
సాక్షి,హైదరాబాద్: ఏం జరిగిందో ఏమోగానీ నిండు నూరేళ్లు తోడుగా కలిసి ఉంటానని చెప్పిన భర్తే చివరికి ఆమె పాలిట యముడిగా మారాడు, ఆపై తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అస్సాం రాష్ట్రానికి చెందిన మహానంద బిశ్వాస్ (24), పంప సర్కార్ (22) జీవనోపాధి కోసం నగరానికి వచ్చి ప్రేమ్ నగర్ లో నివాసం ఉంటూ జీవీకే మాల్ లో సెక్యూరిటీ గార్డ్ గా విధులు నిర్వహిస్తున్నారు.
మూడు రోజులుగా భార్య భర్తల మధ్య తగాదాలు జరుగుతుండగా నిన్న(సోమవారం) మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో భార్యను నీళ్లతో ఉన్న బకెట్లో ముంచి హత్య చేసి అనంతరం సోమవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు కిందపడి మృతిచెందాడు. రైల్వే పోలీసులు గమనించి మృతదేహాన్ని పోస్టమార్టం తరలించే సమయంలో అతని వద్ద ఉన్న చిన్న డైరీలో భార్యను చంపి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రాసుకున్నాడు. దీంతో నాంపల్లి రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు పంజాగుట్ట పోలీసులు ప్రేమ్ నగర్ లోని వారి నివాసం ఉంటున్న గదికి తాళం వేసి ఉండగా తాళాలు పగలగొట్టి భార్య మృతదేహానికి పోస్టమార్టం జరిపించారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి పూర్తిస్థాయిలో వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment