- సిరీస్‌ను విడుదల చేసిన అధికారులు
- మొదటి రోజు 33 రిజిస్ట్రేషన్లు..
- 23 ఫ్యాన్సీ నంబర్లకు రిజర్వేషన్
- తెలంగాణ సిరీస్ రావడం
- ఆనందంగా ఉందన్న వాహనదారులు
ఖిలా వరంగల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో వాహనాల రిజిస్ట్రేషన్ సిరీస్ కూడా మారింది. ఏపీ సిరీస్ పోయి.. టీఎస్ సిరీస్ వచ్చింది. కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం మన జిల్లాకు ‘టీఎస్ 03’ కేటారుయించగా.. అధికారులు బుధవారం నుంచి కొత్త సిరీస్ ప్రకారం వాహనాల రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించారు. వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో రవాణా శాఖ ఉప కమిషనర్(డీటీసీ) మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ కొత్త నంబర్లను విడుదల చేశారు.
జిల్లాలో మొదటి నెంబర్ ‘టీఎస్ 03 ఇఏ-0001’ను వాల్‌గో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ సీఈఓ అయిన హన్మకొండ వాసి గుంటి శ్రీధర్‌రావు దక్కించుకున్నారు. ఆ ఫ్యాన్సీ నంబర్‌ను శ్రీధర్‌రావుకు డీటీసీ అందజేశారు. ఈ సందర్భంగా డీటీసీ మాట్లాడుతూ కొత్త సిరీస్‌తో మొదటిరోజు 33 మంది వాహనదారులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, దీంతో పాటు 23 ఫ్యాన్సీ నంబర్లకు రిజర్వేషన్ చేసుకున్నారని వివరించారు.
టీఎస్03 సీరీస్‌కు మొదటిరోజు రూ. 2.63లక్షల ఆదాయం వచ్చిందని ఆయన వెల్లడించా రు. పాత వాహనాలకు మాత్రం ఏపీ 36 సీరిస్ కొద్దిరోజుల పాటు యథావిధిగా కొనసాగనుందని తెలి పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎంవీఐలు జయకుమార్, కొండల్‌రావు, రాంచందర్, సత్యనారాయ ణ, కార్యాల సిబ్బంది వాహనదారులు పాల్గొన్నారు.
వాహనదారుల్లో కొత్త ఉత్సాహం
టీఎస్ సిరీస్ కోసం వచ్చిన వాహనదారులతో వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. కొత్త రాష్ట్రంలో .. కొత్త వాహనాలతో.. కొత్త నెంబర్‌లతో వాహనదారులు ఆనందంలో ము నిగిపోయూరు. ఇప్పటికే చాలామంది కొత్త వాహనా లు కొనుగోలు చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర సిరీస్ కోసం ఎదురుచూశారు. బుధవారం కొత్త నెంబర్లకు ఆర్‌టీఏ పచ్చజెండా ఊపడంతో ఆర్‌టీఏ కార్యాల యం వాహనదారులతో కిక్కిరిసిపోయింది. అయితే మొదటిరోజు టీఎస్ సిరీస్‌లో ఫ్యాన్సీ నంబర్ల కోసం సైతం వాహనదారులు పోటీపడ్డారు. కొంతమంది ఏకంగా ఎన్నిడబ్బులైనా చెల్లిస్తాం.. మాకు ఫ్యాన్సీ నంబర్ కేటాయించాలని విజ్ఞప్తి చేసుకున్నారు.
నా అదృష్ట సంఖ్య 03 దక్కించుకున్నా..
తెలంగాణ రాష్ర్టంలో జిల్లాకు కేటాయించిన టీఎస్03కావడమే కాకుండా నా అదృష్ట సంఖ్య 3 నంబర్ నాకు దక్కడం ఆనందంగా ఉంది. ఈ ఫ్యాన్సీ నంబర్ కోసం కొన్ని రోజులుగా ఎదురుచూసిన.
- తోట సునీల్, వరంగల్
టీఎస్ సిరీస్‌లో 6 నంబర్ గురించి ఎంతో కలగన్నాం
60 ఏళ్ల కల నెరవేరిన నేపథ్యంలో వాహనాలకు కూడా ఏపీ సిరీస్‌పోయి టీఎస్ సిరీస్ రావడం చాలా సంతోషంగా ఉంది. 6 మా లక్కీ నంబర్. దీని కోసం చాలా రోజులు ఎదురు చూశాం. ఆర్టీఏ అధికారులు మాకు టీఎస్03ఇఎ006 నంబర్ కేటాయించడం ఆనందంగా భావిస్తున్నాం.
- ఎర్రబెల్లి స్వర్ణ, వరంగల్ నగర మాజీ మెయర్
ఆరు నెలలుగా ఎదురు చూస్తున్నా
ఇరవైరోజుల క్రిత మే వాహనం కొన్నాను. టీఎస్ సిరీస్‌లో కొత్త ఫ్యాన్సీ నెంబర్ టీఏస్ 03ఇఎ0036 కోసం ఇన్ని రోజులు ఆగాను. ఆలస్యం అయినా కూడా నాకు మంచి అదృష్ట నంబర్ దక్కింది.
-శ్రీనివాస్, ఏకశిలనగర్
తొలి నంబర్ TS 03 EA 0001
దక్కించుకున్న హన్మకొండ వాసి శ్రీధర్‌రావు
టీఎస్ సిరీస్‌లో తొలి నంబర్ ‘టీఎస్ 03ఇఎ0001’ ను హన్మకొండకు చెందిన
గుంటి శ్రీధర్‌రావు దక్కించుకున్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త ఫ్యాన్సీ నంబర్ రావడం ఆనందంగా ఉందన్నారు. ఈ నంబర్ కోసం నెలరోజులగా ఎదురు చూస్తున్నానని, జిల్లాలోనే మొదటి నంబర్ రావడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన చెప్పారు.