
‘లష్కర్’ భద్రత పూచీ నాదే
పోలీసులతో మంత్రి పద్మారావు
రాంగోపాల్‌పేట్: లష్కర్ బోనాల జాతరలో శాంతి భద్రతల పరిరక్షణపై పోలీసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, దానికి పూచీ నాదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు అన్నారు. ఆంక్షల పేరుతో భక్తులను ఇబ్బందులకు గురిచేయొద్దని, ఎవరి నుంచైనా ఇబ్బందులు వస్తే ప్రత్యక్షంగా తాను, స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడే ఉండి వెంటనే సరిదిద్దుతామని మంత్రి అన్నారు. మంగళవారం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ఈనెల 13,14వ తేదీల్లో జరుగనున్న బోనాల జాతరపై నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డ, వివిధ శాఖల అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫలహార బండ్ల ఊరేగింపులో పోలీసులు కొంత సంయమనంతో వ్యవహరించాలని, త్వరగా పంపించాలే ఉద్దేశంతో బలవంతగా పంపిస్తే ఇబ్బందులు వస్తాయన్నారు. ఫలహార బండ్ల నిర్వాహకులు ఎవరైనా అతిగా వ్యవహరిస్తే ‘మీ డ్యూటీ నేను చేస్తా.. మీరు ఆందోళన చెందాల్సిన పనిలేదు, మీ మాట వినని వారు మాకు వింటారు’ మీరు ఇబ్బందులకు గురిచేస్తే మాకు టెన్షన్ పెరుగుతుందన్నారు.
డీజేలకు ఒక జోన్‌లో అనుమతి ఇచ్చి మరో జోన్‌లో ఇవ్వకపోతే అది పోలీసులకు ఇబ్బందిగా వస్తుంది కాబట్టి సౌండ్‌ను కొద్దిగా తగ్గించి పెట్టుకునేలా చట్ట ప్రకారం వ్యవహరించి అనుమతి ఇవ్వాలని ఆయన పోలీసులను కోరారు.
స్థానిక ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్, నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి, అదనపు కమిషనర్ ్ర (ట్రాఫిక్) జితేందర్, జాయింట్ కమిషనర్ మల్లారెడ్డి, ఉత్తర మండలం డీసీపీ జయలక్ష్మి, కార్పొరేటర్లు కిరణ్మయి, మహేశ్వరి, ఈవో అశోక్, ఆర్డీవో రఘురాంశర్మ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అనంతరం దేవాలయ పరిసర ప్రాంతాలను మంత్రి, ఎమ్మెల్యే, కమిషనర్ కలిసి పరిశీలించారు.