Cong Vs BRS: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతల ధర్నా..  | BRS Leaders Dharna On LRS over Congress Party | Sakshi
Sakshi News home page

Cong Vs BRS: రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ నేతల ధర్నా.. 

Published Wed, Mar 6 2024 11:10 AM | Last Updated on Wed, Mar 6 2024 3:19 PM

BRS Leaders Dharna On LRS over Congress Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎల్‌ఆర్‌ఎస్‌ విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. LRS పథకాన్ని ఉచితం చేయాలని డిమాండ్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు నిరసనలు తెలుపుతున్నారు. 

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలు.. గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఛార్జీలు లేకుండా ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో గులాబీ పార్టీ నేతలు ధర్నా కార్యక్రమాలు చేపట్టారు. అలాగే, హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ, హెచ్‌డీఎంఏ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతున్నారు. 

ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క మాట్లాడిన మాటలను బీఆర్‌ఎస్‌ నేతలు గుర్తుచ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన మాట ప్రకారమే 25 లక్షల కుటుంబాలకు ఉచితంగా ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రజల నుంచి 20వేల కోట్లు వసూలు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం సిద్ధమైందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నిరసనల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నారు. అమీర్‌పేటలోని మైత్రివనం హెచ్‌ఎండీఏ కార్యాలయం వద్ద బీఆర్‌ఎస్‌ ధర్నాలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 

తలసాని కిరణ్‌ వినూత్న నిరసన..
అమీర్‌పేటలోని HMDA కార్యాలయం ముందు బీఆర్ఎస్ నేత తలసాని సాయి కిరణ్ వినూత్న నిరసన చేపట్టారు. వాటర్‌ బాబిల్స్‌తో హెచ్‌ఎండీఏ ముందు నిరసన. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ సిబ్బందికి వాటర్‌ బాటిల్స్‌ పంపిణీ చేసిన కిరణ్‌. తాను ఇచ్చిన నీళ్లు తాగి ప్రశాంతంగా ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు అంశం ఆలోచించాలని కోరిన కిరణ్‌. ఈ సందర్బంగా తలసాని కిరణ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై భారం మోపాలని చూస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్‌ వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు. గత ప్రభుత్వాన్ని విమర్శించిన నాయకులు ఇప్పుడెందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు చేస్తున్నారు అని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement