పురిటినొప్పులతో ఆస్పత్రిలో చేరిన మహిళ
వైద్యులు లేకపోవడంతో ప్రసవం చేసిన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ వెంకట్రావు
భద్రాచలం అర్బన్: భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పురిటినొప్పులతో ఇబ్బంది పడుతున్న గర్భిణికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పురుడుపోసి ప్రశంసలు అందుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రేగుబల్లికి చెందిన భీమనబోయిన స్వప్నకు పురిటినొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు సోమవారం ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు.
కాగా, మంగళవారం స్వప్నకు పురిటినొప్పులు తీవ్రం కాగా, డ్యూటీ డాక్టర్ (ఈఎన్‌టీ) పరీక్షించి వెంటనే ప్రసవం చేయాలని నిర్ధారించారు. కానీ ఆ సమయానికి ఆస్పత్రిలో గైనిక్ వైద్యులు లేకపోవడంతో స్వతహాగా వైద్యుడైన ఎమ్మెల్యే వెంకట్రావుకు సమాచారం అందింది. దీంతో ఆయన సిజేరియన్ ద్వారా స్వప్నకు ప్రసవం చేయడంతో 3.2 కేజీల మగ శిశువుకు జన్మనిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment