సాక్షి, భద్రాచలం: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్‌ఎస్ నెగ్గిన ఏకైక నియోజకవర్గం భద్రాచలం. ఇక్కడ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్ నుంచి నెగ్గిన తెల్లం వెంకటరావు.. పార్టీ ఫిరాయించబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. పొంగులేటి అనుచరుడిగా ముద్రపడి ఉన్న తెల్లం వెంకట్రావు పార్టీ మారి స్వామి భక్తి చాటుకునేందుకు అడుగులు వేస్తున్నాడనేది ఆ ప్రచార సారాంశం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫొటో కూడా వైరల్ అయ్యింది.
అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు నేరుగా స్పందించారు. ‘కాంగ్రెస్‌లో జాయిన్ అవుతారని సోషల్ మీడియాలో వైరలైన ఫోటోను తాను పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. తనను నమ్మి బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ గారికి రుణపడి ఉంటానని తెలిపారు. తన ప్రయాణం కేసీఆర్ గారితోనే ఉంటుంది’ అని తెల్లం స్పష్టం చేశారు.
ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్‌ఎస్ పార్టీ 39 స్థానాల్లో గెలుపొందింది. ఫలితాలు వెలువడిన అనంతరం.. తెల్లం వెంకట్రావు పార్టీ మారి కాంగ్రెస్‌లోకి చేరిపోతున్నాడంటూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పొంగులేటిలతో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో దుమారం లేపింది. అయితే ఈ ప్రచారం తారాస్థాయికి చేరడంతో.. తెల్లం స్వయంగా స్పందిస్తూ ఖండించారు.
ఇదీ చదవండి: మాకు నచ్చలే.. అందుకే ఓటేయ్యలే!
Comments
Please login to add a commentAdd a comment