హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్‌ల పర్వం మొదలైనట్లేననా?. బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్‌కు.. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు గైర్హాజరు కావడతో ఈ అంశం తెరపైకి వచ్చింది. విశేషం ఏంటంటే..ఆ జిల్లాలో బీఆర్‌ఎస్‌కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయన ఒక్కరే కావడం.
సోమవారం బీఆర్‌ఎస్ అధికార భవనం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ అధ్యక్షతన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలపై లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. అయితే ఈ మీటింగ్‌కు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ హాజరు కాలేదని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం తరఫున బీఆర్‌ఎస్‌కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయనే.
బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లగా తెల్లం వెంకట్రావు మాత్రం వారితో వెళ్లలేదు. మరోవైపు ఇటీవలే కుటుంబంతో సహా ఆయన టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. దీంతో.. ఆయన పార్టీ మారబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. అయితే ఈ పరిణామాలపై బీఆర్‌ఎస్ శ్రేణులు స్పందించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. గతంలోనూ ఆయన సీఎం రేవంత్‌ను కలవగా.. అప్పుడు ఇలాంటి ఊహాగానాలే వినిపించాయి. అయితే ఆ సమయంలో ఆయన ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాజా పరిణామాలతో వెంకట్రావు పార్టీ మారతారన్న అనుమానాలు బలపడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment