
బాధితుల్లో భరోసా నింపడమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల్లో భరోసా నింపడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం పర్యటించనున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లు ఈ పర్యటనలో పాల్గొంటారు.
మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హైదర్‌షాకోట్‌తో పాటు సమీప కాలనీల్లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుంది. మూసీ పరీవాహక కాలనీల్లో అధికారుల సర్వే పరిశీలన, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు వినడంతో పాటు బాధితులకు పారీ్టపరంగా భరోసా ఇస్తారు.