సదాశివపేట/జహీరాబాద్, న్యూస్‌లైన్ : జిల్లాలో నిబంధనలు పాటించని ఐదు ప్రైవేటు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఇందులో సదాశివ పేటలో రెండు, జహీరాబాద్‌లో మూడు ఉన్నాయి. సదాశివపేటలో గురువారం రెండు ప్రైవేటు బస్సులను సీజ్ చేసినట్లు మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్ వద్ద ఆయన ఆధ్వర్యంలో సి బ్బంది ప్రైవేటు బస్సులను తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబుబ్‌నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో ప్రతి రోజూ ట్రావెల్స్ బస్సులను తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే ఒమర్, సహారా ట్రావెల్స్‌కు చెందిన బస్సుల్లో ప్రయాణికుల వివరాల జాబితా, ఇద్దరు డ్రైవర్లు లేనందువల్ల వాటిని సీజ్ చేసి పోలీసులకు అప్పగించామని మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. తనిఖీల కార్యక్రమంలో సహా య మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు బీ కిరణ్‌కుమార్, బాబులు పాల్గొన్నారు.
జహీరాబాద్ : పర్మిట్ లేక పోవడం, ప్రయాణికుల వివరాలు సక్రమంగా లేక పోవడం, ట్యాక్స్ బకాయి పడడం తదితర కారణాలతో జహీరాబాద్‌లో మూడు ప్రైవేటు బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. గురువారం అల్గోల్ రోడ్డులో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (ఎంవీఐ) గణేష్ వాహనాలను తనిఖీ చేశారు. ముంబాయి నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఒమర్ ట్రావెల్స్ బస్సును నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నందున సీజ్ చేశాడు. అదేవిధంగా బీదర్ క్రాస్‌రోడ్డు వద్ద 9వ జాతీయ రహదారిపై ఎంవీఐ సుభాష్, ఏఎంవీఐలు మధుసూదన్, జయప్రకాష్‌రెడ్డిలు తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించని కేశినేని, ఎస్వీఆర్ ట్రావెల్స్ బస్సులను సీజ్ చేశారు.
ఐదు ప్రైవేటు బస్సుల సీజ్
Published Fri, Nov 8 2013 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement
Advertisement