adhyayanotsavalu
-
కూర్మావతారంలో రామయ్య
సాక్షి, భద్రాచలం : భక్తుల జయజయ ధ్వానాలు.. పండితుల వేద ఘోష నడుమ భద్రాద్రిలో శ్రీ వైకుంఠ అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతోన్నాయి. పగల్పత్తు ఉత్సవాల్లో భాగంగా నేడు రామయ్య కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తుల సందడితో భద్రగిరి పులకించిపోతోంది. దేవతలు, రాక్షసులు మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని అమృతానికై క్షీరసాగరాన్ని చిలుకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మందరగిరి మునిగిపోగా, దేవతలు, రాక్షసుల ప్రార్థనపై శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతాన్ని తన వీపున నిలుపుకొని పైకెత్తి సహాయపడ్డాడట. ఈ అవతారాన్ని దర్శించుకోవడం వలన శనిగ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. -
భద్రాద్రిలో ‘ముక్కోటి’ అధ్యయనోత్సవాలు
సాక్షి, భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం అయ్యాయి. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల సందర్భంగా శ్రీరామ దివ్య క్షేత్రం రామనామ సంకీర్తనలతో మార్మోగుతోంది. వేడుకల్లో భాగంగా తొలుత పగల్పత్తు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. మంగళవారం మత్స్యావతారం, 20న కూర్మావతారం, 21వరాహావతారం, 22న నృసింహావతారం, 23న వామన, 24న పరుశురామ, 25న శ్రీరామావతారం, 26న బలరామ, 27న శ్రీ కృష్ణావతారంలో దర్శనమివ్వనున్నారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం నుంచి జనవరి 8 వరకు నిత్య కల్యాణాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈఓ ప్రభాకర శ్రీనివాస్, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు తెలిపారు. జనవరి 13న విశ్వరూప సేవ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈనెల 28న నిర్వహించే తెప్పోత్సవానికి హంసవాహనాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. రామాలయాన్ని సోమవారం రాత్రే విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్తర ద్వార దర్శనానికి రూ.1000, రూ.500, రూ.250 టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. -
నేటి నుంచి భద్రాద్రిలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
నేటి నుంచి అధ్యయనోత్సవాలు ఉత్సవాలకు ముమ్మర ఏర్పాట్లు 31న తెప్పోత్సవం 1న ఉత్తర ద్వార దర్శనం నేటి నుంచి నిత్య కల్యాణాలు రద్దు భద్రాచలం టౌన్ : భద్రాద్రి రామాలయం లో అధ్యయనోత్సవాలు నేడు ప్రారంభమవుతాయి. స్వామి వారు నేటి నుంచి ఈ నె ల 30వ తేదీ వరకు రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ నెల 31న పవిత్ర గోదావరి నదిలో జరిగే తెప్పోత్సవాన్ని, జనవరి 1న ఉత్తర ద్వార దర్శనాన్ని తిలకించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు రావచ్చని దేవస్థానం అ ధికారులు అంచనా వేసి, తదనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా ఉత్తర ద్వారానికి ఎ దురుగా కల్యాణ మండపం ప్రాంగణంలో సాంస్కతిక కార్యక్రమాలు, సురభి సంస్థ వారి నాటకాల నిర్వహణకు ప్రత్యేకంగా వే దిక రూపొందిస్తున్నారు. ఉత్సవాలు ము గిసేంత వరకు ఈ వేదికపై సాంస్కతిక ప్రదర్శనలు జరుగుతాయి. అంగరంగ వైభవంగా జరిగే ఈ అధ్యయనోత్సవాల కోసం భద్రాచలం పట్టణం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. రామాలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులను ఆహ్వానిస్తూ అభయాంజ నేయ స్వామి పార్క్, దమ్మక్క విగ్రహం, పంచాయతీ కార్యాలయం వద్ద, ఆలయం సమీపంలో స్వాగత ద్వారాలు ఏర్పాటవుతున్నాయి. నేటి నుంచి అధ్యయనోత్సవాలు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా సోమవారం నుంచి జనవరి 11వ తేది వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. పగల్పత్తు ఉత్సవాలలో భాగంగా స్వామి వారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. రాపత్తు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పల్లకిపై సేవలను స్వామి వారు రాత్రి వేళల్లో అందుకుంటారు. విలాసోత్సవాలు జనవరి 12 నుంచి స్వామి వారికి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో విలాసోత్సవాలు ఉంటాయి. 12న శ్రీరామదాసు మండపంలో రెవెన్యూ వారు, 13న నసింహదాస మండపంలో పంచాయతీ వారు, 14న వశిష్ట మండపంలో దేవస్థానం సిబ్బంది ఈ విలాసోత్సవాలు ఉంటాయి. జనవరి 11న కూడారై పాశుర ఉత్సవం, 14న గోదా కల్యాణం, 15న మంకర సంక్రాంతి ఉత్సవం, 17న విశ్వరూప సేవలు ఉంటాయి. నేటి నుంచి నిత్య కల్యాణాలు రద్దు అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి జనవరి 1వ తేదీ వరకు స్వా మి వారికి నిత్య కల్యాణాలు ఉండవని దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి తెలిపారు. పగ ల్పత్తు ఉత్సవాలు 22న మత్స్యావతారం 23న కూర్మావతారం 24న వ రాహావతారం 25న నరసింహావతారం 26న వామనావతారం 27నపరశురామావతారం 28న శ్రీరామావతారం 29న బలరామావతారం 30న శ్రీ కృష్ణావతారం రాపత్తు ఉత్సవాలు 01న శ్రీ రామ రక్షామండపం (డీఎస్పీ కార్యాలయం) 02న శ్రీ హరిదాసు మండపం (అంబా సత్రం) 03న శ్రీ గోకుల మండపం (శ్రీ కష్ణ దేవాలయం) 04న శ్రీరామ దూత మండపం (అభయాంజనేయ స్వామి మండపం) 05న శ్రీ గోవింద రాజ మండపం (తాత గుడి) 06న వన విహార మండపం (వేస్ట్ ల్యాండ్) 07న పునర్వసు మండపం 08న విశ్రాంత మండపం (దొంగలదోపు ఉత్సవం) కల్కి అవతారం (శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం వద్ద) 09న వన విహార మండపం (వేస్ట్ ల్యాండ్) 10న నమ్మాళ్వార్ల పరమపదోత్సవం (ఆలయంలో) 11న అధ్యయనోత్సవాల సమాప్తి (దసరా మండపం)