
సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలిగా చెప్పుకుంటున్న మంచిర్యాల ఆరిజిన్ పాల కంపెనీ ప్రతినిది శేజల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎమ్మెల్యే చెంచాలు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై మంళవారం మరో వీడియో విడుదల చేశారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు.
పైగా పోలీసులకు ఫిర్యాదు అనంతరం వేదింపులు మరింతగా పెరిగాయన్నారు. బీఆర్‌ఎస్ నేతలు కూడా న్యాయం చేస్తామని మాట ఇచ్చి ఆ విషయమే మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో బిఅర్ఎస్ పెద్దలు తనతో చర్చలు జరిపినప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు ఆమె వెల్లడించారు. ఈసారి టిక్కెట్ ఇవ్వడం లేదని బిఅర్ఎస్ నాయకులు స్పష్టంగా చెప్పారని శేజల్ గుర్తు చేశారు.
(తాజ్‌మహల్ చూసేందుకు వచ్చిన టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి)
తనపై, అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలా మందిపై ఎమ్మెల్యే చిన్నయ్య లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి కామపిశాచికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని ఆమె వ్యాఖ్యానించారు. తనకు న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటం ఆపేది లేదని శేజల్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment