ములకలపల్లి : మండల పరిధిలోని మూకమామిడి ప్రాజెక్ట్ సమీపంలోని శ్రీవీరభద్ర లింగేశ్వరస్వామి దేవాలయం అద్భుత ఆలయంగా విరాజిల్లుతోంది. ప్రాజెక్ట్ సమీపంలోని పచ్చని కొండల సమీపంలో భాస్కరగట్టు మీద ఈ ఆలయం ఉంది. మూకమామిడి గ్రామానికి చెందిన శిగ వీరభద్రం, సక్కుబాయమ్మ దంపతులు గత ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, దాతల సహాయంతో ఆలయం నిర్మించారు. ప్రతీ ఏడాది శివరాత్రి, కార్తీకమాసం తదితర పవిత్ర సమయాల్లో అన్నదానం చేస్తున్నారు. నాగులచవితి పర్వదినాన పుట్టలో పాలుపోసేందుకు ఈ ప్రాంగణంలో పాముల పుట్టలు సైతం స్వయంగా ఆవిర్భవించడం గమనార్హం. అంతేకాకుండా ఆలయ సమీపంలో భద్రకాళి విగ్రహాన్ని సైతం ప్రతిష్ఠించారు. శివపార్వుతుల కల్యాణం శాస్రోక్తంగా నిర్వహించేందుకు పనులు పూర్తి చేశారు.
108 లింగాలు ప్రతిష్ఠించాలని..
ఎకరం విస్తీర్ణం ఉన్న ఈ ఆలయ ప్రాంగణంలో విడతల వారీగా 108 శివలింగాలు ప్రతిష్ఠించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 12 శక్తిపీఠాల మీద వాటిని ప్రతిష్ఠించేందుకు దాతల నుంచి విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే 50 విగ్రహాలు ప్రతిష్ఠించినట్లు ఆలయ వ్యవస్థాకులు తెలిపారు. రూ.6 వేలు చెల్లిస్తే, ఆంధ్రాలోని పిడుగుళ్లరాళ్లలో ‘‘సానపట్టం’కల్గిన శివలింగాలు ప్రతిష్ఠించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment