ten lakh value
-
9999 @ రూ.10 లక్షలు
సాక్షి, సిటీబ్యూరో: ఆర్టీఏ ఫ్యాన్సీ నంబర్లపై వాహనదారులు మరోసారి తమ క్రేజ్‌ను చాటుకున్నారు. మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏలో ప్రత్యేక నంబర్లకు నిర్వహించిన వేలానికి వాహనదారుల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ప్రతి ఒక్కరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘టీఎస్ 09 ఈజడ్ 9999’ నంబర్ కోసం ఓ వ్యక్తి రూ.10.46 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నారు. బాగా డిమాండ్ ఉండే ‘ఆల్ నైన్స్కు’ రూ.10 లక్షలు చెల్లించడం ఇదే మొట్టమొదటిసారి. గతంలో ఈ నంబర్ కోసం రూ.9 లక్షల వరకు చెల్లించి దక్కించుకున్నావారు ఉన్నారు. కానీ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ తమ రూ.1.04 కోట్ల ఖరీదైన రేంజ్‌రోవర్ కారు కోసం ఆల్ నైన్స్ నంబర్‌ను వేలంలో రూ.10,46,722 చెల్లించి సొంతం చేసుకుంది. ‘టీఎస్ 09 ఎఫ్ఏ 0009’ నంబర్ కోసం గంగవరం పోర్టు సంస్థ రూ.5,01,000కు దక్కించుకుంది. రూ.1.41 కోట్ల ఖరీదైన బీఎండబ్ల్యూ కారు కోసం ఈ నంబర్ తీసుకున్నారు. అలాగే ‘టీఎస్ 09 ఎఫ్ఏ 0005’ నెంబర్ కోసం కూనం ఈశ్వరమ్మ రూ.2,51,000 చెల్లించారు. తమ వోల్వో ఎక్స్‌సి కారు కోసం ఈ నెంబర్ తీసుకున్నారు. ప్రత్యేక నెంబర్లకు మంగళవారం నిర్వహించిన వేలం పాటల్లో ఆర్టీఏకు మొత్తం రూ.26,55,243 లభించినట్లు ఖైరతాబాద్ ప్రాంతీయ రవాణా అధికారి సి.రమేష్ తెలిపారు. -
అగ్నిప్రమాదం: రూ.10 లక్షల నష్టం
సాక్షి, అమలాపురం: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి గ్రామంలో అగ్నిప్రమాదం జరిగింది. స్థానిక శివాలయం వద్ద పది ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదం జరగడానికి కారణం తెలియరాలేదు. పది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. -
బల్లిపర్రులో నాలుగు పూరిళ్లు దగ్ధం
బల్లిపర్రు (గన్నవరం రూరల్) : తెంపల్లె శివారు గ్రామం బల్లిపర్రులో బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన లోయ జేజేరావు, సాంబశివరావు, మురళీకృష్ణ గృహాలతో పాటు సాంబశివరావుకు చెందిన గేదెల పాక మంటల్లో కాలిపోయింది. జేజేరావు ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించటంతో అతని తలభాగం కాలినట్లు స్థానికులు చెప్పారు. మంటల్లో చిక్కుకున్న జేజేరావును బంధువులు బయటకు తీసుకువచ్చారు. గాయపడిన జేజేరావును చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మూడు కుటుంబాలు కట్టుబట్టలతో మిగిలాయి. జేజేరావు ఇంట్లో రూ.లక్ష నగదు, 4 కాసుల బంగారం, దస్తావేజులు, సాంబశివరావు ఇంట్లో రూ.20 వేల నగదు, దస్తావేజులు, రెండు కాసుల బంగారం, మురళీకృష్ణ ఇంట్లో 4.5 ఎకరాలకు సంబంధించిన దస్తావేజులు, 2,500 నగదు, బంగారు ఉంగరాలు, దుస్తులు తదితరాలన్నీ మంటల్లో కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో జేజేరావు ఇంట్లోని గ్యాస్ సిలిండరు పేలిందని గ్రామస్తులు చెప్పారు. జేజేరావు ఇంటి నుంచి ఎగసిపడిన మంటలు గ్రామస్తులు అప్రమత్తమయ్యేలోపు మిగిలిన ఇళ్లను చుట్టుముట్టాయి. గన్నవరం అగ్ని మాపక శకటం వచ్చి మంటలను అదుపు చేసింది. ఇదే ప్రమాదంలో సమీపంలోని వీర్ల సీతారామయ్య ఇంటి పైకప్పుకు నిప్పు అంటుకోగా గ్రామస్తులు పైకప్పు తాటి ఆకులను పీకేశారు. సంఘటన స్థలాన్ని సర్పంచ్ నిమ్మకూరి విజయ్‌కుమార్, వీఆర్వో వెంకటేశ్వరరావు తదితరులు సందర్శించారు. ప్రమాద నష్టం రూ.10 లక్షలు ఉంటుందని గ్రామస్తులు చెప్పారు.