వరుసగా వలస నేతలతో అసంతృప్తి
నియోజకవర్గ ఇన్‌చార్జిల పరిస్థితేంటీ?
గ్రేటర్ కాంగ్రెస్ కేడర్‌లో గందరగోళం
గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ కి కొత్త కష్టమొచి్చంది. వలసల పర్వం ఆ పార్టీలో అసంతృప్తిని రాజేస్తోంది. మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న నేతలను అక్కున చేర్చుకుంటున్న తీరును ద్వితీయ శ్రేణి నాయకత్వం తప్పుపడుతోంది. పార్టీ బలోపేతం పేరిట గులాబీ నాయకులకు స్వాగతం పలుకుతుండడం సీనియర్లకు మింగుడు పడడంలేదు. ఒకవైపు పార్టీ బలీయంగా తయారవుతుందనే సంతోషపడుతున్నా.. మరోవైపు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందనే ఆందోళన వారిని వెంటాడుతోంది. ఇటీవల బీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
మరికొందరు కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి రాక తమ ఉనికికి భంగం కలిగిస్తుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పార్టీ అసమ్మతులకు తెరలేపింది. ఇటీవల చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పారీ్టలో చేరడంతో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన భీంభరత్ వర్గం అసంతృప్తికి గురైంది. పారీ్టలో చేర్చుకోవద్దని చివరి నిమిషం వరకు న్రయతి్నంచినా ఫలించకపోవడంతో సర్దుబాటుకు సరే అంది. అయితే.. మనుషులు కలిసినా మనసులను కలపలేమనే సంకేతాలు ఇరువర్గాలు ఇస్తున్నాయి.
రాజేంద్రనగర్‌లోనూ..
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరికంటే ముందే రేవంత్ భేటీ అయి కండువా కప్పుకున్న ప్రకాశ్.. మొన్నటివరకు ఆగినా చివరకు కారు దిగి చేయి పట్టుకున్నారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీచేసిన నరేందర్, సీనియర్ నేతలు జ్ఞానేశ్వర్, ముంగి జైపాల్‌రెడ్డి వర్గీయులు అసంతృప్తికి లోనయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో వేరు కుంపట్లతో కాంగ్రెస్ ఎలా ముందుకు సాగుతుందో వేచిచూడాల్సిందే మరి!
శేరిలింగంపల్లిలో మూడు గ్రూపులు
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ సెగ్మెంట్‌లో కాంగ్రెస్ మూడు గ్రూపులుగా విడిపోయింది. శాసనసభ ఎన్నికల వేళ టికెట్ ఆశించిన జైపాల్ సహా.. ఆఖరి నిమిషంలో బీఆర్‌ఎస్‌ను వీడి టికెట్ దక్కించుకున్న జగదీశ్వర్‌గౌడ్ ఇప్పటికే రెండు వర్గాలు వ్యవహరిస్తున్నారు. తాజాగా గాంధీ రాకతో కాంగ్రెస్‌లో మూడో వర్గానికి తెరలేపింది.
ఖైరతాబాద్‌తో మొదలు..
పరువు పోయిన చోటే వెతుక్కోవాలన్న ఉబలాటంతో ఆపరేషన్ ఆకర్‡్షకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. లోక్‌సభ ఎన్నికల ముందే నగరంలో గులాబీ తొలి వికెట్‌గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను పార్టీలో చేర్చుకొని సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి ప్రయోగించింది. ఇటీవల దానం బాటలోనే జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దానం చేరికతో ఆయనపై పోటీ చేసిన ఓటమి పాలైన విజయారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
డైలామాలో నేతలు
ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లను చేర్చుకోవడం ద్వారా గ్రేటర్‌లో పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్న పీసీసీ నాయకత్వం ఆపరేషన్ ఆకర్‡్షకు మరింత పదును పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మరింత మంది ఎమ్మెల్యేలకు గాలం విసిరింది. ఇప్పటికే వీరితో సంప్రదింపులు కూడా జరిపింది. అయితే.. వీరి రాకపై సంకేతాలు రావడంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తాము ఓడినా.. అధికారంలోకి వచ్చామనే సంతోషంలో ఇన్నాళ్లూ ఉన్న తమను తాజా పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. కొత్తగా చేరిన నాయకుల కింద తమ శ్రేణులు పనిచేయాల్సిన పరిస్థితి అనివార్యం కావడం.. దిగువ శ్రేణి నాయకుల పదవులను కొత్త నేతల అనుచరులు తన్నుకుపోయే ప్రమాదం ఉండడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
పటాన్‌చెరులోనూ..
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలపై ఆ నియోజకవర్గ పార్టీలోనూ అసంతృప్తికి తెరలేపింది. శనివారం సాయంత్రం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్‌ను కలుస్తారనే సమాచారం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఆయన ఆదివారం చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాగా.. ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ముదిరాజ్ గ్రూపులుగా విడిపోయిన ఆ పారీ్టలో తాజా ఈ పరిణామాలు పార్టీ శ్రేణులను కలవరపరుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment