సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. పొంగులేటి కీలక అనుచరుడు తెల్లం వెంకట్రావ్ అధికార బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోని వెంక్రటావ్‌ను మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఆహ్వానించారు. ఇక, వెంకట్రావ్ భద్రాచలం టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదినట్టే. వెంకట్రావ్‌కి ఈ విషయం అర్థం కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. వెంక్రటావ్ భవిష్యత్త్‌కు మాది భరోసా. జల్, జంగల్, జమీన్ విషయంలో ఏం జరుగుతుందో అందరూ చూడాలి. తెలంగాణలో కోటి ఎకరాల్లో సాగు జరుగుతోంది. ప్రాజెక్టుల పునరుద్ధరణతో సాగు విస్తీర్ణం పెరిగింది.
..కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగింది. తెలంగాణలో నీటి కష్టాలు, విద్యుత్ వెతలు తీరిపోయాయి. మిషన్ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఎవరెన్ని మొరిగిన మళ్ళీ గెలిచేది మనమే, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వం. వచ్చే రోజుల్లో భద్రాచలం గుడి అభివృద్ది చేస్తాం. గోదావరి నది కరకట్ట మరమత్తులు కూడా చేపడతాం’ అని కామెంట్స్ చేశారు.
ఈ క్రమంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలప్పుడే బయటకు వస్తాయి. ప్రజాసేవ చేసే నాయకత్వం కావాలి. ఎన్నికలప్పుడే కొందరు నేతలు ప్రజల్లోకి వస్తారు అంటూ ఎద్దేవా చేశారు.
ఇది కూడా చదవండి: స్పీడ్ పెంచిన గులాబీ బాస్.. తొలి లిస్ట్‌లో అభ్యర్థులు వీరే!
Comments
Please login to add a commentAdd a comment