BRS MLA
-
దద్దరిల్లిన అసెంబ్లీ: చేతికి సంకెళ్లతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో బీఆర్ఎస్ నిరసన చేపట్టారు. నల్ల దుస్తులు, బేడీలతో అసెంబ్లీకి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. రైతులకు బేడీలా సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు.‘లగచర్ల’ఘటనపై నిన్న (సోమవారం) కూడా శాసనసభ అట్టుడికింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, నినాదాలతో హోరెత్తింది. ‘రాష్ట్రంలో పర్యాటక విధానం’అంశంపై మంత్రి జూపల్లి కృష్ణారావు లఘుచర్చను ప్రారంభించగానే బీఆర్ఎస్ సభ్యులంతా లేచి.. ‘లగచర్ల’రైతుల నిర్బంధం, అరెస్టులపై చర్చించాలని పట్టుబట్టారు. స్పీకర్ అంగీకరించకపోవడంతో ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు.మరోవైపు, లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, చిత్రహింసలకు గురిచేశారని.. దీనిపై మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలపాలని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చింది. జైళ్లలో నిర్బంధించి, రైతన్న చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ అమానవీయ, అణచివేత విధానాలను నిలదీయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వాలని పిలుపునిచ్చారు. లగచర్ల రైతులపై కేసులను ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘ఈ కార్ రేసు’ కేసు.. స్పందించిన కేటీఆర్ -
కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్.. ఎర్రవెల్లి చేరుకున్న గులాబీ నేతలు
సాక్షి, సిద్దిపేట: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరుగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలపై ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా ఎర్రవల్లికి చేరుకుంటున్నారు.కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ వేదికగా బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కొనసాగనుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు ఎర్రవల్లికి వస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్ రావు, ఎమ్మెల్సీలు వెంకట్రామి రెడ్డి, నవీన్ కుమార్ కుమార్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు ఎర్రవల్లి చేరుకున్నారు. -
పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్
-
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
-
ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఊకే అబ్బయ్య మృతి
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత..హైకోర్టులో పాల్ వాదనలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం(అక్టోబర్ 25) మరోసారి విచారించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేఏ పాల్ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పాల్ పార్టీఇన్పర్సన్(స్వయంగా)గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 4కు వాయిదా వేసింది.కాగా, తమ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి తుది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు -
నేడు ‘మూసీ’ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల్లో భరోసా నింపడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం పర్యటించనున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లు ఈ పర్యటనలో పాల్గొంటారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హైదర్‌షాకోట్‌తో పాటు సమీప కాలనీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుంది. మూసీ పరీవాహక కాలనీల్లో అధికారుల సర్వే పరిశీలన, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు వినడంతో పాటు బాధితులకు పారీ్టపరంగా భరోసా ఇస్తారు. -
సీఎల్పీ భేటీకి బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ(సీఎల్పీ) సమావేశానికి హాజరయ్యారు.ఈ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పీఏసీ చైర్మన్‌గాంధీ, వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డితో పాటు మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సీఎల్పీ సమావేశం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో ప్రారంభమైంది. ఎమ్మెల్యే లు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు హోటల్‌కు వచ్చారు.సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరుగుతోంది.లోకల్ బాడీ ఎన్నికలు,పార్టీకి ప్రభుత్వానికి మధ్య సమన్వయం,పార్టీ సభ్యత్వం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఇదీ చదవండి.. జమిలి ముసుగులో దేశాన్ని కబలించే కుట్ర -
మీడియా కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు: బొంతు రామ్మోహన్
సాక్షి,హైదరాబాద్: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ ఇంట్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల భేటీ పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. శుక్రవారం(సెప్టెంబర్13) ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి భేటీ నిర్వహించేందుకు సిద్ధమైన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని హౌస్ అరెస్టులు చేశారు. ఎమ్మెల్యేలు తలసాని, కౌశిక్ రెడ్డి, మాగంటి గోపినాథ్, వివేకానంద, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను ఆయా ప్రాంతాల్లో వారి ఇళ్లలోనుంచి బయటికి రాకుండా హౌస్ అరెస్టు చేశారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి మద్ధతు పలకడానికి అయన నివాసానికి వచ్చిన బొంతు రామ్మోహన్మీడియాలో వార్తల కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడు: బొంతు రామ్మోహన్ సీనియర్ నేత గాంధీ పట్ల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తుంది.హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవటమే బీఆర్ఎస్ లక్ష్యం.సెటిలర్ల పట్ల కౌశిక్ రెడ్డి కామెంట్స్ సరైనవి కావు.సీనియర్ నేత గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది.రాజా సింగ్, బీజేపీ ఎమ్మెల్యేమాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోల్పోవడంతో మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటందని మంచి సూచన చేశారు.దాన్ని తప్పు పడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.పనిపాట లేక కేంద్రంపై ఏదో ఒక ఆరోపణ చేయాలని కేటీఆర్ ట్వీట్ చేశారు.కాంగ్రెస్ పైన మంచిగా ఫైట్ చేస్తున్నారు..కేటీఆర్‌తోపాటు వారి ఎమ్మెల్యేలు మంచిగా ఫైట్ చేస్తున్నారు ఆ దారిలో వెళ్లండి.కానీ మధ్యలో మంచి పనులపై ఇలాంటి కామెంట్స్ చేస్తే పిచివాళ్లని జనాలు అంటారు..నేను చేసిన తప్పు ఏంటి?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేశారు.ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్దామని నేను, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు బయలుదేరాము.మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు.నాపై ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు.స్వయంగా రేవంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయండని చెప్పారు.నాపై హత్యాయత్నం చేశారు.తెలంగాణలో ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే ఎట్లానేను చేసిన తప్పు ఏంటి.?అరికేపూడి గాంధీ భాషను శేరిలింగంపల్లి ప్రజలు గమనించాలి.స్వయంగా అరికేపూడి గాంధీ నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు.అరికేపూడి గాంధీ భాషను సమాజం అంగీకరిస్తుందా?నేను వుండే విల్లాలో మొత్తం 69 కుటుంబాలు ఉంటాయి.అదే విల్లాలో ఏపీ మంత్రి నారాయణ,ఎమ్మెల్యేలు ఉంటారు.నేను వ్యక్తిగతంగా అరికేపూడి గాంధీని అన్నాను.ఆంధ్రా వాళ్ళు అంటే మాకు గౌరవం ఉంది.చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారు.హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారు.రేవంత్ రెడ్డి కుట్రతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్నారు.రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారుకాంగ్రెస్ మంత్రులు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారురేవంత్ రెడ్డికి ఇక నుంచి కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు అవసరం లేదుకౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు.బిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కొట్లాడుతాను.కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయా...?కేసీఆర్,తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునేవారా...?రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు బంద్ చేయాలి మీ రౌడీయిజాన్ని ప్రజలు చూశారునిన్న హరీష్ రావును అరెస్టు చేసి షాద్ నగర్ కు తీసుకువెళ్లారుబీఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది.పోలీసు రాజ్యంతో ప్రభుత్వాన్ని నడపలేరు.ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదునాకు అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కార్యకర్తలకు ధన్యవాదాలుహైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు.పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా.కేసీఆర్ పెట్టిన భిక్షతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు.ఇప్పటికైనా సిగ్గు,శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి.నేను అడిగిన ప్రశ్నలకు అరికేపూడి గాంధీకి ఎందుకు భయం?పీఏసీ చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు పేరును ఇచ్చింది.హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు మేము దాడులు చేయడం లేదు.దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువ ఉందిదానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి.నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడా వాడలేదు.నేను ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు గాంధీకి వ్యక్తిగతం మాత్రమే.కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఆంధ్రా సెటిలర్స్ ను మంచిగా చూసుకున్నారు.ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్స్ బిఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు.సెటిలర్స్ ను మా నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అల్లర్లు సృష్టించాలని కుట్ర చేస్తున్నారు: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంసీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక హై డ్రామా చేస్తున్నారు.కౌశి క్ రెడ్డి అనే షికండిని పెట్టి హరీష్ రావు డ్రామా అడుతున్నాడు.కౌశిక్ రెడ్డికి మహిళల పట్ల గౌరవం లేదు.మహిళ గౌర్నర్ ని కూడా అవమానించాడు.కరీంనగర్ జెడ్పీ మీటింగ్‌లో మహిళా కలెక్టర్ పై కూడా అమర్యాదగా మాట్లాడారు.రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కుట్ర చేస్తున్నారు.ఈ కుట్రలను పసిగట్టాలని డిజిపికి విజ్ఞప్తి.కేసీఆర్ పామ్ హౌస్ లో పడుకున్నాడు.కేటీఆర్ విదేశాల్లో ఉండి కుట్రలకు తెర లేపారు.గ్యాప్‌ను ఉపయోగించుకోవాలని హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు.కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి.లేదంటే తెలంగాణ ప్రజలు కౌశిక్ రెడ్డిని తిరగనియ్యరు.ఏఐజీ ఆస్పత్రిలో హరీశ్‌రావుకు వైద్య పరీక్షలుకుడి భుజానికి చికిత్స తీసుకునేందుకు హరీశ్‌రావుకు అనుమతిచ్చిన పోలీసులుగురువారం గొడవల్లో హరీశ్‌రావు భుజానికి గాయంతొలుత హౌస్ అరెస్టు కారణంగా ఇంట్లోనుంచి బయటికి రావడానికి అనుమతించని పోలీసులు తర్వాత అనుమతిచ్చి ఏఐజీ ఆస్పత్రికి హరీశ్‌రావు వెంట వచ్చిన పోలీసులుఆస్పత్రిలో హరీశ్‌రావును ఎవరితో కలవనివ్వని పోలీసులుహరీశ్రావును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోత్ కవిత అరెస్టుకౌశిక్రెడ్డి, శంభీపూర్ రాజు హౌస్ అరెస్టుపీఏసీ చైర్మన్ గా ఎమ్మెల్యే గాంధీ ఎన్నికైనందునే శాలువా కప్పడానికి వెళ్తామంటే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.గాంధే స్వయంగా రమ్మని ఆహ్వానించినా పోలీసులు అడ్డుకుంటున్నారు.ఎమ్మెల్యే దానం నాగేందర్ అరికెపూడి గాంధీ ఇంటికి ఎలా వెళ్లారు వారికి ఎలా పర్మిషన్ ఇస్తారు. ఎమ్మెల్యే గాంధీ ఇంటికి బయల్దేరిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ శంభీపూర్ రాజులను పోలీసులు బలవంతంగా ఇంట్లోకి లాక్కెళ్లి హౌస్ అరెస్టు చేశారు. హరీశ్‌రావు అంటే గౌరవం.. ఆయన స్థాయి తగ్గించుకుంటున్నారు: దానం నాగేందర్ కౌశిక్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. కౌశిక్ రెడ్డికి మహిళలంటే లెక్కలేదు.ఆయన ఒక బచ్చా. మహిళల ప్రతాపం అతనికి పూర్తిస్థాయిలో తెలియదు.మా ఎమ్మెల్యే గాంధీ టిఫిన్‌కి పిలిచాడు. అందుకోసమే గాంధీ ఇంటికి వచ్చాను.హారతులిచ్చి స్వాగతం పలుకుతామంటేనే గాంధీ, కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు.ప్రాంతీయ విభేదాలను కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం సరికాదు.హరీష్ రావు అంటే నాకు గౌరవం. ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారుమాజీ మంత్రి హరీశ్‌రావు హౌజ్ అరెస్ట్.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో భేటీ అవుతామని మేడ్చల్ జిల్లా నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు ఇంటి వద్ద భారీగా మోహరించారు. కోకాపేటలోని ఇంట్లోనే హరీశ్‌రావును హౌస్ అరెస్ట్ చేశారు. హరీశ్‌రావు ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు హరీశ్‌రావు బయటికి వెళ్లకుండా అటు ఇంట్లోకి ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్ఎస్ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోత్ కవితను హరీశ్‌రావు నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. గురువారం నిరసనలు, పోలీసుల అరెస్టు సందర్భంగా హరీశ్‌రావు చేతి గాయమైంది. ఈ గాయానికి చికిత్స తీసకోవడానికి ఆస్పత్రికి వెళ్తానని చెప్పినా తొలుత అనుమతించని పోలీసులు తర్వాత అనుమతిచ్చి ఆయన వెంట ఆస్పత్రికి వెళ్లారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో కౌశిక్‌రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ వివాదంలో సైబరాబాద్ కమిషనరేట్ ముందు ఇతర బీఆర్ఎస్ నాయకులతో కలిపి నిరసన తెలిపిన హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రి 11 గంటలకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హరీశ్‌రావు చేతికి గాయమైంది. బీఆర్ఎస్తో యుద్ధం కాదు.. కౌశిక్‌రెడ్డితోనే యుద్ధం: ఎమ్మెల్యే గాంధీ ఇది బీఆర్ఎస్,గాంధీకి యుద్ధం కాదని, కౌశిక్‌రెడ్డికి తనకు మధ్య యుద్ధమని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్13) ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు. గురువారం ఉదయం నా ఇంటికి వస్తానని కౌశిక్‌రెడ్డి అన్నారు.ఆయన రానందున వాళ్ల ఇంటికి నేనే వెళ్లా. ఇది బీఆర్ఎస్, గాంధీకి యుద్ధం కాదు.కౌశిక్‌రెడ్డితో యుద్ధం. కౌశిక్ బీఆర్ఎస్లోకి వచ్చి పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారు.ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించాలి. పార్టీలో ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు.ఇలాంటి వాళ్లు బీఆర్ఎస్లో ఉంటే మరింత మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయే ప్రమాదముంది.ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలి. బీఆర్ఎస్, కేసీఆర్ అంటే నాకు గౌరవం.వ్యక్తిగతంగా మాత్రమే కౌశిక్‌రెడ్డితోనే నాకు యుద్ధం. సమఉజ్జీ కూడా కాని కౌశిక్‌రెడ్డి ఇంటికి వెళ్లినందుకు బాధపడుతున్నాగాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు.. గాంధీ ఇంట్లో భేటీకి బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి గాంధీ నివాసానికి ఎవరు వచ్చినా అడ్డుకుంటున్నారు. శుక్రవారం ఉదయం గాంధీ ఇంటికి వచ్చిన పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేసి ఇప్పటికే అక్కడినుంచి తరలించారు. కౌశిక్‌రెడ్డి డౌన్‌డౌన్ నినాదాలు.. గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తతఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో ముగిసిన కార్యకర్తల సమావేశం.కౌశిక్ రెడ్డిని తక్షణమే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సమావేశంలో తీర్మానం.కౌశిక్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు ఎవరు గాంధీ వచ్చినా సానుకూలంగా స్వాగతిస్తాం.ఒకవేళ దాడి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని గాంధీ అనుచరులు స్పష్టం చేశారు.కౌశిక్‌రెడ్డి డౌన్‌డౌన్ నినాదాలతో గాంధీ నివాసప్రాంగణం మార్మోగుతోంది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మేడ్చల్ బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు..మరోవైపు గాంధీ ఇంట్లో భేటీకి సిద్ధమవుతున్న పలువురు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు ఉదయం నుంచే అరెస్టు చేస్తున్నారు. పలువురిని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. భేటీ కోసం బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళితే ఉద్రిక్తతలకు దారి తీస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మా ఎమ్మెల్యే ఇంటికి మేం వెళితే తప్పేంటి: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ చీఫ్ శంభీపూర్ రాజు ఎమ్మెల్యే గాంధీ ఇంట్లో మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ నేతల భేటీకి పిలుపునిచ్చిన జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధినేత శంభీపూర్‌రాజు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై రాజు స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి తాము వెళితే తప్పేంటి అని రాజు ప్రశ్నించారు. ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్లోనే ఉన్నా అని చెప్పిన మాటలను ఈ సందర్భంగా రాజు గుర్తు చేశారు. ఎమ్మెల్యే గాంధీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంటికి రావాలని రాజు ఆహ్వానించారు. మరోపక్క గాంధీ ఇంటికి బయలుదేరిన మేడ్చల్ బీఆర్ఎస్ నేతలను, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గులాబీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అడిషనల్ ఎస్పీ ఫిర్యాదు.. కేసు నమోదు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఫిర్యాదుతో కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడి పట్ల చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగిన హరీశ్‌రావు, గంగుల కమలాకర్, వద్దిరాజు రవిచంద్ర తదితర బీఆర్ఎస్ ముఖ్య నాయకులను పోలీసులు అక్కడినుంచి తరలించి కేశంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సివచ్చింది. అనంతరం రాత్రి 11 గంటలకు హరీశ్‌రావు సహా ఇతర బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు కేశంపేట పోలీస్‌స్టేషన్ నుంచి విడుదల చేశారు. ఇదీ చదవండి.. బీఆర్ఎస్లోనే గాంధీ.. ప్రతిపక్షానికే పీఏసీ: సీఎం రేవంత్ -
హైకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్
-
‘అనర్హత’ పిటిషన్లపై తీర్పు రిజర్వు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. రాజ్యాంగపరమైన అంశాల నేపథ్యంలో ఏప్రిల్ నుంచి సుదీర్ఘ వాదనలు విన్నది. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున సుప్రీంకోర్టు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు పలు తీర్పులను ఉదహరిస్తూ వాదనలు వినిపించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ కేపీ.వివేకానంద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్.. ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లోకి చేరారని ఆయనను కూడా అనర్హుడిగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మరో పిటిషన్ వేశారు. నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఫిర్యాదు చేసేందుకు ప్రయతి్నంచిన స్పీకర్ సమయం ఇవ్వడం లేదంటూ బీజేపీ ఎలీ్పనేత మహేశ్వర్‌రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి బుధవారం మరోసారి విచారణ చేపట్టారు. దానం, కడియం తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘సుప్రీంకోర్టు వేర్వేరు తీర్పుల ప్రకారం స్పీకర్‌కు కోర్టులు ఆదేశాలు జారీ చేసేందుకు వీల్లేదు. స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన పదిరోజులకే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్‌కు కనీస గడువు కూడా ఇవ్వకుండానే న్యాయ సమీక్ష కోరడం చెల్లదు. తాజా పిటిషన్లను కొట్టేయాలి.. లేనిపక్షంలో డివిజన్ బెంచ్‌కు నివేదించాలి. గత శాసనసభ స్పీకర్ ఎదుట పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటిషన్లో స్పీకర్‌కు నిర్దిష్ట గడువు నిర్ణయించేందుకు ఇద్దరు న్యాయమూర్తుల హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది’అని పేర్కొన్నారు. లిఖితపూర్వక వాదనలను శుక్రవారం సమర్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వాదనలు పూర్తి కావడంతో న్యాయమూర్తి.. తీర్పు రిజర్వు చేశారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు.. హైకోర్టులో విచారణ 25కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయాధికారం శాసన సభ స్పీకర్దేనని హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ ఏ.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. గడువు విధించి ఆలోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనని న్యాయస్థానాలు ఆదేశాలు జారీ చేయజాలవన్నారు. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావు, దానం నాగేందర్‌ను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎల్పీ మహేశ్వర్‌రెడ్డి మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బీ.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు.ప్రభుత్వం తరఫున ఏజీ, ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాదులు శ్రీరఘురాం, మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘అనర్హతపై కోర్టులు స్పీకర్‌కు గడువు విధించలేవు. పిటిషనర్లు చెప్పిన ప్రకారం ఫిర్యాదు చేసిన తర్వాత స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి 3 నెలల సమయం ఇవ్వాలి. మరి వారంపది రోజుల్లోనే హైకోర్టులో పిటిషన్లు ఎలా వేశారు. ఎందుకు వేశారు?. స్పీకర్ విధుల్లో కోర్టుల జోక్యం అత్యంత స్వల్పం. అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకున్న తర్వాత విచారణ చేయవచ్చు. అయితే అందులోనూ న్యాయస్థానాల జోక్యం స్వల్పమే’అని వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు జె.రాంచందర్‌రావు, గండ్ర మోహన్‌రావు.. ఉత్తర్వులు జారీ చేయాలని న్యాయమూర్తిని విజ్ఞప్తి చేశారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. స్పీకర్ రాజ్యాంగ అధికారి అని.. ఆ కుర్చీపై మాకు గౌరవం ఉందన్నారు. అయితే తన ముందు పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లు ఏ దశకు చేరుకున్నాయో తెలియజేయాలని స్పీకర్‌ను ఆదేశించకున్నా.. దీనిపై అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేస్తామని వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై స్పీకర్ ఏం చర్యలు చేపట్టారో వివరాలు అందజేయాలని కోరవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు. దీనికి ఏజీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయో కూడా స్పీకర్‌ను న్యాయస్థానాలు వివరాలు అడగలేవని బదులిచ్చారు. ఇప్పడు అత్యవసర ఉత్తర్వులు కోరుతున్న న్యాయవాదులు కూడా గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి కేసుల్లో వాయిదా కోరిన వారేనని చెప్పారు. ఇప్పుడు న్యాయస్థానంపై ఒత్తిడి తీసుకురావడం హాస్యాస్పదం అన్నారు. అనంతరం తదుపరి వాదనల కోసం విచారణను రేపటికి వాయిదా వేశారు. -
నేడు గవర్నర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కానున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ భేటీకి గవ ర్నర్ అపాయింట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఇటీవల కేటీఆర్ నేతృత్వంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం గవర్నర్‌తో జరిగే భేటీలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించే అవకాశముంది.క్షేత్రస్థాయిలో ప్రొటోకాల్ ఉల్లంఘనలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కూడా సాక్ష్యాధారాలను గవర్నర్‌కు బీఆర్ఎస్ బృందం అందజేస్తుంది. దీంతోపాటు రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలు, పోటీ పరీక్షల నిర్వహణపై నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలు, వారిపై పోలీస్ కేసుల నమోదు వంటి అంశాలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నా రు. ఈ నెల 23న రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యేలోపే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చూడాలని కేటీఆర్ రాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి చేయనున్నారు. అప్పటికి అనర్హత వేటు పడకుంటే ఇదే అంశాన్ని అసెంబ్లీలోనూ ఎత్తిచూపాలని బీఆర్ఎస్ వ్యూహం సిద్ధం చేస్తోంది. -
హస్తం గూటికి గులాబీ ఎమ్మెల్యేలు
గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ కి కొత్త కష్టమొచి్చంది. వలసల పర్వం ఆ పార్టీలో అసంతృప్తిని రాజేస్తోంది. మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న నేతలను అక్కున చేర్చుకుంటున్న తీరును ద్వితీయ శ్రేణి నాయకత్వం తప్పుపడుతోంది. పార్టీ బలోపేతం పేరిట గులాబీ నాయకులకు స్వాగతం పలుకుతుండడం సీనియర్లకు మింగుడు పడడంలేదు. ఒకవైపు పార్టీ బలీయంగా తయారవుతుందనే సంతోషపడుతున్నా.. మరోవైపు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందనే ఆందోళన వారిని వెంటాడుతోంది. ఇటీవల బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి రాక తమ ఉనికికి భంగం కలిగిస్తుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పార్టీ అసమ్మతులకు తెరలేపింది. ఇటీవల చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పారీ్టలో చేరడంతో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన భీంభరత్ వర్గం అసంతృప్తికి గురైంది. పారీ్టలో చేర్చుకోవద్దని చివరి నిమిషం వరకు న్రయతి్నంచినా ఫలించకపోవడంతో సర్దుబాటుకు సరే అంది. అయితే.. మనుషులు కలిసినా మనసులను కలపలేమనే సంకేతాలు ఇరువర్గాలు ఇస్తున్నాయి. రాజేంద్రనగర్‌లోనూ.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరికంటే ముందే రేవంత్ భేటీ అయి కండువా కప్పుకున్న ప్రకాశ్.. మొన్నటివరకు ఆగినా చివరకు కారు దిగి చేయి పట్టుకున్నారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీచేసిన నరేందర్, సీనియర్ నేతలు జ్ఞానేశ్వర్, ముంగి జైపాల్‌రెడ్డి వర్గీయులు అసంతృప్తికి లోనయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో వేరు కుంపట్లతో కాంగ్రెస్ ఎలా ముందుకు సాగుతుందో వేచిచూడాల్సిందే మరి! శేరిలింగంపల్లిలో మూడు గ్రూపులు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ సెగ్మెంట్లో కాంగ్రెస్ మూడు గ్రూపులుగా విడిపోయింది. శాసనసభ ఎన్నికల వేళ టికెట్ ఆశించిన జైపాల్ సహా.. ఆఖరి నిమిషంలో బీఆర్ఎస్ను వీడి టికెట్ దక్కించుకున్న జగదీశ్వర్‌గౌడ్ ఇప్పటికే రెండు వర్గాలు వ్యవహరిస్తున్నారు. తాజాగా గాంధీ రాకతో కాంగ్రెస్‌లో మూడో వర్గానికి తెరలేపింది. ఖైరతాబాద్‌తో మొదలు.. పరువు పోయిన చోటే వెతుక్కోవాలన్న ఉబలాటంతో ఆపరేషన్ ఆకర్‡్షకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. లోక్‌సభ ఎన్నికల ముందే నగరంలో గులాబీ తొలి వికెట్‌గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకొని సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి ప్రయోగించింది. ఇటీవల దానం బాటలోనే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దానం చేరికతో ఆయనపై పోటీ చేసిన ఓటమి పాలైన విజయారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. డైలామాలో నేతలు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లను చేర్చుకోవడం ద్వారా గ్రేటర్లో పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్న పీసీసీ నాయకత్వం ఆపరేషన్ ఆకర్‡్షకు మరింత పదును పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మరింత మంది ఎమ్మెల్యేలకు గాలం విసిరింది. ఇప్పటికే వీరితో సంప్రదింపులు కూడా జరిపింది. అయితే.. వీరి రాకపై సంకేతాలు రావడంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తాము ఓడినా.. అధికారంలోకి వచ్చామనే సంతోషంలో ఇన్నాళ్లూ ఉన్న తమను తాజా పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. కొత్తగా చేరిన నాయకుల కింద తమ శ్రేణులు పనిచేయాల్సిన పరిస్థితి అనివార్యం కావడం.. దిగువ శ్రేణి నాయకుల పదవులను కొత్త నేతల అనుచరులు తన్నుకుపోయే ప్రమాదం ఉండడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.పటాన్చెరులోనూ.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలపై ఆ నియోజకవర్గ పార్టీలోనూ అసంతృప్తికి తెరలేపింది. శనివారం సాయంత్రం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్‌ను కలుస్తారనే సమాచారం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఆయన ఆదివారం చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాగా.. ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ముదిరాజ్ గ్రూపులుగా విడిపోయిన ఆ పారీ్టలో తాజా ఈ పరిణామాలు పార్టీ శ్రేణులను కలవరపరుస్తున్నాయి. -
మళ్లీ మంచిరోజులు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, భవిష్యత్‌లో బీఆర్ఎస్కు మళ్లీ మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మె ల్యేలకు భరోసా ఇచ్చారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మారడాన్ని పట్టించుకోవా ల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ బీఆర్ఎస్ ఎమ్మె ల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని ఉద్యమస్ఫూర్తి ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినా వెనుకంజ వేయలేదన్నారు.పార్టీ ఫిరాయింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బీఆర్ ఎస్‌కు చెందిన పలువురు శాసనసభ్యు లు, శాసన మండలి సభ్యులు మంగళవారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ భేటీ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అరడజను మంది ఎమ్మెల్యేలు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం, క్షీణించిన శాంతిభద్రతలు వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.రాష్ట్ర ఏర్పాటు ద్వారా అనుభవం కలిగిన నేతలను పునర్నిర్మాణంలో భాగస్వాము లు చేయాలనే లక్ష్యంతోనే కొందరిని బీఆర్ ఎస్‌లో గతంలో చేర్చుకున్నట్టు కేసీఆర్ చెప్పారు. అధికారం కేంద్రంగా పరిభ్రమించే వ్యక్తులు కొందరు అన్నిచోట్లా ఉంటారని, అలాంటి వారిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. పార్టీ వెంట నడిచే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కేసీ ఆర్ భరోసా ఇచ్చినట్టు భేటీలో పాల్గొన్న నేతలు వెల్లడించారు.నగర ఎమ్మెల్యేల భేటీకి ప్రాధాన్యంఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్ ఎమ్మె ల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే తోవ పడుతున్నారనే ప్రచారం జరు గుతోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే లు కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.కేసీఆర్‌ను కలిసిన గ్రేటర్ ఎమ్మెల్యేల్లో అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), మాధవరం కృష్ణారావు (కూకట్పల్లి), ముఠా గోపాల్ (ముషీరాబాద్), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), కేపీ.వివేకానంద (కుత్బుల్లాపూర్) ఉన్నారు. వీరితోపాటు ఎమ్మె ల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నేతలు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్‌రెడ్డి కూడా కేసీఆర్‌ను కలి శారు. కేసీఆర్‌తో భేటీ అధికారిక సమావేశం కాదని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధ వారం కూడా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశముంది. రెండు రోజులుగా కేసీఆర్‌ను కలిసేందుకు వందల మంది నాయకులు, కార్యకర్తలు తరలివస్తుండటంతో ఎర్రవల్లి నివాసం వద్ద సందడి నెలకొంది.కౌశిక్ హరికి అభినందనలుఇటీవల రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్ట రీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘంనేత కౌశిక్ హరి కుటుంబ సమేతంగా ఎర్రవల్లి నివాసంలో కేసీ ఆర్‌ను కలిశారు. కౌశిక్ హరిని కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావులు కూడా అభినందించారు.కేసీఆర్‌కు ఊరట రైల్‌రోకో కేసు దర్యాప్తును నిలిపివేసిన హైకోర్టుసాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు హై కోర్టులో ఊరట లభించింది. ఆయనను నిందితుడిగా చేర్చిన మౌలాలి రైల్‌రోకో కేసులో దర్యాప్తును నిలిపివేసింది. తదుపరి విచారణ వరకు దర్యాప్తుపై స్టే విధించింది. పోలీసుల కు నోటీసులు జారీ చేసిన జస్టిస్ బి.విజయ్ సేన్‌రెడ్డి తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణను జూలై 23 కు వాయిదా వేశారు. 2011లో తనపై నమోదైన రైల్‌రోకో కేసును కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకు న్నా తనను నిందితుల జాబితాలో చేర్చారంటూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా 2011లో మౌలాలి రైల్వేస్టేషన్లో జరిగే రైల్‌రోకోలో పాల్గొనా ల ని ఉద్యమకారులను నేను, ప్రొఫెసర్ కోదండరామ్ పురిగొల్పినట్లు పేర్కొంటూ కేసు నమోదు చేశారు. స్వరాష్ట్ర పోరాటంలో నేను, కోదండరామ్‌లు తమకు పిలుపునిచ్చారన్న సాక్షుల మౌఖిక వాంగ్మూలం తప్ప పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. నేను ఆ రైల్ రోకోలో పాల్గొనలేదు. ఆధారాలు లేకుండా నిందితుల జాబితాలో నా పేరు చేర్చారు. కనుక ఈ కేసు కొట్టివేయాలి’ అని కేసీఆర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి వాదనల సందర్భంగా.. కేసీఆర్ రైల్ రోకోలో పాల్గొన్నట్లు చార్జిషీట్లో పేర్కొనలే దు కదా అని అన్నారు. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం సరికాదని చెప్పారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు
జనగామ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదైంది . గత ఏడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ పాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్అభ్యర్థి పోలింగ్ ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో పోలింగ్ బూత్ కి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 'బలవంతంగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు ఫొటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తాజాగా శనివారం కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం ఆదివారం బయటకు వచ్చింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా కేసు నమోదైంది వాస్తవమేనని చెప్పారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్‌లో చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్/ఖమ్మం: ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు. కాగా, తెల్లం వెంకట్రావ్ కొద్దిరోజులుగా కాంగ్రెస్ నేతలతో టచ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కాగా, రాష్ట్రంలో బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ నేడు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యే సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయ్యింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సమక్షంలో వెంకట్రావ్ హస్తం పార్టీలో చేరారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన వెంటనే వెంకట్రావ్ సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ను కలిశారు. దీంతో, అప్పటి నుంచే ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారనే చర్చ నడిచింది. ఇక, గత కొన్ని రోజుల క్రితమే మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో జరిగిన మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం కూడా ప్రత్యక్షమయ్యారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి, కాంగ్రెస్ మీటింగ్‌లో పాల్గొనడం, గెలుపు వ్యూహాలపై చర్చించడం గమనార్హం. మరోవైపు.. ఇటీవల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభా వేదికపైన కూడా ఆయన కూర్చున్నారు. అయితే, ఇటీవలి కాలంలో తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. ఎన్నికల నేపథ్యంలో పలు పార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ చేస్తున్నారు. ఇక, పార్టీ చేరిన వెంటనే వారికి టికెట్ కూడా రావడం విశేషం. దీంతో, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు హైకమాండ్‌పై సీరియస్ అవుతున్నారు. తమకు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. -
‘సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ కలవలేదు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తమకు అపాయింట్మెంట్ ఇచ్చిమరీ కలవకపోవడంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు అపాయిట్మెంట్ ఇవ్వడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ వెళ్లారు. ఇంట్లో స్పీకర్ లేకపోవడంతో ఆయనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో రెండున్నర గంటల పాటు స్పీకర్ నివాసం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరీక్షించి అయినప్పటికీ ఆయన రాకపోవటంతో వెనుదిరిగారు. తమను స్పీకర్ కలవకపోవటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి మాట్లాడారు. స్పీకర్ గడ్డం ప్రసాద్.. అపాయింట్మెంట్ ఇచ్చి తమను కలవకపోవడం బాధాకరమని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడితోనే అసెంబ్లీ స్పీకర్ తమను కలవలేదని మండిపడ్డారు. రేపు మరోసారి స్పీకర్‌కు దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ సమర్పించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారాయన. -
Cong Vs BRS: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల ధర్నా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. LRS పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు.. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో గులాబీ పార్టీ నేతలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ, హెచ్‌డీఎంఏ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ నేతలు గుర్తుచ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజల నుంచి 20వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు. అమీర్‌పేటలోని మైత్రివనం హెచ్ఎండీఏ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. తలసాని కిరణ్ వినూత్న నిరసన.. అమీర్‌పేటలోని HMDA కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేత తలసాని సాయి కిరణ్ వినూత్న నిరసన చేపట్టారు. వాటర్ బాబిల్స్‌తో హెచ్ఎండీఏ ముందు నిరసన. ఈ క్రమంలో హెచ్ఎండీఏ సిబ్బందికి వాటర్ బాటిల్స్ పంపిణీ చేసిన కిరణ్. తాను ఇచ్చిన నీళ్లు తాగి ప్రశాంతంగా ఎల్ఆర్ఎస్ రద్దు అంశం ఆలోచించాలని కోరిన కిరణ్. ఈ సందర్బంగా తలసాని కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై భారం మోపాలని చూస్తోంది. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. గత ప్రభుత్వాన్ని విమర్శించిన నాయకులు ఇప్పుడెందుకు ఎల్ఆర్ఎస్ అమలు చేస్తున్నారు అని ప్రశ్నించారు. -
కేసీఆర్ మీటింగ్‌కు డుమ్మా.. ఆ ఎమ్మెల్యే జంపింగ్ కన్ఫర్మ్!
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్‌ల పర్వం మొదలైనట్లేననా?. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరుగుతున్న మీటింగ్‌కు.. ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు గైర్హాజరు కావడతో ఈ అంశం తెరపైకి వచ్చింది. విశేషం ఏంటంటే..ఆ జిల్లాలో బీఆర్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయన ఒక్కరే కావడం. సోమవారం బీఆర్ఎస్ అధికార భవనం తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలపై లోక్‌సభ ఎన్నికల సన్నాహాక సమావేశాలు జరిగాయి. అయితే ఈ మీటింగ్‌కు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ హాజరు కాలేదని తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం తరఫున బీఆర్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఆయనే. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్‌తో కలిసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లగా తెల్లం వెంకట్రావు మాత్రం వారితో వెళ్లలేదు. మరోవైపు ఇటీవలే కుటుంబంతో సహా ఆయన టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. దీంతో.. ఆయన పార్టీ మారబోతున్నారా? అనే చర్చ జోరందుకుంది. అయితే ఈ పరిణామాలపై బీఆర్ఎస్ శ్రేణులు స్పందించాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. గతంలోనూ ఆయన సీఎం రేవంత్‌ను కలవగా.. అప్పుడు ఇలాంటి ఊహాగానాలే వినిపించాయి. అయితే ఆ సమయంలో ఆయన ఆ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాజా పరిణామాలతో వెంకట్రావు పార్టీ మారతారన్న అనుమానాలు బలపడుతున్నాయి. -
పొలిటికల్ ట్విస్ట్.. సీఎం రేవంత్‌ను కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది. వివరాల ప్రకారం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం వెంకట్రావ్ తన కుటుంబసభ్యులతో వెళ్లి సీఎం రేవంత్‌ను కలిశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. దీంతో, ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎంను వెంకట్రావ్ కలవడం ఇది రెండోసారి. అనంతరం, వెంకట్రావ్ మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశాను. భద్రాచలం రామాలయం అభివృద్ధి. ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి. భద్రాచలం పట్టణంలో డంపింగ్ యార్డు సైతం లేదు. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం రేవంత్‌ను కలిశాను అని అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత దుర్మరణం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్చెరు/పటాన్చెరు టౌన్/కంటోన్మెంట్: దివంగత రాజకీయ నేత జి. సాయన్న కుమార్తె, బీఆర్ఎస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి. లాస్య నందిత (37) శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించారు. సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు తెలిపిన వివరాల ప్రకారం... సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై రామేశ్వరం బండ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు ఓ గుర్తుతెలియని భారీ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొని ఆపై నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కనున్న రెయిలింగ్‌ను గుద్దుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. కారు ముందు సీట్లో కూర్చున్న నందిత తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. వాహనం నడిపిన ఆమె పీఏ ఆకాష్ కాళ్లు విరిగాయి. కారు గంటకు సుమారు 100 కి.మీ. వేగంతో వెళ్తుండటంతో ప్రమాద తీవ్రతకు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాద వార్త తెలియగానే హైవే పాట్రోల్, స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఎమ్మెల్యే లాస్య నందిత, డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించగా నందిత అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు వెళుతున్న క్రమంలో.. ఎమ్మెల్యే లాస్య నందిత తన అక్క కూతురు స్కూల్లో చేరుతుండటంతో రెండు వాహనాల్లో కుటుంబ సభ్యులతో కలసి రెండు వాహనాల్లో గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు సమీపంలోని సూఫీ మిస్కిన్ దర్గాను దర్శించుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు అక్కడే ఉన్నారు. తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరుకున్నారు. ఇతర కుటుంబ సభ్యులను వారి నివాసాల్లో దింపిన అనంతరం ఆకలి వేస్తుండటంతో బ్రేక్‌ఫాస్ట్ చేసేందుకు శామీర్‌పేట వైపు నుంచి పటాన్చెరు వైపు వెళ్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్నట్లు సంగారెడ్డి అదనపు ఎస్పీ సంజీవరావు ప్రకటించారు. డ్రైవర్ ఆకాష్ అకస్మాత్తుగా నిద్ర మత్తులోకి జారుకోవడంతో ముందున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢీకొట్టి ఆపై రైలింగ్‌ను ఢీకొట్టినట్లు తెలుస్తోందని... ఆ సమయంలో ఎమ్మెల్యే లాస్య సీటు బెల్టు పెట్టుకున్నట్లే ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, లాస్య నందిత కారు ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనాన్ని జహీరాబాద్ వద్ద పోలీసులు స్వా«దీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. అక్క పిలుస్తోంది.. వెళ్లొస్తానని చెప్పి.. ఎమ్మెల్యే లాస్య కారు నడిపిన ఆకాశ్‌కు ఆమె నుంచి ఫోన్ రావడంతో అక్క దగ్గరికి వెళ్తున్నానంటూ ఇంట్లో వాళ్లకు చెప్పి బయలుదేరినట్లు తెలిసింది. ఆకాశ్ తండ్రి శ్రీనివాస్ కంటోన్మెంట్లో దఫేదార్‌గా పనిచేసి రెండేళ్ల క్రితం బ్రెయిన్‌డెడ్‌కు గురై మరణించారు. మడ్‌ఫోర్ట్‌లో నివసించే ఆకాశ్ ఇటీవలే కానిస్టేబుల్ రాత పరీక్షల్లో ఉత్తీర్ణుడైనట్లు అతని సన్నిహితులు పేర్కొంటున్నారు. లాస్య నందిత చిన్నమ్మ కూతురు, కొడుకు పీయూష్ రాఘవ, ఆకాశ్ స్నేహితులు. ఈ క్రమంలోనే పీయూష్ ద్వారా లాస్యకు ఆకాశ్ పరిచయం అయ్యాడు. ఇంటి మనిషిగా వ్యక్తిగత పనులపై వెళ్లినప్పుడు తరచూ ఆకాశ్‌తోనే ఆమె బయటకు వెళ్లేవారని తెలుస్తోంది. 10 రోజుల క్రితం నల్లగొండలో లాస్య కారు ప్రమాదానికి గురైన సమయంలో పీయూష్ ఆ వాహనాన్ని నడపగా శుక్రవారం నాటి ప్రమాదంలో ఆకాశ్ వాహనాన్ని నడపడం గమనార్హం. కేసు నమోదు ఈ ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత పీఏ ఆకాష్‌పై పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 304 కింద కేసు పెట్టారు. నిర్లక్ష్యంగా వాహనం నడిపారని లాస్య సోదరి నివేదిత ఇచ్చిన ఫిర్యాధు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు పటాన్చెరు పోలీసులు తెలిపారు. సీఎం రేవంత్ సహా నేతల నివాళి... రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎమ్మెల్యే లాస్య నందిత పారి్థవదేహానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, స్పీకర్ ప్రసాద్‌రావు, ప్రతిపక్ష నేత కె. చంద్రశేఖర్‌రావు సహా పలువురు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని స్వగృహానికి ఆమె పారి్థవదేహాన్ని తరలించగా సీఎం, మంత్రులు ఎమ్మెల్యేలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మరికొందరు నేతలు ఆమె నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఆమె అంతిమయాత్రలో పాడె మోశారు. శుక్రవారం సాయంత్రం ఈస్ట్ మారేడుపల్లిలోని హిందూ శ్మశానవాటికలో అధికార లాంఛనాలతో లాస్య నందిత అంత్యక్రియలు జరిగాయి. కుటుంబానికి అండగా ఉంటాం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కష్టకాలంలో ఉన్న ఆమె కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. ఇటీవల నల్లగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన లాస్య నందితను పరామర్శించి వారం కూడా కాకముందే ఆమె లేరనే విషాదకర వార్తను వినాల్సి వస్తుందని అనుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లాస్యను వెంటాడిన వరుస ప్రమాదాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితను రెండు నెలలుగా వరుస ప్రమాదాలు వెంటాడాయి. గతేడాది డిసెంబర్ 3న ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య అదే నెల 24న బోయిన్‌పల్లిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నూతన విభాగం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా వెళ్లారు. సెల్లార్ నుంచి మూడో అంతస్తుకు వెళ్లే క్రమంలో ఒకటో అంతస్తుకు రాగానే లిఫ్ట్ కూలిపోయింది. లిఫ్ట్‌ను బద్దలు కొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చారు. దీంతో భయాందోళనకు గురైన ఆమె ఆసుపత్రి ప్రారం¿ోత్సవంలో పాల్గొనకుండానే వెనుతిరిగారు. ఈ ఏడాది జనవరి మూడో వారంలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ నెల 13న నల్లగొండలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొని తిరిగి వస్తుండగా చర్లపల్లి వద్ద ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఆ ఘటనలో ట్రాఫిక్ హోంగార్డు మృతి చెందాడు. ఈ రెండు ఘటనల నుంచి తేరుకోకముందే లాస్య నందిత ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఏడాది వ్యవధిలోనే తండ్రి, కూతురు మృతి కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న గతేడాది ఫిబ్రవరి 19న అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో మరణించారు. ఇటీవలే సాయన్న ప్రథమ వర్ధంతిని నిర్వహించగా అది జరిగిన నాలుగు రోజులకే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. మెజారిటీ కంటోన్మెంట్ వాసులు సైతం సాయన్నను తమ కుటుంబ సభ్యుడిగానే భావించేవారు. సాయన్న మరణానంతరం సైతం ఆయన కుమార్తె లాస్యను 17వేల ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించారు. రెండున్నర నెలల్లోనే లాస్య మృతి చెందడంపట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. -
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వేకువ ఝామున పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడిపిన ఆమె పీఏ, స్నేహితుడు ఆకాష్‌కు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుల్తాన్పూర్ వద్ద ఓఆర్ఆర్పై ప్రమాదానికి గురైన కారు నిద్రమత్తులోనే? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద ఈ తెల్లవారు ఝామున దుర్ఘటన చోటు చేసుకుంది. మొక్కులు తీర్చుకునే క్రమంలో లాస్య తప్ప ఆమె కుటుంబ సభ్యులంతా గురువారం రాత్రి సదాశివపేట (మం) కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాకి వెళ్లారు. కాసేపటికే ఆకాష్‌తో పాటు లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి 12.30 గంటలకు దర్గాలో పూజలు చేశారని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. తిరిగి.. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్‌కు లాస్య కుటుంబం పయనం అయ్యింది. మొక్కులు తీర్చుకున్న తర్వాత.. 3 నుంచి 4 గంటల మధ్య లాస్య కారు బయల్దేరిందని చెప్తున్నారు. అయితే.. పటాన్ చెరు వైపు ఎందుకు ఆమె వాహనం వెళ్లింది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి నిద్రమత్తు, వాహన అతివేగం ప్రమాదానికి కారణాలైన ఉంటాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి.. రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్య సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. సుల్తాన్పూర్ వద్ద ఓఆర్ఆర్పై ప్రమాదానికి గురైన కారు తల్లడిల్లిన తల్లి గుండె ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న లాస్య నందిత స్పాట్లోనే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఆకాశ్‌ను మియాపూర్ మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్చెరు అమెథా ఆస్పత్రికి తరలించారు. కూతురి మరణవార్త విని తల్లి స్పృహ తప్పి పడిపోయారు. మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించారు. సోదరి నివేదితా రోదన పలువురిని కంటతడి పెట్టించింది. బీఆర్ఎస్ సీనియర్ హరీష్‌రావు ఆస్పత్రికి వెళ్లి లాస్య కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. గాంధీ ఆస్పత్రిలో లాస్య మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అందజేస్తారు. ఇక.. యువ ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లాస్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన హరీష్‌రావు సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారుల్ని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు సైతం లాస్య మృతిపై సంతాపం ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి గాంధీ ఆస్పత్రికి వెళ్లి లాస్య కుటుంబాన్ని పరామర్శించారు. లాస్య మృతి బాధాకరమని.. ఎమ్మెల్యేగా ఆమె ప్రజలకు ఇచ్చిన హామీల్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. లాస్య నందిత మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారాయన. బీఆర్ఎస్ నేతలు తలసాని, హరీష్‌రావు, కేటీఆర్, మల్లారెడ్డి.. తదితరులు లాస్య మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత లాస్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. లాస్య అంత్యక్రియలు అయ్యేదాకా ఆమె కుటుంబ సభ్యులతోనే ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం కవితకు సూచించినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసుల దర్యాప్తు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరగ్గా.. ప్రాథమికంగా వచ్చిన అంచనాతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోప్రమాద తీరును పోలీసు బృందాలు పరిశీలించాయి. త్వరలో కుటుంబ సభ్యులనూ పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే.. లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గతేడాది ఫిబ్రవరిలో సాయన్న గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. నవంబర్ చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో.. అదీ చిన్న వయసులో లాస్య ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. @KTRBRS @TelanganaCMO @BRSparty pic.twitter.com/r3ZBt5SiAz — G Lasya Nanditha (@glasyananditha) December 9, 2023 10 రోజుల కిందటే ప్రమాదం.. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక లాస్య నందిత వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. ఫిబ్రవరి 13వ తేదీన నల్లగొండలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఈ సభకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కట్‌పల్లి వద్ద ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆమె వెళ్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య తలకు స్వల్ప గాయమైంది కూడా. అయితే ఆ సమయంలోనూ ఆకాషే(25) కారు నడిపినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. కిందటి ఏడాది డిసెంబర్లో ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆమె మూడు గంటలపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. సిబ్బంది అతికష్టం మీద లిఫ్ట్‌ను బద్ధలు కొట్టి ఆమెను, ఆమెతో పాటు ఉన్నవాళ్లను బయటకు తీశారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదికే.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందడం గమనార్హం. నార్కట్‌పల్లి వద్ద లాస్య కారుకు ప్రమాదం కుటుంబ నేపథ్యం.. సాయన్న, గీతలకు లాస్య నందిత జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు.. నమ్రతా, నివేదితా. లాస్య కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశారు. లాస్య నందిత గతంలో కవాడిగూడ కార్పొరేటర్‌గానూ పని చేశారు. తండ్రి మరణంతో ఆమెకు బీఆర్ఎస్ సీటు ఇవ్వగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్ గణేష్‌పై 17 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో లాస్య గెలుపొందారు. ఏడాదికే.. ప్రజాప్రతినిధుల హోదాలోనే ఈ తండ్రీకూతుళ్లిద్దరూ మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తండ్రి సాయన్నతో లాస్య నందిత -
BRS MLA Malla Reddy Goa Trip: గోవాలో చిల్ అయిన ఎమ్మెల్యే మల్లారెడ్డి.. ఫొటోలు వైరల్
హైదరాబాద్: భారాస ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అంటే సందడి. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా ఆయన జోష్ చూపిస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు ఎన్నికల హడావుడితో అలసిపోయిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గోవాకు వెళ్లి చిల్ అయ్యారు. ఆయన తన బృందంతో కలిసి గోవాకు వెళ్లి అక్కడ సముద్రంలో బోటింగ్, స్కూబాడైవింగ్ చేశారు. బోటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోవాలో ఆయన చేసిన జల్సాల ఫొటోలు వైరల్ అయ్యాయి. పలువురు నెటిజన్లు మల్లన్నా.. మజాకా అంటూ కామెంట్స్ చేశారు. -
ఓటమి తర్వాత కేసీఆర్ తొలిసారి ఇలా..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో గెలిచిన ఎమ్మెల్యేతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు. వచ్చే నెల 16వ తేదీ దాకా మన ప్రభుత్వం కొనసాగేందుకు అవకాశం ఉంది(తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి గడువు జనవరి 16వ తేదీ దాకా ఉంది). కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరగుతుందో చూద్దాం’’ అని అన్నట్లు తెలుస్తోంది. అలాగే.. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ మీటింగ్ జరుపుదాం. ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేద్దాం. అదే మీటింగ్‌లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతను ఎన్నుకుందాం అని ఆయన ఎమ్మెల్యేలతో అన్నారు. సీఎం కేసీఆర్‌ను కలిసిన వాళ్లలో నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్లు ఉన్నారు.