ఖమ్మం: ఆంధ్రప్రదేశ్కు చెందని టూరిస్టులు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఆర్టీఏ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం ఆందోళనకు దిగారు. సీజ్ చేసిన బస్సును తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వివరాలు.. భద్రాచలంలోని శ్రీరాముల వారిని దర్శించుకోవడానికి చిత్తూరు, రాజమండ్రి నుంచి వచ్చిన భక్తులతో కూడిన బస్సు శుక్రవారం సాయంత్రం భద్రాచలం పరిసర ప్రాంతాలకు చేరుకుంది.
బస్సు డ్రైవర్ వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అవసరమైన పర్మిట్ లేకపోవడంతో.. బస్సును తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద ఆపి.. అక్కడినుంచి ఆటోలో స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి బస్సు వద్దకు చేరుకునే సరికి భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఆ బస్సును సీజ్ చేశారు. దీంతో రాత్రి నుంచి తీవ్ర అవస్థలు ఎదుర్కొటోన్న భక్తులు.. శనివారం ఉదయం ఆర్టీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
భద్రాచలంలో ఏపీ టూరిస్టుల ధర్నా
Published Sat, Jul 4 2015 10:42 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
Advertisement