సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నేతలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు భేటీ కావడం హాట్ టాపిక్‌గా మారింది.
వివరాల ప్రకారం.. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భద్రాచలం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం వెంకట్రావ్ తన కుటుంబసభ్యులతో వెళ్లి సీఎం రేవంత్‌ను కలిశారు. వారితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. దీంతో, ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సీఎంను వెంకట్రావ్ కలవడం ఇది రెండోసారి.
అనంతరం, వెంకట్రావ్ మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశాను. భద్రాచలం రామాలయం అభివృద్ధి. ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలి. భద్రాచలం పట్టణంలో డంపింగ్ యార్డు సైతం లేదు. పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం రేవంత్‌ను కలిశాను అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment