defection case
-
మేం చూస్తూ ఊరుకోం!.. సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు ఎంత సమయం కావాలి? తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం.’’ – తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శి తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీతో సుప్రీంకోర్టు ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ‘‘ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో చర్యలు తీసుకోవడానికి మీకెంత సమయం కావాలో చెప్పండి. ఇంకా తగినంత సమయం కావాలని అడుగుతున్నారు. తగినంత సమయం అంటే ఎంత? ఆ సమయానికి ఏదైనా గడువు అనేది ఉండాలి కదా? ఇలా సమయాన్ని పెంచుకుంటూ వెళితే ఎలా? రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే.. మేం చూస్తూ ఊరుకోబోం’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. కావాల్సిన సమయం ఎంత అనేది చెప్పకపోతే.. తామే గడువు పెడతామని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తరఫు న్యాయవాదికి స్పష్టం చేసింది. రెండు పిటిషన్లపై విచారణ.. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రా వ్, దానం నాగేందర్లపై ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ), మరో ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీని వాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహిపాల్‌రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. ఈ రెండు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచా రణ చేపట్టింది. స్పీకర్ తరపున సీనియర్ న్యాయ వాది ముకుల్ రోహత్గీ వాదనలు విని పించగా.. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యామ సుందరం, దామ శేషాద్రినాయుడు, పి.మోహిత్‌రావు వాదనలు వినిపించారు. ఇంకా ఎంత సమయం కావాలి? తొలుత పిటిషనర్ల తరపు న్యాయవాది శేషాద్రినాయుడు వాదనలు వినిపిస్తూ.. ‘‘బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. మరో ఎమ్మెల్యే ఆయన కుమార్తె కోసం ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేశారు’’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తాము విచారణ జరుపుతున్నది ఎన్నికల ప్రచారంపై కాదని, అనర్హత పిటిషన్‌పై మాత్రమేనని, అందువల్ల పిటిషన్లో ఉన్న అంశాలను ప్రస్తావించాలని సూచించింది. పిటిషన్‌పై స్పందించేందుకు మీకెంత సమయం కావాలని స్పీకర్ కార్యదర్శి తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. తమకు ఇంకా తగినంత సమయం కావాలని రోహత్గీ బదులిచ్చారు. ఈ సమయంలో పిటిషనర్ల తరపు మరో న్యాయవాది ఆర్యామ సుందరం జోక్యం చేసుకుంటూ.. ‘‘ఇప్పటికే పది నెలలు గడిచింది, మొదట్లోనే దీనిపై స్పీకర్ స్పందించి ఉంటే.. మిగతా ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించేవారు కాదు’’ అని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. హక్కులకు సంబంధించిన అంశం ఇది అయితే తమకు ఇంకా సమయం కావాలని రోహత్గీ ఈ సందర్భంగా అభ్యర్ధించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘తగినంత టైం అంటే ఎంత? అసెంబ్లీ గడువు ముగిసేంత సమయం కావాలా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల హక్కులకు సంబంధించిన అంశం ఇది. రాజకీయ పార్టీల హక్కులకు ఇబ్బంది కలుగుతుంటే మేం చూస్తూ ఊరుకోం’’ అని స్పష్టం చేసింది. సంపత్‌కుమార్, సుభాష్ దేశాయ్ కేసులో స్పీకర్ కోరిన ‘తగినంత సమయం’ అంశంలో సుప్రీంకోర్టు గతంలో ఇచి్చన తీర్పును రోహత్గీ ప్రస్తావించారు. దీనితో ‘తగినంత సమయం’ అంటే ఎంత అని రోహత్గీని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు. ‘‘తగినంత సమయం అంటే రెండు నెలలు, మూడు నెలలు అని ఏదీ కూడా ఆ తీర్పులో ధర్మాసనం చెప్పలేదని రోహత్గీ బదులిచ్చారు. డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం’ అంటే ఎంత? రోహత్గీ సమాధానంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘డిక్షనరీ ప్రకారం ‘తగినంత సమయం (రీజనబుల్ టైం) అంటే ఎంత? పది నెలలు రీజనబుల్ టైం కాదా? అయితే మీ దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఎంతో చెప్పండి? మీరు చెప్పే రీజనబుల్ టైమ్‌కు గడువు అనేది ఉందా, లేదా? పోనీ మీరు రీజనబుల్ టైం చెప్పకపోతే.. మేమే ఓ గడువు విధిస్తాం. ఆ గడువులోపు దానిని పూర్తి చేయండి’’ అని జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్‌చంద్రన్‌ల ధర్మాసనం పేర్కొంది. అయితే ‘రీజనబుల్ వ్యక్తికి రీజనబుల్ టైం ఇవ్వాల’ని రోహత్గీ తిరిగి అభ్యర్ధించారు. ‘‘రీజనబుల్ వ్యక్తి దృష్టిలో రీజనబుల్ టైం అంటే ఏంటీ, అసలు ఎంత సమయం కావాలి?’’ అని ధర్మాసనం ఆగ్రహంగా స్పందించింది. దీనికి బదులు ఇచ్చేందుకు రెండు, మూడు రోజులు సమయం కావాలని రోహత్గీ విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం అంగీకరించి తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది. ధర్మాసనానికి అన్ని ఆధారాలు సమర్పించాం: మోహిత్‌రావు తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ తరపు న్యాయవాది పి.మోహిత్‌రావు పేర్కొన్నారు. సుప్రీంకోర్టులో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అన్ని ఆధారాలను ధర్మాసనానికి సమర్పించామని చెప్పారు. గతంలోని సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టు సూచనలను స్పీకర్ పట్టించుకోకపోవడాన్ని వివరించామన్నారు. -
ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ వాయిదా
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత..హైకోర్టులో పాల్ వాదనలు
సాక్షి,హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు శుక్రవారం(అక్టోబర్ 25) మరోసారి విచారించింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కేఏ పాల్ హైకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో పాల్ పార్టీఇన్పర్సన్(స్వయంగా)గా కేఏ పాల్ వాదనలు వినిపించారు. ఈ కేసులో తదుపరి విచారణను హైకోర్టు నవంబర్ 4కు వాయిదా వేసింది.కాగా, తమ ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై బీఆర్ఎస్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి తుది ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇదీ చదవండి: మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు -
TG: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై రేపే తీర్పు
హైదరాబాద్, సాక్షి: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై రేపు (సోమవారం)తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలివ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆగస్టులో విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజ్వర్వ్ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలకు స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తమ ఫిర్యాదును స్పీకర్ స్వీకరించలేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, వివేకానంద్ కోర్టు తలుపు తట్టారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడునెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇక.. పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావ్‌లపై అనర్హత వేటు వేయాలని కోరారు. సోమవారం వెలువడే తీర్పుపై అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. -
స్పీకర్ వేటు వేయకుంటే సుప్రీంకు..: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేయకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడతామని ఢిల్లీలో పోజులు కొడుతున్న కాంగ్రెస్ పార్టీ .. రాష్ట్రంలో మాత్రం దానిని తుంగలో తొక్కుతోందని మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌తో భేటీ అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా పాయింట్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపులపై గగ్గోలు పెడుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీ మారేలా వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు వెంటనే పదవిని కోల్పోయేలా రాజ్యాంగాన్ని సవరించాలన్న రాహుల్ గాంధీ.. తెలంగాణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్పీకర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారు కర్ణాటకలో ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేను బీజేపీ రూ.50 కోట్ల చొప్పున కొనుగోలు చేస్తోందని అక్కడి సీఎం సిద్దరామయ్య ఆరోపించిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ఎన్ని కోట్లు చేతులు మారుతున్నాయో చూడాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్‌ను కోరినట్లు తెలిపారు. హర్యానా, హిమాచల్‌ప్రదేశ్‌లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు అక్కడి స్పీకర్లు అనర్హత వేటు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర స్పీకర్‌ను ప్రభుత్వంతో పాటు కొందరు అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకున్నా ఎలాంటి కళంకం రాదంటూ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారని, వారికి ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణలో దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారకుంటే ప్రాణహాని పేరిట బీఆర్ఎస్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను డీఎస్పీ స్థాయి అధికారులు బెదిరించారని చెప్పారు. బీజేపీని వాషింగ్ మెషీన్ పారీ్టగా విమర్శించిన కాంగ్రెస్ తెలంగాణలో అదే పని చేస్తోందన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి ఆస్తులు, భవనాలపై ప్రభుత్వ సంస్థలతో దాడులు చేయిస్తోందని చెప్పారు. మరికొందరు ఎమ్మెల్యేల వ్యాపారాలపై విజిలెన్స్ విభాగాన్ని, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారిపై జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, టౌన్ ప్లానింగ్ విభాగాలను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. స్పీకర్‌తో భేటీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం కోరింది. ఈ మేరకు వేర్వేరుగా లేఖలు అందజేసింది. కేటీఆర్ నేతృత్వంలో 14 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిశారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. కాగా నియోజకవర్గాల్లో జరుగుతున్న ప్రోటోకాల్ ఉల్లంఘనలను కూడా స్పీకర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రివిలేజ్ నోటీసులు అందజేశారు. -
కీలకదశకు చేరిన ఫిరాయింపుల కేసు
-
‘సుప్రీం’ ఆదేశాలను అపహాస్యం చేయడమే
న్యూఢిల్లీ: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో తెలపాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ర్ట ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమే అవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అన్నారు. ఆయన సోమవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారో ఈ నెల 8వ తేదీలోపు చెప్పాలని సుప్రీం కోర్టు శాసనసభ స్పీకర్‌ను ఆదేశించిందన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు అఫిడవిట్ దాఖలు చేయలేదన్నారు. ఇది రాజ్యాంగంపై ప్రభుత్వానికి ఎంత గౌరవం ఉందో తెలియజేస్తున్నదన్నారు. అత్యున్నత ధర్మాసనం ఆదేశించినా ప్రభుత్వం స్పందించకుండా అనైతిక చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.