స్టాళ్లను పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి, సందీప్ కుమార్ సుల్తానియా
ఖైరతాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. పేదరిక నిర్మూలన సంస్థ ‘సెర్ప్’ ఆధ్వర్యంలో గురువారం నెక్లెస్‌రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన సరస్ –2022 ఎగ్జిబిషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి మండలంలో, జిల్లా కేంద్రాలలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసి మహిళల ఉత్పత్తులను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ నెల 28 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 32 జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం 300 స్టాల్స్‌ను ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment