్‌బండ్ వైపులోతుగా ఉండడంతో పూడిక తొలగింపు సులభం కాదంటూ కొన్నేళ్లుగా దాటవేస్తున్నారు. నీటిపై తేలిన విగ్రహాలు, పూలు పత్రి వంటి వాటిని డీయూసీ, బోట్ల ద్వారా గట్టుకు చేరుస్తున్నారే తప్ప, అడుగుకు చేరుకున్న విగ్రహాల జోలికి వెళ్లట్లేదు. దీంతో పూడిక భారీగా పేరుకుపోతోంది. ఇది ట్యాంకు బండ్ ఉనికికే ప్రమాదమని, నీటి నిల్వ సామర్థ్యం ఘననీయంగా తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
సరికొత్త అడుగులు
-
భక్తజన పారవశ్యం
సాక్షి, సిటీబ్యూరో : జై బోలో గణేశ్ మహరాజ్‌కీ.. అంటూ భక్తి పారవశ్యంలో భక్తుల జయజయ ధ్వానాలతో ఎన్టీఆర్ మార్గ్(ఖైరతాబాద్ ఫ్లైఓవర్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్‌వరకు) మార్మోగింది. తొమ్మిది రోజుల పాటు సకల జనుల పూజలందుకున్న బొజ్జగణపయ్యలను బుధవారం సాగరంలో నిమజ్జనం చేసేందుకు వచ్చిన జనప్రవాహంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. ఫ్లడ్‌లైట్ల కాంతుల్లో సాగర తీరం శోభాయమానంగా మారగా, అక్కడ జరుగుతున్న సామూహిక గణేశ్ నిమజ్జనాన్ని కనులారా చూచేందుకు రాష్ట్రవ్యాప్తంగా భక్తులు తరలివచ్చారు. అద్భుతమైన రీతుల్లో అలంకరించిన గణనాథుల వాహన శ్రేణి చూపరులను అమితంగా ఆకట్టుకుంది. అర్ధరాత్రి దాటినా నిమజ్జనోత్సవం ఉత్సాహభరితంగా కొనసాగింది ఆలస్యంగా ... గణేశ్ నిమజ్జనం కార్యక్రమం ఎన్టీఆర్ మార్గ్‌లో ఈసారి కాస్త ఆలస్యంగానే ప్రారంభమైంది. గతంలో నిమజ్జన ం రోజున ఉదయం 10గంటల నుంచే భారీ సంఖ్యలో గణనాథులు తరలిరాగా బుధవారం మాత్రం మధ్యాహ్నం 2గంటల తర్వాత సందడి మొదలైంది. మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు భారీ జనసందోహం నడుమ గణనాథుల ఊరేగింపు అంగరంగ వైభవంగా సాగింది. ఐదున్నర గంటలకు వర్షం కురవడంతో భక్తులంతా చెల్లాచెదురయ్యారు. గంట తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో నిమజ్జన కార్యక్రమంలో భక్తజనం తిరిగి హుషారుగా పాల్గొన్నారు. ఆకట్టుకున్న చిన్ని గణేశుల ర్యాలీ ఎన్టీఆర్ మార్గ్ వినాయక నిమజ్జన కార ్యక్రమంలో ఓ విచిత్రం చోటు చేసుకుంది. చిన్నసైజు మట్టి వినాయక విగ్రహాలను సాగర తీరానికి చిన్నిచిన్ని ట్రాలీల్లో తరలించారు. 51 విగ్రహాలు వరుసగా ట్రా లీలపై రావడం చూపరులను ఆకట్టుకుంది. హిం దూ మతానికి సంబంధించి ‘51’ని లక్కీనంబరుగా భావిస్తున్నందున అన్ని విగ్రహాలను వరుసగా ట్రాలీల్లో తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. డ్రైఫ్రూట్స్ గణేశ్..! పర్యావరణాన్ని కాంక్షిస్తూ రకరకాల ఇకో ఫ్రెండ్లీ గణేశులను చూస్తూనే ఉంటాం. అయితే బుధవారం ఎన్టీఆర్ మార్గ్‌లో నిమజ్జనాన్ని చూసేందుకు వచ్చిన వారికి డ్రైఫ్రూట్స్ గణేశుడు సాక్షాత్కరించాడు. రాంబాగ్‌కు చెందిన శ్రీహరి అలియాస్ చిరు జీడిపప్పు, కిస్మిస్, బాదంపప్పు, ఖర్జూర, కలకండలతో గణనాథుని తయారు చేశాడు. పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలు, రంగులు వాడకుండా ఏటా ఇలాగే డ్రైఫ్రూట్స్ గణేశుడిని రూపొందించి నిమజ్జనానికి తెస్తానని శ్రీహరి చెప్పాడు. ఇంతకీ డ్రైఫ్రూట్స్ గణేశుడి బరువెంతో తెలుసా... అక్షరాల ముఫ్ఫై కిలోలట. టిప్పర్ గణేశ్.. బైక్ గణేశ్..! డ్రైఫ్రూట్స్ గణేశుని సంగతి అలా ఉంటే.. గోల్నాక చెందిన దినేశ్ గణేశ్ విగ్రహాన్ని చిన్నబొమ్మ సైజు టిప్పర్(లారీ)పై ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించాడు. అలాగే గోషామహల్‌కు చెందిన సాంబశివరావు గత నాలుగేళ్లుగా తన మోటార్ బైక్‌పై గణేశుని నిమజ్జనానికి తీసుకు వస్తున్నాడట. చిత్ర విచిత్రమైన గణేశులను వీక్షించి, తమ కెమెరాల్లో బంధించేందుకు భక్తులు పోటీ పడ్డారు. ఫ్రాన్స్‌కు చెందిన కొందరు విదేశీయులు కూడా గణేశ్ ప్రతిమలను ఎంతో ఆసక్తిగా తిలకించి, తమ వెంట తెచ్చుకున్న కెమెరాలతో వీడియోలు, ఫోటోలు తీసుకున్నారు. అగర్వాల్ సమాజం ఆతిథ్యం.. అగర్వాల్ సహాయత ట్రస్ట్ తరఫున అగర్వాల్ సమాజ్ మోతీనగర్ శాఖ గణేశ్ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులకు మెరుగైన అతిథ్యాన్ని ఇచ్చారు. సాగర తీరంలో ఎర్పాటు చేసిన స్టాల్ నుంచి వేలాది మందికి పూరీలు, సమోసాలు, పండ్లు, ఉప్మా.. తదితర అహారపదార్థాలను ఉచితంగా అందించారు. భక్తులకు సేవ చేయాలనే తలంపుతోనే ఉదయం 10గంటల నుంచి రాత్రి 12గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామని సమాజ్ అధ్యక్షుడు సతీష్ అగర్వాల్ తెలిపారు. మోడీ, సర్దార్ల పలకరింపులు..! అదేంటి నరేంద్ర మోడీ మళ్లీ నగరానికి వచ్చారని అనుకుంటున్నారా. అదేం లేదు గానీ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, నరేంద్ర మోడీల భారీ కటౌట్లను అటూ, ఇటూ ఊపుతూ పాతబస్తీకి చెందిన గుజరాతీ యువకులు సందడి చేశారు. దూరం నుంచి వీక్షించిన వారికి నరేంద్ర మోడీ తమను పలకరిస్తున్న ఫీలింగ్ కలిగేలా కటౌట్లు రూపొందించడం విశేషం.