సాక్షి, భద్రాచలం : భక్తుల జయజయ ధ్వానాలు.. పండితుల వేద ఘోష నడుమ భద్రాద్రిలో శ్రీ వైకుంఠ అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతోన్నాయి. పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా నేడు రామయ్య కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సందడితో భద్రగిరి పులకించిపోతోంది. దేవతలు, రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని అమృతానికై క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మందరగిరి మునిగిపోగా, దేవతలు, రాక్షసుల ప్రార్థనపై శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పైకెత్తి సహాయపడ్డాడట. ఈ అవతారాన్ని దర్శించుకోవడం వలన శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
కూర్మావతారంలో రామయ్య
Published Wed, Dec 20 2017 1:58 PM | Last Updated on Wed, Dec 20 2017 1:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment