కరీంనగర్ : కరీంనగర్ జిల్లా జగిత్యాల ఆర్టీఏ కార్యాలయంలో శుక్రవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవింగ్ టెస్ట్ చేస్తుండగా కార్యాలయంలోకి వచ్చిన ప్రజలుపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను పట్టణంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆర్టీఏ కార్యాలయానికి చేరుకుని... జరిగిన ఘటనపై విచారిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.