ఎమ్మెల్యేలు పార్టీ మారితే నష్టమేమీ లేదు
గతంలోనూ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు
హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలం
రాజకీయ భవిష్యత్‌పై నగర ఎమ్మెల్యేలకు కేసీఆర్ భరోసా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీల అమలులో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, భవిష్యత్‌లో బీఆర్‌ఎస్‌కు మళ్లీ మంచిరోజులు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మె ల్యేలకు భరోసా ఇచ్చారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ మారడాన్ని పట్టించుకోవా ల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యేలను కాంగ్రెస్ పార్టీ చేర్చుకొని ఉద్యమస్ఫూర్తి ని దెబ్బతీసేందుకు ప్రయత్నించినా వెనుకంజ వేయలేదన్నారు.
పార్టీ ఫిరాయింపు వ్యవహారం చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో బీఆర్ ఎస్‌కు చెందిన పలువురు శాసనసభ్యు లు, శాసన మండలి సభ్యులు మంగళవారం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన ఈ భేటీ లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అరడజను మంది ఎమ్మెల్యేలు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం, క్షీణించిన శాంతిభద్రతలు వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
రాష్ట్ర ఏర్పాటు ద్వారా అనుభవం కలిగిన నేతలను పునర్నిర్మాణంలో భాగస్వాము లు చేయాలనే లక్ష్యంతోనే కొందరిని బీఆర్ ఎస్‌లో గతంలో చేర్చుకున్నట్టు కేసీఆర్ చెప్పారు. అధికారం కేంద్రంగా పరిభ్రమించే వ్యక్తులు కొందరు అన్నిచోట్లా ఉంటారని, అలాంటి వారిని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. పార్టీ వెంట నడిచే వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని కేసీ ఆర్ భరోసా ఇచ్చినట్టు భేటీలో పాల్గొన్న నేతలు వెల్లడించారు.
నగర ఎమ్మెల్యేల భేటీకి ప్రాధాన్యం
ఎర్రవల్లిలో కేసీఆర్‌ను కలిసిన వారిలో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డితోపాటు పలువురు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర నేతలున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఖైరతాబాద్ ఎమ్మె ల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరిన నేపథ్యంలో మరికొందరు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కూడా అదే తోవ పడుతున్నారనే ప్రచారం జరు గుతోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే లు కేసీఆర్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేసీఆర్‌ను కలిసిన గ్రేటర్ ఎమ్మెల్యేల్లో అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), మాధవరం కృష్ణారావు (కూకట్‌పల్లి), ముఠా గోపాల్ (ముషీరాబాద్), ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), కేపీ.వివేకానంద (కుత్బుల్లాపూర్) ఉన్నారు. వీరితోపాటు ఎమ్మె ల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, పార్టీ నేతలు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్‌రెడ్డి కూడా కేసీఆర్‌ను కలి శారు. కేసీఆర్‌తో భేటీ అధికారిక సమావేశం కాదని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. బుధ వారం కూడా పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసీఆర్‌తో భేటీ అయ్యే అవకాశముంది. రెండు రోజులుగా కేసీఆర్‌ను కలిసేందుకు వందల మంది నాయకులు, కార్యకర్తలు తరలివస్తుండటంతో ఎర్రవల్లి నివాసం వద్ద సందడి నెలకొంది.
కౌశిక్ హరికి అభినందనలు
ఇటీవల రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్ట రీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కార్మిక సంఘంనేత కౌశిక్ హరి కుటుంబ సమేతంగా ఎర్రవల్లి నివాసంలో కేసీ ఆర్‌ను కలిశారు. కౌశిక్ హరిని కేసీఆర్‌తోపాటు కేటీఆర్, హరీశ్‌రావులు కూడా అభినందించారు.
కేసీఆర్‌కు ఊరట రైల్‌రోకో కేసు దర్యాప్తును నిలిపివేసిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుకు హై కోర్టులో ఊరట లభించింది. ఆయనను నిందితుడిగా చేర్చిన మౌలాలి రైల్‌రోకో కేసులో దర్యాప్తును నిలిపివేసింది. తదుపరి విచారణ వరకు దర్యాప్తుపై స్టే విధించింది. పోలీసుల కు నోటీసులు జారీ చేసిన జస్టిస్ బి.విజయ్ సేన్‌రెడ్డి తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విచారణను జూలై 23 కు వాయిదా వేశారు. 2011లో తనపై నమోదైన రైల్‌రోకో కేసును కొట్టివేయాలని, ఎలాంటి ఆధారాలు లేకు న్నా తనను నిందితుల జాబితాలో చేర్చారంటూ కేసీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా 2011లో మౌలాలి రైల్వేస్టేషన్‌లో జరిగే రైల్‌రోకోలో పాల్గొనా ల ని ఉద్యమకారులను నేను, ప్రొఫెసర్ కోదండరామ్ పురిగొల్పినట్లు పేర్కొంటూ కేసు నమోదు చేశారు. స్వరాష్ట్ర పోరాటంలో నేను, కోదండరామ్‌లు తమకు పిలుపునిచ్చారన్న సాక్షుల మౌఖిక వాంగ్మూలం తప్ప పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. నేను ఆ రైల్ రోకోలో పాల్గొనలేదు. ఆధారాలు లేకుండా నిందితుల జాబితాలో నా పేరు చేర్చారు. కనుక ఈ కేసు కొట్టివేయాలి’ అని కేసీఆర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ చేపట్టిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి వాదనల సందర్భంగా.. కేసీఆర్ రైల్ రోకోలో పాల్గొన్నట్లు చార్జిషీట్‌లో పేర్కొనలే దు కదా అని అన్నారు. ఆధారాలు లేకుండా కేసు నమోదు చేయడం సరికాదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment