బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత..హైకోర్టులో పాల్‌ వాదనలు | Telangana High Court Hearing On KA Paul Petition Over BRS MLAs | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత..హైకోర్టులో పాల్‌ వాదనలు

Published Fri, Oct 25 2024 4:05 PM | Last Updated on Fri, Oct 25 2024 4:14 PM

Telangana High Court Hearing On KA Paul Petition Over BRS MLAs

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం(అక్టోబర్‌ 25) మరోసారి విచారించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేఏ పాల్‌ హైకోర్టులో తాజాగా  పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 

ఈ కేసులో పాల్‌ పార్టీఇన్‌పర్సన్‌(స్వయంగా)గా కేఏ పాల్‌ వాదనలు వినిపించారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు నవంబర్‌ 4కు వాయిదా వేసింది.కాగా, తమ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై బీఆర్‌ఎస్‌ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్‌ కార్యాలయానికి తుది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.  

ఇదీ చదవండి: మాజీ ఈఎన్‌సీకి కాళేశ్వరం కమిషన్‌ కీలక ఆదేశాలు 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement