నిందితుడైతే ఇల్లు కూల్చేస్తారా
చట్ట ప్రక్రియ పాటించరా? పలు రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు సీరియస్
మార్గదర్శకాలను రూపొందిస్తామని స్పషీ్టకరణ
సాక్షి, న్యూఢిల్లీ: బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఓ వ్యక్తి నిందితుడు అయినంత మాత్రాన∙అతడి ఇల్లు కూల్చేస్తారా? అని నిలదీసింది. పలు రాష్ట్రాల్లోని బుల్డోజర్ సంస్కృతిపై అసహనం వ్యక్తం చేసింది. క్రిమినల్ కేసుల్లో నిందితులైన వారి ఇళ్లను కొన్ని రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఆందోళన వ్యక్తం చేసింది.
సమస్యలు పరిష్కరించడానికి బుల్డోజర్ న్యాయం సరికాదని, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయడానికి మార్గదర్శకాలు రూపొందించాల్సి ఉందని పేర్కొంది. ‘నిందితుడైనంత మాత్రాన అతని ఇల్లు కూల్చేస్తారా? ఒకవేళ అతన్ని దోషిగా న్యాయస్థానం తేలి్చనా.. ఇల్లు కూల్చడానికి వీల్లేదు. దానికి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలి’ అని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.
పలు రాష్ట్రాల్లో ఇళ్ల కూలి్చవేతపై దాఖలైన వేర్వేరు పిటిషన్లను సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనా«థన్‌ల ధర్మాసనం విచారించింది. ‘‘ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఇల్లు ఎందుకు కూల్చివేయాలి. దోషి అయినప్పటికీ ఇల్లు కూలి్చవేయలేం’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ వ్యాఖ్యానించారు. దీంతోపాటు అనధికార నిర్మాణాలను, ఆక్రమణలను కోర్టు రక్షించదని, అయితే వీటికి కొన్ని మార్గదర్శకాలు అవసరమని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు అందజేయాలని ఇరుపక్షాలను ధర్మాసనం కోరింది. ఆయా ప్రతిపాదనలు సీనియర్ న్యాయవాది నచికేత జోషికి సమరి్పంచాలని, వాటిని క్రోడీకరించి కోర్టుకు అందజేయాలని సూచించింది. నిందితుల స్థిరాస్తుల ధ్వంసాన్ని అడ్డుకోవడానికి తాము అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలను జారీచేస్తామని తెలిపింది.
రోడ్లను ఆక్రమిస్తే గుడులైనా వదలం..
ఏదైనా నేరంలో ప్రమేయం ఉన్నంత మాత్రాన.. అతని స్థిరాస్తి కూల్చివేతకు అది భూమిక కాబోదని ఇదివరకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో స్పష్టం చేశామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విన్నవించారు. మున్సిపల్ నిబంధనలను లేదా అక్కడి ప్రాధికార సంస్థ నిబంధనలను ఉల్లంఘిస్తేనే.. కూలి్చవేతలు ఉంటాయని అందులో స్పష్టం చేశామని యూపీ తరఫున హాజరైన మెహతా తెలిపారు.
యజమాని క్రిమినల్ కేసుల్లో నిందితుడనే కారణంతో ఏ స్థిరాస్తిని కూలి్చవేయబోమన్నారు. ‘మీరు ఇదే వాదనకు కట్టుబడి ఉన్నామంటే.. మేము దీన్ని రికార్డు చేసుకుంటాం. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీచేస్తాం. రహదారులపై ఎలాంటి ఆక్రమ నిర్మాణాన్ని, ఆక్రమణలనూ మేము రక్షించబోవడం లేదు. రహదారులపై గుడులున్నా వదిలిపెట్టబోం’ అని ధర్మాసనం పేర్కొంది. ‘కూ లి్చవేతలు చట్టానికి లోబడి ఉండాలి. కానీ చట్టాన్ని అతిక్రమించి జరగడమే చూస్తున్నాం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను సెప్టెంబరు 17కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment