Sejal
-
MI స్టార్స్‌తో ‘మిస్టరీ గర్ల్’.. ఇంతకీ ఈ అందాల సుందరి ఎవరంటే? (ఫొటోలు)
-
‘బీఆర్ఎస్కు మణిపూర్ ఘటనే కనిపిస్తోందా?’
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద లైంగిక ఆరోపణలు చేస్తున్న శేజల్ మరోసారి ఢిల్లీలో హల్ చల్ చేసింది. తనకు న్యాయం చేయాలంటూ శుక్రవారం ఏకంగా పార్లమెంట్ ఎదుటే నిరసనకు దిగిందామె. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను లైంగికంగా వేధించారని, మోసం చేసారని తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆరిజన్ డైరీ ప్రతినిధి శేజల్ ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో జాతీయ మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, సీబీఐకి సైతం చిన్నయ్యపై ఫిర్యాదు చేసిందామె. అయినా స్పందన కొరవడడంతో తెలంగాణ భవన్ వద్ద ఆత్మహత్యయత్నానికి కూడా యత్నించింది. ఇక కేటీఆర్ ,బీఆర్ఎస్ ఎంపీల దృష్టికి తన సమస్యను తీసుకెళ్లినప్పటికీ లాభం లేకుండా పోయిందని వాపోతుందామె. ‘‘పేరుకు మాత్రమే చట్టాలు..ఆడపిల్లకి న్యాయం చేయలేని చట్టాలు ఎందుకు?. మణిపూర్ లో మహిళలపై జరిగిన ఘటన చాలా బాధాకరం. కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సొంత రాష్ట్రంలో మహిళ పై జరిగిన విషయం మీద స్పందించే సమయం దొరకడం లేదు. అదే పక్క రాష్ట్రాలలో జరిగిన ఘటనలు మీద మాత్రం క్షణాల్లో స్పందించి రాజకీయాలు చేసుకోవడం పరిపాటిగా మారింది’’ అని ఘాటుగా వ్యాఖ్యానించిందామె. మహిళల లైంగిక వేధింపులకు సంబంధించి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మీద FIR ఇవ్వమని పోలీస్ స్టేషన్‌కి వెళ్తే.. ఇవ్వకపోగా తిరిగి తన మీదే తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపిస్తోందామె. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అయిన స్పందించి ఎమ్మేల్యే దుర్గం చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి తక్షణమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని.. చిన్నయ్య మీద కేసు నమోదు చేసే వరకు తన పోరాటం ఆగదని చెబుతోంది శేజల్. -
ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వమని చెప్పారు.. కథ మారలేదు.. శేజల్ మరో వీడియో
-
ఎమ్మెల్యేకు టికెట్ ఇవ్వమని చెప్పారు.. కథ మారలేదు.. శేజల్ మరో వీడియో
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలిగా చెప్పుకుంటున్న మంచిర్యాల ఆరిజిన్ పాల కంపెనీ ప్రతినిది శేజల్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎమ్మెల్యే చెంచాలు తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు ఆమె బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై మంళవారం మరో వీడియో విడుదల చేశారు. అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని వాపోయారు. పైగా పోలీసులకు ఫిర్యాదు అనంతరం వేదింపులు మరింతగా పెరిగాయన్నారు. బీఆర్ఎస్ నేతలు కూడా న్యాయం చేస్తామని మాట ఇచ్చి ఆ విషయమే మర్చిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలో బిఅర్ఎస్ పెద్దలు తనతో చర్చలు జరిపినప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పినట్టు ఆమె వెల్లడించారు. ఈసారి టిక్కెట్ ఇవ్వడం లేదని బిఅర్ఎస్ నాయకులు స్పష్టంగా చెప్పారని శేజల్ గుర్తు చేశారు. (తాజ్‌మహల్ చూసేందుకు వచ్చిన టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి) తనపై, అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలా మందిపై ఎమ్మెల్యే చిన్నయ్య లైంగిక వేదింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి కామపిశాచికి ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని ఆమె వ్యాఖ్యానించారు. తనకు న్యాయం జరిగేంతవరకు ఈ పోరాటం ఆపేది లేదని శేజల్ హెచ్చరించారు. (వ్యభిచారం గుట్టు రట్టు.. యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని)