మీడియా కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు: బొంతు రామ్మోహన్ | BRS MLAs Kaushik Reddy Vs Arikepudi Gandhi Row Updates | Sakshi
Sakshi News home page

మళ్లీ ఉద్రిక్తత..బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హౌస్‌ అరెస్టు

Published Fri, Sep 13 2024 7:15 AM | Last Updated on Fri, Sep 13 2024 2:53 PM

BRS MLAs Kaushik Reddy Vs Arikepudi Gandhi Row Updates

సాక్షి,హైదరాబాద్‌: శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడిగాంధీ ఇంట్లో మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతల భేటీ పిలుపు ఉద్రిక్తతలకు దారి తీసింది. శుక్రవారం(సెప్టెంబర్‌13) ఉదయం 11 గంటలకు అరికెపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజవర్గ  బీఆర్‌ఎస్‌ పార్టీ విస్తృత స్థాయి భేటీ నిర్వహించేందుకు సిద్ధమైన మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని హౌస్‌ అరెస్టులు చేశారు. ఎమ్మెల్యేలు తలసాని, కౌశిక్‌ రెడ్డి, మాగంటి గోపినాథ్‌, వివేకానంద, మాధవరం కృష్ణారావు, బండారి లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలను ఆయా ప్రాంతాల్లో వారి ఇళ్లలోనుంచి బయటికి రాకుండా హౌస్‌ అరెస్టు చేశారు. 

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి మద్ధతు పలకడానికి అయన నివాసానికి వచ్చిన బొంతు రామ్మోహన్

  • మీడియాలో వార్తల కోసమే కౌశిక్ రెడ్డి డ్రామాలు చేస్తున్నాడు: బొంతు రామ్మోహన్ 
  • సీనియర్ నేత గాంధీ పట్ల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.
  • ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ ప్రాంతీయ అసమానతలు సృష్టిస్తుంది.
  • హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకోవటమే బీఆర్ఎస్ లక్ష్యం.
  • సెటిలర్ల పట్ల కౌశిక్ రెడ్డి కామెంట్స్ సరైనవి కావు.
  • సీనియర్ నేత గాంధీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది.

రాజా సింగ్, బీజేపీ ఎమ్మెల్యే

  • మాజీ మంత్రి కేటీఆర్ అధికారం కోల్పోవడంతో మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యారు.
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిందీ కూడా నేర్చుకుంటే బాగుంటందని మంచి సూచన చేశారు.
  • దాన్ని తప్పు పడుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
  • పనిపాట లేక కేంద్రంపై ఏదో ఒక ఆరోపణ చేయాలని కేటీఆర్ ట్వీట్  చేశారు.
  • కాంగ్రెస్ పైన మంచిగా ఫైట్ చేస్తున్నారు..
  • కేటీఆర్‌తోపాటు వారి ఎమ్మెల్యేలు మంచిగా ఫైట్ చేస్తున్నారు ఆ దారిలో వెళ్లండి.
  • కానీ మధ్యలో మంచి పనులపై ఇలాంటి కామెంట్స్ చేస్తే పిచివాళ్లని జనాలు అంటారు..

నేను చేసిన తప్పు ఏంటి?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

  • ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను, మాజీ మంత్రులను హౌస్ అరెస్టులు చేశారు.
  • ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్దామని నేను, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు బయలుదేరాము.
  • మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు.
  • నాపై ఇంటిపై దాడికి పోలీసులు ఎందుకు అనుమతి ఇచ్చారు.
  • స్వయంగా రేవంత్ రెడ్డి పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయండని చెప్పారు.
  • నాపై హత్యాయత్నం చేశారు.
  • తెలంగాణలో ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే ఎట్లా
  • నేను చేసిన తప్పు ఏంటి.?
  • అరికేపూడి గాంధీ భాషను శేరిలింగంపల్లి ప్రజలు గమనించాలి.
  • స్వయంగా అరికేపూడి గాంధీ నేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్తున్నారు.
  • అరికేపూడి గాంధీ భాషను సమాజం అంగీకరిస్తుందా?
  • నేను వుండే విల్లాలో మొత్తం 69 కుటుంబాలు ఉంటాయి.
  • అదే విల్లాలో ఏపీ మంత్రి నారాయణ,ఎమ్మెల్యేలు ఉంటారు.
  • నేను వ్యక్తిగతంగా అరికేపూడి గాంధీని అన్నాను.
  • ఆంధ్రా వాళ్ళు అంటే మాకు గౌరవం ఉంది.
  • చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా, తెలంగాణ అంటూ రెచ్చగొడుతున్నారు.
  • హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారు.
  • రేవంత్ రెడ్డి కుట్రతో హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.
  • రేవంత్ రెడ్డి చంద్రబాబు డైరెక్షన్ లో హైదరాబాద్ అభివృద్ధిని అమరావతికి తరలిస్తున్నారు.
  • రేవంత్ రెడ్డి కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు
  • కాంగ్రెస్ మంత్రులు కౌశిక్ రెడ్డి స్థాయికి దిగిపోయారు
  • రేవంత్ రెడ్డికి ఇక నుంచి కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు అవసరం లేదు
  • కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డితో కాంప్రమైజ్ కావడానికి సిద్ధంగా లేడు.
  • బిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం కొట్లాడుతాను.
  • కేసీఆర్ హయాంలో హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయా...?
  • కేసీఆర్,తెలంగాణ లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చునేవారా...?
  • రేవంత్ రెడ్డి అవాకులు చెవాకులు బంద్ చేయాలి 
  • మీ రౌడీయిజాన్ని ప్రజలు చూశారు
  • నిన్న హరీష్ రావును అరెస్టు చేసి షాద్ నగర్ కు తీసుకువెళ్లారు
  • బీఆర్ఎస్ పార్టీ నేతలపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది.
  • పోలీసు రాజ్యంతో ప్రభుత్వాన్ని నడపలేరు.
  • ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి ఉండదు
  • నాకు అండగా నిలిచిన బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కార్యకర్తలకు ధన్యవాదాలు
  • హైకోర్టు తీర్పు తర్వాత పార్టీ మారిన ఎమ్మెల్యేలు గజగజ వణుకుతున్నారు.
  • పది నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా.
  • కేసీఆర్ పెట్టిన భిక్షతో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు అయ్యారు.
  • ఇప్పటికైనా సిగ్గు,శరం ఉంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలు రిజైన్ చేయాలి.
  • నేను అడిగిన ప్రశ్నలకు అరికేపూడి గాంధీకి ఎందుకు భయం?
  • పీఏసీ చైర్మన్‌గా బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు పేరును ఇచ్చింది.
  • హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకునేందుకు మేము దాడులు చేయడం లేదు.
  • దానం నాగేందర్‌కు గోకుడు ఎక్కువ ఉంది
  • దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి  రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి.
  • నేను సెటిలర్స్ అనే పదం ఎక్కడా వాడలేదు.
  • నేను ఎక్కడైనా ఆంధ్రా అనే పదం వాడితే అది నాకు గాంధీకి వ్యక్తిగతం మాత్రమే.
  • కేసీఆర్ సీఎంగా వున్నప్పుడు ఆంధ్రా సెటిలర్స్ ను మంచిగా చూసుకున్నారు.
  • ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్స్ బిఆర్ఎస్ పార్టీ వెంట ఉన్నారు.
  • సెటిలర్స్ ను మా నుండి దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

 అల్లర్లు సృష్టించాలని కుట్ర చేస్తున్నారు: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

  • సీఎం రేవంత్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక హై డ్రామా చేస్తున్నారు.
  • కౌశి క్ రెడ్డి అనే షికండిని పెట్టి హరీష్ రావు డ్రామా అడుతున్నాడు.
  • కౌశిక్ రెడ్డికి మహిళల పట్ల గౌరవం లేదు.
  • మహిళ గౌర్నర్ ని కూడా అవమానించాడు.
  • కరీంనగర్ జెడ్పీ మీటింగ్‌లో మహిళా కలెక్టర్ పై కూడా అమర్యాదగా మాట్లాడారు.
  • రాష్ట్రంలో అల్లర్లు సృష్టించాలని కుట్ర చేస్తున్నారు.
  • ఈ కుట్రలను పసిగట్టాలని డిజిపికి విజ్ఞప్తి.
  • కేసీఆర్‌ పామ్ హౌస్ లో పడుకున్నాడు.
  • కేటీఆర్ విదేశాల్లో ఉండి కుట్రలకు తెర లేపారు.
  • గ్యాప్‌ను ఉపయోగించుకోవాలని హరీష్ రావు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు.
  • కౌశిక్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి.
  • లేదంటే తెలంగాణ ప్రజలు కౌశిక్ రెడ్డిని తిరగనియ్యరు.

ఏఐజీ ఆస్పత్రిలో హరీశ్‌రావుకు వైద్య పరీక్షలు

  • కుడి భుజానికి చికిత్స తీసుకునేందుకు హరీశ్‌రావుకు అనుమతిచ్చిన పోలీసులు

  • గురువారం గొడవల్లో హరీశ్‌రావు భుజానికి గాయం

  • తొలుత హౌస్‌ అరెస్టు కారణంగా ఇంట్లోనుంచి బయటికి రావడానికి అనుమతించని పోలీసులు 

  • తర్వాత అనుమతిచ్చి  ఏఐజీ ఆస్పత్రికి హరీశ్‌రావు వెంట వచ్చిన పోలీసులు

  • ఆస్పత్రిలో హరీశ్‌రావును ఎవరితో కలవనివ్వని పోలీసులు

  • హరీశ్‌రావును కలిసేందుకు ఆయన నివాసానికి వచ్చిన బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోత్‌ కవిత అరెస్టు

కౌశిక్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు హౌస్‌ అరెస్టు

  • పీఏసీ చైర్మన్ గా ఎమ్మెల్యే గాంధీ ఎన్నికైనందునే శాలువా కప్పడానికి  వెళ్తామంటే పోలీసులు అరెస్ట్  చేస్తున్నారు.

  • గాంధే స్వయంగా రమ్మని ఆహ్వానించినా పోలీసులు అడ్డుకుంటున్నారు.

  • ఎమ్మెల్యే దానం  నాగేందర్ అరికెపూడి గాంధీ  ఇంటికి  ఎలా   వెళ్లారు వారికి ఎలా పర్మిషన్‌ ఇస్తారు. 

  • ఎమ్మెల్యే గాంధీ ఇంటికి బయల్దేరిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ శంభీపూర్‌ రాజులను పోలీసులు బలవంతంగా  ఇంట్లోకి లాక్కెళ్లి హౌస్‌ అరెస్టు చేశారు. 

హరీశ్‌రావు అంటే గౌరవం.. ఆయన స్థాయి తగ్గించుకుంటున్నారు: దానం నాగేందర్‌ 

  • కౌశిక్ రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి. కౌశిక్ రెడ్డికి మహిళలంటే లెక్కలేదు.
  • ఆయన ఒక బచ్చా.  మహిళల ప్రతాపం అతనికి పూర్తిస్థాయిలో తెలియదు.
  • మా ఎమ్మెల్యే గాంధీ టిఫిన్‌కి పిలిచాడు. అందుకోసమే గాంధీ ఇంటికి వచ్చాను.
  • హారతులిచ్చి స్వాగతం పలుకుతామంటేనే గాంధీ, కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళాడు.
  • ప్రాంతీయ విభేదాలను కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టడం సరికాదు.
  • హరీష్ రావు అంటే నాకు గౌరవం. ఆయన స్థాయిని తగ్గించుకుంటున్నారు

మాజీ మంత్రి హరీశ్‌రావు హౌజ్‌ అరెస్ట్‌.. 

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ  ఇంట్లో భేటీ అవుతామని మేడ్చల్‌ జిల్లా నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత హరీశ్‌రావు ఇంటి వద్ద భారీగా మోహరించారు. కోకాపేటలోని ఇంట్లోనే హరీశ్‌రావును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. హరీశ్‌రావు ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఇటు హరీశ్‌రావు బయటికి వెళ్లకుండా అటు ఇంట్లోకి ఎవరూ రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. బీఆర్‌ఎస్‌ మహిళా నేతలు సునీతా లక్ష్మారెడ్డి, మాలోత్‌ కవితను హరీశ్‌రావు నివాసంలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. 

గురువారం నిరసనలు, పోలీసుల అరెస్టు సందర్భంగా హరీశ్‌రావు చేతి గాయమైంది. ఈ గాయానికి చికిత్స తీసకోవడానికి ఆస్పత్రికి వెళ్తానని చెప్పినా తొలుత అనుమతించని పోలీసులు తర్వాత అనుమతిచ్చి ఆయన వెంట ఆస్పత్రికి వెళ్లారు. 

పార్టీ ఫిరాయింపుల విషయంలో కౌశిక్‌రెడ్డి వర్సెస్‌ అరికెపూడి గాంధీ వివాదంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ ముందు  ఇతర బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిపి నిరసన తెలిపిన హరీశ్‌రావును పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రి 11 గంటలకు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా హరీశ్‌రావు చేతికి గాయమైంది. 

బీఆర్‌ఎస్‌తో యుద్ధం కాదు.. కౌశిక్‌రెడ్డితోనే యుద్ధం: ఎమ్మెల్యే గాంధీ 

ఇది బీఆర్‌ఎస్‌,గాంధీకి యుద్ధం కాదని, కౌశిక్‌రెడ్డికి తనకు మధ్య యుద్ధమని  ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ఈ విషయమై శుక్రవారం(సెప్టెంబర్‌13) ఉదయం మీడియాతో ఆయన మాట్లాడారు.

  •  గురువారం ఉదయం నా ఇంటికి వస్తానని కౌశిక్‌రెడ్డి అన్నారు.

  • ఆయన రానందున వాళ్ల ఇంటికి నేనే వెళ్లా. ఇది బీఆర్‌ఎస్‌, గాంధీకి యుద్ధం కాదు.

  • కౌశిక్‌రెడ్డితో యుద్ధం. కౌశిక్‌ బీఆర్‌ఎస్‌లోకి వచ్చి పార్టీని  భ్రష్టుపట్టిస్తున్నారు.

  • ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తించాలి. పార్టీలో ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తున్నారు.

  • ఇలాంటి వాళ్లు బీఆర్‌ఎస్‌లో ఉంటే మరింత మంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోయే ప్రమాదముంది.

  • ఈ విషయాన్ని కేసీఆర్‌ గుర్తించాలి. బీఆర్‌ఎస్‌, కేసీఆర్‌ అంటే నాకు గౌరవం.

  • వ్యక్తిగతంగా మాత్రమే కౌశిక్‌రెడ్డితోనే నాకు యుద్ధం. సమఉజ్జీ కూడా కాని  కౌశి‌క్‌రెడ్డి ఇంటికి వెళ్లినందుకు  బాధపడుతున్నా

గాంధీ ఇంటి వద్ద భారీ బందోబస్తు.. 

గాంధీ ఇంట్లో భేటీకి బీఆర్‌ఎస్‌ పిలుపు నేపథ్యంలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఏర్పాటు చేసి గాంధీ నివాసానికి  ఎవరు వచ్చినా అడ్డుకుంటున్నారు. శుక్రవారం ఉదయం గాంధీ ఇంటికి వచ్చిన పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను అరెస్టు చేసి ఇప్పటికే అక్కడినుంచి తరలించారు. 

కౌశిక్‌రెడ్డి డౌన్‌డౌన్‌ నినాదాలు.. గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత

  • ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంట్లో ముగిసిన కార్యకర్తల సమావేశం.

  • కౌశిక్ రెడ్డిని తక్షణమే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ సమావేశంలో తీర్మానం.

  • కౌశిక్ రెడ్డితో పాటు ఇతర నాయకులు, కార్యకర్తలు ఎవరు గాంధీ వచ్చినా సానుకూలంగా స్వాగతిస్తాం.

  • ఒకవేళ దాడి చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ప్రతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నామని గాంధీ అనుచరులు స్పష్టం చేశారు.

  • కౌశిక్‌రెడ్డి డౌన్‌డౌన్‌ నినాదాలతో గాంధీ నివాసప్రాంగణం మార్మోగుతోంది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత నెలకొంది. 

మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ నేతల ముందస్తు అరెస్టులు..

మరోవైపు గాంధీ ఇంట్లో భేటీకి సిద్ధమవుతున్న పలువురు మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలను పోలీసులు ఉదయం నుంచే అరెస్టు చేస్తున్నారు. పలువురిని హౌస్‌ అరెస్ట్‌ చేస్తున్నారు. భేటీ కోసం బీఆర్‌ఎస్‌ నేతలు ఎమ్మెల్యే గాంధీ ఇంటికి వెళితే ఉద్రిక్తతలకు దారి తీస్తుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

 మా ఎమ్మెల్యే ఇంటికి మేం వెళితే తప్పేంటి: మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ చీఫ్‌ శంభీపూర్‌ రాజు 

ఎమ్మెల్యే గాంధీ ఇంట్లో మేడ్చల్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతల భేటీకి పిలుపునిచ్చిన జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత శంభీపూర్‌రాజు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దీనిపై రాజు స్పందించారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఇంటికి తాము వెళితే తప్పేంటి అని రాజు ప్రశ్నించారు. ఎమ్మెల్యే గాంధీ బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా అని చెప్పిన మాటలను ఈ సందర్భంగా రాజు గుర్తు చేశారు. 

ఎమ్మెల్యే గాంధీ బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇంటికి రావాలని రాజు ఆహ్వానించారు. మరోపక్క గాంధీ ఇంటికి బయలుదేరిన మేడ్చల్‌ బీఆర్‌ఎస్‌ నేతలను, రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు చెందిన గులాబీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. 

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అడిషనల్‌ ఎస్పీ ఫిర్యాదు.. కేసు నమోదు  

పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై  అడిషనల్‌ ఎస్పీ రవిచందన్‌ ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఫిర్యాదుతో కౌశిక్‌రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ దాడి పట్ల చర్యలు తీసుకోవాలని సైబరాబాద్‌ కమిషనరేట్‌ ముందు ఆందోళనకు దిగిన హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, వద్దిరాజు రవిచంద్ర తదితర బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులను పోలీసులు అక్కడినుంచి తరలించి కేశంపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీఛార్జ్‌ చేయాల్సివచ్చింది. అనంతరం రాత్రి 11 గంటలకు హరీశ్‌రావు సహా ఇతర బీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలను పోలీసులు కేశంపేట పోలీస్‌స్టేషన్‌ నుంచి విడుదల చేశారు. 

ఇదీ చదవండి.. బీఆర్‌ఎస్‌లోనే గాంధీ.. ప్రతిపక్షానికే పీఏసీ: సీఎం రేవంత్‌

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement