
ముంబై ఇండియన్స్ జట్టుతో ఫొటోలతో ఒక్కరోజులోనే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారింది ఓ అమ్మాయి. ముఖ్యంగా ముంబై మాజీ సారథి, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో ఆమె ఉన్న ఫొటో బాగా వైరల్ అయింది.

దీంతో ఈ మిస్టరీ గర్ల్ ఎవరా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు!..

మరి ఈ బ్యూటీ ఎవరు?!.. ఆమె పేరు సేజల్ జైస్వాల్.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జన్మించిన సేజల్.. మోడల్‌గా రాణిస్తూ నటిగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

యే దిల్ మాంగే మోర్ షోతో 2022లో బుల్లితెరపై అరంగేట్రం చేసిన ఆమె.. ధాకడ్ సినిమాలోనూ మెరిసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సేజల్‌కు లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

అయితే, ముంబై ఇండియన్స్ జట్టుతో ఫొటోలు వైరల్ అయిన తర్వాతే చాలా మందికి ఈ ముద్దుగుమ్మ గురించి తెలిసింది.













