
ఆర్టీఏలో బస్సులకు ఫిట్‌నెస్ పరీక్షలు
విద్యాసంవత్సరం ఆరంభం కానున్న నేపథ్యంలో వరంగల్ ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో బుధవారం ఫిట్‌నెస్ పరీక్షల ప్రక్రియ జోరందుకుంది...
- స్కూల్ బస్సులతో కిటకిటలాడిన ఆర్టీఏ కార్యాలయం
- ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న బస్సులకే ఫిట్‌నెస్‌లు
ఖిలావరంగల్ : విద్యాసంవత్సరం ఆరంభం కానున్న నేపథ్యంలో వరంగల్ ప్రాంతీయ రవాణాశాఖ కార్యాలయంలో బుధవారం ఫిట్‌నెస్ పరీక్షల ప్రక్రియ జోరందుకుంది. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న బస్సులకే ఫిట్‌నెస్ పరీక్షలు కొనసాగుతున్నాయి. దీంతో పెద్దఎత్తున విద్యాసంస్థల బస్సులు రావడంతో ఆర్టీఏ కార్యాలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఈ నెల 15తోనే ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల ఫిట్‌నెస్ పరీక్షల కాలపరిమితి ముగిసింది.. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశ పెట్టిన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానంతో బస్సుల వివరాలు. బస్సుల డ్రైవర్, అటెం డెంట్, విద్యాసంస్థల వివరాలతోపాటు విద్యార్థుల వివరాలు రూట్‌మ్యాప్‌తో కూడిన వివరాలతో నమోదు చేసి ఆర్టీఏ కార్యాలయానికి చేరుకున్న బస్సులకు ఎంవీఐలు ఫిట్‌నెస్ పరీక్షలు చేసి సర్టిఫికెట్లు అందజేస్తున్నారు.
జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల యజమానులు పోటాపోటీగా ముందుకు రావడంతో ఆర్టీఏ కార్యాలయంలో సందడి నెలకొంది. ఈ సందర్భంగా వరంగల్ రవాణాశాఖ అధికారి మాధవరావు మాట్లాడు తూ జిల్లాలో మొత్తం 1656 పైచిలుకు బస్సులు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు బస్సు క ండీషన్‌ను బట్టి సుమారు 56 బస్సులకు ఫిట్‌నెస్ ధ్రువీకరణ పత్రాలను అందజేసినట్లు తెలిపారు. జూన్ 31 తర్వాత ఫిట్‌నెస్ పరీక్షలు లేని బస్సులను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.