tellam venkatrao
-
నేను బీఆర్ఎస్లో చేరడం లేదు : కాంగ్రెస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: తాను బీఆర్ఎస్లో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న కథనాల్ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఖండించారు. తాను పార్టీ మారడం లేదని, ఒకవేళ కాంగ్రెస్‌ను కాదని బీఆర్ఎస్లో చేరితో అది ప్రాణ త్యాగమే అవుతుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌తోనే భద్రాచలం అభివృద్ధి చెందుతుంది. భద్రాచలం అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్‌లో చేరాను. అదే నమ్మకంతో కాంగ్రెస్ లోనే ఉంటా. తిరిగి బీఆర్ఎస్లో చేరనున్నానేది అవాస్తవమని తెలిపారు. భద్రాచలం ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. అయితే లోక్‌సభ ఎన్నికల ముందు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ వీడి సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.తాజాగా ఆయన అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ప్రతిపక్షనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఛాంబర్‌కి వెళ్లారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేక్, మల్లారెడ్డిలు ఉన్నారు. కేసీఆర్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. అనంతరం తెల్లం వెంకటరావు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు కలిసి బయటకు వెళ్లడంతో..తెల్లం వెంకట్రావు సైతం తిరిగి బీఆర్ఎస్ చేరనున్నారనే సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో తాను కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరడం లేదని స్పష్టత ఇచ్చారు. -
తెలంగాణ కాంగ్రెస్‌కు మరో బిగ్ షాక్.. బీఆర్ఎస్ టచ్‌లోకి మరో ఎమ్మెల్యే
సాక్షి,హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో ఎమ్మెల్యే షాకివ్వనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఇందులో భాగంగా ప్రతిపక్షనేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఛాంబర్‌కి వెళ్లారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేక్, మల్లారెడ్డిలు ఉన్నారు. కేసీఆర్ ఛాంబర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. అనంతరం తెల్లం వెంకటరావు, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు కలిసి బయటకు వెళ్లడంతో..తెల్లం వెంకట్రావు సైతం తిరిగి బీఆర్ఎస్ చేరనున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.జులై మొదటి వారంలో బీఆర్ఎస్ నుంచి గెలిచి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కష్ణమోహన్ రెడ్డి తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ ఉదయం అసెంబ్లీ ఎల్‌వోపీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే తాను బీఆర్ఎస్లోనే కొనసాగుతానని ఆయన కేటీఆర్‌తో చెప్పినట్లు సమాచారం. సాయంత్రం పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి మళ్లీ గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉంది.ఇప్పుడు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డితో భేటీ అవ్వడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. -
పురుడు పోసిన ఎమ్మెల్యే..
భద్రాచలం అర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్న గర్భిణికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పురుడుపోసి ప్రశంసలు అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లికి చెందిన భీమనబోయిన స్వప్నకు పురిటినొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు సోమవారం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.కాగా, మంగళవారం స్వప్నకు పురిటినొప్పులు తీవ్రం కాగా, డ్యూటీ డాక్టర్ (ఈఎన్టీ) పరీక్షించి వెంటనే ప్రసవం చేయాలని నిర్ధారించారు. కానీ ఆ సమయానికి ఆస్పత్రిలో గైనిక్ వైద్యులు లేకపోవడంతో స్వతహాగా వైద్యుడైన ఎమ్మెల్యే వెంకట్రావుకు సమాచారం అందింది. దీంతో ఆయన సిజేరియన్ ద్వారా స్వప్నకు ప్రసవం చేయడంతో 3.2 కేజీల మగ శిశువుకు జన్మనిచ్చింది. -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు. కాగా, తెల్లం వెంకట్రావ్ కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ నేడు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన వెంటనే వెంకట్రావ్ సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ను కలిశారు. దీంతో, అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారనే చర్చ నడిచింది. ఇక, గత కొన్ని రోజుల క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం కూడా ప్రత్యక్షమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ మీటింగ్‌లో పాల్గొనడం, గెలుపు వ్యూహాలపై చర్చించడం గమనార్హం. మరోవైపు.. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపైన కూడా ఆయన కూర్చున్నారు. అయితే, ఇటీవలి కాలంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఇక, పార్టీ చేరిన వెంటనే వారికి టికెట్ కూడా రావడం విశేషం. దీంతో, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు హైకమాండ్‌పై సీరియస్ అవుతున్నారు. తమకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
కేసీఆర్ మీటింగ్‌కు డుమ్మా.. ఆ ఎమ్మెల్యే జంపింగ్ కన్ఫర్మ్!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్‌ల పర్వం మొదలైనట్లేననా?. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్‌కు.. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు గైర్హాజరు కావడతో ఈ అంశం తెరపైకి వచ్చింది. విశేషం ఏంటంటే..ఆ జిల్లాలో బీఆర్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయన ఒక్కరే కావడం. సోమవారం బీఆర్ఎస్ అధికార భవనం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలపై లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. అయితే ఈ మీటింగ్‌కు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ హాజరు కాలేదని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం తరఫున బీఆర్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయనే. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లగా తెల్లం వెంకట్రావు మాత్రం వారితో వెళ్లలేదు. మరోవైపు ఇటీవలే కుటుంబంతో సహా ఆయన టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. దీంతో.. ఆయన పార్టీ మారబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. అయితే ఈ పరిణామాలపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గతంలోనూ ఆయన సీఎం రేవంత్‌ను కలవగా.. అప్పుడు ఇలాంటి ఊహాగానాలే వినిపించాయి. అయితే ఆ సమయంలో ఆయన ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాజా పరిణామాలతో వెంకట్రావు పార్టీ మారతారన్న అనుమానాలు బలపడుతున్నాయి. -
పొలిటికల్ ట్విస్ట్.. సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం వెంకట్రావ్ తన కుటుంబసభ్యులతో వెళ్లి సీఎం రేవంత్‌ను కలిశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. దీంతో, ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎంను వెంకట్రావ్ కలవడం ఇది రెండోసారి. అనంతరం, వెంకట్రావ్ మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశాను. భద్రాచలం రామాలయం అభివృద్ధి. ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి. భద్రాచలం పట్టణంలో డంపింగ్ యార్డు సైతం లేదు. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం రేవంత్‌ను కలిశాను అని అన్నారు. -
‘కేసీఆర్ వెంటే.. కాంగ్రెస్‌లోకి వెళ్లను’
సాక్షి, భద్రాచలం: అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ నెగ్గిన ఏకైక నియోజకవర్గం భద్రాచలం. ఇక్కడ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి నెగ్గిన తెల్లం వెంకటరావు.. పార్టీ ఫిరాయించబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. పొంగులేటి అనుచరుడిగా ముద్రపడి ఉన్న తెల్లం వెంకట్రావు పార్టీ మారి స్వామి భక్తి చాటుకునేందుకు అడుగులు వేస్తున్నాడనేది ఆ ప్రచార సారాంశం. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఫొటో కూడా వైరల్ అయ్యింది. అయితే ఈ విషయంపై ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు నేరుగా స్పందించారు. ‘కాంగ్రెస్‌లో జాయిన్ అవుతారని సోషల్ మీడియాలో వైరలైన ఫోటోను తాను పూర్తిగా ఖండిస్తున్నానని తెలిపారు. తనను నమ్మి బీఫామ్ ఇచ్చిన కేసీఆర్ గారికి రుణపడి ఉంటానని తెలిపారు. తన ప్రయాణం కేసీఆర్ గారితోనే ఉంటుంది’ అని తెల్లం స్పష్టం చేశారు. ఆదివారం వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో విజయం సాధించగా.. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో గెలుపొందింది. ఫలితాలు వెలువడిన అనంతరం.. తెల్లం వెంకట్రావు పార్టీ మారి కాంగ్రెస్‌లోకి చేరిపోతున్నాడంటూ.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పొంగులేటిలతో ఉన్న ఓ ఫోటో సోషల్ మీడియాలో దుమారం లేపింది. అయితే ఈ ప్రచారం తారాస్థాయికి చేరడంతో.. తెల్లం స్వయంగా స్పందిస్తూ ఖండించారు. ఇదీ చదవండి: మాకు నచ్చలే.. అందుకే ఓటేయ్యలే! -
బీఆర్ఎస్లోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక అనుచరుడు తెల్లం వెంకటరావు
-
వెంక్రటావ్ భవిష్యత్త్‌కు మాది భరోసా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. పొంగులేటి కీలక అనుచరుడు తెల్లం వెంకట్రావ్ అధికార బీఆర్ఎస్లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోని వెంక్రటావ్ను మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఆహ్వానించారు. ఇక, వెంకట్రావ్ భద్రాచలం టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదినట్టే. వెంకట్రావ్కి ఈ విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వెంక్రటావ్ భవిష్యత్త్‌కు మాది భరోసా. జల్, జంగల్, జమీన్ విషయంలో ఏం జరుగుతుందో అందరూ చూడాలి. తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతోంది. ప్రాజెక్టుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం పెరిగింది. ..కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. తెలంగాణలో నీటి కష్టాలు, విద్యుత్ వెతలు తీరిపోయాయి. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎవరెన్ని మొరిగిన మళ్ళీ గెలిచేది మనమే, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం. వచ్చే రోజుల్లో భద్రాచలం గుడి అభివృద్ది చేస్తాం. గోదావరి నది కరకట్ట మరమత్తులు కూడా చేపడతాం’ అని కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడే బయటకు వస్తాయి. ప్రజాసేవ చేసే నాయకత్వం కావాలి. ఎన్నికలప్పుడే కొందరు నేతలు ప్రజల్లోకి వస్తారు అంటూ ఎద్దేవా చేశారు. ఇది కూడా చదవండి: స్పీడ్ పెంచిన గులాబీ బాస్.. తొలి లిస్ట్‌లో అభ్యర్థులు వీరే! -
పొంగులేటికి హ్యాండిస్తూ.. తిరిగి బీఆర్ఎస్లోకి తెల్లం
-
పొంగులేటికి భారీ ఝలక్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి పెద్ద ఝలకే తగిలింది. గత నెలలో ఢిల్లీలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సమక్షంలో తనతో పాటే కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకటరావు మనసు మర్చాకున్నాడు. తిరిగి బీఆర్ఎస్లోకే వెళ్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చకపోవడం, అదే సమయంలో తనను నమ్ముకున్న కార్యకర్తల నమ్మకం వమ్ము చేయడం ఇష్టం లేకనే తిరిగి బీఆర్ఎస్ వెళ్తున్నట్లు ఓ వీడియో సందేశం ద్వారా తెలిపారాయన. భద్రాచలం అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంలోనే జరుగుతుందని తాను నమ్ముతున్నట్లు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రేపు(గురువారం) ఆయన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెల్లం వెంకటరావు మొదటి నుంచి పొంగులేటికి ముఖ్య అనుచరుడిగా ఉంటూ వచ్చారు. 2018లో టీ(బీ)ఆర్ఎస్ తరపున తెల్లం పోటీ చేసి ఓడిపోయారు(32 శాతం ఓటింగ్.. దాదాపు 36వేల ఓట్లు పోలయ్యాయి). అయితే రాబోయే ఎన్నికల్లో భద్రాచలం టికెట్ ఆశించి మరీ ఆయన పొంగులేటితో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇక్కడే ఆయనకు ఆటంకాలు ఎదురయ్యాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన పొదెం వీరయ్యకే కేటాయించే అవకాశం ఉండడంతో.. వెంకటరావు నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో మరోపక్క నుంచి బీఆర్ఎస్ ముఖ్యనేతలు వెంకటరావుతో మంతనాలు జరిపినట్లు సమాచారం. అయితే టికెట్ హామీ ఇస్తేనే బీఆర్ఎస్లోకి వస్తానని ఆయన కరాకండిగా చెప్పినట్లు ఆయన వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. చివరకు ఏమైందో తెలియదుగానీ.. ఆయన బీఆర్ఎస్లో చేరనున్నట్లు ప్రకటన చేసేశారు. ఇదీ చదవండి: జెండా వందనంలో కొట్టుకున్న బీజేపీ నేతలు -
భద్రాచలం: ప్రజా సేవకే అంకితమవుతా..!
సాక్షి, భద్రాచలం: నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజల శ్రేయస్సుకోసం కృషి చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో నిర్వహించిన రోడ్‌షోలో ముఖ్య అతిధిగా ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరుకాగా, ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నేను ఎప్పుడూ ప్రజల మనిషినేనని తెలిపారు. నాలుగున్నరేళ్ల పాలనలో ఏ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని టీఆర్ఎస్ చేసి చూపిందని అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో కేసీఆర్ మెనిఫెస్టోను త్వరలోనే ప్రజల ముందుకు ఉంచబోతున్నారని అన్నారు. టీఆర్ఎస్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, నిరుపేదలకు కూతుళ్ల పెళ్లిళ్లకోసం కల్యాణలక్ష్మీ, రైతుభందు మరెన్నో పథకాలను తీసుకొచ్చిన ఘనత ఒక్క టీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. ఇదే రీతిలో భద్రాచల అభివృద్ధికి కూడా తాను కట్టుబడి ఉంటానన్నారు. మీ అమూల్యమైన ఓటును టీఆర్ఎస్ గుర్తు కారుపై వేసి తనను గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నియోజక వర్గ ఇంఛార్జ్ మానె రామకృష్ణ, మండల అధ్యక్షుడు యశోధ నగేష్, ప్రధాన కార్యదర్శి చి ంతాడి చిట్టిబాబు, ఉపాధ్యక్షుడు రత్నం రమాకాంత్, పడిశిరి శ్రీనివాస్, అధికార ప్రతినిథి అరికెళ్ల తిరుపతిరావు, సీనియర్ నాయకుడు కోటగిరి ప్రబోద్ కుమార్, తాళ్ల రవికుమార్, కొండిశెట్టి కృష్ణ, పెద్దినేని శ్రీనివాస్, మాజీ సర్పంచ్ భూక్యా శ్వేత, ఎంపీపీ ఊకే శాంతమ్మ, ఎంపీటీసీలు మానె కమల, బానోత్ రాముడు, మహిళా అ«ధ్యక్షురాలు ఎండీ ముంతాజ్, గ్రంథాలయ ఛైర్మన్ మామిడి పుల్లారావు, కృష్ణ, ఎండీ బషీర్, ఈర్ల భారతి, సీతామహలక్ష్మీ, లలిత, గంగా భారతి, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. -
హోరెత్తిన రోడ్ షో..
కదం తొక్కిన వైఎస్సార్సీపీ, సీపీఎం శ్రేణులు చిందేసిన తెల్లం వెంకట్రావ్, సున్నం రాజయ్య భద్రాద్రిలో అడుగడుగునా అపూర్వ స్వాగతం అందుబాటులో ఉంటాం..ఆశీర్వదించండి : డాక్టర్ వెంకట్రావు, సున్నం రాజయ్య భద్రాచలం, న్యూస్‌లైన్: వైఎస్సార్సీపీ, సీపీఎం శ్రేణులు సోమవారం భద్రాచలం పట్టణంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార రోడ్‌షో విజయోత్సవాన్ని తలదన్నేలా సాగింది. వైఎస్సార్సీపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, సీపీఎం భద్రాచలం అసెంబ్లీ అభ్యర్థి సున్నం రాజయ్యలు ఈ రోడ్‌షోలో ఓపెన్ టాప్ వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఓట్లు అభ్యర్థించారు. సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రచార రోడ్‌షోలో గిరిజనుల కొమ్ము నృత్య కళాకారులు ఆటపాటలతో ముందు నడువగా, డప్పు వాయిద్యాలు, ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ పాల్గొన్నారు. భద్రాచలం పట్టణంలోని అన్ని వీధుల్లో సాగిన ఈ ర్యాలీకి వివిధ వ ర్గాల ప్రజలు పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. బుధవారం జరుగనున్న ఎన్నికల్లో వీరిద్దరికే ఓట్లు వేస్తామన్న రీతిలో భరోసా ఇచ్చేలా పట్టణ ప్రజానీకం పలికిన స్వాగతం ఆ పార్టీల శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపిం ది. ప్రజల నుంచి వచ్చిన ఆదరణ చూసిన ఇరువురు నేతలు కూడా వాహనం దిగి కార్యకర్తలతో పాటు చిందేసి వారికి మరింత ఉత్సాహాన్ని నింపారు. నిజాయితీకి పట్టం కట్టండి ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావ్ మాట్లాడు తూ అభ్యర్థుల గుణగణాలతో పాటు నిజాయితీని చూసిఓటు వేసి గెలిపించాలని కోరారు. సేవ చేయాలనే ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, రోగి నాడి తెలిసిన డాక్టర్‌గా వైద్యం చేస్తున్న తాను ప్రజా సమస్యలు కూడా తెలుసుకుని ఓ మంచి నాయకుడిగా పని చేస్తానని అన్నారు. తనను గెలిపిస్తే భద్రాచలం నియోజకవర్గ ప్రజానీకానికి ఏది అవసరం గుర్తించి పనిచేస్తానన్నారు. నీతి నిజాయితీగా ఉండే తనను గెలిపించేందుకు ప్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ, సీపీఎం గెలుపు అవసరం భద్రాచలంలో నియోజకవర్గంలో సీపీఎం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానంలో వైఎస్సార్సీపీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి సున్నం రాజయ్య అన్నారు. భద్రాచలం నియోజకవర్గ ప్రజానీకం భవిష్యత్‌కు దశ, దిశ నిర్ధేశం చేసే ఈ ఎన్నికల్లో మంచి వ్యక్తులకు పట్టం కట్టాలన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను నిస్వార్ధంగా, నిరాడంబరంగా పనిచేశానని గుర్తు చేశారు. కానీ ఒక్క సారి గెలిచిన వారు కూడా కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న విషయాన్ని ఈ ప్రాంత ప్రజానీకం గుర్తుంచుకోవాలన్నారు. అదే విధం గా కేవలం ఎన్నికలప్పుడు కనిపించే టీడీపీ వంటి పార్టీలకు ఓటు వేసినా ప్రజల కష్టాలు తీరవవన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కడియం రామాచారి, సీనియర్ నాయకులు గంటా కృష్ణ, కొవ్వూరి రాంబాబు, దామెర్ల రేవతి, లక్ష్మీబాయి, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బీ వెంకట్, పీ సోమయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఏజే రమేష్, బ్రహ్మచారి, బీబీజీ తిలక్, గిరిప్రసాద్, జీఎస్ శంకర్రావు, ఎంబీ నర్సారెడ్డి, ముదిగొండ నాగేశ్వరరావు, బండారు శరత్‌బాబు, వైఎస్సార్సీపీ నాయకులు బానోతు రాముడు, రాయిని రమేష్, లక్ష్మీబాయి, నీరజ, రాజు, ప్రవీణ్‌రెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్ పథకాలే గెలిపిస్తాయి..
నర్సంపేట టౌన్, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తన గెలుపునకు బాటలు వేస్తాయని వైఎస్సార్ సీపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు అన్నారు. పట్టణంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శాంతికువూర్ స్వగృహంలో వుంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్నారనే ఉద్దేశంతోనే వైఎస్.జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని వారి గుండెల్లో దేవుడిగా నిలిచిన గొప్ప నాయుకుడు వైఎస్ అని అన్నారు. వుహబూబాబాద్ పార్లమెంట్ పార్టీ పరిశీ లకుడు ఉడువుుల లక్ష్మీనారాయుణరెడ్డి వూట్లాడుతూ దేశంలో ఏ వుుఖ్యవుంత్రి ప్రవేశపెట్టని సంక్షేవు పథకాలను వైఎస్ ప్రవేశపెట్టారన్నారు. వెంకట్రావును గెలిపిస్తే ప్రజల వుధ్యలోనే ఉంటూ కష్టాల్లో పాలుపంచుకుంటూ సేవ చేస్తాడన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వుుత్తినేని సోమేశ్వర్రావు వూట్లాడుతూ వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభివూనంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుస్తారన్నారు. ప్రజలకు సేవ చేయూలనే ఉద్దేశంతోనే వెంకట్రావు ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీలో నిలిచారని గుర్తు చేశారు. ై వెఎస్ అభివూనులు పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రావు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సవూవేశంలో పార్టీ భద్రాచలం డివిజన్ నాయుకుడు రాజు, నియోజకవర్గ కోఆర్డినేటర్ నాడె ం శాంతికువూర్, దేవానాయుక్, నర్సంపేట, నెక్కొండ వుండలాల అధ్యక్షులు నూనె నర్సయ్యు, భూక్య లాలు, కోల లింగయ్యు, వెంకట్‌రెడ్డి, బూర సువున్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీతోనే పేదల అభివృద్ధి
ములుగు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే పేదల అభివృద్ధి జరుగుతుందని ఆ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ములుగు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి లోకిని సంపతితో కలిసి శుక్రవారం ఆయన ములుగు, జంగాలపల్లి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. గ్రామాల్లో పనులు కరువై పట్టణాలకు వలస వెళ్తున్న కూలీలకు ఉపాధిహామీ పథకం, మహిళలకు పావలావడ్డీ రుణాలు, ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కే దక్కుతుందని తెలిపారు. మహానేత ప్రవేశపెట్టిన పథకాల అమలు ఆయన తనయుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకునే వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించిందని ఆయన తెలిపారు. ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి లోకిని సంపతి మాట్లాడు తూ గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని కాలరాశారని ఆరోపించారు. పేదల కష్టాలను తెలిసిన తనను ఎన్నికల్లో గెలిపిస్తే ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతానని చెప్పారు. అనంతరం మండలంలోని జంగాలపల్లి గ్రామానికి చెందిన రేణుకుంట్ల భాస్కర్, గండి మహేష్, గడ్డం క్రాంతికుమార్, గుండె రమేష్, బండారి ప్రశాంత్, రేణుకుంట్ల శ్రీకాంత్, మామిడి కమలాకర్, గుండె విష్ణు, శ్యాం, గుర్రం జాషువాతో పాటు వివిధ పార్టీలకు చెం దిన మరో 50 మంది కార్యకర్తలు ఎంపీ అ భ్యర్థి తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో ములుగు జెడ్పీటీసీ అభ్యర్థి దొంగరి మహేందర్, డివిజన్ నాయకులు ఆశోక్‌రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్, మెట్టు సురేష్ పాల్గొన్నారు. షర్మిల రోడ్‌షోను విజయవంతం చేయాలి.. ఎన్నికలను పురస్కరించుకుని నర్సంపేట, మహబూబాబాద్ డివిజన్లలో శనివారం జరుగనున్న వైఎస్సార్సీపీ నాయకురాలు షర్మిల రోడ్‌షోను కార్యకర్తలు విజ యవంతం చేయాలని ఆ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు, ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి లోకిని సంపతి పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. -
వైఎస్ఆర్సీపీ జాబితా విడుదల
సాక్షి, ఖమ్మం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు, అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా మంగళవారం అర్ధరాత్రి విడుదలైంది. ఖమ్మం పార్లమెంటు అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి డాక్టర్ తెల్లం వెంకట్రావ్ పేర్లను ప్రకటించారు. అలాగే జిల్లాలో కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి వనమా వెంకటేశ్వరరావు, పినపాకకు పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేటకు తాటి వెంకటేశ్వర్లు, సత్తుపల్లికి మట్టా దయానంద్‌విజయ్‌కుమార్, వైరాకు బాణోతు మదన్‌లాల్, ఇల్లెందు అసెంబ్లీ స్థానానికి గుగులోతు రవిబాబు పేర్లను పార్టీ ప్రకటించింది. -
మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికిై వెఎస్సార్ సీపీ అభ్యర్థి నామినేషన్
కలెక్టరేట్, న్యూస్‌లైన్ : మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి వైఎ స్సార్ సీపీ ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు సోమవారం కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేశారు. వెంకట్రావు వెంట ఖమ్మం జిల్లా నుంచి పార్టీ కార్యకర్తలు, అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు భారీగా తరలివచ్చారు. పార్టీ వరంగల్ జిల్లా కన్వీనర్ ముత్తినేని సోమేశ్వర్రావు, రాము తదితరులు వెంకట్రావును కలిసి సంఘీభావం తెలిపారు. వెంకట్రావు, పార్టీ ఖమ్మం జిల్లా కన్వీనర్ పాయం వెంకటేశ్వర్లు, ముత్తినేని సోమేశ్వర్రావు, తాటి వెంకటేశ్వర్లు తదితరులు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి, జేసీ పౌసుమిబసుకు అందజేశారు. ఐదు అసెంబ్లీ స్థానాలు మావే.. ఖమ్మం జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందని మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని సోమేశ్వర్‌రావును ఆయన కోరారు. వెంకట్రావు వెంట ఖమ్మం జిల్లా నేతలు ఉడుముల లక్ష్మారెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు వట్టం రాంబాబు, పోలెబోయిన తిరుపతిరెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాస్ ఉన్నారు.