Houses demolition
-
AP: కూటమి సర్కార్ లీలలు.. పోలీసుల పహారాలో ఇళ్ల కూల్చివేతలు!
సాక్షి, తిరుపతి: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. పేదలను టార్గెట్ చేస్తూ కొందరు కూటమి నేతలతో ఆదేశాలతో అధికారులు దౌర్జన్యాలకు దిగుతున్నారు. తాజాగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్యాయంగా పేదల ఇళ్లను కూల్చివేశారు. అర్ధరాత్రి పోలీసుల బందోబస్తు మధ్య ఇళ్ల కూల్చివేత జరిగింది. ఈ క్రమంలో అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వివరాల ప్రకారం.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేదల ఇళ్లపై కూటమి నేతల దౌర్జన్యం కొనసాగుతోంది. రేణిగుంట మండలం తూకివాకం గ్రామ పంచాయతీ పరిధిలోని గువ్వల కాలనీలో తాజాగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. కూటమి నేతల ఆదేశాలతో రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు, పోలీసులు ఇళ్లలోని వారిని బలవంతంగా ఖాళీ చేయించారు. అనంతరం, అర్థరాత్రి వేళ రేణిగుంట పోలీసుల బందోబస్తు మధ్య ఇళ్లను కూల్చివేశారు.ఇదిలా ఉండగా, చెన్నై-తిరుపతి మూడవ లైన్ విస్తరణ పనుల్లో భాగంగా ఇల్లు కోల్పోతున్న వారికి ఎలాంటి నష్ట పరిహారం ఇవ్వకుండానే కూల్చివేతలను ప్రారంభించారు. అర్థరాత్రి ఇల్లు కూల్చివేయడంతో గువ్వల కాలనీవాసులు ఆర్తనాదాలు చేశారు. గువ్వల కాలనీలో 52 కుటుంబాలను ఖాళీ చేయించి ఇంటి సామాన్లను పోలీసులు సహాయంతో అధికారులు బయట పడేశారు. దీంతో, వారి ఆవేదన తెలుసుకుంటున్న మీడియాను సైతం రేణిగుంట పోలీసులు అడ్డుకున్నారు. తమకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇల్లు కూల్చివేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. తమను బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు పంపారని విలపిస్తున్నారు. -
నేడు ‘మూసీ’ పర్యటనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల్లో భరోసా నింపడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆదివారం పర్యటించనున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లు ఈ పర్యటనలో పాల్గొంటారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ తదితరులు ఈ బృందంలో ఉన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు హరీశ్‌రావు తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి హైదర్‌షాకోట్‌తో పాటు సమీప కాలనీల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటిస్తుంది. మూసీ పరీవాహక కాలనీల్లో అధికారుల సర్వే పరిశీలన, ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు వినడంతో పాటు బాధితులకు పారీ్టపరంగా భరోసా ఇస్తారు. -
ఇదెక్కడి బుల్డోజర్ న్యాయం?
సాక్షి, న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఓ వ్యక్తి నిందితుడు అయినంత మాత్రాన∙అతడి ఇల్లు కూల్చేస్తారా? అని నిలదీసింది. పలు రాష్ట్రాల్లోని బుల్డోజర్ సంస్కృతిపై అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులైన వారి ఇళ్లను కొన్ని రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది. సమస్యలు పరిష్కరించడానికి బుల్డోజర్ న్యాయం సరికాదని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంది. ‘నిందితుడైనంత మాత్రాన అతని ఇల్లు కూల్చేస్తారా? ఒకవేళ అతన్ని దోషిగా న్యాయస్థానం తేలి్చనా.. ఇల్లు కూల్చడానికి వీల్లేదు. దానికి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. పలు రాష్ట్రాల్లో ఇళ్ల కూలి్చవేతపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనా«థన్ల ధర్మాసనం విచారించింది. ‘‘ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఇల్లు ఎందుకు కూల్చివేయాలి. దోషి అయినప్పటికీ ఇల్లు కూలి్చవేయలేం’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. దీంతోపాటు అనధికార నిర్మాణాలను, ఆక్రమణలను కోర్టు రక్షించదని, అయితే వీటికి కొన్ని మార్గదర్శకాలు అవసరమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు అందజేయాలని ఇరుపక్షాలను ధర్మాసనం కోరింది. ఆయా ప్రతిపాదనలు సీనియర్ న్యాయవాది నచికేత జోషికి సమరి్పంచాలని, వాటిని క్రోడీకరించి కోర్టుకు అందజేయాలని సూచించింది. నిందితుల స్థిరాస్తుల ధ్వంసాన్ని అడ్డుకోవడానికి తాము అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపింది. రోడ్లను ఆక్రమిస్తే గుడులైనా వదలం.. ఏదైనా నేరంలో ప్రమేయం ఉన్నంత మాత్రాన.. అతని స్థిరాస్తి కూల్చివేతకు అది భూమిక కాబోదని ఇదివరకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేశామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విన్నవించారు. మున్సిపల్ నిబంధనలను లేదా అక్కడి ప్రాధికార సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తేనే.. కూలి్చవేతలు ఉంటాయని అందులో స్పష్టం చేశామని యూపీ తరఫున హాజరైన మెహతా తెలిపారు. యజమాని క్రిమినల్ కేసుల్లో నిందితుడనే కారణంతో ఏ స్థిరాస్తిని కూలి్చవేయబోమన్నారు. ‘మీరు ఇదే వాదనకు కట్టుబడి ఉన్నామంటే.. మేము దీన్ని రికార్డు చేసుకుంటాం. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేస్తాం. రహదారులపై ఎలాంటి ఆక్రమ నిర్మాణాన్ని, ఆక్రమణలనూ మేము రక్షించబోవడం లేదు. రహదారులపై గుడులున్నా వదిలిపెట్టబోం’ అని ధర్మాసనం పేర్కొంది. ‘కూ లి్చవేతలు చట్టానికి లోబడి ఉండాలి. కానీ చట్టాన్ని అతిక్రమించి జరగడమే చూస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 17కు వాయిదా వేసింది. -
మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అసదుద్దీన్ సవాల్
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి దమ్ముంటే విదేశాలకు మాంసం ఎగుమతులను నిషేధించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. రోజుకు కేవలం వంద నుంచి రెండు వందల రూపాయలు సంపాదించే వారి వ్యాపారాలను మూసివేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ ప్రభుత్వం బుల్డోజర్లతో ముస్లింల ఇళ్లు, దుకాణాలు కూల్చివేసి, తగులబెట్టడంపై ఒవైసీ మండిపడ్డారు. ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం కూల్చివేతకు పాల్పడిందని ఆయన ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని దారుస్సలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చదవండి: (ఆరేళ్ల తర్వాత అరుదైన సమావేశం) -
నంద్యాలలో అధికార పార్టీ కక్ష సాధింపు
-
నంద్యాలలో అధికార పార్టీ కక్ష సాధింపు
► వందల ఇళ్లు కూల్చివేత ► 854 మంది ఇళ్ల పట్టాలు రద్దు ► ఆ స్థలాల్లో నిర్మించుకున్న ఇళ్లు కూల్చివేత ► వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని పేదలపై కక్ష ► ఇదెక్కడి న్యాయమంటూ వాపోతున్న బాధితులు సాక్షి, నంద్యాల: అధికార పార్టీ నాయకులు చెప్పినంత పని చేస్తున్నారు. టీడీపీకి ఓట్లు వేయకపోతే రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లపట్టాలు రద్దు చేస్తామని ఉప ఎన్నికలో ఓటర్లను భయపెట్టారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఇప్పుడు పక్కా గృహాల కూల్చివేతకు పూనుకున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల మండలంలోని అయ్యలూరు మెట్ట వద్ద పేదలు వేసుకున్న స్థలంలోని బేస్‌మట్టాలను, ఇళ్లను పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు శనివారం తొలగించారు. గృహాల వద్దకు లబ్ధిదారులు ఎవరూ రాకుండా భారీ పోలీసు బందోబస్తు మధ్య, వర్షపు నీటిలోనే పొక్లెయిన్లు పెట్టించి పేదల ఇళ్లను, బేస్‌మట్టాలను తొలగించడం చర్చనీయాంశమైంది. మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి ద్వారా పట్టాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకున్న వీరు ఉప ఎన్నికలో టీడీపీకి ఓట్లు వేయలేదని కక్ష సాధింపుతో అధికార పార్టీ నేతలు ఈ చర్యకు పాల్పడ్డారు. ఈనెల 19న సీఎం చంద్రబాబు నంద్యాల పర్యటనకు వస్తుండటంతో ఆయన మెప్పు కోసం ఆగమేఘాల మీద పేదల పట్టాలు రద్దు చేసి, ఆ స్థానంలో నిర్మించుకున్న కట్టడాలను కూలగొడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో అధికార పార్టీ ప్రచారంలో భాగంగా ఇళ్లులేని నిరుపేదలు 13 వేల మందికి పక్కాగృహాలు మంజూరు చేశామని గొప్పలు చెప్పుకుంది. అయితే నేడు టీడీపీకి ఓట్లు వేయలేదంటూ 854 మంది నిరుపేద కుటుంబాల ఇళ్ల పట్టాలను రద్దు చేసి, వారి స్థలాల్లో నిర్మించుకున్న కట్టడాలను కూలగొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. పక్కాగృహాల కోసం ఏళ్లతరబడి నిరీక్షణ అయ్యలూరు మెట్ట సమీపాన 852/2, 853 సర్వే నంబర్లలోని 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో 2009వ సంవత్సరంలో 854 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 1.50 సెంట్ల చొప్పున పంపిణీ చేశారు. వీటికి సంబంధించి అప్పటి నంద్యాల ఎమ్మెల్యే శిల్పామోహన్‌రెడ్డి పట్టాలు కూడా అందజేశారు. ఈ స్థలంలో ముళ్లపొదలు ఉండడంతో పాటు వెళ్లేందుకు దారి లేకపోవడంతో లబ్ధిదారులే చందాలు వేసుకుని మార్గం ఏర్పాటు చేసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసుకున్నారు. కాలనీలోకి వర్షపునీరు చేరకుండా కల్వర్టులు, మంచినీటి సౌకర్యం కోసం బోర్లు వేసుకున్నారు. అధికారుల చుట్టూ తిరిగి విద్యుత్ స్తంభాలు, వైర్లు, మెటల్‌రోడ్డు వేయించుకున్నారు. ఈ స్థలంలో గృహాల మంజూరుకు కొందరు దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇందిరమ్మ పథకం కింద పక్కాగృహాలు మంజూరు కావడంతో నిర్మాణాలు చేపట్టారు. మిగిలిన లబ్ధిదారులు 2015లో ఇళ్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్నారు. పక్కాగృహాలు మంజూరైతేనే ఇళ్లు కట్టుకోవాలన్న నిబంధన ఉండటంతో ఎక్కువశాతం మంది నిర్మాణాలు చేపట్టలేదు. మరికొందరు సొంత డబ్బు వెచ్చించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టి అక్కడ నివాసం ఉంటున్నారు. అధికారపార్టీ పక్కాగృహాలు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తూ ఉప ఎన్నిక నేపథ్యంలో గృహాలు కట్టుకోలేదంటూ పట్టాలు రద్దు చేసింది. ఉప ఎన్నిక అనంతరం వైఎస్సార్సీపీకి ఓట్లు వేశారని ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో నిర్మించిన కట్టడాలను పొక్లెయిన్లతో కూల్చివేశారు.