9999 @ రూ.10 లక్షలు | Rs 10.46 lakhs for 9999 Fancy numbers at Khairtabad RTA office | Sakshi
Sakshi News home page

9999 @ రూ.10 లక్షలు

Published Wed, Jun 13 2018 6:46 PM | Last Updated on Wed, Jun 13 2018 6:53 PM

Rs 10.46 lakhs for 9999 Fancy numbers  at Khairtabad RTA office - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. మంగళవారం ఖైరతాబాద్‌ ఆర్టీఏలో ప్రత్యేక నంబర్లకు నిర్వహించిన వేలానికి వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘టీఎస్‌ 09 ఈజడ్‌ 9999’ నంబర్‌ కోసం ఓ వ్యక్తి రూ.10.46 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. బాగా డిమాండ్‌ ఉండే ‘ఆల్‌ నైన్స్‌కు’ రూ.10 లక్షలు చెల్లించడం ఇదే మొట్టమొదటిసారి. గతంలో ఈ నంబర్‌ కోసం రూ.9 లక్షల వరకు చెల్లించి దక్కించుకున్నావారు ఉన్నారు. 

కానీ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ సంస్థ తమ రూ.1.04 కోట్ల ఖరీదైన రేంజ్‌రోవర్‌ కారు కోసం ఆల్‌ నైన్స్‌ నంబర్‌ను వేలంలో రూ.10,46,722 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్‌ 09 ఎఫ్‌ఏ 0009’ నంబర్‌ కోసం గంగవరం పోర్టు సంస్థ రూ.5,01,000కు దక్కించుకుంది. రూ.1.41 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కోసం ఈ నంబర్‌ తీసుకున్నారు. అలాగే ‘టీఎస్‌ 09 ఎఫ్‌ఏ 0005’ నెంబర్‌ కోసం కూనం ఈశ్వరమ్మ రూ.2,51,000 చెల్లించారు. తమ వోల్వో ఎక్స్‌సి కారు కోసం ఈ నెంబర్‌ తీసుకున్నారు. ప్రత్యేక నెంబర్లకు మంగళవారం నిర్వహించిన వేలం పాటల్లో ఆర్టీఏకు మొత్తం రూ.26,55,243 లభించినట్లు ఖైరతాబాద్‌ ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement