నగరంలో నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ తొలిరోజు ముగిసింది. అయితే తొలిరోజు రేసింగ్‌లో రెండు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే జరిగాయి. రేసింగ్ నిర్వహణలో మరోసారి గందరగోళం నెలకొనడంతో నిర్వహకులు ఆదివారమే అన్ని పోటీలు పెట్టే యోచనలో ఉన్నారు. రేసింగ్ సమయంలో రెండు కార్లు రేస్ మద్యలో ఆగడంతో రెండు సార్లు రెడ్ ఫ్లాగ్స్ రావడం గందరగోళానికి దారి తీసింది.
గతంలోలాగే మరోసారి రేస్ నిర్వహణలో ఆలస్యం కావడంతో ప్రాక్టీస్ రేస్లతోనే నిర్వాహకులు తొలిరోజును ముగించారు. ఆలస్యం కారణంగా మెయిర్ రేస్-1 జరగలేదు. దీంతో ఆదివారం అసలైన ఇండియన్ రేసింగ్ లీగ్ జరగనుంది. ఇక సాంకేతిక కారణాలతో స్పోర్ట్స్ కార్లు చాలా ఆలస్యంగా ట్రాక్ ఎక్కాయి. అయితే రేసింగ్ చూడడానికి వీక్షకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఆదివారం జరిగే ఇండియన్ రేసింగ్ ఫైనల్‌పైనే అందరి ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment