సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఖైరతాబాద్, మలక్‌పేట్, నాగోల్, అత్తాపూర్,మహబూబ్‌నగర్, సిద్ధిపేట ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. వాహనదారుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నారు. ఆర్డీఏ కార్యాలయాల్లో రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు.
ఆర్డీఏ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్లు ఆరోపణలు రావడంతో ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. చెక్‌పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు,లావాదేవీలపై ఏసీబీ విచారిస్తోంది. నకిలీ ఇన్స్యూరెన్సులు, ప్రైవేటు వ్యక్తుల వసూళ్లపై ఫిర్యాదులు అందుతున్న క్రమంలో ఏసీబీ డీఎస్పీ బృందం ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
మహబూబాబాద్‌లోని రవాణా శాఖ కార్యాలయంలో ఆరుగురు ఏజెంట్లు, రవాణా శాఖ అధికారి గౌస్ పాషా, డ్రైవర్ సుబ్బారావును అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఏజెంట్ల వద్ద 45,100 నగదు, డ్రైవర్ వద్ద 16,500 నగదు, నూతన లైసెన్స్‌లు, రెనివల్స్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కౌంటర్లలో పనిచేసే ఉద్యోగుల వద్ద డిక్లరేషన్ కన్నా ఎక్కువ నగదు లభ్యమైంది.
Comments
Please login to add a commentAdd a comment