bhadra chalam
-
‘కేసీఆర్ వెంటే.. కాంగ్రెస్‌లోకి వెళ్లను’
సాక్షి, భద్రాచలం: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ నెగ్గిన ఏకైక నియోజకవర్గం భద్రాచలం. ఇక్కడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి నెగ్గిన తెల్లం వెంకటరావు.. పార్టీ ఫిరాయించబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. పొంగులేటి అనుచరుడిగా ముద్రపడి ఉన్న తెల్లం వెంకట్రావు పార్టీ మారి స్వామి భక్తి చాటుకునేందుకు అడుగులు వేస్తున్నాడనేది ఆ ప్రచార సారాంశం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫొటో కూడా వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు నేరుగా స్పందించారు. ‘కాంగ్రెస్‌లో జాయిన్ అవుతారని సోషల్ మీడియాలో వైరలైన ఫోటోను తాను పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. తనను నమ్మి బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ గారికి రుణపడి ఉంటానని తెలిపారు. తన ప్రయాణం కేసీఆర్ గారితోనే ఉంటుంది’ అని తెల్లం స్పష్టం చేశారు. ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో గెలుపొందింది. ఫలితాలు వెలువడిన అనంతరం.. తెల్లం వెంకట్రావు పార్టీ మారి కాంగ్రెస్‌లోకి చేరిపోతున్నాడంటూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పొంగులేటిలతో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో దుమారం లేపింది. అయితే ఈ ప్రచారం తారాస్థాయికి చేరడంతో.. తెల్లం స్వయంగా స్పందిస్తూ ఖండించారు. ఇదీ చదవండి: మాకు నచ్చలే.. అందుకే ఓటేయ్యలే! -
భద్రాచలం వద్ద తగ్గిన వరద ఉధృతి
సాక్షి, హైదరాబాద్/భద్రాచలం/ధరూరు: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపినివ్వడంతో ఎగువ గోదావరిలో వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. భద్రాచలం వద్ద వరద ఉధృతి క్రమంగా తగ్గుతుండటంతో మూడో ప్రమాద హెచ్చరికను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్దకు ప్రవాహం 12,79,307 క్యూసెక్కులకు తగ్గింది. నీటిమట్టం 56 అడుగుల నుంచి 50.4 అడుగులకు తగ్గింది. ప్రస్తుతం అక్కడ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు ఆగిపోవడంతో గోదావరిలో వరద తగ్గుతోంది. మరోవైపు, శ్రీరాంసాగర్‌లోకి ప్రవాహం 8,100 క్యూసెక్కులకు పడిపోవడంతో ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ఎల్లంపల్లి వద్ద 44,354, పార్వతి బ్యారేజ్ వద్ద 30,150, సరస్వతి బ్యారేజ్ వద్ద 43,615 క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 5.71 లక్షలు, తుపాకులగూడెం బ్యారేజ్ నుంచి 9.15 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. శ్రీరామ్ సాగర్, కడెం ప్రాజెక్టుల నుంచి ప్రవాహం తక్కువగా ఉండటంతో భద్రాచలం వద్ద గోదావరి వరద సోమవారం మరింతగా తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. జూరాలలో..: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఉదయం 7 గంటలకు 1,58,655 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. 9 గంటల వరకు 37 వేలకు తగ్గడంతో 25 క్రస్టు గేట్లనూ మూసివేశారు. మళ్లీ రాత్రి 8 గంటలకు 68,500 క్యూసెక్కులకు వరద పెరగడంతో 6 గేట్లను తెరిచి 23,184 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. జూరాల నుంచి విద్యుదుత్పత్తి, గేట్ల ద్వారా కలిపి 64,474 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 846.90 అడుగుల వద్ద 73.6744 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఏపీ సంబంధించిన ఒక విగ్రహాన్ని త్వరలోనే అప్పగిస్తాం: కిషన్‌రెడ్డి
సాక్షి, ఢిల్లీ: దక్షిణ అయోధ్య భద్రాచలంను రామాయణ సర్క్యూట్లో చేరుస్తున్నామని కేంద్ర పర్యాటక మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. భద్రాచలం వద్ద భక్తుల మౌలిక సౌకర్యాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేస్తామని అన్నారు. భద్రాచలం విషయంపై స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైల్వే శాఖతో మాట్లాడారని తెలిపారు. రామాయణ సర్క్యూట్లో ఏపీలోని అంజనాద్రిని చేర్చెందుకు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ప్రతిపాదనను తమ ముందుకు వస్తే పరిశీలిస్తామని తెలిపారు. అలంపూర్ జోగులాంబ దేవాలయ అభివృద్ధికి రూ.35 కోట్ల మంజూరు చేశామని తెలిపారు. వందల ఏళ్ల కింద దేశం నుంచి కెనడా తరలిపోయిన అన్నపూర్ణ విగ్రహాన్ని యూపి ప్రభుత్వానికి అప్పగించామని పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన ఒక విగ్రహాన్ని త్వరలోనే రాష్ట్రానికి విగ్రహం ఇస్తామని చెప్పారు. వందల ఏళ్ల కిందట దేశం నుంచి అనేక విగ్రహాలు దేశం నుంచి బయటకు వెళ్లిపోయాయని తెలిపారు. వాటిని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. -
భద్రాచలంలో అంగరంగ వైభవంగా శ్రీరామ పట్టాభిషేకం
-
ఈసారీ రాములోరి భక్తులకు నిరాశే..ఎందుకంటే!
భద్రాచలం: భద్రాద్రి సీతారాముల కల్యాణాన్ని స్వయంగా వీక్షించాలనుకునే భక్తులకు ఈసారి కూడా నిరాశే ఎదురుకానుంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఆంతరంగిక వేడుకగానే ఉత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భక్తులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించి సంతృప్తి చెందాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల జరిగిన యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొనటం, ఆ తర్వాత ఆలయ సిబ్బంది, అర్చకుల్లో కోవిడ్ కేసులు వెలుగు చూడటం తెలిసిందే. రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో మతాలకతీతంగా అన్ని బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించింది. వేడుకలు నిరాడంబరంగా, ఆగమశాస్త్ర పద్ధతులను అనుసరిస్తూ జరుపుతామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి వెల్లడించారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా అర్చకులు, వేదపండితులు, అధికారులు, పోలీసులు, ముత్యాల తలంబ్రాలు సమర్పించే ప్రభుత్వ ప్రతినిధులు మినహా సాధారణ భక్తులకు అనుమతి ఉండే అవకాశం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని విధించిన ఈ ఆంక్షలకు భక్తులు కూడా సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులెవరూ భద్రాచలం రావద్దని, ఇప్పటికే కల్యాణ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు డబ్బు వాపస్ చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌కుమార్, ఖమ్మం జిల్లా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో ఫోన్లో చర్చించారు. ఇతర దేవాలయాల్లోనూ భక్తులు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూనే దర్శనాలు చేసుకోవాలని కోరారు. దేవాలయాలకు వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని కోరారు. అన్ని మతాల పండుగల విషయంలో కోవిడ్ నిబంధనలు అమలులో ఉంటాయని వెల్లడించారు. శ్రీరామనవమి వేడుకలకు శ్రీకారం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవ స్థానంలో ఆదివారం స్వామివారి పెళ్లి పనులకు శ్రీకారం చుట్టారు. చిత్రకూట మండపంలో ప్రత్యేకపూజలు చేశారు. ఆ తర్వాత కల్యాణంలో పాల్గొనే రుత్వికులు, వారి సతీమణులు పెళ్లి పనులకు అవసరమైన పసుపు దంచారు. అనంతరం పసుపు, అత్తరు, ఇతర సుగంధద్రవ్యాలు కలిపి తలంబ్రాలను తయారు చేశారు. ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి డోలోత్సవం, వసంతోత్సవాలను వైభవంగా జరిపించారు. కాగా, కరోనా నిబంధనల నేపథ్యంలో ఈ ఏడాది కూడా స్వామివారి కల్యాణ వేడుకలను అంతరాలయంలోనే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో భక్తులు నిరాశకు లోనవుతున్నారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ..
సాక్షి, భద్రాచలం(ఖమ్మం) : ఆర్టీసీ ఇన్‌గేట్ సమీపంలో బస్‌ను లారీ ఢీకొట్టిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకొంది. భద్రాచలం డిపోకు చెందిన టీఎస్ 28జెడ్ 0058 నంబరు గల ఆర్టీసీ డీలక్స్ బస్ విజయవాడ నుంచి భద్రాచలం బస్టాండ్‌లోకి వస్తున్నది. బస్ ఇన్ గేట్లోకి ప్రవేశించే సమయంలో బస్ వెనకభాగాన్ని వెనుక నుంచి లారీ బలంగా ఢీకొన్నది. ఇదే సమయంలో అంబేడ్కర్ సెంటర్ నుంచి బ్రిడ్జిరోడ్డు వైపు రెండు లారీలు ఒకదాని వెనక మరొకటి వేగంగా వస్తున్నాయి. ఇదేక్రమంలో బస్టాండ్‌లోకి బస్ ప్రవేశిస్తుండటంతో లారీ డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆ లారీ వెనుకనే వస్తున్న లారీ డ్రైవర్ కూడా సడన్ బ్రేక్ వేశాడు. ఆ సమయంలో వర్షం కురుస్తున్నందున సడన్ బ్రేక్ వేయడంతో లారీలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. దీంతో ముందు లారీ ఆర్టీసీ బస్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్‌లో ప్రయాణికులెవరూ లేక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 0042 లారీ డ్రైవర్‌కు మాత్రమే స్వల్ప గాయాలు అయ్యాయి. ఆర్టీసీ అధికారులు అక్కడకు చేరుకొని బస్‌కు రూ.10 వేల ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఆటో బోల్తా..10 మందికి గాయాలు అశ్వారావుపేటరూరల్: అదుపుతప్పి ఆటో బోల్తా పడి పది మందికి గాయాలైన సంఘటన ఆదివారం మండలంలో జరిగింది. ఖమ్మం జిల్లా వీఎం బంజరకు చెందిన భక్తులు అశ్వారావుపేట మండలంలోని గోగులపుడి అటవీ ప్రాంతంలోగల శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకొని తిరిగి ఆటోలో వస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని పాత కన్నాయిగూడెం–కొత్త కన్నాయిగూడెం గ్రామాల మధ్యలో గల మూల మలుపు వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడిపోయింది. దాంతో ఆటోలో ప్రయాణిస్తున్న వీఎం బంజర మండలం ఉప్పలచలక గ్రామానికి చెందిన లింగపోగు వెంకటేశ్వరరావుతో పాటు, అదే ప్రాంతానికి చెందిన చిల్లముంత రామకృష్ణ, చిల్లముంత వెంకటేశ్వరరావు, చిల్లముంత జమలయ్య, జొన్నలగడ్డ రవితోపాటు, ఆటో డ్రైవర్ కొత్తపల్లి శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. వీరితోపాటు మరో నలుగురికి స్వల్ప గాయాలు కాగా 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించగా వైద్యులు చికిత్స నిర్వహించారు. వీరిలో లింగపోగు వెంకటేశ్వరరావుకు ఎడమ చేతికి తీవ్ర గాయాలు కాగా, చిల్లముంత రామకృష్ణ తలకు బలమైన గాయం అయింది. మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. సమా చారం అందుకున్న స్థానిక పోలీసులు వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కూసుమంచిలో ట్రాలీ ఆటో బోల్తా.. కూసుమంచి: లోక్యాతండా సమీపంలో కూలీలతో వెళుతున్న ట్రాలీ ఆటో బోల్తా పడిన ఘటన ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ మండల మాధాపురం గ్రామానికి చెందిన కూలీలు పనుల నిమిత్తం కూసుమంచి వస్తున్న క్రమంలో ట్రాలీ ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో ముగ్గురు కూలీలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని పోలీసులు తెలిపారు. -
నాలుగేళ్లుగా నత్తనడకే..!
భద్రాచలంటౌన్: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో గోదావరి నదిపై రెండో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించి నాలుగేళ్లు కావస్తున్నా నేటికీ నత్తనడకనే సాగుతున్నాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భద్రాచలానికి రవాణా సౌకర్యాలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. దేశం నలుమూలల నుంచి భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు నిత్యం ఎంతోమంది భక్తులు వస్తుంటారు. వారికి ఇబ్బంది కలుగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గోదావరి నదిపై ప్రస్తుతం ఉన్న పాత బ్రిడ్జిని ఆనుకునే కొత్త వంతెన నిర్మిస్తున్నారు. అయితే పనుల్లో తీవ్ర జాప్యం జరగడంతో నాలుగేళ్లు కావస్తున్నా ఇంకా పిల్లర్ల నిర్మాణమే పూర్తి కాలేదు. 1964లో గోదావరిపై మొదట వారధి నిర్మించారు. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడి శా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల రాకపోకలకు భద్రాచలం కీలకంగా మారింది. దీంతో పెరుగుతున్న వాహనాల రద్దీ దృష్ట్యా రెండో వంతెన నిర్మించాలని ప్రభుత్వం యోచించింది. 2015లో శంకుస్థాపన.. ఈ బ్రిడ్జి నిర్మాణ పనులకు 2015 ఏప్రిల్ 1న కేంద్రమంతి నితిన్ గడ్కరీ, అప్పటి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలసి శంకుస్థాపన చేశారు. రూ.90 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు తయారు చేయగా, రూ.65 కోట్లకు ఓ కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఉన్న గోదావరి వంతెనకు సమానంగా దాని పక్కనే 36 పిల్లర్లతో పనులు చేపట్టారు. ఇంకా కొన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తి కాలేదు. గోదావరిలో నీరు ఉండడంతో పనులకు ఆటంకం కలుగుతోంది. నిర్మాణం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు గోదావరికి మూడుసార్లు వరదలు వచ్చాయి. కాగా సాంకేతిక సమస్య సైతం జాప్యానికి కారణమవుతోంది. సారపాక వైపు నుంచి గోదావరి నదిపై నిర్మించిన రెండు పిల్లర్లను సాంకేతిక సమస్యలతో కూల్చివేశారు. అయితే ఈ మార్గంలో పిల్లర్ల నిర్మాణ పనులు ప్రస్తుతం కొంత పురోగతిలో ఉ న్నప్పటికీ.. భద్రాచలం నుంచి ప్రారంభించిన పిల్లర్ల నిర్మాణం లో మాత్రం తీవ్ర జాప్యం నెలకొంది. ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల బాధ్యతా రాహిత్యంతో ప్రయాణీకులకు క ష్టాలు తప్పడం లేదు. ఇక్కడ కొ న్ని పిల్లర్లు ఇంకా పునాది దశలో నే ఉన్నాయి. రెండో వంతెన పనులను నేషనల్ హైవేస్ ద్వారా కేంద్రప్రభుత్వం పనులు చేపడుతున్నందున జాప్యం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. పూర్తయిన పిల్లర్లపై ట్రాక్ బెడ్ పనులు... సారపాక నుంచి భద్రాచలం వైపు రెండో వంతెన పనుల్లో 18 పిల్లర్లు పూర్తి కాగా, 11 పిల్లర్లపై ట్రాక్ బెడ్ పనులు చేపట్టారు. అయితే భద్రాచలం నుంచి సారపాక వెళ్లే వంతెన పనుల్లోనే తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ ప్రాంతంలో రాళ్లు ఎక్కువగా ఉండడం కూడా పనుల జాప్యానికి కారణమవుతోంది. ప్రస్తుతం ఎండాకాలంలో గోదావరిలో నీటిమట్టం 4 నుంచి 5 అడుగుల మధ్యనే ఉంటుంది. జూన్‌లోపు పనులను వీలైనంత వరకు పూర్తి చేస్తే బాగుంటుందని స్థానికులు అంటున్నారు. జూలై నుంచి అక్టోబర్ వరకు వరదలు వచ్చే అవకాశం ఉంటుందని, అప్పుడు మళ్లీ జాప్యం జరుగుతుందని చెపుతున్నారు. పనుల వేగవంతానికి చర్యలు కొన్ని సాంకేతిక కారణాలతో వంతెన నిర్మాణంలో జాప్యం జరుగుతున్న మాట నిజమే. భద్రాచలం వైపు ఎక్కువగా రాళ్లు ఉండడం, ఈ ప్రాంతంలోనే ప్రవాహం ఉండడంతో పిల్లర్ల నిర్మాణం ఆలస్యమైంది. పనులు వేగంగా చేయాలని కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నాం. గతేడాది నుంచి కొంత వేగంగానే సాగుతున్నాయి. మరో ఏడాది గడువు పెంచిన నేపథ్యంలో ఈ వ్యవధిలోనే పనులు పూర్తయ్యేలా కృషి చేస్తాం. ఇప్పటికే రెండు భారీ క్రేన్లు కూడా తెప్పించాం. రెండు, మూడు నెలల్లో పనులు చాలా వరకు పూర్తవుతాయి. –శైలజ, నేషనల్ హైవే డీఈ -
ప్రారంభమైన వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరు గాంచిన భద్రగిరిలో వైకుంఠ ప్రయుక్త ఏకాదశి ఉత్సవాలు శనివారం వైభవోపేతంగా ప్రారంభమయ్యా యి. అధ్యయనోత్సవాల్లో భాగంగా పరివార దేవతల ను ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో వేంచేయింప జేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారిని మత్సా్య వతారంలో అలంకరించిన అర్చకులు బేడా మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ఆళ్వార్ల మధ్య స్వామి వారిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన గావించారు. అధ్యయనోత్సవాల నిర్వహణలో పాల్గొనే అర్చకులు, వేదపండితులు, ఇతర సిబ్బందికి దేవస్థానం తరఫున ఈఓ రమేశ్‌బాబు దీక్షా వస్త్రాలను అందజేశారు. స్వామివారితో పాటు పరివార దేవతలకు ప్రత్యేక అర్చనలు గావించా రు. అనంతరం వేద పండితులు చతుర్వేదాలను, దివ్య ప్రబంధాలను పఠించారు. ఆ తర్వాత మత్సా్యవతారంలో ఉన్న రామయ్యను గర్భగుడిలోకి తీసుకెళ్లి మూలమూర్తుల వద్ద కొద్దిసేపు ఉంచి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో స్వామి వారిని వేంచేయింపజేసి కోలాటా లు, భజనలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలు, భక్త జనసందోహం నడుమ గోదావరి తీరం వరకు ఊరే గింపుగా తీసుకెళ్లారు. అక్కడ పూజలు చేసిన తర్వాత తిరిగి కల్యాణమండపంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి వారిని భక్తుల సందర్శనార్థం వేంచేయింపజేశారు. మత్సా్యవతార రూపుడైన శ్రీసీతారామచంద్రస్వామి వారిని కనులారా తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు అర్చకులు ఆశీర్వచనాలు అందజేసి, స్వామివారి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆలయ వేదపండితులు మత్సా్యవతర రూపం విశిష్టతను వివరించారు. పురవీధుల్లో స్వామివారు... మిథిలా ప్రాంగణంలో పూజలు అందుకున్న శ్రీసీతారామచంద్రస్వామి వారిని అక్కడ నుంచి పల్లకిపై పురవీధుల్లో తిరువీధి సేవకు తీసుకెళ్లారు. మహిళా భక్తుల కోలాటాలతో రామ నామ సంకీర్తనలు ఆలపించగా, వేద విద్యార్థులు, వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తజనం తోడుగా స్వా మివారు పురవీధుల్లో ఊరేగారు. దారి పొడువునా భక్తులు స్వామివారికి మొక్కులు సమర్పించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం ఈఓ రమేశ్‌బాబు, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, ఏఈఓ శ్రావణ్ కుమార్, వేదపండితులు మురళీ కృష్ణమాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, డీఈ రవీందర్, ఈవోటు సీసీ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. నేడు కూర్మావతారం... సీతారామచంద్రస్వామి వారు ఆదివారం కూ ర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ‘ దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని చిలకించగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని, అమృతానికై క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మంధరగిరి మునిగిపోగా, దేవతలు, రాక్షసుల ప్రార్థనలతో శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మునిగిపోయిన మం ధర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పైకెత్తి సహాయపడ్డాడు. ఈ అవతారాన్ని దర్శించడం వల్ల శని గ్రహ సంబంధమైన దోషాలు తొలగుతాయి’ అని పండితులు చెబుతున్నారు. నేటి సాంస్కృతిక కార్యక్రమాలు... మిథిలా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భద్రాచలానికి చెందిన శ్రీరామ సేవాతరంగణి సరోజని బృందంచే భజన సంకీర్తన, ఖమ్మానికి చెందిన ఎల్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాయభారం హరికథా కాలక్షేపం ఉంటాయి. ఆ తర్వాత విజయవాడ జయరామ, సుధాకర్ వారిచే గాత్ర కచేరి, భద్రాచలానికి చెందిన అల్లం రమాదేవిచే భక్తి సంగీతం, మంగళగిరికి చెం దిన గోలి శ్రీలక్ష్మి వారిచే కూచిపూడి నృత్యం, హై దరాబాద్‌కు చెందిన సాయి దంషిక కూచిపూడి నృ త్యం, ఖమ్మం రాయప్రోలు అలేఖ్య బృందంచే కచేరి ప్రదర్శించనున్నారు. తర్వాత వనంవారి కృష్ణాపురం వనం శ్రీముఖి, రఘుమయిచే నాట్య ప్రదర్శన ఉంటుంది. హైదరాబాద్ జనత సేవా సమితి వారిచే భక్త రామదాసు నాటకం ఉంటుంది. పర్ణశాలలో పెబ్బేరుకు చెందిన హెచ్ఎం సుధాకర్‌చే శ్రీరామ పట్టాభిషేకం హరికథ ఉంటుంది. -
పులకించిన భద్రగిరి
భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి కల్యాణం సోమవారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. రామాలయ సమీపంలోని మిథిలా ప్రాంగణంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో జరిగిన ఈ వేడుకను కనులారా చూసిన భక్తులు పులకించిపోయారు. వేడుకలో భాగంగా మొదట గర్భగుడిలో అభిషేకం జరిపించారు. అక్కడ ధ్రువమూర్తులకు తొలుత కల్యాణం జరిపించారు. ఆ తర్వాత వేద పండితుల మంత్రోచ్ఛరణలు, ఆలయ ఆస్థాన విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా కల్యాణ మండపం వద్దకు తీసుకొచ్చారు. భక్త రామదాసు చేయించిన బంగారు నగలను ధరించిన శ్రీసీతారాముల వారు చూడముచ్చటగా కనిపించారు. ఉదయం 10 గంటల నుంచి ఆలయ వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా కల్యాణ తంతు నిర్వహించారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్న సుముహూర్తంలో జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ విగ్రహాల శిరస్సులపై ఉంచారు. భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో మాంగల్యధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం తలంబ్రాలు పోసే వేడుకను జరిపించారు. భద్రాద్రి క్షేత్ర మహత్మ్యం, శ్రీసీతారాముల కల్యాణ విశిష్టతను వేద పండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు భక్తులకు వివరించారు. మార్మోగిన రామనామస్మరణం శ్రీసీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాద్రికి తరలివచ్చారు. సుమారు 1.50 లక్షల మంది కల్యాణాన్ని తిలకించారని అధికారులు అంచనా వేస్తున్నారు. స్వామివారి కల్యాణ వేడుక తంతు జరుగుతున్నంత సేపూ మిథిలా ప్రాంగణం రామనామస్మరణంతో మార్మోగింది. ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి శ్రీసీతారాముల వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువస్త్రాలు తీసుకొస్తారని ప్రకటించినప్పటికీ.. చివరి క్షణాల్లో ఆయన పర్యటన రద్దయింది. కాగా, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున జేఈవో శ్రీనివాసరాజు శ్రీసీతారాముల వారికి పట్టువస్త్రాలను అందజేశారు. రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే సున్నం రాజయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు కల్యాణోత్సవాన్ని వీక్షించారు. స్వామివారికి కల్యాణం జరిగిన వేదికపైనే మంగళవారం పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థానం అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ప్రభాకర శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
‘లైన్’ క్లియర్..
సాక్షిప్రతినిధి, ఖమ్మం : భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయించడంతో మందకొడిగా సాగుతున్న భూసేకరణ పనులు ఇక వేగవంతం కానున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు రైల్వే శాఖ పరంగా ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తమ ఎంపీల ద్వారా విన్నవించుకున్నప్పటికీ.. ఈ ఒక్క ప్రాజెక్టుకు మాత్రమే నిధులు కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో రైల్వే లైన్ భూసేకరణకు రూ.120కోట్లు కేటాయించిన నేపథ్యంలో పనులు ఊపందుకోనున్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్ అనేక ప్రతిపాదనలు ఇచ్చారు. అయితే రైల్వే లైన్‌కు మినహా ఏ ఒక్కదానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. దశాబ్ద కాలంగా ఇటు కొత్తగూడెం, అటు సత్తుపల్లివాసులను రైల్వే లైన్ ఊరిస్తోంది. సింగరేణి సంస్థ లైన్ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు ముందుకొచ్చినా.. సర్వే పనులు ఆలస్యం కావడంతో పనులు పట్టాలెక్కని పరిస్థితి. గతంలో మంజూరు చేసిన రైల్వే లైన్ ప్రాజెక్ట్‌లో ఈ లైన్ ఉండటంతో కేంద్రం బడ్జెట్లో రూ.120కోట్లు మంజూరు చేసింది. సుమారు 53 కిలోమీటర్లు ఉండే మార్గంలో పెద్ద ఎత్తున భూములు సేకరించాల్సి ఉంది. అయితే కొత్త భూసేకరణ విధానం ప్రకారం ఆ నిధులు ఏ మేరకు సరిపోతాయనే అంశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉన్న నిధులతోనే భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. భూసేకరణ పూర్తయి.. పరిహారం చెల్లించే ప్రక్రియ కొలిక్కి వస్తే తప్ప నిర్మాణ పనులు ప్రారంభమయ్యే పరిస్థితి లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 2010–11 బడ్జెట్లో కేంద్ర రైల్వే శాఖ రైలు మార్గం నిర్మాణానికి అనుమతిచ్చింది. సుమారు రూ.337.50కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా సర్వే పనులు పూర్తి చేశారు. సత్తుపల్లి వరకు 53.25 కిలోమీటర్ల మేరకు ఎలక్ట్రికల్ లైన్లతో లైన్ నిర్మాణం జరగాల్సి ఉంది. భూసేకరణ కోసం రైల్వే శాఖ రూ.19.04కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా.. సింగరేణి సంస్థ రైల్వేకు రూ.318.64కోట్లు చెల్లించేందుకు అంగీకారం కుదిరింది. 2012, ఆగస్టులో సర్వే నిమిత్తం రూ.6.38కోట్లను రైల్వే శాఖకు సింగరేణి చెల్లించింది. లైన్ నిర్మాణం పూర్తయితే సింగరేణి సంస్థ ప్రతీ ఏడాది 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్లపాటు బొగ్గును రైలు మార్గంలో రవాణా చేసేందుకు రైల్వే శాఖతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే లైన్ నిర్మాణం భూసేకరణ కోసం కేంద్రం రూ.120కోట్లు కేటాయించింది. దీంతో పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. కాలయాపనతో పెరిగిన అంచనా వ్యయం తొలుత రూ.360కోట్లతో భద్రాచలం రోడ్–సత్తుపల్లి రైల్వే లైన్ నిర్మాణం చేపట్టాలని భావించారు. అయితే కాలయాపన కావడంతో ప్రాజెక్టు వ్యయం రెండింతలు పెరిగింది. ఈ నేపథ్యంలో నిర్మాణ వ్యయం తగ్గించుకునేందుకు 2015లో సింగరేణి సంస్థ రీ సర్వే కోసం రైట్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. సర్వే చేసిన రైట్స్ సంస్థ రూ.792కోట్ల అంచనాతో రూపొందించిన ప్రణాళికకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. భూసేకరణ, సర్వే, అటవీ శాఖ అనుమతుల కోసం సింగరేణి రూ.80కోట్ల నిధులు విడుదల చేసింది. రైలు మార్గానికి సర్వే పూర్తి కావడంతో భూసేకరణ పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఐదు స్టేషన్లు.. పెనుబల్లి జంక్షన్ ఈ మార్గంలో ఐదు స్టేషన్లతో పెనుబల్లి జంక్షన్‌గా ఏర్పాటు చేస్తున్నారు. 3.4 కిలోమీటర్ వద్ద సీతంపేట స్టేషన్, 22.8 కిలోమీటర్ వద్ద భావన్నపాలెం, 39.25 కిలోమీటర్ వద్ద చండ్రుగొండ స్టేషన్, 44 కిలోమీటర్ వద్ద పెనుబల్లి జంక్షన్, 53.2 కిలోమీటర్ వద్ద సత్తుపల్లి రోడ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే భూసార పరీక్షలు పూర్తి చేశారు. రైలు మార్గంలో ఉన్న చెరువులు, కుంటలు, వాగులపై వంతెనల నిర్మాణం కోసం నీటిపారుదల శాఖ అధికారులతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సత్తుపల్లి రోడ్ రైల్వేస్టేషన్‌ను కొత్త లంకపల్లి శివాలయం వెనుక ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల వరకు ఓపెన్‌కాస్టుకు వెళ్లే విధంగా లైన్ వేస్తున్నారు. కొత్త లంకపల్లి రాష్ట్రీయ రహదారిపై రైలు కోసం ఓవర్ బ్రిడ్జి కట్టేందుకు ప్రతిపాదనలు చేశారు. -
‘భద్రాద్రి’కి తుదిరూపు!
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరుకుంది. శ్రీరాముడు జన్మించిన విళంబినామ సంవత్సరం వచ్చే మార్చిలో నిర్వహించే శ్రీరామనవమికి ఎంతో ప్రత్యేకత ఉన్న దృష్ట్యా అదే రోజున భద్రాద్రి క్షేత్ర అభివృద్ధికి శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. చినజీయర్ సూచనలతో దేవాదాయశాఖ రూపశిల్పి ఆనందసాయి నేతృత్వంలో ఇప్పటికే మూడు నమూనాలను సిద్ధం చేశారు. ఆ నమూనాలను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళ్లనున్నారు. సీఎం ఆమోదంతో వచ్చే నెలలో పనులు ప్రారంభించే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. 65 ఎకరాల్లో ఆలయాభివృద్ధి భద్రాచలం ఆలయాభివృద్ధికి 65 ఎకరాల భూమి అవసరం ఉంటుందని జిల్లా అధికారులు ప్రాథమికంగా నివేదించారు. రామాలయం చుట్టూ 28 ఎకరాలు, అదే విధంగా కల్యాణ మండపం, దీనికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలు ఇలా మిగతా 37 ఎకరాలను రెండు చోట్ల సేకరించేలా నివేదికలో చూపించారు. రామదాసు కాలంలో నిర్మించిన గర్భగుడిని అలాగే ఉంచి, చుట్టూ రెండు ప్రాకారాలను శిల్పికళా శోభితంగా నిర్మించాలని డిజైన్‌లో పేర్కొన్నారు. నిత్య కల్యాణ మండపం, స్వామి వారి తిరువీధి సేవ కోసం మాడవీధులతో పాటు, భక్తులు ఆలయం చుట్టూ తిరిగేలా మరో దారిని కూడా ఏర్పాటు చేయాలని, ఆలయం నలువైపుల నుంచి స్వామి వారి దర్శనం చేసుకునేలా ద్వారాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. వేయికాళ్ల మండపం వేయికాళ్ల (శిల్పాలతో చెక్కిన వేయి ఫిల్లర్లు కలిగిన)మండప నిర్మాణానికి డిజైన్‌లో ప్రాధాన్యం కల్పించారు. శ్రీరామనవమి నాడు శ్రీసీతారాముల వారికి పెళ్లి వేడుక జరిగే కల్యాణ మండపం, దీనికి ఆనుకొని ఉన్న స్థలంలో వేయి కాళ్ల మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. వేయికాళ్ల మండపం అంతర్భాగంలోనే కల్యాణ మండపం కూడా ఉండేలా డిజైన్ తీర్చిదిద్దారు. ప్రస్తుతం అందుబాటులో కల్యాణ మండపంలో మొత్తంగా 35 వేల మంది శ్రీరామనవమి రోజున స్వామి వారి పెళ్లి వేడుకను ప్రత్యక్ష్యంగా తిలకిస్తున్నారు. భవిష్యత్‌లో 80 వేల మంది మండపంలో కూర్చొనేవిధంగా డిజైన్ తయారు చేశారు. 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం గోదావరి తీరంలో 108 అడుగుల ఎత్తైన అభయాంజనేయస్వామి వారి విగ్రహాన్ని నిర్మించేలా డిజైన్‌లో పొందుపరిచారు. రామాలయం నుంచి నేరుగా గోదావరి తీరం వరకూ నేరుగా వెళ్లేందుకు రహదారి నిర్మాణం చేపట్టనున్నారు. నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ? ఆలయాభివృద్ధిలో భాగంగా రామాలయం చుట్టూ ఉన్న వందకు పైగా ఇళ్లను కూల్చివేయాల్సి వస్తోంది. ఈ లెక్కన రామాలయం వెనుక ఉన్న జీయర్ మఠం నుంచి గోదావరి కరకట్ట వరకూ చుట్టు పక్కల ఇళ్లవారిని వేరే చోటకు తరలించాల్సి ఉంటుంది. భద్రాచలంలో ప్రభుత్వ స్థలం లేకపోవటంతో వీరికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారనేది చర్చనీయాంశమైంది. పట్టణానికి ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నంలో ఆలయానికి సంబంధించిన వెయ్యి ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. ఇవి రాష్ట్ర విభజనతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో వీరికి అక్కడ పునరావాసం కల్పించటం వల్ల వారిని వేరే రాష్ట్రంలోకి పంపించినట్లౌతుంది. ఇది పెద్ద సమస్యగా మారనుంది. ఈ ప్రాంత వాసుల డిమాండ్ మేరకు భద్రాచలానికి సమీపంలో ఉన్న ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణకు వస్తేనే ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసే క్రమంలోనే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని శ్రీరామ నవమికి ఆహ్వానించేలా ఆలోచన చేస్తుందనే ప్రచారం ఉంది. అంతా సిద్ధం చేశాం ఆలయాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శ్రీరామనవమికి శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. ఆ దిశగానే దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతితో ఏర్పాట్లు చేస్తున్నాం. మరోవైపు శ్రీరామనవమి ఉత్సవాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రభాకర శ్రీనివాస్, దేవస్థానం ఈఓ -
ఆలయం.. అద్భుతం
ములకలపల్లి : మండల పరిధిలోని మూకమామిడి ప్రాజెక్ట్ సమీపంలోని శ్రీవీరభద్ర లింగేశ్వరస్వామి దేవాలయం అద్భుత ఆలయంగా విరాజిల్లుతోంది. ప్రాజెక్ట్ సమీపంలోని పచ్చని కొండల సమీపంలో భాస్కరగట్టు మీద ఈ ఆలయం ఉంది. మూకమామిడి గ్రామానికి చెందిన శిగ వీరభద్రం, సక్కుబాయమ్మ దంపతులు గత ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, దాతల సహాయంతో ఆలయం నిర్మించారు. ప్రతీ ఏడాది శివరాత్రి, కార్తీకమాసం తదితర పవిత్ర సమయాల్లో అన్నదానం చేస్తున్నారు. నాగులచవితి పర్వదినాన పుట్టలో పాలుపోసేందుకు ఈ ప్రాంగణంలో పాముల పుట్టలు సైతం స్వయంగా ఆవిర్భవించడం గమనార్హం. అంతేకాకుండా ఆలయ సమీపంలో భద్రకాళి విగ్రహాన్ని సైతం ప్రతిష్ఠించారు. శివపార్వుతుల కల్యాణం శాస్రోక్తంగా నిర్వహించేందుకు పనులు పూర్తి చేశారు. 108 లింగాలు ప్రతిష్ఠించాలని.. ఎకరం విస్తీర్ణం ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో విడతల వారీగా 108 శివలింగాలు ప్రతిష్ఠించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 12 శక్తిపీఠాల మీద వాటిని ప్రతిష్ఠించేందుకు దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 50 విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు ఆలయ వ్యవస్థాకులు తెలిపారు. రూ.6 వేలు చెల్లిస్తే, ఆంధ్రాలోని పిడుగుళ్లరాళ్లలో ‘‘సానపట్టం’కల్గిన శివలింగాలు ప్రతిష్ఠించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
పాలు పొంగేదెప్పుడో..
భద్రాచలం : డబుల్ బెడ్ రూం ఇళ్లలో పాలు పొంగించేందుకు లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పటం లేదు. అన్ని హంగులతో జిల్లాలో 30 కాలనీల నిర్మాణం పూర్తయినా.. వీటిని ప్రారంభించేందుకు అమాత్యులకు తీరిక దొరకటం లేదు. జిల్లాలోని భద్రాచలం, కొత్తగూడెం, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాలతో పాటు, వైరాలోని జూలూరుపాడు మండలం (ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నందున)లో మొత్తం 43 చోట్ల మొదటి విడతలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఒక్కో నియోజకవర్గానికి 400 ఇళ్లు కేటాయించారు. మొదటి విడతలో 1298 ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించగా. ఇప్పటివరకు 1100 పూర్తయ్యాయి. 198 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తంగా 30 కాలనీలు నిర్మించి ప్రారంభోత్సవాలకు సిద్ధం చేశారు. కానీ జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వీటి ప్రారంభోత్సవాలకు సమయం కేటాయించకపోవటంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రారంభోత్సవాలే ఇలా సా..గుతుంటే తమకు ఇళ్లు ఎప్పుడు కేటాయిస్తారని లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముహూర్తం కుదిరేదెప్పడో... త్వరలో జరుగనున్న పంచాయతీ ఎన్నికల ముందు డబుల్ బెడ్రూం ఇళ్లు ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు తాత్సారం చేస్తున్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు దీనిని ఉపయోగించుకోవాలని చూస్తున్నారని సమాచారం. ఇందుకోసం పనుల్లో జాప్యం చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై వారు ఒత్తిడి తీసుకొస్తున్నారనే ప్రచారం సైతం ఉంది. ఏజెన్సీ కేంద్రమైన భద్రాచలంలో మొదటి విడతలో 88 ఇళ్లు కేటాయించగా, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. దసరాకు పాలు పొంగించేలా అధికారులు అంతా సిద్ధం చేసినప్పటికీ అనివార్య కారణాలతో వాయిదా పడింది. ముక్కోటి ఉత్సవాలకు ప్రభుత్వ పెద్దలు వస్తారని భావించి, ప్రారంభోత్సవం కోసం హడావిడిగా శిలాఫలకం ఏర్పాటు చేసినా.. ఎంపీటీసీ ఉప ఎన్నికల కోడ్‌తో అది కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. మౌలిక వసతులకు ఇబ్బందులే... రెండో విడత కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. దీంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ వ్యయం రూ.5.04 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో రూ.5.30 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.7 లక్షలు, కార్పొరేషన్ ప్రాంతాల్లో రూ.7.90 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నారు. మొదటి విడత ఇళ్లకు ఆయా కాలనీల్లో మౌలిక వసతుల కోసం ఒక్కో ఇంటికి అదనంగా రూ. 1.25 లక్షలు మంజూరు చేశారు. ఇంటి నిర్మాణ వ్యయంతో పాటు అదనంగా మంజూరైన రూ.1.25 లక్షలతో ఆయా కాలనీల్లో విద్యుత్, అంతర్గత రహదారులు, తాగునీటి సదుపాయం, డ్రైనేజీల వంటి మౌలిక వసతులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. కానీ రెండో విడత ఇళ్లకు మాత్రం మౌలిక వసతుల కల్పనకు స్థానికంగా అందుబాటులో ఉన్న నిధులను మాత్రమే వినియోగించుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది భవిష్యత్‌లో ఇబ్బందికరంగా మారుతుందని అధికారులు సైతం అంటున్నారు. రెండో విడతకు స్థలం సమస్య... రెండో విడతలో ఒక్కో నియోజకవర్గానికి 1000 ఇళ్ల చొప్పున మంజూరు చేసింది. త్వరలోనే జరిగే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు భారీగానే చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించకపోవటంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ శాఖకు మొత్తం 3 వేల ఇళ్ల నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. కొత్తగూడెం పట్టణంలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శా>ఖకు అప్పగించారు. కొన్ని చోట్ల ఆర్వీఎం, ఆర్అండ్బీ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షణలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. టీడబ్ల్యూ ఇంజనీరింగ్ శాఖకు అప్పగించిన 3000 ఇళ్లలో 2600 గృహాల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి, కాంట్రాక్టర్లకు అగ్రిమెంట్లు సైతం సిద్ధం చేశారు. కానీ జిల్లాలో దాదాపు సగం మండలాల్లో అవసరమైన స్థలాలు కేటాయించలేదు. రెండో విడతలో ఇప్పటివరకు భద్రాచలం మండలం మినహా జిల్లాలో మరెక్కడా పూర్తి స్థాయిలో స్థలాలు గుర్తించలేదు. బూర్గంపాడు, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో అయితే కనీసం ఒక్కచోటైనా పనులు ప్రారంభించాలని ఇంజనీరింగ్ అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నా.. రెవెన్యూ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయా మండలాల్లో నెలకొన్న సమస్యపై ఉన్నతాధికారులకు నివేదించేందుకు ఇంజనీరింగ్ శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. స్థలం సమస్యపై నివేదించాం రెండో విడత ఇండ్ల నిర్మాణానికి స్థలం కేటాయింపుల్లో సమస్య ఉన్న మాట వాస్తవమే. దీనిపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాము. మొదటిలోని ఇండ్లన్నింటినీ మార్చి నెలాఖరునాటికి పూర్తి చేస్తాం. ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లి ప్రారంభోత్సవాలు చేయిస్తాం. – శంకర్, గిరిజన సంక్షేమ ఈఈ -
బాలికల వసతి గృహాల్లో..
భద్రాచలం : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల స్థాయి సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టళ్లలో సమస్యలు గూడుకట్టుకున్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం హడావుడిగా వసతి గృహాలు ప్రారంభించినా.. మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 10 (బాలురు –5, బాలికలు–5) ఎస్ఎం హాస్టళ్లలో సుమారు 750 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఇందులో కొత్తగూడెం మినహా మిగతా ఎక్కడా పక్కా భవనాలు లేవు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 23 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు సైతం నిర్వహిస్తుండగా, వీటిలో 1615 మంది ఉంటున్నారు. వసతి గృహాల్లో చాలా చోట్ల సరైన వసతులు లేవు. ఈ సమస్యలను గుర్తించిన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు కేటాయించారు. ప్రధానంగా బాలికల వసతి గృహాల్లో అవసరమైన చోట్ల యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు రూ. 35.50 లక్షలు మంజూరు చేశారు. కానీ వాటిని సవ్యంగా వినియోగించక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరమ్మతుల పేరిట వసతి గృహాలకు పైపైన రంగులు వేసి నిధులు దుర్వినియోగం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పనులపై ‘సాక్షి’ పరిశీలన చేయగా, మరమ్మతుల్లో దాగి ఉన్న గమ్మత్తు వెలుగులోకి వచ్చింది. రూ.35.50 లక్షలతో పనులు... వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రీ మెట్రిక్ హాస్టళ్ల పరిధిలోనే ఎస్ఎం హాస్టళ్లను కూడా నిర్వహిస్తున్నందున, ఇక్కడ మౌలిక వసతులు మెరుగుపరిస్తే అందరికీ బాగుంటుందని భావించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల నివేదికల ఆధారంగా జిల్లాలోని ఏడు బాలికల వసతి గృహాల మరమ్మతుల కోసం రూ.35.50 లక్షలు మంజూరు చేశారు. అధికారులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం భద్రాచలం ఏ హాస్టల్‌కు రూ. 8.50 లక్షలు, బీ హాస్టల్‌కు రూ.4 లక్షలు, బూర్గంపాడుకు రూ.4.50 లక్షలు, మణుగూరుకు రూ.4.50 లక్షలు, పాల్వంచ రూ. 5 లక్షలు, ఇల్లెందు రూ. 4.50 లక్షలు, కొత్తగూడెం హాస్టల్‌కు రూ. 4.50 లక్షలతో మరమ్మతు పనులు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షణలో చేపట్టిన ఈ పనులన్నీ పూర్తయ్యాయని అధికారులు చెపుతున్నారు. అంతా వారిష్టమే.. హాస్టళ్లలో చేపట్టిన పనులన్నీ ఎస్సీ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అ«ధికారులు ఇష్టానుసారమే చేసినట్లుగా తెలుస్తోంది. వసతి గృహాల అధికారుల నివేదికలను పక్కన పెట్టి, వారికి ఇష్టమొచ్చిన రీతిలో పనులు చేశారు. భద్రాచలంలోని బాలికల బీ హాస్టల్లో ప్రహరీ నుంచి హాస్టల్ బిల్డింగ్ వరకు సీసీ రోడ్ వేయాలని హెచ్‌డబ్ల్యూవో నివేదిక ఇవ్వగా, ఇంజనీరింగ్ అధికారులు మాత్రం హాస్టల్ ప్రాంగణంలో పూలమొక్కల మధ్యలో ఫ్లోరింగ్ పనులు చేశారు. అక్కడ అవసరం లేకున్నా, ఏదో రీతిన నిధులు ఖర్చు చేసేందుకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఇంజనీరింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. మిగతా చోట్ల కూడా ఇదే రీతిన చేశారనే విమర్శలు ఉన్నాయి. పైపైన పనులు చేసి, చేతులు దులుపుకున్నారని కొందరు హెచ్‌డబ్ల్యూఓలు అంటున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యమెందుకో... వసతి గృహాల్లో మరమ్మతు పనులు పూర్తి చేసి రెం డు నెలలకు పైనే అయిందని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. కానీ ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ అధికారులకు మధ్య కమీషన్ ఒప్పందాలు కుదరకపో వడమే కారణమనే ప్రచారం జరుగుతోంది. కాగా, రిపేర్ పనులు పూర్తయినట్లు సంబంధిత హాస్టల్ ఇన్చార్జీలు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. ఆయా ప్రాంతాలకు చెందిన ఏఎస్‌డబ్ల్యూవోలు పనులు తనిఖీ చేసి నిర్ధారించాలి. కానీ ఇప్పటి వరకు హెచ్‌డబ్ల్యూవోలు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని సమాచారం. ఈ వ్యవహారంపై కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు మరమ్మతు పనులకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖ వారికి ఇంకా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు. హెచ్‌డబ్ల్యూవోల నివేదిక కూడా నాకు అందలేదు. వారి ధ్రువీకరణ ఆధారంగా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే బిల్లుల చెల్లింపునకు సిఫార్స్ చేస్తా. పనులు కూడా ఇంకా కొన్ని అసంపూర్తిగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై పరిశీలన చేస్తా. – నతానియేల్, డివిజనల్ సాంఘిక సంక్షేమ అధికారి -
సరిహద్దుల్లో మాఫియా..
భద్రాచలం: అంతర్రాష్ట్ర సరిహద్దు సమస్యలతో భద్రాచలం ప్రాంతం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భద్రగిరి మీదుగా గంజాయి పెద్ద ఎత్తున తరలిపోతోంది. ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల బోర్డర్లు కూడా ఇక్కడికి వంద కిలోమీటర్ల దూరంలో ఉండటంతో స్మగ్లింగ్‌కూ అడ్డాగా మారుతోంది. కొందరు మాఫియాగా ఏర్పడి, గంజాయి, టేకు కలపను అక్రమంగా తరలిస్తున్నారు. మావోయిస్టుల కదలికలు ఉండే నాలుగు రాష్ట్రాల అటవీ ప్రాంతాన్ని స్మగ్లింగ్‌కు సేఫ్‌జోన్‌గా చేసుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా ములుగుకు చెందిన సురేష్ అనే వ్యక్తి జాతీయ నిఘా విభాగం ఎస్ఐగా నకిలీ అవతరమెత్తి ఎటపాక(ఆంధ్రా) పోలీస్ స్టేషన్‌ను కేంద్రంగా అనేక దందాలకు పాల్పడ్డాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావటంతో అతను నిఘా విభాగానికి చెందినవాడే అయిఉండవచ్చని అటు ఏపీ పోలీసులు నకిలీ ఎస్సై బాగోతాలపై ఏమాత్రం దృష్టి సారించలేకపోయారు. గంజాయి రవాణాకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. హైదరాబాద్, విజయవాడ, వరంగల్ వంటి ప్రాంతాలకు పెద్ద ఎత్తున గంజాయి భద్రాచలం మీదుగానే తీసుకెళ్తున్నారు. భద్రాచలం బ్రిడ్జి సెంటర్లో ఎక్సైజ్ శాఖ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు ఉన్నా ఫలితంలేకుండా పోయింది. రంగారెడ్డి పరిసర ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో పాడి గేదెలను దొంగతనంగా తీసుకొచ్చిన ఓ వ్యక్తి వాటిని భద్రాచలానికి సమీపంలోని ఎటపాకలో ఉంచి విక్రయాలు చేస్తూ, దర్జాగా వ్యాపారం సాగించాడు. ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించే వరకు ఈ మోసగాడి బాగోతం బయటకు రాలేదు. భద్రాచలంలో పట్టుబడిన కలప(ఫైల్) భద్రాచలం ఇందిరాక్రాంతి పథం కార్యాలయంలో క్లస్టర్ కో ఆర్డినేటర్‌గా పనిచేసే సాంబశివరావు కొంతకాలం క్రితం ఇక్కడికి సమీపంలోని ఏపీలో గల గుండాల జామాయిల్ తోటలో హత్యకు గురయ్యాడు. హత్య జరిగిన ప్రాంతం ఏపీలో ఉండటంతో అక్కడి పోలీస్టేషన్లో దీనిపై కేసు నమోదైంది. ఈ కేసు పూర్వాపరాలు మొత్తం తెలంగాణలోని భద్రాచలంతో ముడిపడి ఉండటంతో ఇప్పటి వరకూ ఈ కేసు మిస్టరీని వెల్లడించలేదు. గిరిజన ప్రాంతం కావటంతో సారాయి తయారీ జోరుగానే సాగుతోంది. నల్లబెల్లం భద్రాచలానికి కూతవేటు దూరంలో ఉన్న గుండాల, పురుషోత్తపట్నం, తుమ్మల గ్రామాల్లో నిల్వ చేస్తున్నారు. కానీ వ్యాపారులంతా భద్రాచలానికి చెందిన వారే. ఇక్కడి ఎక్సైజ్ అధికారులు ఒక్కో సారి హద్దులను దాటి ఏపీలోకి వెళ్లి కూడా బెల్లం నిల్వలను స్వాధీనం చేసుకుని, ఇక్కడి వ్యాపారస్తులపై కేసులు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. కానీ వేరే రాష్ట్రంలో ఎలా దాడులు చేస్తారని వ్యాపారస్తులు వారిపైనే ఎదురుదాడి చేస్తున్నారు. నిఘా పెంచాల్సిందే.. సరిహద్దుల సమస్య ఇక్కడి అధికారులకు కూడా తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రత్యేక నిఘా పెంచాల్సి ఉంది. కొన్నివర్గాల పేరుతో ఈ ప్రాంతంలో సంచరిస్తున్న వ్యక్తులు, సంస్థలపై కూడా నిశిత పరిశీలన అవసరం ఉంది. ఆ దిశగా రెండు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి, తగిన చర్యలు తీసుకోవాలని భద్రాచలం వాసులు కోరుతున్నారు. -
కూర్మావతారంలో రామయ్య
సాక్షి, భద్రాచలం : భక్తుల జయజయ ధ్వానాలు.. పండితుల వేద ఘోష నడుమ భద్రాద్రిలో శ్రీ వైకుంఠ అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతోన్నాయి. పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా నేడు రామయ్య కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సందడితో భద్రగిరి పులకించిపోతోంది. దేవతలు, రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని అమృతానికై క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మందరగిరి మునిగిపోగా, దేవతలు, రాక్షసుల ప్రార్థనపై శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పైకెత్తి సహాయపడ్డాడట. ఈ అవతారాన్ని దర్శించుకోవడం వలన శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. -
మూడు రోజులైనా అతడిని వదలని నాగుపాము
టేకులపల్లి : పాములు పగబడతాయా అంటే ఏమో ఆ విషయం ఎవరికీ తెలియదు. కానీ, చర్చకు వచ్చినప్పుడు మాత్రం ఎక్కువమంది పగబడుతుందనే చెబుతారు.. కాస్త చదువుకున్నవాళ్లయితే మాత్ర ఆ ఛాన్సే లేదంటారు.. అలా వారన్నప్పటికీ వారి మనసులో మాత్రం ఏమో నిజంగా పగబట్టవచ్చునేమో అని లోలోపల భయపడుతుంటారు కూడా. అలాంటి ఊహనే నిజం చేస్తూ కొన్నిసార్లు అలాంటి సంఘటనలే చోటు చేసుకుంటుంటాయి.. అరుదుగా వెలుగులోకి వస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక నాగు పాము ఒకే వ్యక్తిని పగబట్టి మూడు రోజులుగా కాటేసిందని చెబుతున్నారు ఓ గ్రామస్తులు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల పరిధిలోని కోయగూడెం పంచాయతీ బావోజీతండాలో చోటు చేసుకుంది. 'అది నాగు పాము. పగబట్టింది. మూడు రోజులుగా అతడినే కాటు వేసింది.. మూడుసార్లు కూడా సకాలంలో చికిత్స అందడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఇల్లు మారాడు. అయినా ఎక్కడినుంచి వచ్చిందో కాటు వేసి వెళ్లిపోయింది. చివరకు గ్రామస్తులంతా కలిసి నిప్పు పెట్టి పామును చంపేశారు' అని ఆ గ్రామస్తులు కొంతమంది చెప్పారు. -
భద్రాచలంలో ఏపీ టూరిస్టుల ధర్నా
ఖమ్మం: ఆంధ్రప్రదేశ్‌కు చెందని టూరిస్టులు ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ఆర్టీఏ కార్యాలయం ఎదుట శనివారం ఉదయం ఆందోళనకు దిగారు. సీజ్ చేసిన బస్సును తిరిగి అప్పగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వివరాలు.. భద్రాచలంలోని శ్రీరాముల వారిని దర్శించుకోవడానికి చిత్తూరు, రాజమండ్రి నుంచి వచ్చిన భక్తులతో కూడిన బస్సు శుక్రవారం సాయంత్రం భద్రాచలం పరిసర ప్రాంతాలకు చేరుకుంది. బస్సు డ్రైవర్ వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు అవసరమైన పర్మిట్ లేకపోవడంతో.. బస్సును తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వద్ద ఆపి.. అక్కడినుంచి ఆటోలో స్వామి దర్శనానికి వెళ్లారు. దర్శనం అనంతరం తిరిగి బస్సు వద్దకు చేరుకునే సరికి భద్రాచలం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆ బస్సును సీజ్ చేశారు. దీంతో రాత్రి నుంచి తీవ్ర అవస్థలు ఎదుర్కొటోన్న భక్తులు.. శనివారం ఉదయం ఆర్టీఏ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. -
పుణ్యప్రదం... పుష్కర తరుణం
పుణ్యప్రదం... పుష్కర తరుణం బూర్గంపాడు: జీవనది గోదావరి పుష్కరశోభతో పరవళ్లు తొక్కుతోంది. భద్రాద్రి శ్రీరాముని పాదాలచెంత పరవశిస్తోంది. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలతో గోదావరితీరం పావనమవుతుంది. జిల్లాలో 150 కిలోమీటర్ల పొడవునా పుష్కరాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరకాలం ఎంతో పుణ్యప్రదమైనదని వేదపండితులు, అర్చకులు చెబుతున్నారు. గోదావరినదిలో పుష్కరస్నానం చేస్తే పాపాలు నశిస్తాయి. భద్రాచలం పరిసరాల్లోని గోదావరిలో శ్రీరాముని ఆజ్ఞతో కోటితీర్థములు ఎప్పుడు ఆవహించి ఉంటాయి. పుష్కరాల కాలంలో మరో మూడున్నరకోట్ల తీర్థములు నదిలో ఆవాహనమౌతాయి. మొత్తంగా భద్రాచలం పరిసరాలలోని గోదావరిలో నాలుగున్నర కోట్ల తీర్థములు పుష్కరసమయంలో ఆవాహనమై ఉంటాయి. ఎక్కడలేని గోదావరి పుష్కర వైశిష్ట్యం భద్రాచల క్షేత్రానికే దక్కుతుంది. పుష్కరాలకు భద్రాద్రి పరిసరాల్లోని గోదావరి నదిలో పుష్కరస్నానమాచరిస్తే 60 వేల సంవత్సరాలు గంగానదీ స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుందని అర్చకులు అంటున్నారు. -
రాచకొండలో స్టూడియో నిర్మించొద్దు
రాచకొండ పరిరక్షణ వేదిక కన్వీనర్ తిరుమలరావు భద్రాచలం: రంగారెడ్డి- నల్లగొండ జిల్లాల మధ్యలోని చారిత్రాత్మక రాచకొండ ప్రాంతాన్ని సినిమా స్టూడియోలకు కేటాయించాలనే ఆలోచనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని రాచకొండ పరిరక్షణ వేదిక కన్వీనర్ జయధీర్ తిరుమలరావు అన్నారు. సోమవారం భద్రాచలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... కొత్త రాష్ట్రంలో చారిత్రక కట్టడాలకు రక్షణ లేకుండా పోతుందనే ఆందోళన మేధావుల్లో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 14వ శతాబ్దంలో 150 ఏళ్ల పాటు తెలుగు రాష్ట్రానికి రాజధానిగా ఉన్న రాచకొండ చారిత్రాత్మక సంపదకు పెట్టింది పేరన్నారు. ఇటువంటి ప్రదేశంలో 30 ఎకరాలను సినిమా స్టూడియో నిర్మాణానికి ఇవ్వాలనే ఆలోచన సరైంది కాదన్నారు. స్టూడియో నిర్మిస్తే ప్రకృతి సోయగాలు, పురాతన కట్టడాలు, అటవీ సంపద కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. చారిత్రకమైన రాచకొండ ప్రాంతాన్ని అపవిత్రం చేయాలనే ఆలోచన మానుకోవాలని, కొత్త రాష్ట్రంలో తెలంగాణ సంపదకు నష్టం వాటిల్లే చర్యలపై ప్రభుత్వం పునరాలోచించాకే నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర చెట్టు విషయంలో మేధావుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, రాచకొండ భూముల విషయంలోనూ అలాగే చేయాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఈ భూములపై కొందరు కన్నేస్తే పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసి చారిత్రక సంపదను కాపాడుకున్నామని గుర్తు చేశారు. -
జైరాం దిష్టిబొమ్మ దహనం
సాక్షి, ముంబై: తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ప్రకటనను నిరసిస్తూ మంగళవారం సాయంత్రం ధారావిలోని సాహునగర్‌లో పలు తెలంగాణ సంఘాలు ఆయన దిష్టి బొమ్మను దహనం చేశాయి. ఈ కార్యక్రమంలో ధారావిలోని తెలంగాణ తెలుగు ప్రజా సంఘం, ముంబై ఉద్యమ సంఘీభావ వేదిక, వడాల తెలుగు సంఘం, వడాల కోలివాడ ఎస్సీ సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భద్రాచలం.. తెలంగాణలో భాగమేనన్నారు. భద్రాచలం పరిసర మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని తీవ్రంగా ఖండించారు. యూపీఏ ప్రభుత్వం సీమాంధ్ర ప్రయోజనాల రక్షణ పేరిట తెలంగాణ ప్రజల గొంతు కోయడం దారుణమని దుయ్యబట్టారు. ఓటు బ్యాంకు రాజకీయలకు పోలవరం ప్రాజెక్టు చేపడితే ఖమ్మం జిల్లా తెలంగాణకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందన్నారు. అందువల్ల దీనిని పునరాలోచించాలంటూ వక్తలు హెచ్చరించారు. ఈ కార్యక్రమమంలోగుడుగుంట్ల వెంకటేశ్‌గౌడ్, ఆవుల రాములు, నరిగే సైదులు, బత్తుల శంకర్, వల్లాల రాజయ్య, కక్కిరేణి వెంకన్న, గుండిపోయిన యాదయ్య, ఎల్లబోయిన యాదయ్య, గద్దిపాటి మారయ్య, కె.రాములు, గద్దిపాటి దశరథ్, సూరారపు వెంకన్న, చింత. లతీఫ్ పాల్గొన్నారు. -
పెద్దాస్పత్రికి ‘అసౌకర్యాల’ జబ్బు
పెద్దాస్పత్రికి ‘అసౌకర్యాల’ జబ్బు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి అసౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతోంది. డివిజన్‌తోపాటు చత్తీస్గడ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి అనేక మంది గిరిజనులకు ఈ ఆస్పత్రే పెద్ద దిక్కు. అయితే ఆస్పత్రిలో సరైన స్ట్రెచర్ కూడా లేకపోవడం శోచనీయం. ఐసీయూలో మానిటర్‌ను బ్యాండేజ్‌తో కట్టివేశారు. చిన్న పిల్లలకు చికిత్సను అందించే గదిలో సరైన బెడ్ కూడా లేదు. ఇలా అసౌకర్యాలతో అల్లాడుతున్న పెద్దాస్పపత్రిని పట్టించుకున్న నాధుడే లేడని రోగులు వాపోతున్నారు. - న్యూస్‌లైన్, భద్రాచలం టౌన్ -
భక్తులు మెచ్చాలి
భద్రాచలం, న్యూస్‌లైన్ : భద్రాచలంలో ఈనెల 10,11 తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వారదర్శనం వేడుకలను భక్తులు మెచ్చే రీతిలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీ నరేష్ అన్నారు. ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం రాత్రి రామాలయం ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసేలా ఉత్సవాలను నిర్వహించేందుకు అధికారులంతా కృషి చేయాలన్నారు. భక్తులకు సరిపడా వసతి సౌకర్యాలు కల్పించేందుకు శ్రద్ధ తీసుకోవాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. స్వామి వారి తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలను భక్తులు తిలకిచేందుకు వీలుగా ప్రధాన కూడళ్లలో ఎల్ఈడీలను తగినన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. భవిష్యత్తులో ఉత్సవాలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా జిల్లా ఎస్పీ రంగనాథ్ సూచన మేరకు జనసంచారం ఉన్న ప్రదేశాల్లో ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలని సమాచార శాఖ అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను రెండు రోజుల ముందుగానే పూర్తి చేయాలన్నారు. గోదావరి నదిలో స్వామి వారి తెప్పోత్సవం నిర్వహణకు హంసవాహనం తయారీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ నెల 7న గోదావరి నదిలో హంస వాహనం ట్రయల్ రన్ వేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ముక్కోటి ఉత్సవాలకు సంబంధించిన టిక్కెట్లు సిద్ధమైనట్లుగా ఈవో రఘునాధ్ తెలిపారు. వీఐపీ, ఇతర సెక్టార్లకు సంబంధించిన టిక్కెట్లను ముద్రించి ముందుగానే తెప్పించినట్లుగా వివరించారు. టిక్కెట్ల విక్రయం నిమిత్తం ఈ నెల 7న ఆయా శాఖల అధికారులకు వాటిని అప్పగిస్తామని చెప్పారు. అదే విధంగా పోలీసు శాఖ వారి సూచనల మేరకు రామాలయ పరిసర ప్రాంగణాల్లో ఈసారి ఎక్కువగా సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సెంట్రల్ కంట్రోల్ రూమ్ ద్వారా వీటిని ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షిస్తారని ఆయన వివరించారు. పారిశుధ్య చర్యలు బాగాలేవు : రామాలయ పరిసరాల్లో పారిశుధ్య పనులు సరిగా లేవని ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ పీవో వీరపాండియన్ అన్నారు. రామాలయానికి ఎదురుగా ఉన్న రహదారిపై డ్రైనేజీ నుంచి దుర్గంధం వస్తోందని, దీనిని వెంటనే శుభ్రం చేసి విస్తృతంగా ఫాగింగ్ చేయాలన్నారు. అదే విధంగా గోదావరి స్నానఘట్టాలకు ఆనుకొని ఉన్న కరకట్టపై గల ముళ్ల పొదలను వెంటనే తొలగించాలని, దీనిపై తాను చెప్పినప్పటికీ ఇంకా పనులు మొదలుకాలేదన్నారు. తప్పుడు నివేదికలు ఇస్తే సస్పెండ్ చేస్తా : ఆహార పదార్థాల తనిఖీ, తూనికల కొలతల శాఖ అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భద్రాచలంలో హోటళ్ల యజమానులు ఎక్కువ ధరలను వసూలు చేయటమే కాకుండా, పరిశుభ్రత పాటించటం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ముక్కోటి సందర్భంగా ఇప్పటి వరకూ ఎన్ని సార్లు భద్రాచలంలో తనిఖీలు చేశారని ప్రశ్నించగా సదరు శాఖాధికారులు తెల్లమొహం వేశారు. దీంతో జాయింట్ కలెక్టర్ సురేంద్రమోహన్ కల్పించుకొని ఆహారపదార్థాల తనిఖీ, తూనికల కొలతల శాఖాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కోటి ఉత్సవాలు ముగిసేంత వరకూ తనకు రోజు వారీ నివేదికలు ఇవ్వాలంటూ ఆదేశించారు. తప్పుడు నివేదికలు ఇచ్చినట్లుగా తేలితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఆహార పదార్థాల తనిఖీ విషయంలో పోలీస్ శాఖ పరంగా ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ రంగనాథ్ తెలిపారు. వీరు సాధారణ భక్తుల మాదిరే ఉత్సవాల రెండు రోజులూ హోటళ్లు, లాడ్జీల్లో తిరిగి రేట్ల వివరాలను సేకరిస్తారని చెప్పారు. సామాన్యులకు వసతి లేదా..? ముక్కోటి ఉత్సవాల సందర్భంగా 10,11 తేదీల్లో భద్రాచలం పట్టణంలోని లాడ్జీలు, ఇతర సత్రాల్లో సామాన్యులకు వసతి దొరికే పరిస్థితి లేదని తెలుసుకున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ ఒకింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ఉత్సవాల సమయంలో భద్రాచలంలో ఉన్న లాడ్జీల్లో ఉన్న గదుల కేటాయింపులు ఎలా ఉంటాయనే దానిపై ఆర్డీవో వెంకటేశ్వర్లు వివరించారు. 50 శాతం రెవెన్యూ వారికి, 30 శాతం పోలీసులకు, మిగతా 20 శాతం లాడ్జీల యజమానులకు కేటాయిస్తున్నట్లుగా వెల్లడించారు. దీంతో సామాన్య భక్తులకు వసతి కష్టాలు తప్పవని అధికారులు సమావేశం సాక్షిగా తేల్చి చెప్పారు. ఏర్పాట్లు పరిశీంచిన కలెక్టర్ : ముక్కోటి ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అధికారులతో కలసి పరిశీలించారు. తెప్పోత్సవం నిర్వహించే గోదావరి నదీ తీరం, రామాలయ ప్రాంగణాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు సూచనులు చేశారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ ప్రకాష్‌రెడ్డి, భద్రాచలం, పాల్వంచ ఆర్డీవోలు కాసా వెంకటేశ్వర్లు, శ్యాంప్రసాద్, ఇరిగేషన్ ఈఈ శ్రావణ్‌కుమార్, డీఎంఅండ్‌హెచ్‌వో భానుప్రకాష్తో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.