rta offices
-
ఏసీబీ దూకుడు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) గత కొద్ది నెలలుగా దూకుడు పెంచింది. వరుస తనిఖీలు, ఆకస్మిక ‘ఆపరేషన్’లతో ఏసీబీ అధికారులు హల్చల్ చేస్తున్నారు. శుక్రవారం ఒక్క రోజే వనపర్తి జిల్లా టీజీఎస్పీడీఎల్ ఉద్యోగులు ముగ్గురు, గొర్రెల కుంభకోణంలో ఇద్దరు, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో సీఐ, ఎస్సై, మరో ప్రైవేటు వ్యక్తి కలిపి ముగ్గురు..గండిపేట్ ఎమ్మార్వో కార్యాలయంలో నలుగురు అధికారులు కలిపి మొత్తంగా 12 మంది అవినీతి అధికారులను కటకటాల వెనక్కి నెట్టారు. ఇక గొర్రెల కుంభకోణం కేసులో పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్‌ను అరెస్టు చేసి కొరడా ఝుళిపిస్తున్నామనే సంకేతాలనిచి్చంది ఏసీబీ. కొద్ది రోజుల ముందు ఆర్టీఏ కార్యాలయాలు, చెక్‌పోస్టులలో ఏకకాలంలో 15 ఏసీబీ అధికారుల బృందాలు 12 ప్రాంతాల్లో సోదాలు చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్లుగా మారు వేషాల్లో వెళ్లి మరీ ఆర్టీఏ చెక్పోస్టులపై సోదాలు చేయడం గమనార్హం. ఆనంద్ రాకతో.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్‌కు బాధ్యతలు అప్పగించింది. ఆయన కింది స్థాయి అధికారులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో క్షేత్రస్థాయిలోని అవినీతి అధికారుల భరతం పడుతున్నారు ఫలితంగా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 78 కేసులు నమోదు చేయగా.. గతేడాది(2023)లో మొత్తం కలిపి కేసులు 94 మాత్రమే కావడం గమనార్హం. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్,పట్టణాభివృద్ధిశాఖతోపాటు పోలీస్‌శాఖలో అవినీతిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. దీంతో పాటు ఇటీవల ఆర్టీఏ కార్యాలయాలపై మెరుపు దాడులు చేయడంతో అవినీతికి నిలయాలుగా మారినన మిగతా ప్రభుత్వ శాఖలపైనా ఏసీబీ నజర్ ఉన్నట్టుగా తేటతెల్లం అయ్యింది. రాష్ట్రంలో అవినీతికి మూల కేంద్రాలుగా చర్చ జరుగుతోన్న ఎక్సైజ్, రిజి్రస్టేషన్ల శాఖలపై కూడా ఏసీబీ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ రెండు శాఖలే టార్గెట్‌గా ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించినా ఆశ్చర్యపోవక్కర్లేదని తెలుస్తోంది. చిక్కుతున్న అవినీతి తిమింగలాలు.. ఏసీబీ అధికారులు పక్కా స్కెచ్‌తో ముందుకు వెళుతుండడంతో అవినీతి తిమింగలాలు విలవిలలాడుతున్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే హెచ్ఎండీఏలో పరాకాష్టకు చేరిన అవినీతి బాగోతం బయటకు లాగారు ఏసీబీ అధికారులు. ఆ శాఖలో అవినీతితో వేళ్లూనుకున్న హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు అప్పట్లో పెను ప్రకంపనలు సృష్టించింది.. వందల కోట్ల అవినీతి సొమ్మును వెలికి తీయడంతోపాటు వరుస అరెస్టులు ఈ కేసులో జరిగాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ.84 వేలు లంచం తీసుకుంటుండగా గిరిజన సంక్షేమశాఖ ఇంచార్జి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ (ఎస్ఈ) జగజ్యోతిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సదరు అధికారి ఇంట్లో సోదాల్లో రూ.65 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారం లభ్యమైంది. మార్చిలో జరిపిన ఏసీబీ సోదాల్లో మహబూబాబాద్ సబ్ రిజి్రస్టార్ తస్లీమా రూ.19 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నట్టు విశ్వసనీయ సమాచారంతో సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్రావు ఇల్లు, బంధువుల ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.కోట్ల ఆస్తులతోపాటు, తనతోపాటు అవినీతి భాగస్వాములుగా ఉన్న మరికొందరి పోలీస్ అధికారుల ఆస్తులకు సంబంధించిన పత్రాలు లభించడం సంచలనంగా మారింది.ప్రజలకు మరింత చేరువయ్యేలా ఏసీబీగతంలో ఏసీబీ అధికారులను సంప్రదించేందుకు కేవ లం 1064 టోల్‌ఫ్రీ నంబర్ మాత్రమే అందు బాటులో ఉండేది. ఇటీవల కాలంలో ప్రజలకు మరింత చేరువయ్యేలా ఏసీబీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. 94404 46106 వాట్సప్ నంబర్ అందుబాటులోకి తెచ్చింది. అదేవిధంగా"www. acb.telangana.gov.in ’వెబ్సైట్లో, ఫేస్బుక్"http//www.facebook.com/ ACBtelangana లో, "https://x.com/ Telangana ACB'sìæÓrt-ÆŠ‡ÌZ, "dg&acb@telangana.gov.in' ఈ–మెయిల్‌లోనూ ఏసీబీ అధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. -
