
శివకుమార్(ఫైల్)
సాక్షి, ఖైరతాబాద్: అర్ధరాత్రి అందరూ నిద్రించిన సమయంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ డివిజన్ ఇందిరానగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసముండే కె.శివకుమార్(30) ప్రైవేటు ఉద్యోగి. ఆదివారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పెద్ద కుమారుడు విషాల్ నీళ్లు తాగేందుకు లేచి చూడగా మద్య గదిలో చీరతో ఉరివేసుకొని ఉండటంతో వెంటనే కుటుంబ సభ్యులతో కలిసి కిందకు దింపి చూడగా అప్పటికే మృతిచెందాడు.
మృతుడు చనిపోయే ముందు ‘నేను చనిపోతున్నా.. నా చావుకు ఎవ్వరూ కారణం కాదు..’ అని సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ పంపి మృతిచెందినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడి చెల్లెలు శ్రీలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.