సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రం... కొత్త సిరీస్... కొత్త ఫ్యాన్సీ నంబర్లు... వురింకేం.. ఈ కొత్తదనాన్ని కొల్లగొట్టేందుకు వాహనదారు లు క్యూ కట్టారు. నచ్చిన నంబర్ల కోసం పోటీపడ్డారు. లక్షలు వెచ్చించడానికీ వెనకాడకుండా ఫ్యాన్సీ నంబర్లపై క్రేజ్‌ను చాటుకున్నారు. గురువారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో నిర్వహించిన వేలం పాటల్లో పలు నంబర్లు రవాణాశాఖకు కాసులు కురిపించాయి.‘టీఎస్ 09 ఈఏ 3456’ అనే రైజింగ్ నంబర్ కోసం పీవీఎస్ రాజు అనే వాహనదారుడు రూ.2.70 లక్షలు చెల్లించారు. రూ.41.23 లక్షల ఖరీదైన తన ఆడి కారు కోసం ఈ నంబర్‌ను సొంతం చేసుకున్నారు.
అలాగే బయోలాజికల్ ఈ లిమిటెడ్ అనే సంస్థ తమ కారు కోసం ‘టీఎస్ 09 ఈఏ 3366’ నంబర్‌కు రూ.80 వేలు చెల్లించింది. జి.రాజు సుధీర్ తన రూ.9.69 లక్షల ఖరీదైన ఫోర్డ్ ఇండియా వాహనం కోసం ‘టీఎస్ 09 ఈఏ 3339 ’ నంబర్‌ను రూ.35,100 చెల్లించి సొంతం చేసుకున్నారు. గురువారం ఒక్కరోజే ఫ్యాన్సీ నంబర్ల ద్వారా రూ.6 లక్షల ఆదాయం లభించినట్లు ప్రాంతీయ రవాణా అధికారి జీపీఎన్ ప్రసాద్ తెలిపారు.
కాసులు కురిపించిన ‘కొత్త’ నంబర్లు
Published Fri, Jun 27 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM
Advertisement
Advertisement