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఖైరతాబాద్, మలక్‌పేట్, నాగోల్, అత్తాపూర్,మహబూబ్‌నగర్, సిద్ధిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆర్డీఏ కార్యాలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.ఆర్డీఏ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. చెక్‌పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు,లావాదేవీలపై ఏసీబీ విచారిస్తోంది. నకిలీ ఇన్స్యూరెన్సులు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.మహబూబాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఆరుగురు ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏజెంట్ల వద్ద 45,100 నగదు, డ్రైవర్ వద్ద 16,500 నగదు, నూతన లైసెన్స్‌లు, రెనివల్స్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యమైంది. -
ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
-
వరుణ్ మోటార్స్ షోరూమ్‌లలో తనిఖీలు
సాక్షి, అమరావతి: వరుణ్ మోటార్స్ గ్రూపు షోరూమ్‌ల్లో అవకతవకలు జరిగినట్లు రవాణా శాఖ తనిఖీల్లో ప్రాథమికంగా వెల్లడైంది. పలు ఫిర్యాదుల ఆధారంగా విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, విజయనగరం, శ్రీకాకుళంలోని వరుణ్ మోటార్స్ షోరూమ్‌ల్లో రవాణా శాఖ గురువారం ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. 300 వాహనాలను టెంపరరీ రిజిస్ట్రేషన్ లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా డెలివరీ చేసినట్లు ఈ తనిఖీల్లో వెల్లడైంది. అలాగే రవాణా శాఖకు ఎటువంటి సమాచారం లేకుండా చాలాచోట్ల సబ్ డీలర్లతో వాహనాల విక్రయాలు చేస్తున్నట్లు తేలింది. అక్రమాలు బహిర్గతమైన నేపథ్యంలో వరుణ్ మోటార్స్ గ్రూప్స్ షోరూమ్‌ల్లో వాహనాల విక్రయాలు జరగకుండా లాగిన్‌ను రవాణా శాఖ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. మరింత లోతుగా విచారణ చేశాక అక్రమాలపై మరిన్ని చర్యలను తీసుకోవాలని నిర్ణయించింది. (చదవండి: లలితా రైస్ మిల్స్‌లో ఐటీ దాడులు) -
ఖైరతాబాద్ ఆర్టీఏలో ఏసీబీ నుంచి వచ్చామంటూ..
సాక్షి, సిటీబ్యూరో: స్థలం : ఖైరతాబాద్ ఆర్టీఏ కేంద్ర కార్యాలయం, సమయం : శనివారం ఉదయం 11 గంటలు, సందర్భం : నలుగురు వ్యక్తులు ఆర్టీఏ కార్యాలయంలోకి ప్రవేశించారు. తాము ఏసీబీ నుంచి వచ్చామంటూ నేరుగా ఒక మహిళా ఉద్యోగి వద్దకు వెళ్లారు. ఆమెను తమ వెంట తీసుకెళ్లారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. దీంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయాందోళనకు గురయ్యారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయనే వార్త దావనలంలా వ్యాపించింది. కొన్ని చానళ్లలో స్క్రోలింగులు కూడా వచ్చాయి. కొందరు మీడియా ప్రతినిధులు సైతం అక్కడకు చేరుకున్నారు. కానీ వచ్చిన అగంతకులు ఆ మహిళా ఉద్యోగిని నేరుగా తమ వెంట తీసుకెళ్లారు. ఆర్టీఏ ఆఫీస్ బయట ఉన్న ఏసీ బస్టాపులో కొద్దిసేపు మాట్లాడారు. అనంతరం లకిడికాపూల్‌లోని ఒక హోటల్‌కు వెళ్లి అక్కడ కొద్ది సేపు మాట్లాడిన అనంతరం ఆమెను వదిలి అయితే వచ్చిన ఆ నలుగురు అగంతకులు అటు ప్రాంతీయ రవాణా అధికారి రమేష్‌కు కానీ, హైదరాబాద్ సంయుక్త రవాణా కమిషనర్ పాండురంగ్నాయక్కు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రేణుక అనే జూనియర్ అసిస్టెంట్‌ను తమ వెంట తీసుకెళ్లడం కలకలం సృష్టించింది. ఎవరా అగంతకులు.... నిజానికి ఆమె కోసం వచ్చిన వాళ్లు పోలీసులైనా, ఏసీబీ అధికారులైనా తాము ఎవరో, ఎందుకొచ్చారో స్పష్టంగా వివరిస్తారు. పై అధికారులకు సమాచారం అందజేస్తారు. కానీ అలాంటిదేమీ లేకుండా సరాసరి ఒక మహిళా ఉద్యోగి వద్దకు వచ్చి ఆమెను తీసుకెళ్లడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ప్రైవేట్ వ్యక్తులే ఆ పని చేశారని అధికారులు అంచనా వేశారు. మరోవైపు ఆర్టీఏ కార్యాలయంలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల కూడా వచ్చిన వారిని నిర్ధారించడం కష్టంగా మారింది. మరోవైపు తమ వెంట రావలసిందిగా వాళ్లు ఆదేశించడంతో పై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆమె బయటకు వారితో బయటకు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. అది వారి వ్యక్తిగతమైన విషయమై ఉండవచ్చునని కొందరు భావిస్తుండగా, ఆమె మాత్రం వచ్చిన వారు ఎవరో తనకు తెలియదని, తనను డబ్బులు డిమాండ్ చేశారని అనంతరం తిరిగి ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్న రేణుక తన పై అధికారులకు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరా... ప్రధాన కార్యాలయం అయిన ఖైరతాబాద్‌లోనే ఈ సంఘటన చోటుచేసుకోవడం, ఆర్టీఏ కార్యాలయంలో ఎలాంటి భద్రత లేకపోవడం, బయటి వ్యక్తులపైన నిఘా వ్యవస్థ కానీ, సీసీ కెమెరాలు కానీ లేకపోవడం ఒకవైపు అయితే మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో ఈ సంఘటన చర్యనీయాంశంగా మారింది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్‌కు ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి.వచ్చిన వాళ్లు ఏసీబీకి చెందిన అధికారులా లేక ప్రైవేట్ వ్యక్తులా, పోలీసులా అనే అంశాన్ని ఆరా తీశారు. ఇలా ఉండగా, అగంతకులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జేటీసీ పాండురంగ్ నాయక్ తెలిపారు. -
9999 @ రూ.10 లక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రత్యేక నంబర్లకు నిర్వహించిన వేలానికి వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘టీఎస్ 09 ఈజడ్ 9999’ నంబర్ కోసం ఓ వ్యక్తి రూ.10.46 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. బాగా డిమాండ్ ఉండే ‘ఆల్ నైన్స్కు’ రూ.10 లక్షలు చెల్లించడం ఇదే మొట్టమొదటిసారి. గతంలో ఈ నంబర్ కోసం రూ.9 లక్షల వరకు చెల్లించి దక్కించుకున్నావారు ఉన్నారు. కానీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ తమ రూ.1.04 కోట్ల ఖరీదైన రేంజ్‌రోవర్ కారు కోసం ఆల్ నైన్స్ నంబర్‌ను వేలంలో రూ.10,46,722 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్ 09 ఎఫ్ఏ 0009’ నంబర్ కోసం గంగవరం పోర్టు సంస్థ రూ.5,01,000కు దక్కించుకుంది. రూ.1.41 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కోసం ఈ నంబర్ తీసుకున్నారు. అలాగే ‘టీఎస్ 09 ఎఫ్ఏ 0005’ నెంబర్ కోసం కూనం ఈశ్వరమ్మ రూ.2,51,000 చెల్లించారు. తమ వోల్వో ఎక్స్‌సి కారు కోసం ఈ నెంబర్ తీసుకున్నారు. ప్రత్యేక నెంబర్లకు మంగళవారం నిర్వహించిన వేలం పాటల్లో ఆర్టీఏకు మొత్తం రూ.26,55,243 లభించినట్లు ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్ తెలిపారు. -
కాలం చెల్లినా బేఫికర్
సాక్షి, సిటీబ్యూరో: ఓఎల్ఎక్స్ నుంచి కాలం చెల్లిన ఆక్షన్డ్ వాహనాలను ఖరీదు చేయడం... మెకానిక్‌ల సాయంతో వీటికి ఇంజన్, ఛాసిస్ నెంబర్లు వేయించడం... ఆర్టీఏ దళారులు, అధికారుల సాయంతో కొత్తగా ఆర్సీలు సృష్టించడం... వీటి సాయంతో వాహనాలను మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకోవడం... 2015 నుంచి ఈ పంథాలో దందా చేస్తున్న ముఠా గుట్టును మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ప్రధాన సూత్రధారితో సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేశామని, వీరిలో ఒకరు బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం దళారిగా డీసీపీ రాధాకిషన్‌రావు బుధవారం తెలిపారు. ఈ వ్యవహారంలో ఆర్టీఏ అధికారుల పాత్రపై దర్యాప్తు చేయాల్సిందిగా ఆ విభాగానికి లేఖ రాయనున్నామన్నారు. ఉత్తరాదిలో వాహనాల వేలం.. గుజరాత్‌కు చెందిన యు.హితేష్ పటేల్ నగరానికి వలసవచ్చి మిఠాయిల వ్యాపారం చేసేవాడు. కవాడిగూడ, నాగోల్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన స్వీట్ షాప్‌లు నష్టాలు మిగల్చడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలో ఇతడి దృష్టి కాలం చెల్లిన వాహనాలపై పడింది. ఉత్తరాదికి చెందిన పోలీసు విభాగాలతో పాటు ఆర్మీ సైతం 15 ఏళ్లకు మించిన వాహనాలను కాలం చెల్లినవిగా పరిగణిస్తాయి. వీటి ఆర్సీలు ఇతర పత్రాలు ధ్వంసం చేయడంతో పాటు ఇంజన్, ఛాసిస్ నెంబర్లు సైతం తుడిచేసి వేలంలో విక్రయిస్తారు. ఇలాంటి వాటిని ఉత్తరాదికి చెందిన దళారులు పెద్ద మొత్తంలో ఖరీదు చేస్తారు. ఆపై వీటిని స్క్రాప్‌గా, విడి భాగాలు విక్రయించడానికి ఓఎల్ఎక్స్లో పెడుతున్నారు. వెబ్సైట్లో సెర్చ్ చేసి నంబర్లు... హితేష్ ఈ వాహనాలను ఓఎల్ఎక్స్ ద్వారా రూ.10 వేల నుంచి రూ.15 వేలు వెచ్చించి ఖరీదు చేస్తున్నాడు. వీటిని హైదరాబాద్‌కు తెప్పించిన తర్వాత తనకు పరిచయస్తులైన దాదాపు 20 మంది మెకానిక్‌లకు సమాచారం ఇచ్చేవాడు. యథాతథంగా వాహనం కావాలంటూ రూ.25 వేలకు విక్రయించేస్తున్నాడు. ఎవరైనా తమకు రిజిస్ట్రేషన్‌తో సహా కావాలని కోరితే అసలు కథ ప్రారంభిస్తున్నాడు. ఆర్టీఏ కార్యకలాపాలపై పట్టున్న హితేష్ అధికారిక వెబ్‌సైట్‌లోని ‘వెహికిల్ రిజిస్ట్రేషన్ సెర్చ్’ విభాగంలోకి ప్రవేశిస్తాడు. తమ దగ్గర ఉన్న వాహనం ఏ మోడల్‌కు చెందినదో గుర్తిస్తాడు. అప్పట్లో ఉండే రిజిస్ట్రేషన్ సిరీస్‌కు చెందిన ఏదో ఒక నెంబర్ అందులో ఎంటర్ చేసి సెర్చ్ చేస్తాడు. ఆ నెంబర్ దాదాపు 15 ఏళ్లకు పూర్వానిది కావడంతో ‘నో డేటా ఫౌండ్’ అంటూ వస్తుంది. ఈ నెంబర్ నోట్ చేసుకునే హితేష్... మెకానిక్స్ సాయంతో ఆయా వాహనాలపై తనకు తోచిన ఇంజన్, ఛాసిస్ నెంబర్లను ప్రత్యేక ఉపకరణాల ద్వారా ముద్రించేస్తాడు. ఆర్టీఏ దళారి సాయంతో... ఇలా సిద్ధమైన వాహనాలకు సంబంధించిన నెంబర్లను ఓ చీటీపై రాసే హితేష్ దాన్ని బండ్లగూడ ఆర్టీఏ కార్యాలయం ఏజెంట్ ఎ.విఠల్‌రావుకు అందిస్తాడు. ఒక్కో వాహనానికి రూ.25 వేల నుంచి రూ.30 వేలు వసూలు చేసే విఠల్‌రావు ఈ వివరాల ఆధారంగా ఆర్టీఏ అధికారుల సాయంతో ఆర్సీలు జారీ చేయిచేస్తాడు. ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వచ్చే వాహనాలకు రీ–అసైన్మెంట్ పద్దతిలో, కాలం చెల్లినప్పటికీ ఫిట్నెస్తో ఉన్న వాహనాలకు రీ–రిజిస్ట్రేషన్ పద్దతిలో ఆర్టీఏ అధికారులు కొత్తగా వేరే నెంబర్లు లేదా పాత నెంబర్లు కేటాయిస్తారు. ఈ రెండు పద్దతుల్నీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్న విఠల్‌రావు ఆర్సీలు జారీ చేయించి హితేష్‌కు అప్పగించేవాడు. రిజిస్ట్రేషన్ సమయంలో ఆర్టీఏ కార్యాలయంలో తన పరిచయస్తులకు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తూ నకిలీ యజమానులుగా ప్రవేశపెడుతున్నాడు. వీరితోనే వేలిముద్రలు వేయించడం, ఫొటోలు దిగేలా చేయడం, డిజిటల్ సంతకాలు పెట్టించడం చేస్తున్నాడు. భారీ మొత్తాలకు అమ్మేసుకుంటూ... ఇలా ‘తయారైన’ వాహనాలను హితేష్ తన ముఠాలోని మెకానిక్‌ల సాయంతో భారీ మొత్తాలకు విక్రయించేస్తున్నాడు. 1962 మోడల్‌కు చెందిన ‘ఏబీడీ 1’ రిజిస్ట్రేషన్‌తో కూడిన వాహనాన్ని ఏకంగా రూ.1.5 లక్షలకు అమ్మారు. విక్రయించేది సైతం మెకానిఖలే కావడం, వాహనాలు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసుకుని ఉండటం, ఆర్టీఏ రికార్డుల్లోనూ వివరాలు ఉంటుండటంతో ఖరీదు చేసే వారికీ ఎలాంటి అనుమానాలు రావడం లేదు. మరోపక్క హితేష్, విఠల్‌రావు ఏలాంటి వాహనాలు లేకుండానే 14 ఆర్సీలు వివిధ పేర్లు, నెంబర్లతో జారీ చేయించి సిద్ధంగా ఉంచారు. ఏవైనా వాహనాలు దొరికితే వాటిపై ఈ నెంబర్లు వేసి విక్రయించాలని భావించారు. మరోపక్క ‘వెహికిల్ రిజిస్ట్రేషన్ సెర్చ్’ సహాయంతో 72 నెంబర్లను సిద్ధం చేసి ఉంచారు. వీరి వ్యవహారాలపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం బుధవారం దాడి చేసి వీరిని అదుపులోకి తీసుకుంది. క్రేజ్ ఉన్న వాహనాలే ఎక్కువగా... ప్రధాన సూత్రధారి హితేష్, ఆర్టీఏ దళారి విఠల్‌రావులతో పాటు సహకరించిన మెకానిక్స్ మైఖేల్ మోది (ఆలుగడ్డబావి), హకీం అబు నాసిర్ (శాస్త్రిపురం), మహ్మద్ ఆరిఫ్‌లను (వారాసిగూడ) అరెస్టు చేసింది. వీరి నుంచి, వీరు విక్రయించిన 15 రాయల్ ఎన్ఫీల్డ్, 2 యమహా బైక్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ గ్యాంగ్ ఎక్కువగా క్రేజ్ ఉన్న వాహనాలకే రిజిస్ట్రేషన్లు సృష్టించి విక్రయిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఆర్టీఏ అధికారుల వివరాలు ఆరా తీయడానికి పోలీసు కమిషనర్ ద్వారా ఆర్టీఏ కమిషనర్‌కు లేఖ రాయనున్నామని డీసీపీ పేర్కొన్నారు. కేసును తదుపరి విచారణ నిమిత్తం బోయిన్పల్లి, గాంధీనగర్ పోలీసులకు అప్పగించారు. -
అమల్లో ‘లైసెన్స్’
♦ ఉదయాన్నే తనిఖీల జోరు హా రూ. 500 జరిమానా ♦ ఉన్నతాధికారుల ఆదేశంతో వెనక్కి ♦ నాలుగు రోజులు అవకాశం ♦ ఆర్టీఏ కార్యాలయాల వద్ద బారులు వాహన చోదకులు ఒరిజినల్ లైసెన్స్‌ను కల్గి ఉండాలన్న ఉత్తర్వులు బుధవారం అమల్లోకి వచ్చాయి. ఉదయాన్నే పోలీసులు వాహనాల తనిఖీలు జోరెత్తారు. ఒరిజినల్ లైసెన్స్‌లు లేని వారి భరతం పడుతూ రూ.500 వరకు జరిమానా విధించారు. అయితే, ఉన్నతాధికారుల ఆదేశంతో కాసేపటికి వెనక్కు తగ్గారు. ఇక, ఆర్టీఏ కార్యాలయాలు వాహనదారులతో కిటకిటలాడాయి. సాక్షి, చెన్నై : అతి వేగం కారణంగా ప్రమాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో వాహనదారుల భరతం పట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి వాహన దారుడు తమ వెన్నంటి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కల్గి ఉండాల్సిందేనన్న ఉత్తర్వులకు మద్రాసు హైకోర్టు సైతం మద్దతు ప్రకటించింది. దీంతో బుధవారం నుంచి ఒరిజినల్ లైసెన్స్‌లు తప్పనిసరి అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో రాష్ట్రంలో అనేకచోట్ల పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. సాధారణంగానే వాహనదారులు పట్టుబడితే, ముక్కు పిండి మరీ జరిమానా మోత విధించే పోలీసులు, తాజాగా ఒరిజినల్ అస్త్రంతో ఉదయాన్నే రోడ్డెక్కారు. చెన్నై వంటి నగరాల్లో సిగ్నల్స్ వద్ద హెల్మెట్లు ధరించి ఉన్నా సరే, అనుమానంగా కనిపిస్తే చాలు, ఆ వాహన దారుడి లైసెన్స్‌ను పరిశీలించడం, ఒరిజినల్ లేని పక్షంలో రూ. 500 జరిమానా మోత మోగించే పనిలో పడ్డారు. వేధించవద్దన్న ఉన్నతాధికారులు పదిన్నర, పదకొండు గంటల వరకు అనేకచోట్ల ఈ జరిమానా మోత మోగినా, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో పోలీసులు వెనక్కు తగ్గారు. వాహనదారుల్ని వేధించే చర్యలకు పాల్పడ వద్దని పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. నాలుగు రోజుల పాటు ఎలాంటి తనిఖీలు వద్దని, లైసెన్స్‌లు పొందేందుకు తగ్గ అవకాశాన్ని ఇచ్చే విధంగా వాహనదారులకు కాస్త ఊరట కల్పించారు. ఈ నాలుగు రోజుల పాటు ›ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వాహనదారులకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు, కరపత్రాల పంపిణీకి పోలీసులు నిర్ణయించారు. ఇక, శనివారం వరకు గడువు లభించినట్టు అయింది. ఆదివారం సెలవు దినం కావడంతో, తదుపరి సోమవారం నుంచి పోలీసుల తనిఖీలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు ఎక్కువే. దీంతో వాహనదారులు లైసెన్స్‌ల కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద క్యూ కట్టే పనిలో పడ్డారు. ఆర్టీఏ వద్ద క్యూ రాష్ట్రవ్యాప్తంగా వాహనదారులు లైసెన్స్‌లు, డూప్లికేట్ ఒరిజినల్స్ కోసం దరఖాస్తుల్ని హోరెత్తిస్తున్నారు. దీంతో ఆర్టీఏ కార్యాలయాల వద్ద క్యూ చాంతాడంతగా పెరిగింది. అలాగే, అక్కడి బ్రోకర్లకు పండుగే అన్నట్టుగా పరిస్థితి నెలకొంది. గత నెలాఖరులో డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ తప్పనిసరి అన్న ఉత్తర్వుల్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు 82 వేల మంది లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు చేసుకుని ఉండడం గమనార్హం. అలాగే, లక్ష మంది రెన్యూవల్‌కు, మూడు వేల మంది వరకు డూప్లికేట్ ఒరిజినల్ లైసెన్స్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. జూన్, జూలై నెలల్లో 60 నుంచి 70 వేలలోపు దరఖాస్తులు లైసెన్స్‌లు, రెన్యూవల్స్ కోసం రాగా, ప్రస్తుతం సంఖ్య పెరగడం గమనించాల్సిన విషయం. ఇక, చెన్నైలోని 14 ఆర్టీఏ కార్యాలయాల వద్ద ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో వాహనదారులు బారులు తీరడంతో ఆ పరిసరాలు కిటకిటలాడాయి. బ్రోకర్లు తామంటే తాము త్వరితగతిన ఇప్పిస్తామంటూ వాహన చోదకుల ముందు వాలిపోయారు. -
ప్రతి పదిమందిలో ఆరుగురు వాళ్లే..
న్యూఢిల్లీ: భారతదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవడం చాలా సులభం. దేశంలో ప్రతి 10మందిలో ఆరుగురు డ్రైవింగ్ పరీక్ష ఎదుర్కోకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందుతున్నారు. దేశంలో మెట్రో నగరాలతోపాటు, అత్యధిక వాహన రద్దీ ఉన్న నగరాల్లో ఈ సంఖ్య మరీ ఎక్కువగా ఉందని ఓ సర్వే సంస్థ తెలిపింది. దేశంలో ఆగ్రాలో కేవలం 12శాతం మంది మాత్రమే నిజాయితీగా లైసెన్స్‌ను తీసుకుంటున్నారు. మిగతా 88శాతం అక్రమంగా లంచాల ద్వారా పొందుతున్నారు. జైపూర్‌లో 72శాతం, గౌహతిలో 64శాతం, ఢిల్లీలో 54శాతం, ముంబై నగరంలో 50 శాతం మంది. ఇలా అక్రమంగా లైసెన్స్ పొందుతున్నారు. సేవ్ లైఫ్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలో మెత్తం 997 రీజనల్ ట్రాన్సపోర్ట్ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతి ఏడాది సుమారు 1.15 కోట్ల రెన్యువల్, కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తున్నాయి. ప్రతి కార్యాలయంలో ప్రతిరోజు సుమారు 40 నుంచి 130 వరకూ మంజూరు చేస్తున్నాయని సర్వేలో తేలింది. ఆర్టీఎ కార్యాలయాలు అన్నీ అవినీతితో నిండిపోయాయని వెల్లడించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక అధికారి రోజుకు 15 నుంచి 20 మాత్రమే జారీ చేయాలి. కానీ 130-150 లైసెన్స్‌లను జారీ చేస్తున్నారు. దీంతో నైపుణ్యంలేని డ్రైవర్లు రోడ్లపైకి వచ్చి ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. దేశంలో 80శాతం మంది రోడ్డు సురక్షితం కాదని, 82 శాతం మంది పాదాచారులు రోడ్డు దాటడం పట్ల అభద్రతా భావంతో ఉన్నారు. -
కొత్త జిల్లాల్లోనే ఆర్టీఏ స్లాట్ల బుకింగ్
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో కొత్త కార్యాలయాల ఏర్పాటుపై రవాణా శాఖ దృష్టి సారించింది. ప్రస్తుతం ఆర్టీఏ సేవలన్నీ ఆన్లైన్ ద్వారానే అందిస్తున్నందున వినియోగదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసి సేవలు పొందే తేదీ (స్లాట్) బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం అవసరమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. దీనికోసం కొత్త స్లాట్లను ఆయా కొత్త జిల్లాలకే బదిలీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 11 వరకు భవిష్యత్తు తేదీల కోసం బుక్ చేసుకున్న స్లాట్లను కొత్త జిల్లాలకు బదిలీ చేయాలని నిర్ణయించారు. అంటే.. 12వ తేదీ నుంచి కొత్త జిల్లాల వారు తమ సేవలను కొత్త జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల ద్వారానే పొందాల్సి ఉంటుంది. యథావిధిగా కొనసాగే పాత జిల్లాల వారు మాత్రం ప్రస్తుత కార్యాలయాల్లోనే సేవలు పొందుతారు. కొత్త జిల్లాకు చెందిన వారెవరైనా నిర్ధారిత తేదీన స్లాట్ పొందలేకపోతే వారు మరో రోజు దాన్ని పొందే వెసులుబాటు కల్పించారు. కార్యాలయాలు, స్లాట్లు, మారితే కొత్త తేదీలు.. తదితర వివరాలను ఎప్పటికప్పుడు రిజిస్టర్ చేసిన సెల్‌ఫోన్‌కు మెసేజ్ రూపంలో తెలుపుతామని అధికారులు పేర్కొంటున్నారు. -
‘ఉత్త’ర్వు... కసరత్తు కరువు..!
♦ గందరగోళంగా నంబర్ ప్లేట్ల వ్యవహారం ♦ జీవో ఇచ్చి పదిరోజులైనా ఖరారు కాని విధివిధానాలు ♦ ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ వాహనదారుల ప్రదక్షిణలు ♦ తమకే స్పష్టత లేదంటూ తిప్పిపంపుతున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ‘తాళం వేశా.. కానీ గొళ్లెం మరిచా..’ అన్నట్టు తయారైంది టీఎస్ సీరీస్‌లోకి వాహనాల నంబర్ ప్లేట్ల వ్యవహారం. ఏదైనా జీవో జారీచేయాలంటే ముందుగా దాని అమలుపై కసరత్తు చేస్తారు. కానీ, ఏపీ సీరీస్‌తో రిజిస్టర్ అయిన వాహనాలను కొత్తగా అమల్లోకి వచ్చిన టీఎస్ సీరీస్‌లోకి మార్చే ముఖ్యమైన వ్యవహారంలో మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయింది. స్టేట్ కోడ్, జిల్లా కోడ్ మార్పును ఎలా అమలు చేయాలి, కొత్త ఆర్సీని ఉచితంగా ఇవ్వాలా, లేక ఫీజు వసూలు చేయాలా?... నేరుగా వాహనదారులు దరఖాస్తు చేసుకోవాలా- ఆన్లైన్లో దరఖాస్తు చేసే వెసులుబాటు కల్పించాలా, వాటికి కచ్చితంగా హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు అమర్చాలా వద్దా, అమరిస్తే ఫీజు ఎంత ఉండాలి... ఇలాంటి కసరత్తు లేకుండా రవాణా శాఖ పది రోజుల క్రితం హడావుడిగా ఉత్తర్వు జారీ చేసింది. దీంతో వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాలకు పోటెత్తుతున్నారు. కానీ... పై సందేహాలపై ప్రభుత్వం నుంచి అధికారులకు ఎలాంటి ఆదేశాలు, సూచనలు అందకపోవటంతో వారు వాహనదారులను తిప్పి పంపుతున్నారు. ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసిన తర్వాత పత్రికాముఖంగా ప్రకటిస్తామని చెపుతున్నారు. రవాణాశాఖ కార్యదర్శి, కమిషనర్ మూడు పర్యాయాలు దీనిపై భేటీ అయినా విధివిధానాలను మాత్రం తేల్చలేకపోయారు. ఆన్లైన్లో మార్పు చేసుకునే వెసులుబాటు... అయితే రాష్ట్రంలో ఏపీ సీరీస్ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనాలు లక్షల సంఖ్యలో ఉన్నందున వాటన్నింటినీ మార్చేందుకు వాహనదారులు నేరుగా కార్యాలయాలకు రావాలని చెబితే పని ఒత్తిడిని తట్టుకోవడం అసాధ్యమని అధికారులు తేల్చేశారు. దీంతో ఎవరికి వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు చేయాలని... ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న సమయంలోనే రవాణాశాఖ నిర్ణయించింది. ఆర్సీ కార్డుకు నిర్ధారించే ఫీజును ఈ-సేవలో చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఇప్పటికే ఓ ప్రణాళికను ఖరారు చేసి పెట్టుకున్నారు. అయితే ఫీజు వసూలు చేస్తే వాహనదారుల నుంచి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికలుండడం, జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు 30 ల క్షల వాహనాలున్నందున అది ఎన్నికలపై ప్రభావం చూపుతుందేమోన న్న సందేహాన్ని అధికారపార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. రుసుము లేకుండానే చూస్తామని ఇప్పటికే రెండుమూడు చోట్ల రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ, దానిని అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. -
నకిలీ పత్రాలు... దళారుల సిత్రాలు
బీమా లేకపోయినా వాహనాల బదిలీ {పహసనంగా ధ్రువపత్రాల పరిశీలన ఇదీ ఆర్టీఏ పని తీరు సిటీబ్యూరో: ఆర్టీఏ కార్యాలయాలు నకిలీ ధ్రువపత్రాలకు చిరునామాగా మారిపోతున్నాయి. డ్రైవింగ్ లెసైన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, వాహనాల బదిలీ వంటి కీలకమైన పౌర సేవల విషయంలో రవాణా అధికారులు శ్రద్ధ చూపడం లేదు. దీంతో ఏ వాహనాలు ఎవరి చేతుల్లోకి వెళ్తున్నాయో... ఎలాంటి వ్యక్తులు డ్రైవింగ్ లెసైన్సులు తీసుకుంటున్నారో తెలియని గందరగోళం నెలకొంది. సాక్షాత్తూ ఆ శాఖ అధికారుల తనిఖీల్లోనే ఈ విషయాలు వెల్లడి కావడం గమనార్హం. మహిళా భద్రత నేపథ్యంలో ఇటీవల ఆర్టీఏ పెద్ద ఎత్తున ఆటోలు, క్యాబ్‌ల తనిఖీలు చేపట్టింది. గ్రేటర్‌లోని లక్షా 30 వేల ఆటోలలో 80 శాతానికి పైగా వాహన యజమానుల వివరాలు కచ్చితంగా లేకపోవడం... నకిలీ ధ్రువపత్రాల ఆధారంగానే వేలాది ఆటోలు ఒకరి నుంచి మరొకరి చేతిలోకి మారిపోవడం, డ్రైవర్లకు, వాహన యజమానులకు మధ్య ఎలాంటి సంబంధం లేకపోవడం వంటివి ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. ఆటోలే కాకుండా ద్వితీయ శ్రేణి బైక్‌లు, కార్లు, ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ల బదిలీల్లోనూ నకిలీ పత్రాలే ఆధారమవుతున్నాయి. హైదరాబాద్ ఆర్టీఏ పరిధిలోని పశ్చిమ మండలం (మెహదీపట్నం), దక్షిణ మండలం (బహదూర్‌పురా)తో పాటు, రంగారెడ్డి ఆర్టీఏ పరిధిలోని కూకట్పల్లి వంటి ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లోనూ ధ్రువపత్రాల పరిశీలన ప్రహసనంగా మారిపోయింది. ఏజెంట్లు, దళారులు ఇచ్చే నకిలీ డాక్యుమెంట్ల ఆధారంగానే వాహన బదిలీలు, డ్రైవింగ్ లెసైన్సుల జారీ వంటి పౌర సేవలను అందిస్తున్నట్టు ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడైంది. తనిఖీల సంగతి అంతే... ఇలా వాహన యజమానుల ధ్రువీకరణ సరిగ్గా లేకపోవడంతో గత నెలలో ఆర్టీఏ చేపట్టిన ఆటోరిక్షాల నమోదు ప్రక్రియ వారం రోజుల్లోనే అటకెక్కింది. ఏ ఆటో ఎవరి చేతుల్లో ఉందో తెలుసుకొనేందుకు అన్ని చోట్లా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఆటో యజమానులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా వచ్చి తమ పేర్లు, ఫోన్ నెంబర్లు, అడ్రస్‌లు, డాక్యుమెంట్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మరోవైపు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. మహిళా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినఈ డ్రైవ్‌లో ఆర్టీఏ పూర్తిగా విఫలమైంది. ఆటో యజమానులు, డ్రైవర్ల కచ్చితమైన వివరాలను రాబట్టలేకపోవడం ఆర్టీఏ పౌర సేవల్లోని డొల్లతనాన్ని బట్టబయలు చేసింది. భద్రతకు ముప్పు తప్పుడు చిరునామాలు, పేర్లపై హైదరాబాద్‌లో డ్రైవింగ్ లెసైన్స్‌లు తీసుకొని, వాహనాలు కొనుగోలు చేసి ఉగ్రవాదులు విధ్వంసాలకు పాల్పడుతున్న ఉదంతాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. అయిఆన రవాణా శాఖ అధికారుల్లో చలనం కనిపించడం లేదు. మెహదీపట్నం కార్యాలయంలో ఇలాంటి బోగస్ పత్రాల ఆధారంగా అనేక పనులు జరిగిపోతున్నాయని ఆటో సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అక్కడ ఇన్స్యూరెన్స్ పత్రాలు లేకపోయినా వాహనాలను బదిలీ చేస్తున్నారని కొందరు ఆటో సంఘాల నేతలు కొద్దిరోజుల క్రితం ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకోవడం విశేషం. మరోవైపు వాహనదారుల పుట్టిన తేదీ, నివాస ధ్రువీకరణ పత్రాల్లో నకిలీలు ఎక్కువగా ఉండడంతో మైనారిటీ తీరని పిల్లల చేతుల్లోకి డ్రైవింగ్ లెసైన్సులు వెళ్తున్నాయి. ఇలాంటి వారు అపరిమిత వేగంతో వాహనాలు నడుపుతూ తర చుగా ప్రమాదాల బారిన పడుతున్నారు. నగరంతో సంబంధం లేని వ్యక్తులు, ఇక్కడ నివాసం కూడా ఉండని వాళ్లు డబ్బుతో తమకు కావలసిన ఆర్టీఏ పౌరసేవలను కొనుగోలు చేయగలుగుతున్నారు.